Ravindra Jadeja's wife Rivaba loses cool- Video: గుజరాత్‌లోని జామ్‌నగర్ ఎమ్యెల్యే, బీజేపీ నేత రివాబా జడేజా సహనం కోల్పోయారు. తమ పార్టీ నాయకులతోనే వాగ్వాదానికి దిగారు. స్వాత్రంత్య దినోత్సవాన ఎంపీ పూనంబెన్ తనను అవమానించారని, ఇలా చేయడం ఆమెకు తగదంటూ హితవు పలికారు. కాగా రివాబా మరెవరో కాదు.. టీమిండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి అన్న విషయం తెలిసిందే.
భార్యను గెలిపించుకున్నాడు
కాంగ్రెస్ పార్టీకి చెందిన తన ఆడపడుచు నైనాబా, మామగారు అనిరుద్ సింగ్ రూపంలో సొంత కుటుంబ సభ్యుల నుంచే వ్యతిరేకత ఎదురైనా.. రివాబా ఎమ్మెల్యేగా గెలుపొందారు. తండ్రి, సోదరి పార్టీ సిద్ధాంతాలను ఎదురిస్తున్న భార్యకు రవీంద్ర జడేజా అన్ని రకాలుగా అండగా నిలిచి ఆమె విజయంలో కీలక పాత్ర పోషించాడు.
గాయం నుంచి కోలుకుంటున్న సమయంలో ఎన్నివలు వచ్చిన నేపథ్యంలో నాడు.. జడ్డూ కావాలనే గాయం సాకుతో గతేడాది బంగ్లాదేశ్ సిరీస్‌కు కూడా దూరమయ్యాడనే విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ, అవేమీ పట్టించుకోకుండా భార్యను గెలిపించుకునే పనిలో నిమగ్నమైన ఈ స్పిన్ ఆల్‌రౌండర్.. విజయవంతంగా టాస్క్ పూర్తి చేశాడు.
ఇక పునరాగమనంలో అదరగొడుతూ జడ్డూ టీమిండియా స్టార్‌గా దూసుకుపోతుండగా.. ఎమ్మెల్యేగా తన విధుల్లో నిమగ్నమయ్యారు రివాబా. ఈ క్రమంలో స్వాతంత్ర్య దినోత్సవాన సహచర బీజేపీ నేతలతో రివాబా ప్రవర్తనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
షూ విప్పితే ఓవర్ స్మార్ట్?
ఈ నేపథ్యంలో.. ‘‘ఇండిపెండెన్స్ డే సందర్భంగా.. ‘‘మేరీ మిట్టీ మేరా దేశ్’’ కార్యక్రమంలో భాగంగా అమరులైన సోదరులకు నివాళి అర్పించేటపుడు ఎంపీ షూ వేసుకున్నారు. నేను మాత్రం.. నా షూ తీసేసిన తర్వాతే నివాళి అర్పించాను.
నాతో పాటు అక్కడున్న మిగతా నేతలు కూడా అలాగే చేశారు. కానీ.. ఎంపీ మాత్రం నన్ను టార్గెట్ చేశారు. ఓవర్ స్మార్ట్ అంటూ నాపై విషం చిమ్మారు’’ అని రివాబా ఆరోపించారు. ‘‘మేము అక్కడున్న సమయంలో.. ప్రధాన మంత్రి, రాష్ట్రపతి కూడా ఇలాంటి కార్యక్రమాల్లో షూ తీయరు.
ఆమెకూ కౌంటర్
అయినా, కొంతమంది ఇలా అతి చేస్తూ ఉంటారు’’ అని ఎంపీ అనడం నేను చెవులారా విన్నాను’’ అని రివాబా పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎంపీకి సపోర్ట్‌గా సిటీ మేయర్ బినా కొటారీ జోక్యం చేసుకోవడంతో ఆమెకు కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చినట్లు రివాబా వెల్లడించారు.
కాగా ఐపీఎల్-2023 ఫైనల్లో ఫోర్ బాది జడేజా చెన్నై సూపర్ కింగ్స్‌ను విజేతగా నిలిపిన తర్వాత.. నిండైన చీరకట్టుతో రివాబా వచ్చి భర్త రవీంద్ర కాళ్లకు నమస్కరించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి కూడా! ఈ నేపథ్యంలో జడ్డూ అభిమానులు.. ‘‘వదినమ్మకు తాను అనుకున్న ఆచారాలు పాటిస్తే తప్పేంటి? ఆమెను విమర్శించడం మానుకోండి అని మద్దతుగా నిలుస్తున్నారు.
#WATCH | Gujarat: A verbal spat broke out between Jamnagar North MLA Rivaba Jadeja and MP Poonamben Maadam during an event in Jamnagar.
— ANI (@ANI) August 17, 2023
(Visuals from earlier today) pic.twitter.com/J9wYiOmQgG
Comments
Please login to add a commentAdd a comment