Rivaba Solanki
-
బీజేపీలో చేరిన టీమిండియా స్టార్ క్రికెటర్!
టీమిండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా రాజకీయాల్లో ప్రవేశించాడు. ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ బీజేపీలో చేరాడు. జడేజా సతీమణి, బీజేపీ ఎమ్మెల్యే రివాబా సోలంకి ఈ విషయాన్ని వెల్లడించారు. జడ్డూ బీజేపీ సభ్యత్వాన్ని ధ్రువపరిచే ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.స్టార్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌కాగా దేశవాళీ క్రికెట్లో సౌరాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్న రవీంద్ర జడేజా.. 2009లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా సత్తా చాటుతూ జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకున్న జడ్డూ.. కీలక సభ్యుల్లో ఒకడిగా ఎదిగాడు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 72 టెస్టులు, 197 వన్డేలు, 74 టీ20 మ్యాచ్‌లు ఆడాడు జడేజా.తన కెరీర్లో ఇప్పటి వరకు అత్యధికంగా.. టెస్టుల్లో 3036 పరుగులు చేసిన జడ్డూ.. 294 వికెట్లు పడగొట్టాడు. ఇక లెఫ్టాండ్ బ్యాటర్ వన్డేల్లో 2756 రన్స్ స్కోరు చేయడంతో పాటు.. 220 వికెట్లు కూల్చాడు. అదే విధంగా ఈ లెప్టార్మ్ స్పిన్నర్ అంతర్జాతీయ టీ20 ఖాతాలో 515 పరుగులతో పాటు 54 వికెట్లు కూడా ఉన్నాయి. బీజేపీ సభ్యత్వంఇటీవల టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన టీమిండియాలోనూ జడేజా సభ్యుడు. ఇక ఐపీఎల్లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు సుదీర్ఘకాలంగా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు ఈ గుజరాతీ క్రికెటర్.ఈ క్రమంలో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న జడేజా తాజాగా రాజకీయాల్లో ప్రవేశించాడు. సభ్యత్వాల నమోదు కార్యక్రమంలో భాగంగా పార్లమెంటరీ మెంబర్షిప్ తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఐడీ కార్డును జడేజా భార్య రివాబా ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఎమ్మెల్యేగా భార్యను గెలిపించుకునికాగా గుజరాత్‌లోని జామ్‌నగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యే పోటీ చేసిన రివాబా విజయం సాధించారు. ఎన్నికల సమయంలో భార్య తరఫున ప్రచారం చేసిన జడ్డూ ఇప్పుడు ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న రాజకీయ పార్టీలో చేరాడు. అయితే, మంగళవారమే రివాబా ఈ ఫొటోలు పంచుకోగా.. తాజాగా ఈ విషయం హైలైట్ అయింది.🪷 #SadasyataAbhiyaan2024 pic.twitter.com/he0QhsimNK— Rivaba Ravindrasinh Jadeja (@Rivaba4BJP) September 2, 2024 -
Ravindra Jadeja: మా కోడలి వల్లే ఇదంతా... మండిపడ్డ రివాబా!
Ravindra Jadeja- Rivaba Jadeja: ఆటతోనే కాకుండా వ్యక్తిగత విషయాలతోనూ ఇటీవల వార్తల్లో నిలుస్తున్నాడు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా. పెళ్లైన తర్వాత తన కుమారుడు పూర్తిగా మారిపోయాడని.. అందుకు తమ కోడలు రివాబనే కారణమంటూ జడేజా తండ్రి అనిరుద్‌సిన్హ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ.. ఎంతో కష్టపడి కొడుకును క్రికెటర్‌ను చేస్తే ఇప్పుడు అతడిని నేరుగా కలిసే అవకాశం కూడా లేకుండా పోయిందంటూ వాపోయాడు. జడేజా ఆస్తిపై రివాబా, ఆమె తల్లిదండ్రుల పెత్తనం ఎక్కువైపోయిందని.. తమ మనవరాలిని కనీసం ఒక్కసారి కూడా చూడనివ్వలేదని అనిరుద్‌సిన్హ జడేజా ఆరోపించాడు. ఈ విషయంపై స్పందించిన రవీంద్ర జడేజా.. తన తండ్రి ఆరోపణలు అర్థంలేనివని కొట్టిపారేశాడు. ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ఇంటర్వ్యూలను ప్లాన్ చేయడాన్ని ఖండిస్తున్నానని.. ఇరువర్గాలను సంప్రదించిన తర్వాతే ఇటువంటి వార్తలు ప్రసారం చేస్తే బాగుంటుందని దైనిక్ భాస్కర్(జాతీయ మీడియా) తీరుపై జడ్డూ మండిపడ్డాడు. విలేకరి ప్రశ్నపై మండిపడ్డ రివాబా ఈ నేపథ్యంలో ఓ కార్యక్రమానికి హాజరైన జామ్‌నగర్ ఎమ్మెల్యే, జడ్డూ సతీమణి రివాబాకు ఈ విషయం గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు స్పందిస్తూ.. ‘‘ఈరోజు మనం ఇక్కడ ఎందుకు సమావేశమయ్యామో తెలియదా? వ్యక్తిగత విషయాల గురించి అడగాలంటే నేరుగా నన్ను వచ్చి కలవండి.. అంతేగానీ ఇక్కడ ఆ విషయాలు మాట్లాడొద్దు’’ అని రివాబా సదరు విలేకరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా రాజకీయాలపై ఆసక్తి ఉన్న రివాబా సోలంకి జడేజా బీజేపీలో చేరి జామ్‌నగర్ ఎమ్మెల్యేగా గెలిచి గుజరాత్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఎన్నికల ప్రచారంలో జడ్డూ మద్దతు.. ఇక ఎన్నికల ప్రచార సమయంలో రవీంద్ర జడేజా తన భార్య రివాబాకు మద్దతుగా నిలవగా... అతడి తండ్రి అనిరుద్‌సిన్హ, అక్క నైనాబా కాంగ్రెస్ తరఫున రివాబాకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు. ఇదిలా ఉంటే.. టెస్టుల్లో వరల్డ్ నంబర్ వన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఇంగ్లండ్‌తో సిరీస్‌తో బిజీగా ఉన్నాడు. తొలి టెస్టు తర్వాత గాయపడిన అతడు.. రెండో మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఫిబ్రవరి 15 నుంచి మొదలుకానున్న మూడో టెస్టుకు జడ్డూ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. చదవండి: ముంబై ఇండియన్స్ కోచ్‌పై రితిక ఫైర్.. రోహిత్ ఫస్ట్ రియాక్షన్ ఇదే પરિવારના વિખવાદ અંગે સવાલ પૂછતાં ભડક્યા રિવાબાજાડેજા.સાંભળો પત્રકારોને શું કહ્યુ ?#RivabaJadeja #Cricketer #RavindraJadeja #Interview #RavindraJadejafather #anirudhsinghjadeja #jamnagar #ravindrajadejanews #controversy #BreakingNews #Rajkot #Jamnagar #video #RavindraJadejafamily pic.twitter.com/RbCGQxA85U — akash solanki (@akash18191819) February 11, 2024 -
రవీంద్రకు మేము కనిపించడం లేదు.. నా భార్యనే అంటారా? ఊహించలేదు జడ్డూ..
#RavindraJadeja- What went wrong In His Family: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గురించి వస్తున్న వార్తలపై అతడి అభిమానులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది జడ్డూకు మద్దతుగా నిలిస్తే.. మరికొంత మంది అతడి తండ్రికి అండగా నిలుస్తున్నారు. ఏదేమైనా కుటుంబంలో చిచ్చు పెట్టేందుకు రాజకీయాలకు అవకాశం ఇవ్వొద్దని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. పెళ్లైన తర్వాత పూర్తిగా మారాడు కాగా పెళ్లైన తర్వాత రవీంద్ర పూర్తిగా మారిపోయాడని అతడి తండ్రి అనిరుధ్‌సిన్హా జడేజా సంచలన ఆరోపణలు చేశారు. అతడిని క్రికెటర్‌ను చేసి పెద్ద తప్పు చేశానని.. లేదంటే అందరిలాగే తమ కొడుకు కూడా తమ దగ్గరే ఉండేవాడని వాపోయారు. కోడలిగా రివాబా తమ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత .. పెత్తమనమంతా ఆమెది, ఆమె తల్లిదండ్రులదేనంటూ అనిరుధ్ ఆరోపించారు. ఈ మేరకు జాతీయ మీడియా దైనిక్ భాస్కర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘రవీంద్ర, అతడి భార్య రివాబాతో మాకు ఇప్పుడు ఎలాంటి బంధుత్వం లేదు. సొంతబంగ్లాలో ఉంటాడు వాళ్లు మాతో మాట్లాడరు. మేము కూడా వాళ్లతో మాట్లాడటం లేదు. రవీంద్ర పెళ్లైన తర్వాత రెండు- మూడు నెలల నుంచే మా మధ్య విభేదాలు మొదలయ్యాయి. ప్రస్తుతం నేను జామ్‌నగర్‌లో ఉంటున్నా. రవీంద్ర జడేజా సొంతబంగ్లాలో విడిగా ఉంటున్నాడు. మాతో పాటు ఒకే పట్టణంలో నివసించినా.. నాకు నా కుమారుడిని కలిసే అవకాశం లేదు. వాడి భార్య ఏం మంత్రం వేసిందో గానీ వాడి భార్య ఏ మంత్రం వేసిందో తెలియదు కానీ.. మా మధ్య సత్సంబంధాలు లేవు. వాడికి సంబంధించిన కొన్ని ట్రోఫీలు, బట్టలు అన్నీ ఇంకా నా గదిలోనే ఉన్నాయి. నిజానికి నేను ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. కీర్తి శేషురాలైన నా భార్య పెన్షన్‌తో బతుకున్నాను. సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేసిన నేను నా కొడుకును క్రికెటర్‌ను చేశాను. డబ్బు రవీంద్రది.. పెత్తనమంతా వాళ్లదే తనకు పేరు వచ్చాక, సంపద పెరుగుతున్నక్రమంలో మేము రెస్టారెంట్ ప్రారంభించాం. ఆ రెస్టారెంట్ వ్యవహారాలు తొలుత నా కుమార్తె నైనాబా చూసుకునేది. అయితే, రవీంద్ర పెళ్లైన కొన్నాళ్ల తర్వాత .. రివాబా యజమానురాలైంది. అలా కుటుంబంలో చిచ్చు రేగింది. అదే మేము విడిపోవడానికి కారణమైంది. ప్రతి విషయంలోనూ రివాబా తల్లిదండ్రులు అతిగా జోక్యం చేసుకుంటారు. వాళ్లు ఇటీవలే రూ. 2 కోట్ల విలువైన ఇంట్లోకి మారారు. అదంతా రవీంద్ర డబ్బే. తను నా కుమారుడు. ఇదంతా నా మనసును దహించి వేస్తోంది. తనకు పెళ్లి చేయకపోయినా బాగుండేది. లేదంటే అసలు క్రికెటర్ కాకపోయినా ఇంకా బాగుండేది. ఇప్పుడిలా తనకు దూరం కావాల్సిన పరిస్థితి వస్తుందని అస్సలు అనుకోలేదు’’ అని అనిరుద్‌సిన్హా తన కోడలు, బీజేపీ ఎమ్మెల్యే రివాబా సోలంకి జడేజాపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తండ్రి చేసిన ఆరోపణలపై రవీంద్ర జడేజా స్పందిస్తూ... తన భార్య రివాబా ఇమేజ్ను దెబ్బతీసేందుకే ఇలాంటి ఇంటర్వ్యూలు ప్లాన్ చేశారని మండిపడ్డాడు. తమ గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. వాటిని తాను ఖండిస్తున్నట్లు పేర్కొన్నాడు. దివ్య భాస్కర్ చేసిన ఈ ఇంటర్వ్యూ పూర్తిగా స్క్రిప్టెడ్ అని, అర్ధరహితమైందని కొట్టిపారేశాడు. నాణేనికి ఒక వైపును మాత్రమే ఎందుకు చూపిస్తారని జడ్డూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను చెప్పాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయని.. అయితే, వాటిని పబ్లిక్‌లో చెబితే బాగుండదని ఘాటుగానే బదులిచ్చాడు. రివాబా బీజేపీలో.. మామ, ఆడపడుచు కాంగ్రెస్‌లో! కాగా జడ్డూ సోదరి నైనాబా కారణంగానే రివాబా అతడికి పరిచయమైందని గతంలో వార్తలు వచ్చాయి. ఇరు కుటుంబాలు సంతోషంగా వీరి పెళ్లి చేశాయి. అయితే, రాజకీయాల మీద ఉన్న ఆసక్తితో రివాబా బీజేపీలో చేరగా.. అప్పటికే మామ అనిరుద్‌సిన్హా, ఆడపడుచు నైనాబా కాంగ్రెస్‌లో ఉన్నారు. ఈ క్రమంలో రివాబాకు రవీంద్ర జడేజా అండగా నిలవగా.. భర్త ప్రోత్సాహంతో అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యే టికెట్ సంపాదించారు. జామ్‌నగర్ నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు రివాబా. కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఆడపడుచు నైనాబా, మామ అనిరుద్ తనకు వ్యతిరేకంగా ప్రచారం చేసినా వారి గురించి రివాబా మాట తూలకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఇలాంటి అనిరుద్‌సిన్హా ఈ మేరకు ఆరోపణలు చేయడం, రవీంద్ర జడేజా ఇందుకు ఇలా సోషల్ మీడియాలో స్పందించడం నెటిజన్లను రెండు వర్గాలుగా చీల్చింది. కాగా టెస్టుల్లో నంబర్ వన్ ఆల్‌రౌండర్‌గా కొనసాగుతున్న జడేజా.. స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్‌తో బిజీగా ఉన్నాడు. అయితే, తొలి టెస్టులో గాయపడిన అతడు రెండో మ్యాచ్‌కు అందుబాటులోలేకుండా పోయాడు. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నట్లు సమాచారం. Ravindra Jadeja provides clarification on matters pertaining to his family.#INDvsENG #RavindraJadeja #TeamIndia pic.twitter.com/nc62uugGtd — OneCricket (@OneCricketApp) February 9, 2024 -
Ind vs Eng: భార్యతో కలిసి రవీంద్ర జడేజా పూజలు
Ravindra Jadeja - Rivaba Jadeja: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, గుజరాత్ క్రికెటర్ రవీంద్ర జడేజా భక్తి పారవశ్యంలో మునిగిపోయాడు. కచ్‌లో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వచనాలు అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను జడ్డూ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. సఫారీ పర్యటనలో విఫలం కాగా సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టీ20, టెస్టు జట్లకు ఎంపికైన జడేజా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. వెన్నునొప్పి కారణంగా తొలి టెస్టుకు దూరమైన అతడు.. ఆఖరిదైన రెండో మ్యాచ్‌లోనూ ప్రభావం చూపలేకపోయాడు. బ్యాటర్‌గా పూర్తిగా విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో డకౌట్ అయిన జడేజాకు ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. సతీసమేతంగా అమ్మవారి సన్నిధిలో ఈ క్రమంలో స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కుటుంబానికి సమయం కేటాయించిన రవీంద్ర జడేజా భార్య రివాబాతో కలిసి ప్రఖ్యాత ఆశాపుర మాతా ఆలయాన్ని దర్శించాడు. 14వ శతాబ్దంలో కచ్ ప్రాంతంలో నిర్మితమైన.. ఈ గుడిలో జడ్డూ కుటుంబం తాజాగా ప్రత్యేక పూజలు చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింటవైరల్ అవుతున్నాయి. కాగా జడేజా తదుపరి ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు సిద్ధం కానున్నాడు. స్వదేశంలో జరుగనున్న ఈ సిరీస్‌కు సంబంధించి తొలి రెండు మ్యాచ్‌లకు బీసీసీఐ ప్రకటించిన జట్టులో అతడికి స్థానం దక్కింది. బీజేపీ ఎమ్మెల్యే ఇక సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో టెస్టుల్లో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో కలిపి జడ్డూ 29 వికెట్లు పడగొట్టడం విశేషం. కాగా జడేజా భార్య రివాబా బీజేపీ ఎమ్మెల్యే అన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. జనవరి 25 నుంచి ఇంగ్లండ్‌తో టీమిండియా ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆరంభం కానుంది. (Rivaba: ఆడపడుచు, మామ అడ్డుపడినా! జడ్డూ భార్య రివాబా బ్యాగ్రౌండ్ ఇదే) చదవండి: Ranji Trophy: కెప్టెన్సీకి విహారీ రాజీనామా! రహానే గోల్డెన్ డక్.. ఇక రీఎంట్రీ కష్టమే! -
సహనం కోల్పోయిన రివాబా.. వీడియో వైరల్! అండగా జడ్డూ ఫ్యాన్స్
Ravindra Jadeja's wife Rivaba loses cool- Video: గుజరాత్‌లోని జామ్‌నగర్ ఎమ్యెల్యే, బీజేపీ నేత రివాబా జడేజా సహనం కోల్పోయారు. తమ పార్టీ నాయకులతోనే వాగ్వాదానికి దిగారు. స్వాత్రంత్య దినోత్సవాన ఎంపీ పూనంబెన్ తనను అవమానించారని, ఇలా చేయడం ఆమెకు తగదంటూ హితవు పలికారు. కాగా రివాబా మరెవరో కాదు.. టీమిండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి అన్న విషయం తెలిసిందే. భార్యను గెలిపించుకున్నాడు కాంగ్రెస్ పార్టీకి చెందిన తన ఆడపడుచు నైనాబా, మామగారు అనిరుద్ సింగ్ రూపంలో సొంత కుటుంబ సభ్యుల నుంచే వ్యతిరేకత ఎదురైనా.. రివాబా ఎమ్మెల్యేగా గెలుపొందారు. తండ్రి, సోదరి పార్టీ సిద్ధాంతాలను ఎదురిస్తున్న భార్యకు రవీంద్ర జడేజా అన్ని రకాలుగా అండగా నిలిచి ఆమె విజయంలో కీలక పాత్ర పోషించాడు. గాయం నుంచి కోలుకుంటున్న సమయంలో ఎన్నివలు వచ్చిన నేపథ్యంలో నాడు.. జడ్డూ కావాలనే గాయం సాకుతో గతేడాది బంగ్లాదేశ్ సిరీస్‌కు కూడా దూరమయ్యాడనే విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ, అవేమీ పట్టించుకోకుండా భార్యను గెలిపించుకునే పనిలో నిమగ్నమైన ఈ స్పిన్ ఆల్‌రౌండర్.. విజయవంతంగా టాస్క్ పూర్తి చేశాడు. ఇక పునరాగమనంలో అదరగొడుతూ జడ్డూ టీమిండియా స్టార్‌గా దూసుకుపోతుండగా.. ఎమ్మెల్యేగా తన విధుల్లో నిమగ్నమయ్యారు రివాబా. ఈ క్రమంలో స్వాతంత్ర్య దినోత్సవాన సహచర బీజేపీ నేతలతో రివాబా ప్రవర్తనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. షూ విప్పితే ఓవర్ స్మార్ట్? ఈ నేపథ్యంలో.. ‘‘ఇండిపెండెన్స్ డే సందర్భంగా.. ‘‘మేరీ మిట్టీ మేరా దేశ్’’ కార్యక్రమంలో భాగంగా అమరులైన సోదరులకు నివాళి అర్పించేటపుడు ఎంపీ షూ వేసుకున్నారు. నేను మాత్రం.. నా షూ తీసేసిన తర్వాతే నివాళి అర్పించాను. నాతో పాటు అక్కడున్న మిగతా నేతలు కూడా అలాగే చేశారు. కానీ.. ఎంపీ మాత్రం నన్ను టార్గెట్ చేశారు. ఓవర్ స్మార్ట్ అంటూ నాపై విషం చిమ్మారు’’ అని రివాబా ఆరోపించారు. ‘‘మేము అక్కడున్న సమయంలో.. ప్రధాన మంత్రి, రాష్ట్రపతి కూడా ఇలాంటి కార్యక్రమాల్లో షూ తీయరు. ఆమెకూ కౌంటర్ అయినా, కొంతమంది ఇలా అతి చేస్తూ ఉంటారు’’ అని ఎంపీ అనడం నేను చెవులారా విన్నాను’’ అని రివాబా పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎంపీకి సపోర్ట్‌గా సిటీ మేయర్ బినా కొటారీ జోక్యం చేసుకోవడంతో ఆమెకు కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చినట్లు రివాబా వెల్లడించారు. కాగా ఐపీఎల్-2023 ఫైనల్లో ఫోర్ బాది జడేజా చెన్నై సూపర్ కింగ్స్‌ను విజేతగా నిలిపిన తర్వాత.. నిండైన చీరకట్టుతో రివాబా వచ్చి భర్త రవీంద్ర కాళ్లకు నమస్కరించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి కూడా! ఈ నేపథ్యంలో జడ్డూ అభిమానులు.. ‘‘వదినమ్మకు తాను అనుకున్న ఆచారాలు పాటిస్తే తప్పేంటి? ఆమెను విమర్శించడం మానుకోండి అని మద్దతుగా నిలుస్తున్నారు. #WATCH | Gujarat: A verbal spat broke out between Jamnagar North MLA Rivaba Jadeja and MP Poonamben Maadam during an event in Jamnagar. (Visuals from earlier today) pic.twitter.com/J9wYiOmQgG — ANI (@ANI) August 17, 2023 -
ఆడపడుచు అడ్డుపడినా! జడ్డూ భార్య రివాబా బ్యాగ్రౌండ్ తెలుసా? వందల కోట్లు!
Who is Rivaba Jadeja? Networth: రవీంద్ర జడేజా.. టీమిండియా ప్రధాన ఆల్‌రౌండర్.. ఆసియా కప్-2022 సందర్భంగా గాయపడ్డ జడ్డూ పునరాగమనంలో అదరగొట్టాడు. ముఖ్యంగా స్వదేశంలో ఆస్ట్రేలియా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 టెస్టు సిరీస్‌లో దుమ్ములేపాడు. అద్భుత ప్రదర్శనతో.. మరో స్పిన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. ఇక ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్‌ను చాంపియన్‌గా నిలపడంలోనూ జడేజా కీలక పాత్ర పోషించాడు. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో ఫైనల్లో బౌండరీ బాది జట్టును విజయతీరాలకు చేర్చి.. సొంతగడ్డపై సత్తా చాటాడు. కాగా ఈ గెలుపుతో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని చెన్నై ఐదోసారి చాంపియన్‌గా నిలవగా ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. ముఖ్యంగా జడ్డూను ధోని పైకెత్తి సెలబ్రేట్ చేసుకోవడం, ఆ తర్వాత జడ్డూ భార్య రివాబా భర్త కాళ్లకు నమస్కరించి అతడిని ఆత్మీయంగా హత్తుకోవడం హైలైట్‌గా నిలిచాయి. సంప్రదాయ చీరకట్టుతో.. చిరునవ్వు నిండిన మోముతో నిండైన రూపంతో కనిపించిన రివాబా భర్త ఆశీర్వాదం తీసుకోవడం అభిమానులకు కన్నులపండుగ చేసింది. ఇంతకీ జడ్డూ భార్య రివాబా గురించి మీకు తెలుసా? ఆమె బ్యాగ్రౌండ్, ప్రొఫెషన్, నికర ఆస్తి.. తదితర ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం! రాజ్‌కోట్ అమ్మాయి రివాబా సింగ్ సోలంకి 1990, నవంబరు 2న గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జన్మించింది. ఆమె తండ్రి హర్దేవ్ సింగ్ సోలంకి వ్యాపారవేత్త. తల్లి ప్రఫుల్లాబా సోలంకి భారత రైల్వేస్‌లో ఉద్యోగిని. రాజ్‌కోట్‌లోని ఆత్మీయ యూనివర్సిటీలో రివాబా మెకానికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అలా పరిచయమై జడేజా సోదరి నైనాబాకు రివాబా స్నేహితురాలు. ఓ పార్టీలో నైనా.. రివాబాను జడేజాకు పరిచయం చేసింది. ఈ క్రమంలో ప్రేమలో పడ్డ జడ్డూ- రివాబాల నిశ్చితార్థం 2016 ఫిబ్రవరి 5న జరిగింది. జడేజాకు చెందిన రెస్టారెంట్లో బంధువుల సమక్షంలో ఇద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. అదే ఏడాది ఏప్రిల్ 17న వివాహ బంధంలో అడుగుపెట్టారు. వీరికి 2017లో కూతురు జన్మించింది. ఆడపడుచు, మామ వ్యతిరేక ప్రచారం చేసినా రాజకీయాల మీద ఉన్న ఆసక్తితో రివాబా బీజేపీలో చేరింది. భర్త ప్రోత్సాహంతో అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యే టికెట్ సంపాదించారు. ఈ క్రమంలో గతేడాది డిసెంబరులో జామ్‌నగర్ నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆడపడుచు నైనాబా, మామ అనిరుద్ సింగ్ తనకు వ్యతిరేకంగా ప్రచారం చేసినా వారిని పన్నెత్తి మాట కూడా అనలేదు. భర్త జడేజా అండగా నిలవడంతో ఇంటి పోరును జయించి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. రివాబా, జడేజా నెట్‌వర్త్ ఎంత? DNA నివేదిక ప్రకారం.. రివాబా సోలంకి జడేజా ఆస్తి విలువ 64.3 కోట్ల రూపాయలు అని సమాచారం. సొంతంగా ఆమె 57.60 లక్షల విలువైన ఆస్తులు కలిగి ఉంది. ఇక గతేడాది బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఏ గ్రేడ్‌లో ఉన్న జడ్డూకు ఈ ఏడాది ప్రమోషన్ లభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏ ప్లస్ గ్రేడ్‌లో ఉన్న అతడికి బీసీసీఐ ఏడాదికి రూ. 7 కోట్లు చెల్లిస్తుంది. కాగా జడేజాకు గుజరాత్లో పలు రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. ఇక ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన ఆటగాడిగా ఉన్న జడ్డూ ఏటా 16 కోట్లు ఆర్జిస్తున్నాడు. ఈ నేపథ్యంలో భారత స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా నికర ఆస్తి రూ. 120 కోట్లుగా పలు నివేదికలు అంచనా వేశాయి. ఆరు ఇండ్లు జడేజా- రివాబా దంపతులకు రాజ్‌కోట్, అహ్మాదాబాద్, జామ్‌నగర్‌లో కలిపి ఆరు ఇండ్లు ఉన్నాయి. ఇక వీరి గ్యారేజ్‌లో ఫోక్స్‌వ్యాగన్ పోలో జీటీ, ఫోర్డ్ ఎండీవర్, ఆడి క్యూ 7 వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. చదవండి: ధోనికి పిల్లనిచ్చిన అత్తగారు! ఆ కంపెనీ సీఈఓ.. రూ. 800 కోట్ల సామ్రాజ్యం! 20 లక్షలు అనుకుంటే ఏకంగా కోటీశ్వరుడయ్యాడు! జూబ్లీహిల్స్‌లో బంగ్లా, కార్లు.. తగ్గేదేలే! Ravindra Jadeja's wife touched Jadeja's feet after the victory last night.#MSDhoni𓃵 #CSKvsGT #IPL2023Final pic.twitter.com/nNp6RAWUhR — Bhadohi Wallah (@Mithileshdhar) May 30, 2023 -
ఇదేం ట్విస్టు భయ్యా! వదినమ్మను కాదని ఇలా..! జడ్డూ ట్వీట్ వైరల్
ప్రపంచంలోని ఉత్తమ ఆల్రౌండర్లలో టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజాకు చోటు దక్కుతుంది. 34 ఏళ్ల ఈ గుజరాత్ ఆటగాడు ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. ముఖ్యంగా ఈ ఏడాది ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‌లో అదరగొట్టిన జడ్డూ.. డబ్ల్యూటీసీ ఫైనల్-2023లో ఫర్వాలేదనిపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 48 పరుగులు చేసిన ఈ స్పిన్ ఆల్‌రౌండర్.. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగి పూర్తిగా నిరాశపరిచాడు. ఇక ఆసీస్‌తో ఫైనల్లో మొత్తంగా 4 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ వేదికగా ప్రఖ్యాత ఓవల్ వేదికగా జూన్ 7- 11 వరకు జరిగిన ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా ఆటగాళ్లకు దాదాపు నెలరోజుల విశ్రాంతి లభించింది. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ సహా మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు. ఇక జడేజా సైతం తనకు ఇష్టమైన వ్యాపకాల్లో మునిగిపోయాడు. కాగా రవీంద్ర జడేజాకు అశ్వాలన్నా, గుర్రపు స్వారీ అన్నా ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలో తాజాగా జడ్డూ షేర్ చేసిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. సుదీర్ఘ విరామం తర్వాత తనకు ఇష్టమైన అశ్వాన్ని కలిశానన్న జడ్డూ.. ‘‘ఫరెవర్ క్రష్’’ అంటూ ట్వీట్ చేశాడు. కాగా గత అక్టోబరులోనూ మై క్రష్ అంటూ జడేజా ఇలాంటి ఫొటోను పంచుకున్నాడు. ఇక జడేజా డబ్ల్యూటీసీ ఫైనల్ సందర్భంగా బిషన్ సింగ్ బేడీ పేరిట ఉన్న రికార్డును సవరించాడు. టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా నిలిచాడు. బిషన్ సింగ్ బేడి 67 మ్యాచ్‌లలో 266 వికెట్లు తీయగా.. జడ్డూ 65 మ్యాచ్‌లలో 268 వికెట్లతో అతడిని అధిగమించాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2023లో విన్నింగ్ షాట్లో రవీంద్ర జడేజా చెన్నై సూపర్ కింగ్స్‌ను చాంపియన్‌గా నిలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడి భార్య, ఎమ్మెల్యే రివాబా మైదానంలోకి వచ్చి జడ్డూ పాదాలకు నమస్కరించిన ఫొటోలు ఎంతగా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో జడ్డూ తాజా ట్వీట్‌పై అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇదేం ట్విస్టు భయ్యా! వదినమ్మ కాకుండా గుర్రాన్ని క్రష్ అంటున్నావు! ’’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు చదవండి: శుబ్‌మన్ గిల్ సంచలన నిర్ణయం! వచ్చే సీజన్లో సన్‌రైజర్స్ కెప్టెన్‌గా! రోహిత్ వద్దే వద్దు!.. నాడు బీసీసీఐ ధోనిని ఎందుకు కెప్టెన్‌ను చేసిందంటే.. Forever crush ❤️🐎 #meetingafterlongtime pic.twitter.com/NvrvZrqenV — Ravindrasinh jadeja (@imjadeja) June 18, 2023 -
CSK అభిమానులకు జడేజా భార్య ట్రీట్ ..!
-
గాయం సాకుతో బంగ్లా టూర్‌కు దూరం; భార్యను గెలిపించుకున్న జడేజా
టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా గుజరాత్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అక్కడి అధికార బీజేపీ నుంచి పోటీ చేసిన ఆమె ఏకంగా 57 శాతం ఓట్లు కొల్లగొట్టడం విశేషం. 50 వేలకుపైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో రివాబా.. జామ్‌నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కర్షన్‌భాయ్ కర్మూర్‌పై రివాబా గెలిచారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చతుర్‌సింగ్ జడేజా 15.5 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ అయిన హరి సింగ్ సోలంకి బంధువు అయిన రివాబా జడేజా 2019లో బీజేపీలో చేరారు. ఇక భార్య ఎన్నికల్లో నిలబడడంతో రవీంద్ర జడేజా గాయం సాకుతో బంగ్లా టూర్‌కు దూరమయ్యాడు. అయితే భార్య రివాబా జడేజా తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం వివాదాస్పదంగా మారింది. దేశానికి ఆడాల్సిన సమయం వచ్చినప్పుడు భార్యకు సహాయం చేయడం కోసం గాయం పేరు చెప్పి తప్పుకోవడం కరెక్ట్ కాదని జడేజాపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే జడేజా ఈ విమర్శలను పట్టించుకోకుండా తన భార్య తరపున ప్రచారం కొనసాగించాడు. కట్‌చేస్తే.. గాయం సాకు చెప్పి బంగ్లా టూర్‌కు దూరమైనప్పటికి భార్యను మాత్రం బంపర్ మెజారిటీతో గెలిపించుకొని జడ్డూ సక్సెస్ అయ్యాడు. ఇక బంగ్లా పర్యటనకు వెళ్లిన టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి రెండు వన్డేల్లో ఓడిన రోహిత్ సేన 0-2తో బంగ్లాకు సిరీస్‌ను అప్పగించింది. కనీసం మూడో వన్డేలోనైనా గెలిచి వైట్‌వాష్ నుంచి తప్పించుకోవాలని టీమిండియా భావిస్తుంది. 1990, సెప్టెంబర్ 5న జన్మించిన రివాబా.. మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. ఆమె 2016, ఏప్రిల్ 17న క్రికెటర్ రవీంద్ర జడేజాను పెళ్లి చేసుకున్నారు. బీజేపీలో చేరిన మూడేళ్లలోనే ఎమ్మెల్యే టికెట్ సంపాదించి ఘన విజయం సాధించడం విశేషం. గుజరాత్లో వరుసగా ఏడోసారీ బీజేపీయే అధికారంలోకి వచ్చింది. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో గత రికార్డులన్నీ చెరిపేస్తూ బంపర్ మెజార్టీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. 182 అసెంబ్లీ స్థానాలకు గానూ 156 స్థానాల్లో గెలిచి బీజేపీ కొత్త రికార్డు సృష్టించింది. 1985లో కాంగ్రెస్ సాధించిన 149 సీట్లే ఇప్పటివరకు రికార్డుగా ఉండగా దానిని బీజేపీ బ్రేక్ చేసింది. Congratulations to Smt Rivaba Jadeja on winning from #Jamnagar North constituency in the #GujaratAssemblyPolls! People have put their faith in your hard work & commitment towards public service. #GujaratElectionResult@Rivaba4BJP @narendramodi @AmitShah @Bhupendrapbjp @imjadeja pic.twitter.com/krS6oHe5ct — Parimal Nathwani (@mpparimal) December 8, 2022 #GujaratAssemblyPolls | BJP candidate from Jamnagar North, Rivaba Jadeja holds a roadshow in Jamnagar, along with her husband and cricketer Ravindra Jadeja. As per official EC trends, she is leading with a margin of 50,456 votes over AAP candidate Karshanbhai Karmur. pic.twitter.com/TgnDKGJB9Z — ANI (@ANI) December 8, 2022 చదవండి: ప్రాక్టీస్ సెషన్‌కు డుమ్మా.. అవమానం తట్టుకోలేకనేనా? 'సరైనోడి చేతుల్లో ఉన్నాం'.. పొవార్‌కు హర్మన్‌ప్రీత్ కౌంటర్ -
గుజరాత్ : రవీంద్ర జడేజా సతీమణి రివాబా గెలుపు
-
మహిళా కానిస్టేబుల్‌తో రవీంద్ర జడేజా వాగ్వాదం
గాంధీనగర్ : భారత క్రికెట్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రాజ్‌కోట్‌లో ఓ మహిళా కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగినట్లు మంగళవారం గుజరాత్ పోలీసులు తెలిపారు. వివరాలు.. జడేజా తన భార్య రివిబాతో కలిసి సోమవారం రాత్రి 9. గంటల సమయంలో కారులో వెళ్తుండగా వీరి వాహనాన్ని తనిఖీ చేసేందుకు మహిళా కానిస్టేబుల్ సోనాల్ గోసాయ్ అడ్డగించారు. కారు డ్రైవింగ్ సీట్లో జడేజా మాస్క్ ధరించి ఉన్నప్పటికీ అతని భార్య మాస్క్ ధరించలేదు. దీంతో ఎందుకు మాస్క్ ధరించలేదని ప్రశ్నించడంతోపాటు జరిమానా చెల్లించాలని మహిళా పోలీస్ ఆదేశించింది. దీంతో రవీంద్ర జడేజాకు కానిస్టేబుల్‌కు మధ్య వాదన పెరిగి వాగ్వాదానికి దిగినట్లు, మరోవైపు రివిబా కూడా ఆమెతో దురుసుగా ప్రవర్తించినట్లు డీసీపీ మనోహర్ సింగ్ తెలిపారు. (నెలలో 16.2 లక్షల సార్లు) అయితే తమ ప్రాథమిక దర్యాప్తులో జడేజా భార్య రవిబా మాస్క్ ధరించలేదని వెల్లడైందని పోలీసులు తెలిపారు. అసలు వీరి మధ్య గొడవ ఎందుకు పెద్దదయ్యిందనే విషయంపై దర్యాప్తు జరుగుతుందని వివరించారు. కాగా ఇద్దరి మధ్య ఘర్షణ అనంతరం మహిళా కానిస్టేబుల్ స్వల్ప అస్వస్థతకు గురవ్వడంతో ఆమెను వెంటనే స్థానిక ఆస్పత్రిలో చేర్చినట్లు తెలిపారు. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం కుదుట పడిందని ఇప్పుడు డిశ్చార్జి అయినట్లు వెల్లడించారు. అంతేగాక ఇటు జడేజా నుంచి అటు కానిస్టేబుల్ నుంచి ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు పేర్కొన్నారు. ('ఆరోజు సచిన్ నక్కతోకను తొక్కాడు') -
ఒక ఫ్యామిలీ.. రెండు పార్టీలు
‘భర్త ఒక పార్టీలో భార్య మరో పార్టీలో ఉంటే.. రేప్పొద్దున్న ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇద్దరూ బాగుపడొచ్చు’ అన్న పాత సినిమా డైలాగు క్రికెటర్ రవీంద్ర జడేజా కుటుంబానికి బాగా సరిపోతుంది. రవీంద్ర జడేజా గుజరాత్‌లోని జామ్‌నగర్ ప్రాంతానికి చెందిన వాడు. కాగా, ఆయన భార్య రివబా కిందటి నెల భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా జడేజా తండ్రి అనిరుధ్ సిన్హ, సోదరి నైనబా రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారు. జామ్‌నగర్ నియోజకవర్గంలోని కలవాడ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పటీదార్ ఉద్యమ నేత, కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన హార్దిక్ పటేల్ సమక్షంలో వీరిద్దరూ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గత మార్చి 3వ తేదీన ప్రధాని మోదీ గుజరాత్ పర్యటనకు రావడానికి ఒక రోజు ముందు జడేజా సతీమణి బీజేపీలో చేరారు. జామ్‌నగర్ సిట్టింగ్ ఎంపీ పూనంబెన్ సమక్షంలో రివబా కమలదళంలో భాగస్వాములయ్యారు. ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున పూనంబెన్ పోటీ చేస్తున్నారు. -
బీజేపీలో చేరిన జడేజా భార్య
రాజ్‌కోట్ : టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివాబా సోలంకి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆదివారం గుజరాత్ వ్యవసాయ శాఖ మంత్రి ఆర్సీ ఫల్దు, ఎంపీ పూనం సమక్షంలో రివాబా కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనకు స్ఫూర్తి అని, అందుకే తాను బీజేపీలో చేరినట్టు రవీబా జడేజా తెలిపారు. బీజేపీలో చేరడం ద్వారా దేశం మొత్తానికి సేవ చేసే అవకాశం లభిస్తుందన్నారు. గత ఏడాది నవంబర్ 20న జడేజా, ఆయన భార్య ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన విషయం తెలిసిందే. కర్ణిసేన మహిళా విభాగం అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన 6 నెల్లకే ఆమె రాజకీయాల్లోకి రావడం చర్చనీయాంశమైంది. గతేడాది ‘పద్మావత్’ సినిమాకి వ్యతిరేకంగా గుజరాత్, రాజస్తాన్ రాష్ట్రాల్లో కర్ణిసేన ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. క్షత్రియ వంశ చరిత్రను వక్రీకరించే విధంగా సినిమాను రూపొందిచినట్లు పేర్కొంటూ వారు ఈ నిరసన చేపట్టారు. దీంతో కొన్ని రాష్ట్రాలు మొదట్లో ఈ సినిమాను ప్రదర్శించడానికి వెనుకాడాయి. ఈ నిరసనల సమయంలోనే కర్ణిసేన పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. అయితే ఓ కానిస్టేబుల్ గొడవతో తొలిసారి వార్తల్లో నిలిచిన రివాబా.. ప్రస్తుతం రాజ్‌కోట్‌లో ఉంటూ జడేజా రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. ఇక జడేజా ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. 2016లో వివాహ బంధంతో ఒక్కటైన జడేజా-రివాబాలకు ఓ పాప ఉంది. -
టీమిండియా క్రికెటర్‌కు భారీ గిఫ్ట్
టీమిండియా సెమీస్ దశలోనే ఓడిపోయినా, మన క్రికెటర్లకు మాత్రం బహుమతులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అయితే స్పాన్సరర్లు, లేకపోతే అత్తవారు మనోళ్లకు గిఫ్టులు చదివిస్తున్నారు. తాజాగా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు బంపర్ లాటరీ తగిలింది. ఈనెల 17వ తేదీన పెళ్లి చేసుకోబోతున్న జడేజాకు అతడి అత్తింటివాళ్లు దాదాపు కోటి రూపాయల విలువైన ఆడి కారు బహూకరించారు. రాజ్‌కోట్‌కు చెందిన వ్యాపారవేత్త కుమార్తె రివబా సోలంకితో జడేజాకు ఫిబ్రవరి 5న నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత వరుసగా బిజీ షెడ్యూలులో ఉండటంతో పెళ్లి ముహూర్తం మాత్రం కాస్తా ఆలస్యంగా పెట్టుకున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన రివబా.. ప్రభుత్వోద్యోగం చేయాలని ఆశిస్తోందట. ఇందుకోసం సివిల్ సర్వీసుల పరీక్షలకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. జడేజా స్వగ్రామంతో పాటు రాజ్‌కోట్ నగరంలో కూడా మూడు రోజుల పాటు పెళ్లి వేడుకలు ఉంటాయి. ఈనెల 16న రాజ్‌కోట్‌లోని ఓ హోటల్లో తన తోటి క్రికెటర్లు, ఇతర ముఖ్య స్నేహితుల కోసం ఓ భారీ పార్టీ ఏర్పాటుచేశాడు. 17వ తేదీన అదే హోటల్లో సంప్రదాయబద్ధంగా పెళ్లి జరుగుతుంది. అదేరోజు సాయంత్రం ఆ హోటల్లోనే రిసెప్షన్ ఉంటుంది. పెళ్లికి కేవలం సన్నిహిత కుటుంబ సభ్యులను మాత్రమే పిలుస్తున్నారు. కొత్త దంపతులు 18వ తేదీన జడేజా స్వగ్రామమైన హడాతోడాకు వెళ్తారు. అక్కడ గ్రామస్తులతో కలిసి సంబరాలు ఉంటాయి. ఆరోజు సాయంత్రం ఓ సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ పెళ్లి వేడుకల నేపథ్యంలో ముందుగానే అత్తింటివాళ్లు అతగాడికి మంచి కారు బహూకరించారు. తనకు కాబోయే భార్యతో కలిసి సోమవారమే షోరూంకు వెళ్లి కారు డెలివరీ తీసుకున్నాడు. హర్దేవ్ సింగ్ సోలంకి, ప్రఫుల్లబా సోలంకి దంపతుల ఏకైక కుమార్తె రివబా. హర్దేవ్కు రాజ్‌కోట్ జిల్లాలో రెండు స్కూళ్లు, మోర్బిలోని నవ్లఖి పోర్టులో వే బ్రిడ్జి, రాజ్‌కోట్ నగరంలో ఓ హోటల్ ఉన్నాయి. రివబా తల్లి రైల్వేశాఖలో అకౌంట్స్ విభాగంలో పనిచేస్తారు. -
'సర్'కి మేడం దొరికింది!
రాజ్‌కోట్: భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా నిశ్చితార్థం... నగరానికే చెందిన రీవా సోలంకీతో శుక్రవారం జరిగింది. క్రికెటర్‌కు చెందిన రెస్టారెంట్ ‘జడ్డూస్ ఫుడ్ ఫీల్డ్’లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ వేడుకను సింపుల్‌గా ముగించారు. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ గౌరవ కార్యదర్శి నిరంజన్ షా, రాజ్ కోట్ సిటీ పోలీస్ కమిషనర్ మోహన్ జా వంటి ఎంపిక చేసిన కొంత మంది అతిథులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సౌరాష్ర్ట జట్టుకు ఆహ్వానం పంపినా రంజీ క్వార్టర్‌ఫైనల్స్ ఆడుతుండటంతో క్రికెటర్లెవ్వరూ ఈ వేడుకకు హాజరుకాలేదు. రీవా రాకతో తనకు వ్యక్తిగతంగా, వృతిపరంగా అదృష్టం కలిసొస్తుందని జడేజా ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘ఈ ఏడాది ఆరంభం నుంచి నాకు మంచే జరిగింది. ఈ నిశ్చితార్థంతో రాబోయే పది నెలలు కూడా క్రికెట్లో మరింత విజయవంతమవుతానని ఆశిస్తున్నా. ఇప్పటికైతే షెడ్యూల్ బాగా బిజీగా ఉంది. కొంత సమయం తీసుకుని పెళ్లి కార్యక్రమం ముగించేస్తా’ అని జడేజా పేర్కొన్నాడు. టి20 వరల్డ్‌కప్‌లో రాణించడమే తన ముందున్న లక్ష్యమన్నాడు. తన కాబోయే శ్రీమతికి క్రికెట్ అంటే పెద్దగా ఇష్టముండదని చెప్పిన జడేజా, ఇప్పట్నించి మ్యాచ్‌లను చూస్తుందని తెలిపాడు.