గాంధీ నగర్: గాయంతో ఇంగ్లండ్ సిరీస్‌కు దూరమైన టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వివాదంలో చిక్కుకున్నాడు. తాజాగా గుజరాత్‌లోని సఫారికి వెళ్లిన జడేజాకు ఒక సింహం గుంపు ఎదురైంది. మూడు సింహాలు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుంటే వాటిని వీడియో తీశాడు. అనంతరం అక్కడే సింహం పిల్లతో ఫోటో దిగి వాటిని ట్విటర్‌లో షేర్ చేశాడు. 'నిజంగా ఇది గొప్ప ఎక్స్‌పీరియన్స్.. రోడ్‌ట్రిప్ ఫుల్‌గా ఎంజాయ్ చేశానంటూ'క్యాప్షన్ జత చేశాడు. జడేజా సింహం పిల్లతో ఫోటో దిగడం అతన్ని వివాదంలోకి నెట్టింది.
సాధారణంగా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం షెడ్యూల్ ఐ కేటగిరీలో ఉన్న జంతువులతో ఫోటోలు తీసుకునే అవకాశం లేదు. ఈ విషయం తెలియని జడేజా సింహంతో ఫోటో దిగి ట్విటర్‌లో షేర్ చేయడంతో ఇబ్బందులు కొని తెచ్చకున్నాడు. జడేజా తీసిన ఫోటోలు పరిశీలించిన అటవీ అధికారులు... అవి గుజరాత్‌లో తీసుకున్న ఫోటో కాదని.. ఆఫ్రికన్ సింహాలు అని అటవీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 2018లో టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లినప్పుడు జడేజా అక్కడి సఫారిలో తీసుకున్న ఫోటో అయి ఉండే అవకాశం ఉంది. తాజాగా అప్పటి వీడియోనే మళ్లీ షేర్ చేసి ఉంటాడని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ విషయంపై జడేజా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
కాగా గత నెలలో బర్ద్ ఫ్లూ ఎక్కువగా ఉన్న సమయంలో చేపలకు, పక్షులకు ఆహారం వేసి ప్రముఖ క్రికెటర్ శిఖర్ ధావన్ ఇబ్బందులకు గురైన సంగతి తెలిసిందే. ఆసీస్ పర్యటనలో భాగంగా మూడో టెస్టులో బ్యాటింగ్ సమయంలో జడేజా బొటనవేలికి బంతి బలంగా తగిలింది. జడేజాను పర్యవేక్షించిన వైద్యులు అతనికి కనీసం ఆరు వారాల విశ్రాంతి అవసరం అని చెప్పడంతో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు.
చదవండి: 'ఇప్పటికైనా అతనికి అవకాశం ఇవ్వండి'
కెప్టెన్‌గా రూట్ అరుదైన రికార్డులు
Woah ! Best experience ever #sasangir #roadtrip pic.twitter.com/nCLwjEv1N1
— Ravindrasinh jadeja (@imjadeja) February 8, 2021
Comments
Please login to add a commentAdd a comment