
Ravindra Jadeja - Rivaba Jadeja: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, గుజరాత్ క్రికెటర్ రవీంద్ర జడేజా భక్తి పారవశ్యంలో మునిగిపోయాడు. కచ్‌లో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వచనాలు అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను జడ్డూ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
సఫారీ పర్యటనలో విఫలం
కాగా సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టీ20, టెస్టు జట్లకు ఎంపికైన జడేజా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. వెన్నునొప్పి కారణంగా తొలి టెస్టుకు దూరమైన అతడు.. ఆఖరిదైన రెండో మ్యాచ్‌లోనూ ప్రభావం చూపలేకపోయాడు. బ్యాటర్‌గా పూర్తిగా విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో డకౌట్ అయిన జడేజాకు ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేసే అవకాశం రాలేదు.
సతీసమేతంగా అమ్మవారి సన్నిధిలో
ఈ క్రమంలో స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కుటుంబానికి సమయం కేటాయించిన రవీంద్ర జడేజా భార్య రివాబాతో కలిసి ప్రఖ్యాత ఆశాపుర మాతా ఆలయాన్ని దర్శించాడు. 14వ శతాబ్దంలో కచ్ ప్రాంతంలో నిర్మితమైన.. ఈ గుడిలో జడ్డూ కుటుంబం తాజాగా ప్రత్యేక పూజలు చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింటవైరల్ అవుతున్నాయి.
కాగా జడేజా తదుపరి ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు సిద్ధం కానున్నాడు. స్వదేశంలో జరుగనున్న ఈ సిరీస్‌కు సంబంధించి తొలి రెండు మ్యాచ్‌లకు బీసీసీఐ ప్రకటించిన జట్టులో అతడికి స్థానం దక్కింది.
బీజేపీ ఎమ్మెల్యే
ఇక సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో టెస్టుల్లో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో కలిపి జడ్డూ 29 వికెట్లు పడగొట్టడం విశేషం. కాగా జడేజా భార్య రివాబా బీజేపీ ఎమ్మెల్యే అన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. జనవరి 25 నుంచి ఇంగ్లండ్‌తో టీమిండియా ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆరంభం కానుంది.
(Rivaba: ఆడపడుచు, మామ అడ్డుపడినా! జడ్డూ భార్య రివాబా బ్యాగ్రౌండ్ ఇదే)
చదవండి: Ranji Trophy: కెప్టెన్సీకి విహారీ రాజీనామా! రహానే గోల్డెన్ డక్.. ఇక రీఎంట్రీ కష్టమే!