Gujarat Election Results 2022
-
Gujarat Election 2022: గుజరాత్ ఓటేసిందిలా...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దుమ్ము రేపి వరుసగా ఏడోసారి అధికారంలోకి రావడంపై పలు రాజకీయ వర్గాల్లో పలు కోణాల్లో విశ్లేషణలు కొనసాగుతూనే ఉన్నాయి. నిజానికి రాష్ట్రంలో బీజేపీ పాలనపై ప్రజల్లో చాలా విషయాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. అంతటి అసంతృప్తిని, అధికార వ్యతిరేకతను అధిగమిస్తూ ఏకంగా నాలుగింట మూడొంతులకు పైగా మెజారిటీ సాధించిన వైనం రాష్ట్ర బీజేపీ ముఖ్యులను కూడా ఆశ్చర్యపరిచింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా బీజేపీకి కనీసం గట్టి పోటీ ఇస్తుందని భావించిన కాంగ్రెస్ చివరికి ఘోర పరాజయం పాలైంది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బీజేపీని అడ్డుకోలేకపోగా, కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చడం ద్వారా దాని జైత్రయాత్రకు పరోక్షంగా సహకరించినట్టయింది! దాంతో రాష్ట్రంలో ఎటు చూసినా కాషాయ రెపరెపలే కనిపించాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఓ విహంగ వీక్షణం... – సాక్షి, నేషనల్ డెస్క్ -
.. ఈ విషయం కాస్తా ముందు తెలిస్తే ఓడించేవాళ్లం!
.. ఈ విషయం కాస్తా ముందు తెలిస్తే ఓడించేవాళ్లం! -
గుజరాత్, హిమాచల్ ఫలితాలు; వాస్తవాలు గ్రహించాల్సింది ఎవరు?
డిసెంబర్ 8న వెలువడిన గుజరాత్ శాసనసభ ఎన్నికల ఫలితాలు వివిధ కోణాల నుంచి చారిత్రకంగా విశేష ప్రాధాన్యం కలిగి ఉంటాయి. ఆ రాష్ట్ర చరిత్రలో ఒకే రాజకీయ పార్టీకి 156 శాసనసభ స్థానాలు లభించడం మొదలు, వరసగా ఏడవసారి అధి కారంలోకి రావడం వరకు ఐదారు కీలక అంశాలు ఉన్నాయి. ఈ ఫలితాలతో పాటే వెలువడిన హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర సంప్రదాయాన్ని పునరావృతం చేశాయి. అక్కడ ఒక పార్టీకి రెండుసార్లు వరసగా అధికారం ఇచ్చే పద్ధతి లేదు. 25 స్థానాలకు పరిమితమైన బీజేపీ, 40 స్థానాలు సాధించిన కాంగ్రెస్‌కు అధికారం అప్పగిస్తున్నది. ఓడిన పార్టీల నేతల నోటి నుంచి వచ్చే మొదటిమాట గెలుపోటములు రాజకీయాలలో సహజం. యాపిల్ సాగు శాసించే హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలలో బీజేపీకీ, కాంగ్రెస్కీ ఓట్లలో తేడా ఒక శాతం కంటే తక్కువ. దీనితో బీజేపీ ఓడినా గెలిచినట్టే. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఘనతలు బీజేపీ అండతో పోరాడిన ప్రధాని నరేంద్ర మోదీవే. ఈ ఫలితాలు చూసిన తరువాత తప్పక వేసుకోవలసిన ప్రశ్న ఈ ఎన్నికల నుంచి వాస్తవాలు గ్రహించవలసిన వారు నిజంగా ఎవరు? బీజేపీ వ్యతిరేకత తప్ప మరొక ఎజెండా జోలికిపోని రాజకీయ పార్టీలా? ప్రజా తీర్పు ప్రజాతీర్పే, బీజేపీ పట్ల మా గుడ్డి వ్యతిరేకత మాదే అన్న ధోరణిలో ఉండిపోతున్న మేధావులూ, ఉదారవాదులా? మేం ప్రజాతీర్పును గౌరవిస్తున్నామంటూ రాజకీయ పార్టీలు చూపిస్తున్న కనీస మర్యాదను మేధావులుగా, ఉదారవాదులుగా చలామణీ అవుతున్నవారు చూపిస్తున్నారా అంటే సమాధానం దొరకదు. వీరందరి అభిమతం ప్రజాస్వామ్య పరిరక్షణే కావచ్చు. దానిని శంకించనక్కర లేదు. కానీ ప్రజాతీర్పును గౌరవించడం దగ్గర బీజేపీ యేతర శిబిరం ప్రదర్శిస్తున్న ఆత్మహత్యాసదృశమైన వైఖరి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయలేదు. వీరు ఒక రాజకీయ పార్టీ మీద, ఒక దేశ సార్వభౌమాధికారం మీద విమర్శల విషయంలో ఉండవలసిన లక్ష్మణరేఖను విస్మరిస్తున్నారు. ముస్లింల మీద జరిగిన కొన్ని దాడులను చూపిస్తూ హిందూ మెజారిటేరియన్ వాదాన్ని అంతర్జాతీయంగా రుద్దాలన్న ప్రయత్నం పట్ల సాధారణ భారతీ యులు ఆగ్రహంతో ఉన్నారని 2019 లోక్‌సభ ఎన్నికలు, తాజా గుజరాత్ ఎన్నికలలో రికార్డు స్థాయి ఫలితాలు చెప్పాయి. ఈ మేధావులు కష్టపడి నిర్మిస్తున్న హిందూ మెజారిటేరియన్ సిద్ధాంతం ముస్లింలకు రక్షణ కల్పించేది కాదు. నిజానికి మైనారిటీలకు అనాలి. కానీ వీరు మైనారిటీ అంటే కేవలం ముస్లింలు అనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు. ఇదే హిందూ ఫోబియాకు జన్మనిచ్చింది. అది బీజేపీకి ఉపయోగపడుతోంది. సాధారణ హిందువు, సాధారణ ముస్లిం కోరుకునేది శాంతినే! పీఎఫ్ఐ లాంటి పచ్చి హిందూ, భారత వ్యతిరేక సంస్థల ప్రభావంలో పడినవారు తప్ప సాధారణ ముస్లింలు మత కల్లోలాలను కోరుకోరు. బీజేపీ పాలనలో నిస్సందేహంగా మత కల్లోలాలు లేవు. ఢిల్లీ మత కల్లోలాలు, దసరా సందర్భంగా జరిగిన తాజా అలజడులు పీఎఫ్ఐ వంటి సంస్థల కారణంగానే జరిగాయి. అది ఇంటెలిజెన్స్ సమాచారం కూడా. ఆ వర్గం నుంచి ఒక్క అభ్యర్థిని కూడా నిలపకున్నా, గుజరాత్ తాజా ఫలితాల ప్రకారం ముస్లింలు అత్యధికంగా ఉన్న 19 నియోజక వర్గాలలో 17 బీజేపీకి దక్కాయి. బీజేపీ పట్ల తమకు గుడ్డి వ్యతికత అయితే లేదని వారే ప్రకటించినట్టయింది. గుజరాత్ శాసనసభలో ముస్లింల సంఖ్య తగ్గడం ఇవాళ్టి పరిణామం మాత్రం కాదు. 1980 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో 12 మంది ముస్లింలు చట్టసభకు వెళ్లారు. అప్పుడే కాంగ్రెస్ ΄పార్టీ ‘ఖామ్’ పేరుతో ఒక ఓటుబ్యాంక్ సమీకరణను తెర మీదకు తెచ్చింది. అదే క్షత్రియ, హరిజన్, ముస్లిం, ఆదివాసీ, ముస్లిం సమీకరణ. గడచిన ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులు మహమ్మద్ జావెద్ ఫిర్జాదా, ఘియాజుద్దీన్ షేక్, ఇమ్రాన్ ఖెడావాలా గెలిచారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ ఆరుగురు ముస్లింలను అభ్యర్థులుగా నిలిపింది. వీరిలో ఖెడావాలా మాత్రమే బీజేపీ, ఎఐఎంఐఎం సవాళ్లను ఎదుర్కొని సభలో ప్రవేశించ బోతున్నారు. గుజరాత్‌తో సంబంధం లేకున్నా, ఈ ఎన్నికలతో పాటే జరిగిన రాంపూర్ (ఉత్తరప్రదేశ్) నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితం గురించి చెప్పడం అసందర్భం కాబోదు. ముస్లింలు అధిక సంఖ్యలో ఉండే ఈ నియోజకవర్గంలో ఏడు దశాబ్దాలుగా ముస్లిం అభ్యర్థులే గెలుస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆజంఖాన్ మీద క్రిమినల్ కేసులు, అరెస్టు తదితర కారణాలతో పదవి రద్దయింది. దీనితో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పుడు సమాజ్‌వాదీ పార్టీ తరఫున అసీమ్ రజా బరిలో ఉండగా, బీజేపీ అభ్యర్థిగా ఆకాశ్ సక్సేనా నిలిచారు. సక్సేనా 33,000 భారీ ఆధిక్యంతో సమాజ్‌వాదీ అభ్యర్థిని ఓడించారు. గుజరాత్ మోర్బీ వంతెన కూలిన ఘటన, దానితో 135 దుర్మరణం పాలైన సంగతిని ఒక వర్గం మీడియా మృతుల మీద సానుభూతిగా కంటే, బీజేపీకి వ్యతిరేకాస్త్రంగానే భావించినట్టు కనిపిస్తుంది. ఆ ఘటన బీజేపీ గెలుపు మీద ప్రభావం చూపుతుందని ప్రచారం చేసింది. ఆ జిల్లాలో (మోర్బీ) మూడు అసెంబ్లీ నియోజక వర్గాలు మోర్బీ, టంకారా, వాంకనెర్ ఉన్నాయి. వీటిని 2017 ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచింది. కానీ ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ ఈ స్థానాలను గెలుచుకుంది. బీజేపీ విజయాన్ని... కాంగ్రెస్ ఓట్లు చీల్చడం, హిందూత్వ వంటి అసహజ విశ్లేషణలతో తక్కువ చేయడానికి ప్రయత్నించడం కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం కానేకాదు. మరి హిమాచల్‌లో జరిగిన దానిని ఏమనాలి? బీజేపీ ఓటును ‘ఆప్’ చీల్చినందునే కాంగ్రెస్ గెలిచిందంటే ఒప్పుకుంటారా? బీజేపీని ప్రస్తుతం ప్రజలు ఆదరిస్తున్నారు. దీనిని అంగీకరించడమంటే... బీజేపీని బలోపేతం చేయడం కాదు, ప్రజా తీర్పును గౌరవించడం! ఆ పార్టీని సిద్ధాంతపరంగా వ్యతిరేకించడమనేది రాజ్యాంగ హక్కు. ఈ రెండింటినీ గుర్తించాలి. ఆర్టికల్ 370 రద్దు, ఉమ్మడి రస్మృతి, పౌరసత్వ సవరణ చట్టం వీటన్నిటికీ రాజ్యాంగ ఆమోదం ఉంది. కానీ వీటన్నిటి లోనూ మైనారిటీ వ్యతిరేకతనే మేధావులు వెతకడానికి ప్రయత్నించారు. దేశ ప్రయోజనాల కోసం ఏ అడుగు వేసినా, ఏది చేసినా బీజేపీని బోనులో నిలబెట్టే ప్రయత్నం మానడం లేదు. మెజారిటీ ప్రజల మౌనాన్ని వీరు అలుసుగా తీసుకుంటున్న మాట కూడా వాస్తవం. ఆ మౌనం వెనుక ఏమున్నదో ఇప్పటికే ఎన్నో పర్యాయాలు రుజువైంది. బీజేపీని ఓడించడానికి అవాస్తవాలను జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా ప్రచారం చేయడం సాధారణ ప్రజలకీ, యువతరానికీ కూడా మింగుడు పడడం లేదు. పీఎఫ్ఐ, కొందరు మౌల్వీలు చేస్తున్న హిందూ వ్యతిరేక, భారత వ్యతిరేక వ్యాఖ్యలను ఖండించడం దగ్గర మేధావులు, ఉదారవాదులు ప్రదర్శిస్తున్న ఊదాసీన వైఖరి, సెలెక్టివ్ పంథా కూడా మైనారిటీలకూ, మెజారిటీలకూ మధ్య అగాధాన్ని తగ్గించడానికి బదులు పెంచుతోందన్న స్పృహ వారికి లేదు. ఇప్పుడు అయోధ్య అంశం లేదు. జ్ఞానవాపి, మధుర ఎన్నికల అంశాలుగా లేవు. అయినా బీజేపీ రికార్డు విజయం సాధించింది. కారణం సంక్షేమ పంథా. షాహీన్ బాగ్కీ, బీజేపీ వ్యతిరేక రైతు ఉద్యమానికీ ఇచ్చిన గౌరవం ఒక గిరిజన మహిళను రాష్ట్రపతి పీఠం మీద కూర్చోబెట్టినప్పుడు మేధావులు ఎందుకు ఇవ్వలేకపోయారన్న ప్రశ్న సగటు భారతీయుడిని ఎప్పటికీ తొలుస్తూనే ఉంటుంది. పరిణామాలను పక్షపాతం ఆధారంగా విశ్లేషించడం కాదు, ప్రజాతీర్పులు, ప్రజల అభిప్రాయాల కోణం నుంచి చూడాలి. అప్పుడే ప్రజాస్వామ్యానికి విలువ! రాజకీయ పార్టీ మీద ఆగ్రహం వ్యవస్థల మీద, ఆ వ్యవస్థలకు సంబంధించిన విలువల మీద ఆగ్రహంగా మారకూడదు. (క్లిక్ చేయండి: విమర్శను ఆహ్వానించే స్ఫూర్తి లేదా?) - డాక్టర్ గోపరాజు నారాయణరావు సీనియర్ జర్నలిస్ట్ -
Gujarat Election 2022: రేపే భూపేంద్రకు పట్టం
గాంధీనగర్: గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ (60) వరుసగా రెండోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. శనివారం జరిగిన సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలంతా ఆయన్ను పార్టీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయం ‘కమలం’లో జరిగిన ఈ భేటీకి పార్టీ కేంద్ర పరిశీలకులుగా సీనియర్ నేతలు రాజ్‌నాథ్‌సింగ్, యడ్యూరప్ప, అర్జున్ ముండా హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు 2021లో విజయ్ రూపానీ స్థానంలో సీఎంగా భూపేంద్ర పగ్గాలు చేపట్టారు. గురువారం వెలువడ్డ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 182 స్థానాలకు గాను ఏకంగా 156 సీట్లను కొల్లగొట్టి బీజేపీ రికార్డు విజయం సొంతం చేసుకోవడం తెలిసిందే. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా మంత్రివర్గంతో పాటుగా భూపేంద్ర శుక్రవారం రాజీనామా చేశారు. శనివారం ఎల్పీ నేతగా ఎన్నికయ్యాక గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత తెలిపారు. సోమవారం ఆయన రాష్ట్ర 18వ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గాందీనగర్‌లోని హెలిప్యాడ్ మైదానంలో జరిగే కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరవుతారు. ఇదీ చదవండి: హిమాచల్ సీఎంగా సుఖు -
సాక్షి కార్టూన్
-
టాప్ 3 పొలిటికల్ టాపిక్స్.. తేల్చేద్దాం గన్‌షాట్‌గా..!
బీసీలు, మైనార్టీలను మోసం చేసింది నువ్వే కదా బాబు ? విజయవాడలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన జయహో బీసీ మహాసభ విజయవంతం కావడం టీడీపీ సహించలేకపోతోంది. ఐదేళ్లలో చంద్రబాబు ఒక్క బీసీని రాజ్యసభకు పంపకుండా వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే.. మూడున్నరేళ్లలో రాష్ట్ర కోటాలో 8 స్థానాలు ఖాళీ అయితే అందులో నలుగురు బీసీలను రాజ్యసభకు పంపి సీఎం వైఎస్ జగన్ వారికి సమున్నత గౌరవం ఇచ్చారు. వెనుకబడిన వర్గాలకు వెన్నుపోటు పొడిచిందెవరు?. బీసీలు, మైనార్టీలను మోసం చేసింది చంద్రబాబు కాదా?.. బీసీలు, మైనార్టీలను మోసం చేసింది నువ్వే కదా బాబు ? రూల్స్ తెలియని వాడు రూలర్ అవుతాడా ? 2019 ఎన్నికల్లో రెండు చోట్ల అసెంబ్లీకి పోటీచేసి ఓటమి పాలైన పవన్ కల్యాణ్ ఇప్పుడు కనీసం తను అయినా గెలవాలని తంటాలు పడుతున్నారు. రాంగ్ రూట్లో పవన్ వెళ్తున్నారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టు మినహా ఏమీ తెలియని పరిస్థితుల్లో ఆయన ఉన్నారు. వారాహి వాహనానికి మిలటరీ వాహనాలకు మాత్రమే వేసే ఆలీవ్ గ్రీన్ రంగు వేశారు. ఇది చట్ట విరుద్ధం కాదా..? రూల్స్ తెలియని వాడు రూలర్ అవుతాడా ? మోదీ బీజేపీ బాహుబలిగా మారారా ? పోయిన చోటే వెతుక్కోవాలంటారు. గత ఎన్నికల్లో త్రుటిలో కోల్పోయిన స్థానాలపై బాగా దృష్టి పెట్టడంలో, దూరమైన వర్గాలను కలుపుకొని పోవడంలో పక్కా ప్రణాళికతో వ్యవహరించిన బీజేపీ గుజరాత్లో తిరుగులేని విజయాన్ని సాధించింది. సీఎంగా 13 ఏళ్లు గుజరాత్‌లోనూ, పీఎంగా ఎనిమిదేళ్లుగా కేంద్రంలోనూ తిరుగులేని నాయకునిగా మోదీ సాధించిన పేరు ప్రఖ్యాతులు కూడా ఈసారి ఫలితాలను బాగా ప్రభావితం చేశాయి. ఒక్కడే వచ్చాడు..156 సీట్లు పట్టుకుపోయాడు.. మోదీ బీజేపీ బాహుబలిగా మారారా ? తేల్చేద్దాం గన్‌షాట్‌గా.. శనివారం రాత్రి 7 గంటలకు తిరిగి ఆదివారం ఉదయం 7.30 గంటలకు సాక్షి టీవీలో -
మోదీ మోత.. గుజరాత్లో కొత్త చరిత్ర
థాంక్యూ గుజరాత్ ‘‘గుజరాత్ ఎన్నికల ఫలితాలను చూశాక ఎన్నోరకాల భావోద్వేగాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాను. అభివృద్ధి రాజకీయాలను ప్రజలు దీవించారు. థాంక్యూ గుజరాత్. అభివృద్ధి ఇదే వేగంతో కొనసాగాలని వారు కోరుకున్నారు. గుజరాత్ జనశక్తికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. బీజేపీ కార్యకర్తల రెక్కల కష్టం లేకుంటే ఈ విజయం సాధ్యమయ్యేది కాదు. ప్రతి కార్యకర్త ఒక ఛాంపియన్. మా పార్టీకి అసలైన బలం కార్యకర్తలే. హిమాచల్ ప్రదేశ్ ప్రజలు సైతం బీజేపీపై ఆప్యాయత కనబర్చారు. మద్దతుగా నిలిచారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి శ్రమిస్తూనే ఉంటాం. సమయం వచ్చినప్పుడల్లా వారి సమస్యలను లేవనెత్తుతాం’’ – ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్: మోదీ మేజిక్ మరోసారి అద్భుతం చేసింది. గుజరాత్లో కమలం పార్టీ కొత్త చరిత్ర సృష్టించింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ను, తానే ప్రత్యామ్నాయమంటూ బరిలో దిగిన ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీ బుల్డోజర్ అక్షరాలా మట్టికరిపించింది. ఏకంగా 53 శాతం ఓట్లు ఒడిసిపడుతూ 182 అసెంబ్లీ స్థానాలకు గాను 156 సీట్లను సొంతం చేసుకుంది. నాలుగింట మూడొంతులకు పైగా మెజారిటీ సాధించింది. తద్వారా 1985లో మాధవ్‌సింగ్ సోలంకీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ సాధించిన 149 సీట్ల రికార్డును బద్దలు కొట్టింది. 2002లో సీఎంగా మోదీ నేతృత్వంలో సాధించిన 127 సీట్ల స్వీయ రికార్డునూ మెరుగు పరుచుకుంది. రాష్ట్ర చరిత్రలో అత్యధిక అసెంబ్లీ స్థానాలు నెగ్గిన పార్టీగానూ రికార్డు సృష్టించింది. 1995 నుంచి అధికారంలో ఉన్న బీజేపీకి ఇది వరుసగా ఏడో విజయం! తద్వారా పశ్చిమబెంగాల్లో సీపీఎం కూటమి సాధించిన ఏడు వరుస విజయాల రికార్డును బీజేపీ సమం చేసింది. కాంగ్రెస్ కేవలం 17 సీట్లతో రాష్ట ఎన్నికల చరిత్రలో అత్యంత ఘోరమైన పరాజయం చవిచూసింది. ఒక్క చాన్సంటూ కేజ్రీవాల్ రాష్ట్రమంతా కాలికి బలపం కట్టుకుని తిరిగినా ఆప్‌కు దక్కింది ఐదు స్థానాలే! ఆద్యంతమూ జైత్రయాత్రే... గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల బరిలో బీజేపీతో పాటు కాంగ్రెస్, ఆప్ పోటాపోటీగా తలపడటం తెలిసిందే. డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరిగింది. గురువారం ఉదయం 8 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్ మొదలైంది. మొదటినుంచీ బీజేపీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్లింది. పార్టీకి అన్ని వర్గాల నుంచీ సంపూర్ణ మద్దతు లభించింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇస్తూ 77 సీట్లు నెగ్గిన కాంగ్రెస్ ఈసారి పూర్తిగా చేతులెత్తేసింది. అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి ప్రచారం చేసిన రాహుల్‌గాంధీ ఈసారి జోడో యాత్ర కారణంగా దూరంగా ఉండటం, ప్రియాంక కూడా హిమాచల్‌తో పోలిస్తే గుజరాత్‌ను పెద్దగా పట్టించుకోకపోవడం ఆ పార్టీ అవకాశాలను మరింతగా దెబ్బ తీశాయి. పులిమీట పుట్రలా ఆప్ కూడా హస్తం పార్టీని బాగా దెబ్బ తీసింది. ఆప్, మజ్లిస్ కలిసి మైనారిటీ ఓట్లను కూడా చీల్చడం బీజేపీకి మరింత కలిసొచ్చింది. ఆప్‌కు కూడా ఘోర పరాజయమే మూటగట్టుకుంది. పార్టీ సీఎం అభ్యర్థి ఇసుదన్ గాఢ్వీతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు తదితరులంతా ఓటమి పాలయ్యారు. 2017లో దెబ్బ తీసిన పాటిదార్ల ఉద్యమం, జీఎస్టీపై వ్యాపారుల కన్నెర్ర వంటి సమస్యలేవీ లేకపోవడంతో ఈసారి బీజేపీ జైత్రయాత్ర నిర్నిరోధంగా కొనసాగింది. ఘనవిజయం ఖాయం కావడంతో పార్టీ కార్యకర్తలు సంబరాలకు తెర తీశారు. మళ్లీ భూపేంద్రే సీఎం ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ (60) అహ్మదాబాద్‌లోని ఘాట్లోడియా స్థానం నుంచి 1.92 లక్షల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. సీఎంగా ఆయనే కొనసాగనున్నారు. డిసెంబర్ 12న ప్రమాణస్వీకారం చేయనున్నారు. బీజేపీ రికార్డు విజయం వెనక... ముచ్చటగా మూడు కారణాలు దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాల మాదిరిగానే గుజరాత్లో కూడా సామాన్యుల్లో చాలా అంశాలపై తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. ధరల పెరుగుదల మొదలుకుని నానా రకాల సమస్యలతో వాళ్లు కూడా సతమతమవుతూనే ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి వెన్నెముకగా భావించే పాడి పరిశ్రమపై ఆధారపడ్డ అసంఖ్యాకులు ద్రవ్యోల్బణం దెబ్బకు లాభాలు సన్నగిల్లి అల్లాడుతున్నారు. వారంతా దీన్ని రాష్ట్ర బీజేపీ ప్రభుత్వ వైఫల్యంగానే చూశారు. సంపన్న సూరత్ వస్త్ర వ్యాపారుల నుంచి మధ్య గుజరాత్‌లోని నిరుపేద పొగాకు రైతుల దాకా అందరిదీ ఇదే వ్యథ, ఇదే అభిప్రాయం. అయినా సరే, బీజేపీకి ఓటేయడం మినహా మరో మార్గం లేదన్న భావన వారిలో ప్రబలంగా వ్యక్తమవడం విశేషం! 27 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉన్నా ప్రభుత్వ వ్యతిరేకత కన్పించకపోవడం మరో విశేషం. ఇందుకు మూడు కారణాలు ప్రధానంగా కన్పిస్తున్నాయి. హిందూత్వ నినాదం, ప్రధాని మోదీ మేజిక్, విపక్ష ఓటులో చీలిక. ఈ మూడూ కలగలిసి బీజేపీకి కళ్లుచెదిరే విజయం కట్టబెట్టాయి. హిందూత్వ నినాదం హిందూత్వ రాజకీయాలు గుజరాత్లో చిరకాలంగా లోలోతులకు పాతుకుపోయాయి. నిజానికి ఎన్నికల ప్రచార సమయంలో కూడా రాష్ట్రంలో సన్నకారు పాడి రైతు మొదలుకుని పాటిదార్ పత్తి రైతు దాకా ఎవరిని కదిలించినా ద్రవ్యోల్బణం దెబ్బకు రెండు మూడేళ్లలో ఆర్థికంగా అక్షరాలా చితికిపోయామంటూ వాపోయినవాళ్లే. కానీ ఓటు మాత్రం బీజేపీకి వేయడం తప్ప ప్రత్యామ్నాయం లేదన్నది వారంతా ఏకగ్రీవంగా చెప్పిన మాట! ముస్లింల ప్రాబల్యాన్ని అడ్డుకోవాలంటే మరో మార్గం లేదన్నది వారు వెలిబుచ్చిన అభిప్రాయం. ‘‘గతంలో అహ్మదాబాద్ వెళ్లాలంటే ‘గొడవ’లేమన్నా అవుతున్నాయా అని ముందుగా వాకబు చేయాల్సొచ్చేది. కానీ సాహెబ్ (మోదీ) వచ్చాక అల్లర్లూ లేవు, సమస్యలూ లేవు’’ అని సగటు హిందూ ఓటర్లంతా చెప్పుకొచ్చారు. ఈ ముస్లిం వ్యతిరేక భావజాలం వారిలో ఇప్పటికీ ప్రబలంగా ఉంది. మతపరమైన విభజన ఆర్థిక కష్టాలను కూడా వెనక్కు నెట్టేసేంది. ఇదే బీజేపీకి శ్రీరామరక్షగా మారింది. మోదీ మేనియా సీఎంగా 13 ఏళ్లు గుజరాత్‌లోనూ, పీఎంగా ఎనిమిదేళ్లుగా కేంద్రంలోనూ తిరుగులేని నాయకునిగా మోదీ సాధించిన పేరు ప్రఖ్యాతులు కూడా ఈసారి ఫలితాలను బాగా ప్రభావితం చేశాయి. ముఖ్యంగా తటస్థ, ఎటూ నిర్ణయించుకోలేని ఓటర్లు మోదీ కరిష్మా కారణంగా బీజేపీవైపే మొగ్గినట్టు ఫలితాల సరళి స్పష్టంగా చెబుతోంది. నిజానికి అధికార బీజేపీ ఎమ్మెల్యేల అసమర్థత, అధికారుల్లో విచ్చలవిడిగా పెరిగిపోయిన అవినీతిని రాష్ట్రంలో జనం అసహ్యించుకునే పరిస్థితి ఉంది! కానీ మోదీ మేనియా వీటన్నింటినీ చాలావరకు అధిగమించేసింది. విపక్ష ఓటులో చీలిక గుజరాత్లో ఎప్పుడు బీజేపీ, కాంగ్రెస్ మధ్య సాగుతూ వచ్చిన పోరు కాస్తా ఆప్ అన్ని అస్త్రశస్త్రాలతో రంగంలోకి దిగడంతో ముక్కోణ పోరుగా మారిపోయింది. కేజ్రీవాల్ పార్టీ ప్రధానంగా చీల్చింది బీజేపీ వ్యతిరేక ఓటునే! అంటే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకునే!! అంతిమంగా ఇది ప్రధాన ప్రతిపక్షానికి కోలుకోలేని దెబ్బగా, బీజేపీకి అనుకోని వరంగా పరిణమించింది. ఈ కారణంగానే కమలం పార్టీ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా రికార్డు స్థాయిలో 150 సీట్ల మార్కును దాటగలిగింది. ఏకంగా 53 శాతం ఓట్లు కొల్లగొట్టింది. మరోవైపు కాంగ్రెస్ ఓటు బ్యాంకు 41 శాతం నుంచి 27 శాతానికి పడిపోయింది. ఆప్ సాధించిన 13 శాతం ఓట్లు చాలావరకు కాంగ్రెస్‌నని దీన్నిబట్టి స్పష్టమవుతోంది. 2017లో కాంగ్రెస్ దుమ్ము రేపిన సౌరాష్ట్ర ప్రాంతాన్ని కూడా బీజేపీ ఈసారి పూర్తిగా తనవైపు తిప్పుకుంది. కానీ ఇక్కడ ఏకంగా 18 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్, ఆప్ రెండింటి ఓట్ల శాతం కలిపితే బీజేపీ కంటే ఎక్కువగా ఉండటం విశేషం! పైగా 2017లో బీజేపీకి చెమటలు పట్టించి కాంగ్రెస్‌కు చాలావరకు ఉపయోగపడ్డ పాటిదార్ ఉద్యమం వంటివేవీ ఈసారి లేకపోవడం కమలనాథులకు మరింతగా కలిసొచ్చింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బిగ్ క్వశ్చన్ : గుజరాత్ మోడల్ పేపర్
-
గుజరాత్ ప్రజలు బీజేపీ వైపేనని నిరూపించారు : ప్రధాని మోదీ
-
గాయం సాకుతో బంగ్లా టూర్‌కు దూరం; భార్యను గెలిపించుకున్న జడేజా
టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా గుజరాత్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అక్కడి అధికార బీజేపీ నుంచి పోటీ చేసిన ఆమె ఏకంగా 57 శాతం ఓట్లు కొల్లగొట్టడం విశేషం. 50 వేలకుపైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో రివాబా.. జామ్‌నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కర్షన్‌భాయ్ కర్మూర్‌పై రివాబా గెలిచారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చతుర్‌సింగ్ జడేజా 15.5 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ అయిన హరి సింగ్ సోలంకి బంధువు అయిన రివాబా జడేజా 2019లో బీజేపీలో చేరారు. ఇక భార్య ఎన్నికల్లో నిలబడడంతో రవీంద్ర జడేజా గాయం సాకుతో బంగ్లా టూర్‌కు దూరమయ్యాడు. అయితే భార్య రివాబా జడేజా తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం వివాదాస్పదంగా మారింది. దేశానికి ఆడాల్సిన సమయం వచ్చినప్పుడు భార్యకు సహాయం చేయడం కోసం గాయం పేరు చెప్పి తప్పుకోవడం కరెక్ట్ కాదని జడేజాపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే జడేజా ఈ విమర్శలను పట్టించుకోకుండా తన భార్య తరపున ప్రచారం కొనసాగించాడు. కట్‌చేస్తే.. గాయం సాకు చెప్పి బంగ్లా టూర్‌కు దూరమైనప్పటికి భార్యను మాత్రం బంపర్ మెజారిటీతో గెలిపించుకొని జడ్డూ సక్సెస్ అయ్యాడు. ఇక బంగ్లా పర్యటనకు వెళ్లిన టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి రెండు వన్డేల్లో ఓడిన రోహిత్ సేన 0-2తో బంగ్లాకు సిరీస్‌ను అప్పగించింది. కనీసం మూడో వన్డేలోనైనా గెలిచి వైట్‌వాష్ నుంచి తప్పించుకోవాలని టీమిండియా భావిస్తుంది. 1990, సెప్టెంబర్ 5న జన్మించిన రివాబా.. మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. ఆమె 2016, ఏప్రిల్ 17న క్రికెటర్ రవీంద్ర జడేజాను పెళ్లి చేసుకున్నారు. బీజేపీలో చేరిన మూడేళ్లలోనే ఎమ్మెల్యే టికెట్ సంపాదించి ఘన విజయం సాధించడం విశేషం. గుజరాత్లో వరుసగా ఏడోసారీ బీజేపీయే అధికారంలోకి వచ్చింది. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో గత రికార్డులన్నీ చెరిపేస్తూ బంపర్ మెజార్టీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. 182 అసెంబ్లీ స్థానాలకు గానూ 156 స్థానాల్లో గెలిచి బీజేపీ కొత్త రికార్డు సృష్టించింది. 1985లో కాంగ్రెస్ సాధించిన 149 సీట్లే ఇప్పటివరకు రికార్డుగా ఉండగా దానిని బీజేపీ బ్రేక్ చేసింది. Congratulations to Smt Rivaba Jadeja on winning from #Jamnagar North constituency in the #GujaratAssemblyPolls! People have put their faith in your hard work & commitment towards public service. #GujaratElectionResult@Rivaba4BJP @narendramodi @AmitShah @Bhupendrapbjp @imjadeja pic.twitter.com/krS6oHe5ct — Parimal Nathwani (@mpparimal) December 8, 2022 #GujaratAssemblyPolls | BJP candidate from Jamnagar North, Rivaba Jadeja holds a roadshow in Jamnagar, along with her husband and cricketer Ravindra Jadeja. As per official EC trends, she is leading with a margin of 50,456 votes over AAP candidate Karshanbhai Karmur. pic.twitter.com/TgnDKGJB9Z — ANI (@ANI) December 8, 2022 చదవండి: ప్రాక్టీస్ సెషన్‌కు డుమ్మా.. అవమానం తట్టుకోలేకనేనా? 'సరైనోడి చేతుల్లో ఉన్నాం'.. పొవార్‌కు హర్మన్‌ప్రీత్ కౌంటర్ -
గుజరాత్ లో బీజేపీ గెలుపుపై " సాక్షి విశ్లేషణ "
-
గుజరాత్ లో రికార్డులు బద్దలు కొట్టిన బీజేపీ
-
గుజరాత్ : రవీంద్ర జడేజా సతీమణి రివాబా గెలుపు
-
గుజరాత్లో పెద్దాయన లేనిలోటు స్పష్టం.. కాంగ్రెస్‌లో ఆ ఒక్కడు లేకపోతే అంతేనా?
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జరుగుతున్న సమయంలో గుజరాత్ ఎన్నికలు జరిగాయి. దీంతో వీటిపై కాంగ్రెస్ భారీగా ఆశలు పెట్టుకుంది. అయితే గుజరాత్‌ను వదిలేసి రాహుల్ ఇంకెక్కడో యాత్రలు చేశారు. కొత్తగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఖర్గే.. ఢిల్లీని వదలలేదు. ఫలితంగా గుజరాత్లో దశదిశ లేక బొక్కాబొర్లా పడింది హస్తం పార్టీ. హస్తానికి ఏమైంది? 2014 నుంచి ప్రతిపక్షంలో ఉంటోన్న కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారింది. గుజరాత్లో ప్రభుత్వ వ్యతిరేకత రావొచ్చని ముందుగా అంచనాలు వచ్చినా.. కాంగ్రెస్‌లో ఆ జోషే కనిపించడం లేదు. స్టార్ క్యాంపెయినర్లు అడ్రస్ లేరు. రాహుల్ ఒకరోజు అలా కనిపించి ఇలా వెళ్లిపోయారు. కొత్త అధ్యక్షుడు ఖర్గే నాకేం సంబంధం అన్నట్టుగా వ్యవహరించారు. అహ్మద్ పటేల్ లేకుంటే అనాథే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో గుజరాత్లో బీజేపీని దాదాపు ఓడించినంత పని చేసింది కాంగ్రెస్. 41.44 ఓట్ షేర్‌తో 77 సీట్లు గెలుచుకుంది. 1998 తర్వాత తొలిసారి బీజేపీని డబుల్ డిజిట్‌కు పరిమితం చేసింది. కానీ, ఇప్పుడు నీరుగారి పోయింది. సీనియర్ నేత అహ్మద్ పటేల్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే అహ్మద్ పటేల్ లేని గుజరాత్ కాంగ్రెస్ అనాథలా మారింది. ఎలక్షనీరింగ్ లేదు.. ప్రచార వ్యూహాల్లేవు.. నేతల హంగామా అసలే లేదు.. అంతా మిస్సింగ్. అంతా చేయిచ్చారు! 2017 నుంచి దాదాపు 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. పాటిదార్ నేత హార్దిక్ పటేల్ కూడా ఎన్నికల ముందు బీజేపీలో చేరిపోయారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, హైకమాండ్ నిర్ణయరాహిత్యం కలిసి ఒక రకమైన నైరాశ్యంలో కూరుకుపోయింది గుజరాత్ కాంగ్రెస్. 27 ఏళ్లుగా పాలిస్తున్న బీజేపీపై పాటిదార్లు సహా అనేక వర్గాల్లో అసంతృప్తి ఉందని ప్రచారం జరిగినా.. దానిని ఓట్లుగా మార్చుకునే వ్యూహాలు మాత్రం కాంగ్రెస్ క్యాంప్‌లో కనిపించలేదు. రాజస్థాన్ మోడల్ అట్టర్ ఫ్లాప్ అహ్మద్ పటేల్ లేకపోవడంతో.. గుజరాత్ కాంగ్రెస్ ఎలక్షన్ బాధ్యతను రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌కు అప్పగించింది అధిష్టానం. కేజ్రీవాల్ ఢిల్లీ మోడల్ అంటుంటే.. రాజస్థాన్ మోడల్ అన్నారు గెహ్లాట్. అధికారంలోకి వస్తే రాజస్థాన్ ప్రజలకు అందుతున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలను గుజరాత్‌లోనూ అమలు చేస్తామని హామీలు ఇచ్చారు. అయినా కాంగ్రెస్ పరువు కాపాడుకోలేకపోయింది. ఈ లెక్కన రాజస్థాన్ మోడల్ హస్తానికి ఏ రకంగాను చెప్పుకోదగ్గ క్రెడిట్‌లోకి రాలేదు. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
Gujarat: కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం దిశగా బీజేపీ దూసుకుపోతోంది. బీజేపీ ప్రభంజనం ధాటికి.. ప్రభావం చూపెడుతుందనుకున్న ఆప్.. సింగిల్ డిజిట్ స్థానాలకే పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో భారీ దెబ్బ పడింది కాంగ్రెస్ పార్టీకే. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో.. గుజరాత్లో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఏకంగా 60 దాకా సిట్టింగ్ స్థానాలకు కోల్పోయింది ఆ పార్టీ. కాంగ్రెస్ ఓట్లను ఆప్, ఎంఐఎం పార్టీలు భారీగా చీల్చాయి. మరోవైపు ఆదివాసి ఓట్లు కూడా కోల్పోవడం కాంగ్రెస్‌కు మరో మైనస్‌గా మారాయి. 2017 ఎన్నికల్లో యూపీఏ కూటమికి 80 సీట్లు దక్కాయి. ఇందులో కాంగ్రెస్ 77 సీట్లు సాధించింది. అంతకు ముందు ఎన్నికలతో పోలిస్తే 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకంగా పదహారు సీట్లు అధికంగా గెల్చుకోవడం గమనార్హం. తాజా ట్రెండ్స్ చూస్తుంటే పాతిక సీట్లు లోపే కాంగ్రెస్ పరిమితం అయ్యేలా కనిపిస్తోంది. -
మోదీ అడ్డాగా గుజరాత్.. రికార్డులు బద్దలుకొట్టిన బీజేపీ!
గుజరాత్.. బీజేపీ అడ్డా అని మరోసారి రుజువైంది. గుజరాత్లో తమకు తిరుగులేదని కమలం పార్టీ ఏకఛత్రాధిపత్యం చూపించుకుంది. ఎన్నికలేవైనా సరే.. కాషాయ జెండా ఎగురవేయాల్సిందేనని బీజేపీ నేతలు నిరూపించుకున్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లోనూ గుజరాత్లో అధికార బీజేపీ భారీ విజయాం దిశగా దూసుకుపోతోంది. ఈ ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి అన్ని రాజకీయ పార్టీల నేతలు రాష్ట్రంలో ఫుల్ ఫోకస్ పెట్టారు. గుజరాత్లో తమ అదృష్టం పరీక్షించుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ముందునుంచే అక్కడ ప్రచారం మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. మాస్టర్ ప్లాన్స్ రచిస్తూ గుజరాతీలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. కానీ, బీజేపీ ఎలక్షన్ స్టంట్స్ ఎదుట ఆ పాచికలేవీ పారలేదు. ఇక, గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండో స్థానానికే పరమితమైనట్టు సమీకరణాలే చెబుతున్నాయి. గుజరాత్ ఎన్నికల ముందు కొందరు కీలక నేతలు కాంగ్రెస్ పార్టీని వీడటం కూడా హస్తం పార్టీకి కలిసిరాలేదు. ముఖ్యంగా పాటిదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్.. కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరడం కాషాయ పార్టీకి కొంత లాభం చేకూర్చిందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఇక, ముందు నుంచి గుజరాత్లో మోదీ మంత్రం పనిచేస్తున్నట్టుగానే ఈ ఎన్నికల్లో కూడా అది మరోసారి నిరూపితమైంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలై.. ప్రచారం ప్రారంభమయ్యాక.. మోదీ రోడ్ షోలతో బిజీగా అయ్యారు. గుజరాత్ అంటే బీజేపీ బ్రాండ్ అంటూ తమ గళం వినిపించారు. దీంతో, అప్పటి వరకు డైలామాలో ఉన్న గుజరాతీలు బీజేపీ వైపునకు మోగ్గారు. ఇదిలా ఉండగా.. 1995 నుంచి గుజరాత్లో బీజేపీ.. వరుసగా విజయం సాధిస్తూనే ఉంది. 1995-2017 వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆరుసార్లు గెలిచి బీజేపీ దేశ రాజకీయ చరిత్రలో రికార్డును క్రియేట్ చేసింది. ఈ ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తే బీజేపీ తమ ఖాతాలో ఏడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుంది. ఇక, ఈ ఎన్నికల్లో బీజేపీ 127 స్థానాలకు పైగా సీట్లో గెలిస్తే కమలం పార్టీ మరో రికార్డు బద్దలుకొట్టినట్టు అవుతుంది. గత ఎన్నికల్లో బీజేపీ సాధించిన సీట్లు.. 1. 1995లో 121 2. 1998లో 117 3. 2002లో 127 4. 2007లో 117 5. 2012 లో 115 6. 2017లో 99 7. 2022లో కూడా 100కు పైగా సీట్లలో విజయం సాధించే అవకాశం ఉంది. -
అంతటా.. రికార్డుల మీదే బీజేపీ కన్ను!
ఢిల్లీ: దేశం మొత్తం గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ దాదాపుగా గుజరాత్ పీఠం బీజేపీదే అని ఖరారు చేసేశాయి. గుజరాత్లో వరసగా ఏడోసారి అధికారాన్ని చేపట్టాలని తహతహలాడుతున్న కమలదళంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు హుషారుని నింపాయి. ఈ తరుణంలో బీజేపీ మరో రికార్డుపై కన్నేసింది. గుజరాత్లో బీజేపీ విజయం సాధిస్తే వరసగా ఏడోసారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించిన పశ్చిమబెంగాల్లో సీపీఎం రికార్డుతో సమం అవుతుంది. అయితే.. తొలిసారిగా పోటీ చేస్తున్న ఆప్ మాత్రం కచ్ఛితంగా ప్రభావం చూపెడతామని ప్రకటించుకుంది. దీంతో కాస్త ఆసక్తి నెలకొంది. గుజరాత్లో 182 అసెంబ్లీ స్థానాలకు ఉదయం 8 గంటల నుంచి 37 కేంద్రాల్లో కౌంటింగ్ మొదలుకానుంది. పదకొండు గంటల కల్లా ఫలితాలపై ఒక అంచనా రానుంది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్‌లో చెరోసారి బీజేపీ, కాంగ్రెస్‌లు అధికారం పంచుకుంటూ వస్తున్నాయి. ఈ తరుణంలో వరుసగా రెండోసారి అధికారం కైవసం చేసుకుని ఆ సంప్రదాయానికి బ్రేక్ వేసి రికార్డు నెలకొల్పాలని బీజేపీ భావిస్తోంది. మరోవైపు కాంగ్రెస్.. తొలిసారి పోటీ చేయబోతున్న ఆప్ కూడా విజయంపై కన్నేశాయి. హిమాచల్ ప్రదేశ్‌లో 68 స్థానాలకు.. 68 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు యూపీలోని మెయిన్‌పురి లోక్‌సభ స్థానం, అయిదు రాష్ట్రాల్లోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. ములాయం మరణంతో మెయిన్‌పురి స్థానానికి ఎన్నిక జరుగుతోంది. ఈ స్థానంలో ఎస్పీ నుంచి అఖిలేష్ భార్య డింపుల్ పోటీ చేస్తుండగా.. గత ఎన్నికల్లో ములాయం మెజార్టీకి గండికొట్టిన బీజేపీ ఈసారి భారీ విక్టరీపై కన్నేసింది. -
Gujarat Election Results: గుజరాత్ ప్రజలకు నమస్కరిస్తున్నా: మోదీ
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. 07:00PM గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తిరుగులేని మెజారిటీని సాధించింది. 182 అసెంబ్లీ స్థానాలు ఉన్న గుజరాత్లో బీజేపీ 156 చోట్ల విజయం కేతనం ఎగురవేసింది. 54శాతం ఓట్లను దక్కించుకుంది. మోదీ- షా సొంత రాష్ట్రంలో వరుసగా ఏడోసారి అధికారాన్ని దక్కించుకుంది. దీంతో పశ్చిమ బెంగాల్లో సీపీఎం రికార్డును బీజేపీ సమం చేసింది. కాగా 1977 నుంచి 2011 వరకు 34 సంవత్సరాల పాటు సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ పశ్చిమ బెంగాల్‌ను పాలించింది. 06:30PM గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, దళిత నాయకుడు జిగ్నేష్ మేవానీ విజయం సాధించారు. వడ్గమ్ అసెంబ్లీ స్థానం నుంచి మరోసారి గెలుపొందారు. అనంతరం తనకు విజయాన్ని అందించినందుకు వడ్గాం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం నియోజకవర్గ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని తెలియజేస్తుందన్నారు. ఇది సమాజంలోని పేద, అట్టడుగు వర్గాలను మరింత ముందుకు తీసుకొచ్చే బాధ్యతను కూడా తనకు అందిస్తుందని మేవానీ ట్వీట్ చేశారు. Thank you Gujarat. I am overcome with a lot of emotions seeing the phenomenal election results. People blessed politics of development and at the same time expressed a desire that they want this momentum to continue at a greater pace. I bow to Gujarat’s Jan Shakti. — Narendra Modi (@narendramodi) December 8, 2022 05:15PM గుజరాత్లో బీజేపీ ఘన విజయంపై ప్రధాని మోదీ స్పందించారు. అద్భుతమైన ఎన్నికల ఫలితాలు చూసి భావోద్వేగాని లోనైనట్లు తెలిపారు. అభివృద్ధి రాజకీయాలను ప్రజలు ఆశీర్వదించారని పేర్కొన్నారు.. ఇదే జోరును మరింత ముందుకు తీసుకెళ్లాలని వారు ఆకాంక్షిస్తున్నారని అన్నారు. గుజరాత్ ప్రజలకు నమస్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ విజయం కోసం కష్టపడి పనిచేసిస గుజరాత్ బీజేపీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. మీరందరూ ఛాంపియన్స్. పార్టీకి నిజమైన బలం అయిన కార్యకర్తల అసాధారణమైన కృషి లేకుండా ఈ చారిత్రాత్మక విజయం ఎప్పటికీ సాధ్యం కాదు.’ అని ట్వీట్ చేశారు. To all hardworking @BJP4Gujarat Karyakartas I want to say - each of you is a champion! This historic win would never be possible without the exceptional hardwork of our Karyakartas, who are the real strength of our Party. — Narendra Modi (@narendramodi) December 8, 2022 04:15PM అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం చవిచూడటంతో గుజరాత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రఘు శర్మ రాజీనామా చేశారు. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల కోత వెనుక ఆప్, అసదుద్దీన్ ఒవైసీ ఓ కారణమన్నది నిజమని గుజరాత్ కాంగ్రెస్ చీఫ్ జే ఠాకూర్ పేర్కొన్నారు. తమ లోటుపాట్లను విశ్లేషించేందుకు త్వరలో సమావేశం కానున్నట్లు తెలిపారు. రాబోయే ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను నెరవేరుస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. 2012, 2017, 2022 ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. 03:45PM గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థి ఇసుదన్ గధ్వి పరాజయం పొందారు. ఖంభాలియా నియోజవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి హర్దాస్‌భాయ్ బేరాపై 18వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. 03:15PM గుజరాత్లో కాంగ్రెస్ ఓట్లకు చీల్చేందుకు బీజేపీ ఆప్‌కి నిధులు సమకూర్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ఆరోపించారు. ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ భారీగా డబ్బు వెదజల్లిందని విమర్శించారు. ఆప్ పోటీలోకి రావడంతో తాము వెనకబడిపోయామని అన్నారు. ఈ ఎన్నికల్లో ఆప్‌కు 10 శాతం ఓట్లు రావడంతో కాంగ్రెస్ ఓట్లు తగ్గాయని పేర్కొన్నారు. మోర్బి అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ బీజేపీ అభ్యర్థి కాంతిలాల్ అమృతీయ విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన జయంతిలాల్ పటేల్‌పై 61,5000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 03:00PM గుజరాత్ ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీపై, బీజేపీ నాయకత్వంపై మరోసారి విశ్వాసం ప్రదర్శించారని రాఫ్ట్ర సీఎం భూపేంద్ర పటేల్ తెలిపారు. ఈ ఎన్నికల్లో గుజరాత్ ప్రజలు దేశ వ్యతిరేక శక్తులను తిరస్కరించారని అన్నారు. ప్రజల అభిష్టాన్ని స్వీకరిస్తున్నామని, బీజేపీకి చెందిన ప్రతి కార్యకర్త ప్రజాసేవకే కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు.. 02:30PM గుజరాత్లో బీజేపీ ఘన విజయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. బూటకపు వాగ్దానాలు చేసిన వారిని ప్రజలు తిరస్కరించారని.. ప్రధాని మోదీ అభివృద్ధి, పాలనపై నమ్మకంతో బీజేపీకి అపూర్వమైన విజయాన్ని అందించారని తెలిపారు. మహిళలు, యువకులు, రైతులు అనే తేడా లేకుండా అన్ని వర్గాలూ బీజేపీ వెంటే ఉన్నాయనడానికి ఈ భారీ విజయం సాక్ష్యంగా నిలిచిందన్నారు. गुजरात ने हमेशा इतिहास रचने का काम किया है। पिछले दो दशक में मोदी जी के नेतृत्व में भाजपा ने गुजरात में विकास के सभी रिकॉर्ड तोड़े और आज गुजरात की जनता ने भाजपा को आशीर्वाद देकर जीत के सभी रिकॉर्ड तोड़ दिये। यह @narendramodi जी के विकास मॉडल में जनता के अटूट विश्वास की जीत है। — Amit Shah (@AmitShah) December 8, 2022 01:53PM ► గుజరాత్ జామ్‌నగర్ నార్త్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన ప్రముఖ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా గెలుపొందారు. 61 వేలకుపైగా భారీ మెజార్టీ సాధించినట్లు తెలుస్తోంది. గెలుపుపై ఆమె స్పందిస్తూ.. ఇది అందరి విజయం అన్నారు. 12:45 PM ► గుజరాత్లో బీజేపీ ఘన విజయంతో సీఎంగా అధికారం చేపట్టనున్న భూపేంద్ర పటేల్. కాగా, డిసెంబర్ 10 లేదా 11వ తేదీన ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. Gujarat CM Bhupendra Patel and state BJP chief CR Paatil have sweets in celebration as the party sweeps the #GujaratAssemblyPolls The Chief Minister is also leading from his constituency Ghatlodia by a margin of 1,07,960 votes. pic.twitter.com/9CAGPjMLsM — ANI (@ANI) December 8, 2022 ► గుజరాత్లో కాంగ్రెస్ ఓట్ షేర్.. 26శాతం, ఆప్ ఓట్ షేర్.. 12.7 శాతం 12:10 PM ► గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ విజయం సాధించారు. గట్లోదియా నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన పటేల్ ఘన భారీ విజయాన్ని అందుకున్నారు. 11:40 AM ► గుజరాత్లో భారీ విజయం నేపథ్యంలో గురువారం సాయంత్రం ఆరు గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ కార్యాలయానికి వెళ్లనున్నారు. 11:18 A ► బీజేపీ ఘన విజయంతో గాంధీనగర్‌లో బీజేపీ శ్రేణులు డ్యాన్స్ చేస్తూ సంబురాలు జరుపుకుంటున్నాయి. #WATCH | Women BJP workers in Gandhinagar celebrate by dancing as the party heads towards a landslide victory in Gujarat BJP leading on 152 of the 182 seats, as per the official EC trends. pic.twitter.com/XlajLlNlYd— ANI (@ANI) December 8, 2022 #WATCH | Celebrations at Gandhinagar BJP office as the party sweeps Gujarat elections BJP leading on 149 seats of total 182 seats, as per ECI trends pic.twitter.com/rfuAusbO3z — ANI (@ANI) December 8, 2022 10:35 AM ► బీజేపీకి బంపర్ మోజార్టీ. బీజేపీ 54 శాతం ఓట్ షేర్ సాధించింది. వరుసుగా ఏడో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. గుజరాత్‌లోని అన్ని ప్రాంతాల్లో బీజేపీ మెజార్టీలో నిలిచింది. గుజరాత్లో అన్ని రికార్డులను బీజేపీ బ్రేక్ చేస్తోంది. ఇప్పటికి 153 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. 9:52 AM ► గాంధీనగర్ సౌత్‌లో అల్పేష్ ఠాకూర్ ముందంజ. మోర్టీలో కూడా బీజేపీ ఆధిక్యంలోకి వచ్చింది. విరంగాం స్థానంలో పాటిదార్ నేత హార్ధిక్ పటేల్ లీడ్‌లో ఉన్నారు. ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతుండటంతో కాషాయ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబురాలు జరుపుకుంటున్నారు. Gandhinagar, Gujarat | Bharatiya Janata Party workers celebrate as party crosses majority mark of 95 in early trends as per ECI. BJP is leading in 99 seats in the State pic.twitter.com/ylar3cPblB — ANI (@ANI) December 8, 2022 9:33 AM ► ఘాట్లోడియాలో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ముందంజలో ఉన్నారు. In Gujarat, BJP -123; Congress-22; AAP-10 - in early trends as per ECI BJP has crossed the halfway mark of 92 in the State in early trends pic.twitter.com/VVmyA1SZUq — ANI (@ANI) December 8, 2022 9: 25 AM ► 130కి పైగా స్థానాల్లో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. సౌరాష్ట్రలోని కచ్ ప్రాంతంలో బీజేపీ భారీ సీట్లలో ఆధిక్యంలో ఉంది. 8:53 AM. మోర్బీలో బీజేపీ వెనుకంజ ► మోర్బీలో బీజేపీ వెనుకంజ. కాగా, మోర్బీలో ఇటీవలే తీగల వంతెన కూలిపోయి దాదాపు 135 మంది మృత్యువాతపడిన విషయం తెలిసిందే. దీంతో, ఎన్నికల ఫలితాలపై ఈ ఘటన ప్రభావం చూపినట్టు తెలుస్తోంది. 8:47 AM ► జామ్‌నగర్ నార్త్‌లో లీడ్‌లో టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా జడేజా. 8:30 AM ► పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ దూసుకుపోతోంది. బీజేపీకి భారీ సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు దక్కాయి. దీంతో, ముందంజలో కొనసాగుతోంది. ► మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. #GujaratElections2022 | Counting of votes begin, visuals from Government Commerce College in Gandhinagar. pic.twitter.com/PmcIXC1rS8 — ANI (@ANI) December 8, 2022 ► ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. పోలీసుల భారీ బందోబస్తు మధ్య కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ► బీజేపీ ఘన విజయం సాధిస్తుంది. బీజేపీ విజయంలో ఎలాంటి సందేహం లేదు. 20 ఏళ్లుగా గుజరాత్లో ఎలాంటి దాడులు, టెర్రరిస్టుల దాడుల జరగలేదు. గుజరాత్ ప్రజలకు బీజేపీ ప్రభుత్వంపై నమ్మకం ఉంది. అందుకే మా పార్టీని గెలిపిస్తారు. 135-145 స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుంది.- హర్దిక్ పటేల్ 135-145, we are definitely going to form the Govt. Do you have any doubts?: BJP candidate from Viramgam, Hardik Patel when asked how many seats will his party get #GujaratElection2022 pic.twitter.com/dfekGSJtBB — ANI (@ANI) December 8, 2022 ► ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. అధికారులు, పార్టీ నేతలు కౌంటింగ్ సెంటర్లకు చేరుకుంటున్నారు. Ahmedabad, Gujarat | The counting of votes for the Gujarat Assembly elections will begin at 8 am. Outside visuals from counting centre at LD Engineering College pic.twitter.com/YPS7tIh2Jn — ANI (@ANI) December 8, 2022 ► గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. గుజరాత్లో 182 శాసనసభ స్థానాలుండగా డిసెంబర్ 1న, డిసెంబర్ 5న రెండు విడతల్లో ఎన్నికలు పూర్తయాయి. 27 ఏళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న కాషాయ పార్టీ తిరిగి ‘పవర్’పంచ్ విసరాలని తీవ్రంగా శ్రమించింది. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం కావడంతో ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా చర్చనడుస్తోంది. ► అయితే, పలు ఎగ్జిట్ పోల్ ఫలితాలు గుజరాత్లో బీజేపీకి అనుకూలంగా తీర్పునిచ్చాయి. తర్వాతి స్థానంలో కాంగ్రెస్ ఉంది. ఆప్ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక, ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ విజయం సాధిస్తే రికార్డు స్థాయిలో ఏడోసారి బీజేపీ విజయకేతనం ఎగురవేయనుంది. -
ఆప్ విజయకేతనం
గుజరాత్ తీర్పు వెల్లడికావడానికి 24 గంటలముందు దేశంలోని అతి పెద్ద కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. బలమైన విపక్షమన్న విశ్వాసం ఏర్పడితే ఆదరించటానికి సిద్ధంగా ఉన్నామని ఢిల్లీ ఓటర్లు సంకేతం పంపారు. ఉత్తర, దక్షిణ, తూర్పు ఢిల్లీ కార్పొరేషన్లు మూడూ విలీనమై 70 లక్షలమంది ఓటర్లు, 250 వార్డులతో మళ్లీ విస్తృతమైన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ)గా ఆవిర్భవించాక జరిగిన తొలి ఎన్నికల్లో ఆప్ 134 స్థానాలు గెలుచుకోగా, బీజేపీ 104 దక్కించుకుంది. దివంగత నేత షీలా దీక్షిత్ ఢిల్లీ ముఖ్య మంత్రిగా ఉన్నకాలంలో అత్యంత శక్తిమంతమైన పార్టీగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు కేవలం తొమ్మిది స్థానాలకు పరిమితమై దయనీయమైన స్థితిలో పడింది. ఢిల్లీ స్థానిక సంస్థల్లో తొలిసారి 2007లో అధికారం చేజిక్కించుకున్న బీజేపీని ఎలాగైనా బలహీనపరచాలని కాంగ్రెస్ పదిహేనేళ్లుగా ఆప సోపాలు పడుతుంటే ఆప్ చాలా స్వల్పకాలంలోనే ఆ పనిని సునాయాసంగా పూర్తిచేసి.... లక్ష్యం ఉంటే సరిపోదని, అందుకు తగ్గ ఆచరణ, చిత్తశుద్ధి అవసరమని తేటతెల్లం చేసింది. 2007లో ఎంసీడీ చేజారటం ఖాయమని గ్రహించిన అప్పటి సీఎం షీలా దీక్షిత్ గండం గట్టెక్కటానికి దాన్ని మూడు కార్పొరేషన్లుగా విడగొట్టారు. అయినా ఫలితం దక్కలేదు. దేశంలో ఇతర ప్రాంతాల మాటేమోగానీ ఢిల్లీలో ఇప్పటికీ ద్విధ్రువ రాజకీయాలే నడుస్తున్నాయని, కాంగ్రెస్ స్థానాన్ని ఆప్ భర్తీ చేసిందని ఈ ఎన్నికలు నిరూపించాయి. ఢిల్లీలో ఎన్నికల ఫలితాల గురించి జోస్యం చెప్పటానికి పెద్దగా నైపుణ్యం అవసరం లేదు. అక్కడి జనం ఏ విషయంపైనైనా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతారు. ఎక్కడ ఎవరి అవసరం ఉంటుందో, ఎవరిని గెలిపించాలో వారికి తెలిసినంతగా మరో ప్రాంతంవారికి తెలియదు. మూడు దఫాలుగా మున్సిపల్ కార్పొరేషన్లలో బీజేపీని అవిచ్ఛిన్నంగా గెలిపిస్తూ వస్తున్న ఓటర్లు అనంతర కాలంలో అసెంబ్లీ విషయానికొచ్చేసరికి ఆప్నే ఎంచుకున్నారు. అలాగని లోక్‌సభ ఎన్నికలొచ్చేసరికి బీజేపీవైపే మొగ్గుతున్నారు. అందుకే ఈ ఎన్నికల తీరు చూసి ఎవరేం చెప్పినా తొందరపాటే అవు తుంది. దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఓటర్లు విలక్షణమైనవారైనా ఢిల్లీ రాజకీయ గణం, అధికార యంత్రాంగం మాత్రం అన్నిచోట్లా ఉన్నట్టే ఉన్నారు. దాన్నొక సుందర నగరంగా తీర్చిదిద్దు తామని, సకల సౌకర్యాలతో స్వర్గంగా మారుస్తామని చెప్పిన నేతలే తప్ప చేసినవారు లేరు. దేశ రాజధానిగా ఉన్నందుకైనా అక్కడ పారిశుద్ధ్యం మెరుగుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎవరికీ అనిపించలేదు. ఆప్ వచ్చాక బస్తీ క్లినిక్‌లు కొంతమేరకు ఉపయోగపడిన మాట వాస్తవమే అయినా ఇంకా తగినంతగా వైద్య సౌకర్యాలు మెరుగుపడలేదనే చెప్పాలి. ఎంసీడీ వార్షిక బడ్జెట్ రూ. 15,200 కోట్లు. అందులో దాదాపు లక్షన్నరమంది సిబ్బంది ఉన్నారు. 2 కోట్ల మంది నగర జనాభాకు కావల సిన జనన, మరణాల ధ్రువీకరణ, వివాహ ధ్రువీకరణ మొదలుకొని వాణిజ్య లైసెన్సుల జారీ, చెత్త తొలగింపు, ప్రాథమిక విద్య పర్యవేక్షణ, ఆరోగ్య సర్వీసులు, కాలనీ రోడ్ల నిర్వహణ తదితరాలన్నీ చూసుకునే బాధ్యత ఎంసీడీదే. ఇన్నాళ్లూ కార్పొరేషన్లు బీజేపీ చేతుల్లోనూ, ప్రభుత్వం ఆప్ అధీనంలోనూ, అత్యధిక సర్వీసులన్నీ కేంద్రం చేతుల్లోనూ ఉండటంతో తరచు సమస్యలు తలెత్తేవి. కార్పొరేషన్ల వైఫల్యాల గురించి ఆప్ సర్కారు ఏకరువు పెట్టడం, సమస్య ప్రభుత్వం చేతిలోనే ఉన్నదని ఆ కార్పొరేషన్ల చైర్మన్లు ఎదురుదాడికి దిగటం రివాజుగా సాగేది. ముఖ్యంగా ఘాజీపూర్, భలాస్వా, జహంగీర్పూర్, ఓఖ్లాలలో కొండల్లా పెరిగిన డంపింగ్ యార్డులు బీజేపీ వైఫల్యాన్ని పట్టిచూపాయి. అన్ని రాజకీయ పక్షాల మాదిరే ఆప్ కూడా మున్సిపల్ పాలన అత్యద్భుతంగా ఉంటుందని ఊరించింది. అదెంతవరకూ నిలబెట్టుకుంటుందో చూడాలి. అందరి మాదిరే ఆప్ కూడా అనిపించేలా వ్యవహరిస్తే ఆ పార్టీని జనం క్షమించరు. ఈ ఎన్నికల్లో నెగ్గి ఎప్పటిలానే పాగా వేయటానికి బీజేపీ చేయనిదంటూ లేదు. అవినీతి ఆభియోగాల కేసులో అరెస్టయిన ఆప్ నేత, మంత్రి సత్యేందర్ జైన్ తిహార్ జైల్లో రాజవైభోగాలు అందుకుంటున్నట్టు నిరూపించే సీసీ టీవీ ఫుటేజ్‌లను చానెళ్లలో ఒకటికి పదిసార్లు ప్రసారమయ్యేలా చూసి లబ్ధి పొందుదామని బీజేపీ ప్రయ త్నించింది. కానీ జైన్ అసెంబ్లీ స్థానం పరిధిలోని మూడు మున్సిపల్ స్థానాలూ ఆప్కే దక్కాయి. ఓటర్లు జైన్‌పై అభియోగాలను పట్టించుకోలేదని ఫలితాలు నిరూపించాయి. ఈ నెల్లాళ్ల ప్రచారంలో 15 మంది కేంద్ర మంత్రులు, ఆరుగురు ముఖ్యమంత్రులు ఢిల్లీ వీధుల్లో కాళ్లకు బలపాలు కట్టుకుని తిరిగారు. మూడు కార్పొరేషన్ల వల్ల ఆచరణలో పెద్దగా లాభం లేకపోగా అందువల్ల అనవసర వ్యయం పెరిగిందని, వాటి పనితీరు మందగించిందని చెప్పి మూడింటినీ విలీనం చేయాలని కేంద్రం గత మే నెల 22న వాటిని రద్దు చేసింది. ఈ ప్రక్రియలో 272 వార్డులు కాస్తా 250కి తగ్గిపోయాయి. ఫలితాల సరళి చూస్తే పూర్వపు తూర్పు ఢిల్లీ కార్పొరేషన్ పరిధిలోని 77 స్థానాల్లో బీజేపీకి 42 వచ్చాయి. విలీనం లేకుంటే ఆ ఒక్కటయినా బీజేపీ ఖాతాలో పడి పరువు దక్కేది. ఫిరాయింపుల చట్టం ఉండీ లేనట్టే మిగిలిపోయిందని వివిధ రాష్ట్రాల్లో గోడ దూకుళ్లు రుజువు చేశాయి. స్థానిక సంస్థల్లో కనీసం ఆ అడ్డు కూడా లేదు. ఢిల్లీలో బీజేపీ ఆ పని చేయదని ఆశించాలి. అధికారాన్ని ఖరీదు చేయటం ద్వారా ఎవరూ జనం మెప్పు పొందలేరు. ఈ ఫలితాలతో ఆప్ బాధ్యత మరిన్ని రెట్లు పెరిగింది. దాన్ని నిలబెట్టుకోవటమా లేదా అనేది ఆ పార్టీ చేతుల్లో ఉంది.