Cricketer Ravindra Jadeja Wife Rivaba Jadeja-Wins Jamnagar North Seat - Sakshi
Sakshi News home page

Ravindra Jadeja: గాయం సాకుతో బంగ్లా టూర్‌కు దూరం; భార్యను గెలిపించుకున్న జడేజా

Published Thu, Dec 8 2022 7:40 PM | Last Updated on Thu, Dec 8 2022 8:20 PM

Cricketer Ravindra Jadeja Wife Rivaba Jadeja-Wins Jamnagar North Seat - Sakshi

టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా గుజరాత్‌ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అక్కడి అధికార బీజేపీ నుంచి పోటీ చేసిన ఆమె ఏకంగా 57 శాతం ఓట్లు కొల్లగొట్టడం విశేషం. 50 వేలకుపైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో రివాబా.. జామ్‌నగర్‌ నార్త్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన కర్షన్‌భాయ్‌ కర్మూర్‌పై రివాబా గెలిచారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి చతుర్‌సింగ్‌ జడేజా 15.5 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్‌ సీనియర్‌ లీడర్‌ అయిన హరి సింగ్‌ సోలంకి బంధువు అయిన రివాబా జడేజా 2019లో బీజేపీలో చేరారు. 

ఇక భార్య ఎన్నికల్లో నిలబడడంతో రవీంద్ర జడేజా గాయం సాకుతో బంగ్లా టూర్‌కు దూరమయ్యాడు. అయితే భార్య రివాబా జడేజా తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం వివాదాస్పదంగా మారింది. దేశానికి ఆడాల్సిన సమయం వచ్చినప్పుడు భార్యకు సహాయం చేయడం కోసం గాయం పేరు చెప్పి తప్పుకోవడం కరెక్ట్‌ కాదని జడేజాపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.

అయితే జడేజా ఈ విమర్శలను పట్టించుకోకుండా తన భార్య తరపున ప్రచారం కొనసాగించాడు. కట్‌చేస్తే.. గాయం సాకు చెప్పి బంగ్లా టూర్‌కు దూరమైనప్పటికి భార్యను మాత్రం బంపర్‌ మెజారిటీతో గెలిపించుకొని జడ్డూ సక్సెస్‌ అయ్యాడు. ఇక బంగ్లా పర్యటనకు వెళ్లిన టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి రెండు వన్డేల్లో ఓడిన రోహిత్‌ సేన 0-2తో బంగ్లాకు సిరీస్‌ను అప్పగించింది. కనీసం మూడో వన్డేలోనైనా గెలిచి వైట్‌వాష్‌ నుంచి తప్పించుకోవాలని టీమిండియా భావిస్తుంది.

1990, సెప్టెంబర్‌ 5న జన్మించిన రివాబా.. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివారు. ఆమె 2016, ఏప్రిల్ 17న క్రికెటర్‌ రవీంద్ర జడేజాను పెళ్లి చేసుకున్నారు. బీజేపీలో చేరిన మూడేళ్లలోనే ఎమ్మెల్యే టికెట్‌ సంపాదించి ఘన విజయం సాధించడం విశేషం. గుజరాత్‌లో వరుసగా ఏడోసారీ బీజేపీయే అధికారంలోకి వచ్చింది.  ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో గత రికార్డులన్నీ చెరిపేస్తూ బంపర్‌ మెజార్టీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. 182 అసెంబ్లీ స్థానాలకు గానూ 156 స్థానాల్లో గెలిచి బీజేపీ కొత్త రికార్డు సృష్టించింది. 1985లో కాంగ్రెస్‌ సాధించిన 149 సీట్లే ఇప్పటివరకు రికార్డుగా ఉండగా దానిని బీజేపీ బ్రేక్‌ చేసింది.

చదవండి: ప్రాక్టీస్‌ సెషన్‌కు డుమ్మా.. అవమానం తట్టుకోలేకనేనా?

'సరైనోడి చేతుల్లో ఉన్నాం'.. పొవార్‌కు హర్మన్‌ప్రీత్‌ కౌంటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement