temple visit
-
Ind vs Eng: భార్యతో కలిసి రవీంద్ర జడేజా పూజలు
Ravindra Jadeja - Rivaba Jadeja: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, గుజరాత్ క్రికెటర్ రవీంద్ర జడేజా భక్తి పారవశ్యంలో మునిగిపోయాడు. కచ్‌లో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వచనాలు అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను జడ్డూ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. సఫారీ పర్యటనలో విఫలం కాగా సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టీ20, టెస్టు జట్లకు ఎంపికైన జడేజా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. వెన్నునొప్పి కారణంగా తొలి టెస్టుకు దూరమైన అతడు.. ఆఖరిదైన రెండో మ్యాచ్‌లోనూ ప్రభావం చూపలేకపోయాడు. బ్యాటర్‌గా పూర్తిగా విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో డకౌట్ అయిన జడేజాకు ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. సతీసమేతంగా అమ్మవారి సన్నిధిలో ఈ క్రమంలో స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కుటుంబానికి సమయం కేటాయించిన రవీంద్ర జడేజా భార్య రివాబాతో కలిసి ప్రఖ్యాత ఆశాపుర మాతా ఆలయాన్ని దర్శించాడు. 14వ శతాబ్దంలో కచ్ ప్రాంతంలో నిర్మితమైన.. ఈ గుడిలో జడ్డూ కుటుంబం తాజాగా ప్రత్యేక పూజలు చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింటవైరల్ అవుతున్నాయి. కాగా జడేజా తదుపరి ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు సిద్ధం కానున్నాడు. స్వదేశంలో జరుగనున్న ఈ సిరీస్‌కు సంబంధించి తొలి రెండు మ్యాచ్‌లకు బీసీసీఐ ప్రకటించిన జట్టులో అతడికి స్థానం దక్కింది. బీజేపీ ఎమ్మెల్యే ఇక సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో టెస్టుల్లో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో కలిపి జడ్డూ 29 వికెట్లు పడగొట్టడం విశేషం. కాగా జడేజా భార్య రివాబా బీజేపీ ఎమ్మెల్యే అన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. జనవరి 25 నుంచి ఇంగ్లండ్‌తో టీమిండియా ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆరంభం కానుంది. (Rivaba: ఆడపడుచు, మామ అడ్డుపడినా! జడ్డూ భార్య రివాబా బ్యాగ్రౌండ్ ఇదే) చదవండి: Ranji Trophy: కెప్టెన్సీకి విహారీ రాజీనామా! రహానే గోల్డెన్ డక్.. ఇక రీఎంట్రీ కష్టమే! -
ఆ విషయంలో నా కుమార్తెకు ధన్యవాదాలు: ఎస్ఎస్ రాజమౌళి
ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్‌ను ప్రపంచానికి పరిచయం దర్శకధీరుడు రాజమౌళి. ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్ ఏకంగా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచింది. అయితే ఈ చిత్రానికి సీక్సెల్ కూడా ఉంటుందని ఇటీవలే ప్రకటించారు కూడా. దీనికి సంబంధించిన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. (ఇది చదవండి: లేటు వయసులో నటుడి పెళ్లి.. మళ్లీ హనీమూన్ కూడానా?) కానీ అంతకుముందే ప్రిన్స్ మహేశ్‌బాబుతో రాజమౌళి ఓ చిత్రం చేయనున్నారు. గతంలోనే రాజమౌళి, మహేశ్ తో చేయబోయే సినిమా గురించి మాట్లాడుతూ.. ఇది గ్లోబ్ ట్రొటింగ్ సినిమా అని అన్నారు. అడ్వెంచరస్ తరహా స్టోరీ ఉండబోతుందని హింట్ ఇచ్చారు. ఇలా రాజమౌళి-విజయేంద్ర ప్రసాద్ మాటలు బట్టి చూస్తుంటే ఇది ఇండియానా జోన్స్ తరహా జంగిల్ అడ్వెంచర్ అని తెలుస్తోంది. షూటింగ్ వచ్చే ఏడాది మొదలవుతుంది. అయితే ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి ఆధ్యాత్మిక పర్యటనకు వెళ్లారు దర్శకధీరుడు. తన కుటుంబంతో కలిసి తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను చుట్టేసినట్లు ట్విటర్లో పోస్ట్ చేశారు. జూన్ నెల చివరివారంలో తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను సందర్శించినట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియోను రాజమౌళి తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ట్వీట్లో రాస్తూ.. 'చాలా కాలంగా తమిళనాడులో రోడ్ ట్రిప్ వెళ్లాలనుకున్నా. దేవాలయాలను సందర్శించాలనుకున్న నా కుమార్తె ఆలోచనకు ధన్యవాదాలు. మేము జూన్ చివరి వారంలో శ్రీరంగం, దారాసురం, బృహదీశ్వర కోయిల్, రామేశ్వరం, కణాదుకథాన్, తూత్తుకుడి, మదురైకి వెళ్లాం. అద్భుతమైన వాస్తుశిల్పం, ఇంజనీరింగ్, పాండ్యాలు, చోజాస్ నాయకర్లు, అనేక ఇతర పాలకుల లోతైన ఆధ్యాత్మిక ఆలోచనలు నిజంగా నన్ను మంత్రముగ్ధులను చేశాయి. అంతే కాకుండా మంత్రకూడం, కుంభకోణంలో చక్కటి భోజనం చేసినా.. రామేశ్వరంలోని కాకా హోటల్ మురుగన్ మెస్‌లో భోజనం చేసినా.. ఎక్కడైనా భోజనం అద్భుతంగా అనిపించింది. నేను వారంలోనే 2-3 కిలోలు పెరిగాను. 3 నెలల విదేశీ ప్రయాణం తర్వాత.. ఈ హోమ్ ల్యాండ్ టూర్ రిఫ్రెష్‌గా ఉంది.' అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (ఇది చదవండి: మహేశ్ సినిమా క్లైమాక్స్ బయటపెట్టిన రాజమౌళి తండ్రి ) Wanted to do a road trip in central Tamilnadu for a long time. Thanks to my daughter who wanted to visit temples, we embarked upon it. Had been to Srirangam, Darasuram, Brihadeeswarar koil, Rameshwaram, Kanadukathan, Thoothukudi and Madurai in the last week of June . Could only… pic.twitter.com/rW52uVJGk2 — rajamouli ss (@ssrajamouli) July 11, 2023 -
అమలాపాల్‌కు చేదు అనుభవం, వివాదాస్పదంగా టెంపుల్ సంఘటన!
నటి అమలాపాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. కేరళలోని అమ్మవారి దర్శనానికి వెళ్లిన ఆమెను ఆలయ అధికారులు అడ్డుకున్న సంఘటన స్థానికంగా వివాదస్పమైంది. వివరాలు.. కేరళలోని ఎర్నాకుళంలోని తిరువైరానికుళం మహాదేవ ఆలయంలోకి హిందూ భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఇతర మతస్తులకు అనుమతి ఉండదు. ఈ క్రమంలో రీసెంట్గా తన స్నేహితులతో అమలాపాల్ అమ్మవారిని దర్శించుకునేందుకు ఎర్నాకుళం ఆలయానికి వెళ్లింది. క్రిస్టయన్ మతస్తురాలైన అమలాను అక్కడ ఆలయ అధికారులు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. చదవండి: అరుదైన వ్యాధి.. పోరాటంలో విజయం మాదే అంటున్న అందాల తారలు దీంతో నిరాశ చెందిన ఆమె ఆలయ సందర్శకుల రిజిస్టర్లో నోట్ రాసింది. ‘అన్యమతస్థురాలిని అని నాకు ఆలయంలో అనుమతి ఇవ్వలేదు. నేను ఆలయంలోకి వెళ్లలేకపోయినా దూరం నుంచే అమ్మవారిని ప్రార్థించాను. అమ్మవారి శక్తిని ఫీల్ అయ్యాను. కానీ నన్ను ఆలయంలోకి అనుమతించకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాను. 2023లోనూ మతపరమైన వివక్ష ఇంకా కొనసాగడం విచారకరం. ఈ వివక్షలో త్వరలో మార్పు వస్తుందని ఆశిస్తున్నా. మతం ప్రాతిపదికన కాకుండా అందరినీ సమానంగా చూసే సమయం రావాలని కోరుకుంటున్నా’ అని అమలా పేర్కొంది. చదవండి: ఆ స్టార్ హీరోతో ప్రేమలో పడ్డాను: సీనియర్ నటి జయమాలిని ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా వివాదస్పదంగా మారింది. దీనిపై పలు సామాజికి సంఘాలు, ప్రముఖుల నుంచి భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ ట్రస్ట్ కార్యదర్శి ప్రసూన్ కుమార్ ఈ ఘటనపై స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ఉన్న ప్రోట్‌కాల్‌ను మాత్రమే మేం పాటిస్తున్నామన్నారు. ఇతర మతాలకు చెందిన వారు కూడా రోజు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కానీ అది ఎవరికి తెలియదు. ఇప్పుడు వచ్చింది ఒక సెలబ్రెటి కాబట్టి ఇది వివాదస్పదం అయ్యింది’ అని అన్నారు. -
వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించిన షారుక్ ఖాన్, వీడియో వైరల్
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తాజాగా జమ్మూ కశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించాడు. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజలు చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవలె షారక్ మక్కాను సందర్శించి అక్కడ కూడా ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం షారుక్ పఠాన్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో దీపికా పదుకోణె హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. Shah visited Vaishno Devi Temple ❤️ May Devi Maa fulfill all his wishes 🙏🏻 #ShahRukhKhan𓀠 pic.twitter.com/1XrL82XaCW — 👸Sharania Jhanvi𓀠🌹BesharamRang (@SharaniaJ) December 12, 2022 -
త్వరలో పెళ్లి! మూవీ యూనిట్‌తో కలిసి అమ్మవారి దర్శనం
నటి హన్సిక పేరు ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. కారణం ఈమె పెళ్లికి సిద్ధమవడమే. డిసెంబర్ 4వ తేదీన హన్సిక పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈమె ఆదివారం చెన్నైలోని కాళియంబాళ్ ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకుంది. ఈమె తాజాగా నటిస్తున్న చిత్రం యూనిట్ కూడా దైవ దర్శనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్లే.. తాజాగా హన్సిక్ ఓ లేడీ ఓరియంటెడ్ చిత్రంలో నటిస్తోంది. ఇందులో ఈమె తొలిసారిగా ద్విపాత్రాభినయం చేయడం విశేషం. దర్శకుడు ఆర్.కన్నన్ స్వీయ దర్శకత్వంలో తన మసాలా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఇందులో మెట్రో సిరీష్ , మయిల్ సామి, తలైవాసల్ విజయ్, ప్రజిత, పవన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. చదవండి: పెళ్లి పీటలు ఎక్కబోతోన్న హీరో-హీరోయిన్! ముహుర్తం కూడా ఫిక్స్? ఈ చిత్రం గత నెలలో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. మసాలా ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న 10వ చిత్రం ఇది. ఈమె చిత్ర షూటింగ్‌ను ఆదివారం చెన్నైలో ప్రారంభించారు. ముందుగా హన్సికతో పాటు చిత్ర యూనిట్ కాళియంబాళ్ ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకున్నారు. ఆ ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది ఎమోషనల్‌తో కూడిన హార్రర్, కామెడీ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. చిత్ర షూటింగ్‌ను నిర్విరామంగా ఈ నెలపాటు నిర్వహించి పూర్తి చేయనున్నట్లు తెలిపారు. #Hansika did Dharshan at the famous #KaligaambaalTemple in Chennai today before shooting for @Dir_kannanR ‘s emotional horror thriller. For the very first time, #Hansika does dual role in this film produced by @MasalaPix @johnsoncinepro pic.twitter.com/tlgEoBIEzp — Ramesh Bala (@rameshlaus) November 13, 2022 -
Rishi Sunak: పక్కా హిందూ
‘‘నేను హిందువుని అని చెప్పుకోవడానికి గర్వపడతాను’’ అని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పలు సందర్భాల్లో బాహాటంగానే ప్రకటించారు. ఎంత ఎదిగినా తన మూలాలను ఆయన ఎన్నడూ మరచిపోలేదు. రిషి బ్రిటన్‌లో పుట్టి పెరిగినప్పటికీ చిన్నప్పట్నుంచి భారత సంస్కృతి సంప్రదాయలను వంటపట్టించుకున్నారు. తరచూ దేవాలయాలను దర్శిస్తూ ఉంటారు. సోమవారం ఉపవాసం చేస్తారు. గోమాంసం ముట్టరు. యూకే రాజకీయాల్లో హిందువునని చెప్పుకునే రిషి పైకి ఎదిగారు. అదే ఆయన ప్రత్యేకత. హిందువులకు అత్యంత పవిత్రమైన భగవద్గీతపైన అపారమైన నమ్మకం. 2015లో మొదటిసారి పార్లమెంటుకు ఎన్నికైనప్పుడు భగవద్గీత మీద ప్రమాణం చేశారు. జాన్సన్ హయాంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించేటప్పుడు కూడా గీతపైనే ప్రమాణం చేశారు .ప్రధానిగా లిజ్ ట్రస్‌తో పోటీ పడే సమయంలో ప్రచారంలోనూ శ్రీకృష్ణ జయంతి రోజున గోపూజ చేస్తున్న ఫొటోలు, వీడియోలతో ఆయన ట్వీట్లు చేశారు.రిషి ఇంగ్లీషుతో పాటు హిందీ, పంజాబీ భాషలు అనర్గళంగా మాట్లాడగలరు. సునాక్‌కు భారత్ పాస్‌పోర్టు కూడా ఉంది. బెంగుళూరుకు చెందిన బ్రాహ్మణ కుటుంబమైన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అక్షతను పెళ్లి చేసుకున్న సునాక్ ఇంట్లో కూడా భారతీయ సంప్రదాయాలనే పాటిస్తారు. వారి ఇద్దరి ఆడపిల్లలు అనౌష్క, కృష్ణని కూడా భారతీయతనే నేర్పిస్తున్నారు. కుటుంబానికి అత్యంత విలువ ఇస్తారు. తన అత్తమామలు ఎప్పటికీ గర్వకారణమని చెప్పుకుంటారు. వారిని కలవడానికి తరచూ బెంగుళూరు వచ్చి వెళుతుంటారు. ప్రతీ ఏటా దీపావళిని ఘనంగా జరుపుకునే సునాక్ ప్రధానిగా దీపావళి రోజే ప్రమాణం చేయడం విశేషం. ఒక హిందువును ప్రధానిగా అంగీకరించడం ద్వారా బహుళ విశ్వాసాలు, వైవిధ్యాలను అంగీకరించగలిగే సహనం యూకే ప్రజలకు బాగా ఉందని అర్థమవుతోంది. కుటుంబ నేపథ్యం ఇదీ రిషి సునాక్ తాత రామదాస్ సునాక్ అవిభాజ్య భారత్‌లో పంజాబ్ రాష్ట్రంలోని గుజ్రనవాలాకు చెందినవారు. 1935 సంవత్సరంలోనే రామదాస్ తూర్పు ఆఫ్రికాలోని నైరోబియాకి వలస వెళ్లిపోయారు. నాన్నమ్మ రాణి సునాక్ ఓ రెండేళ్లు ఢిల్లీలో ఉండి తర్వాత భర్త దగ్గరకి వెళ్లారు. రామదాస్ దంపతులకి ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. రిషి సునాక్ తండ్రి యశ్వీర్ 1949లో కెన్యాలో జన్మించారు. 1960లో ఆఫ్రికాలో భారతీయులపై జరిగే దాడులకు భయపడి యశ్వీర్ యువకుడిగా ఉన్నప్పుడే ఆ కుటుంబం బ్రిటన్‌కు మకాం మార్చి అక్కడే స్థిరపడింది. పంజాబ్ నుంచి టాంజానియా వచ్చి స్థిరపడిన కుటుంబానికి చెందిన ఉషా బెర్రీని యశ్వీర్ వివాహం చేసుకున్నారు. ఆ దంపతుల మొదటి సంతానమే రిషి సునాక్. రిషి తాత ముత్తాతలు ఉంటే గుజ్రనవాలా ప్రస్తుతం పాకిస్తాన్లో ఉండడంతో ఆ దేశం కూడా రిషి మా వాడే అని అంటోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చాముండేశ్వరి ఆలయాన్ని సందర్శించిన హీరో సుదీప్
బెంగళూరు: ప్రముఖ హీరో కిచ్చ సుదీప్ చెన్నపట్టణ తాలూకా గౌడగెరె గ్రామంలో హల్చల్ చేశారు. శనివారం సతీసమేతంగా సుదీప్ గ్రామంలోని చాముండేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇటీవలె గ్రామంలో 65 అడుగుల చాముండేశ్వరిదేవి పంచలోహ విగ్రహాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. దావాలయం ట్రస్ట్ వారు సుదీప్‌ను ఆత్మీయంగా సన్మానించారు. హీరో సుదీప్‌ను చూడటానికి గ్రామస్థులు ఎగబడ్డారు. -
నేడు యాదాద్రికి కేసీఆర్.. ముఖ్యమంత్రి హోదాలో 15వ సారి
సాక్షి, యాదగిరిగుట్ట : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి రానున్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా వరంగల్ జిల్లాలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. అనంతరం వరంగల్ నుంచి ఎర్రవెల్లిలోని తన ఫాంహౌజ్‌కు తిరుగుప్రయాణంలో మార్గ మధ్యలో ఉన్న యాదాద్రికి మధ్యాహ్నం 2నుంచి 4గంటల మధ్యలో హెలికాప్టర్లో ఎప్పుడైనా చేరుకోనున్నట్లు అధి కారులు తెలిపారు. తొలుత బాలాలయంలో శ్రీస్వామి వారిని దర్శించుకొని ఆ తరువాత పనులను పరి శీలించనున్నారు. ప్రధానాలయానికి బెంగళూర్ లై టింగ్ టెక్నాలజీ సంస్థ వేసిన విద్యుత్ లైట్లను పరిశీ లించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతకంటే ముందే ప్రధానాలయంతో పాటు కొండపైన, కొండ కింద జరుగుతున్న అభివృద్ధి పనులను చూడనున్నట్లు తెలుస్తోంది. అనంతరం కొండపై గల అతి థిగృహంలో వైటీడీఏ అధికారులతో సమావేశమై పనుల పురోగతిపై సమీక్షించనున్నారు. యాదాద్రికి 15వ సారి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఏడాది మార్చి 4వ తేదీన యాదాద్రి ఆలయ పనులను పరిశీలించారు. సీఎం హోదాలో 15వ సారి సోమవారం మరోమారు పనులను పరిశీలించి దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. ఇందుకోసం వైటీడీఏ, ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోసారి విద్యుత్ దీపాల ట్రయల్ రన్ ప్రధానాలయ తూర్పు, ఉత్తర రాజగోపురాలు పసిడి కాంతులు వెదజల్లేలా ఏర్పాటు చేసిన విద్యుత్ లైట్ల ను అధికారులు ఆదివారం రాత్రి మరోమారు ట్ర యల్ రన్ నిర్వహించారు. సీఎం కేసీఆర్ లైటింగ్‌ను పరిశీలించనున్న నేపథ్యంలో ట్రయల్ రన్ నిర్వహించి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. రాజగోపురాలు, అష్టభుజి ప్రాకార మండపం, సాలహారాల్లో విగ్రహాలతో పాటు ప్రధానాలయంలోఆళ్వార్ పిల్లర్లకు వేసిన విద్యుత్ దీపాలను సరిచేశారు. పనుల్లో పెరిగిన వేగం సీఎం రాకను పురస్కరించుకొని వైటీడీఏ అధికా రు లు ఆలయ పనుల్లో వేగం పెంచారు. కొండపై శివా లయం వద్ద మెట్ల దారి నిర్మాణం, బాలాలయానికి వెళ్లే దారిలో పైప్‌లైన్ వేసి మట్టిని పూడ్చివేత, పారాఫిట్ వాల్‌పై విద్యుత్ దీపాల బిగింపు, ఉత్తరం దిక్కు రిటైర్నింగ్ వాల్ నిర్మాణం, కల్యాణకట్ట, దీక్షాపరుల మండపం, పుష్కరిణి, ప్రెసిడెన్షియల్ సూట్లో పనులను వేగంగా చేయిస్తున్నారు. వైకుంఠద్వా రం వద్ద సర్కిల్ నిర్మాణంతో పాటు పాతగుట్ట చౌర స్తా వరకు ఇళ్లు, దుకాణాలు కూల్చివేసే పనులను ముమ్మరం చేశారు. పోలీసు బందోబస్తు టెంపుల్ సిటీపై ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద పోలీ సు బందోబస్తు ఏర్పాటు చేశారు. టెంట్ వేసుకొని గస్తీ నిర్వహిస్తున్నారు. గుట్టపైకి వచ్చివెళ్లే వాహనా లను తనిఖీ చేస్తున్నారు. -
రూల్స్ బ్రేక్ చేసిన సీఎం కుమారుడు, భార్యతో కలిసి..
బెంగళూరు: దేశవ్యాప్తంగా కరోనా కట్టడి చర్యలు కొనసాగుతున్నాయి. చాలా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కర్ఫ్యూ, లాక్డౌన్ అమలు చేస్తున్నారు. అయితే వాటిని కొందరు పట్టించుకోవడం లేదు. తాజాగా ముఖ్యమంత్రి యడియూరప్ప కుమారుడే స్వయంగా లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించారు. సీఎం కుమారుడు, బీజేపీ కర్ణాటక ఉపాధ్యక్షుడు బీవై విజయేంద్ర తన భార్యతో కలిసి మైసూర్ జిల్లా నంజనగూడులోని కంఠేశ్వర స్వామి ఆలయాన్ని మంగళవారం ఉదయం సందర్శించారు. భార్యతో కలిసి గర్భ గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అర్థగంటకు పైగా ఆ ప్రాంతంలో ఉన్నారు. ఆయన సందర్శన నేపథ్యంలో భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం తనయుడు కావడంతో ఆలయ అధికారులు కూడా కోవిడ్ నిబంధనల్ని పక్కన పెట్టేశారు. ఆయనకు వీఐపీ మర్యాదలన్నీ చేశారు. కాగా, బీవై విజయేంద్ర ఆలయ సందర్శన కర్ణాటకలో తీవ్ర దుమారం రేపుతోంది. సీఎం కుమారుడికి నిబంధనలు వర్తించవా? అని ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. వాస్తవంగా కర్ణాటకలో లాక్డౌన్ కొనసాగుతోంది. దీంతో ఆలయాలన్నీ మూసివేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన రూల్స్‌ను బ్రేక్ చేసిన విజయేంద్రపై చర్యలు తీసుకోవాలని వివిధ పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రత్యేకంగా విజయేంద్ర ఆలయంలో పూజలు చేపట్టడం పలు విమర్శలకు దారితీసింది. సామాన్యులకు ఒక రూల్.. నాయకులకు ఒక నిబంధన ఉంటదా? అని స్థానికులూ ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో విజయేంద్రపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: గొర్రెల ధర్నా: బర్త్ డే నాడు గవర్నర్‌కు చేదు అనుభవం -
రేపటి నుంచి ఆలయ దర్శనం
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర నెలలుగా ఆలయాల్లో నిలిచిపోయిన భక్తుల దర్శనాలు సోమవారం (ఈనెల 8) నుంచి పాక్షికంగానూ.. బుధవారం నుంచి పూర్తిస్థాయిలోనూ తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అన్ని ఆలయాల ఈఓలను ఆదేశిస్తూ దేవదాయ శాఖ కమిషనర్ అర్జునరావు శనివారం ఉత్తర్వులు జారీచేశారు. అలాగే, ఈ నెల 8, 9 తేదీల్లో ట్రయల్ రన్ విధానంలో ఆలయం ఉండే ప్రాంతంలోని స్థానికులకు మాత్రమే దర్శనాలకు అనుమతిచ్చి ఆ సమయంలో గుర్తించిన లోటుపాట్లను సరిచేసుకుని పదో తేదీ నుంచి పూర్తిస్థాయిలో దర్శనాలకు అనుమతి తెలపాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. భక్తులకు సూచనలు.. ► గంటకు 300 మంది భక్తులకు మించకుండా దర్శనాలకు అనుమతించాలని నిర్ణయించిన నేపథ్యంలో.. శ్రీశైలం, అన్నవరం, ద్వారకా తిరుమల, సింహాచలం, విజయవాడ దుర్గగుడి వంటి 11 పెద్ద ఆలయాలకు వెళ్లదలిచిన భక్తులు 12 గంటల ముందు తమ పేర్లను ఆలయ ఈఓ ఫోను నెంబరుకు ఎస్ఎంఎస్ చేయాలి. ► దర్శనానికి వచ్చే భక్తులు మాస్క్‌లు ధరించి ఉండాలి. కాళ్లు, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ► క్యూలైన్ ప్రారంభంలో థర్మల్ స్క్రీనింగ్‌లో జ్వరం ఉన్నట్లు నిర్ధారణ అయితే లోపలికి అనుమతించరు. ► క్యూలైన్‌లోనూ ప్రతిఒక్కరు ఆరడుగుల భౌతిక దూరం పాటించాలి. ► భక్తులు ఆధార్ లేదా ఏదైన గుర్తింపు కార్డు తీసుకురావాలి. ► 65 ఏళ్లు పైబడిన వారు, పదేళ్లలోపు పిల్లలు, గర్భవతులు రావొద్దు. విజయవాడ దుర్గ గుడి దర్శనం క్యూలైన్లలో భక్తులు భౌతికదూరం పాటించేలా మార్కింగ్ చేసిన దృశ్యం ఉత్తర్వుల్లోని ముఖ్యాంశాలు.. ► సాధారణ పరిస్థితులు ఏర్పడేవరకూ కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అనుసరించి దేవాలయాల్లో కొంతకాలం తీర్థ ప్రసాదాల పంపిణీ, శఠగోపం వంటివి ఉండవు. ► నిత్యాన్నదానాలను కొంతకాలం అమలుచేయవద్దు. ► ఉ.6 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్య కాలంలో మాత్రమే దర్శనాలకు అనుమతించాలి. ► కేవలం రెండే రెండు క్యూలైన్ల ద్వారా దర్శనాలకు అనుమతి. ఇందులో ఒకటి ఉచిత దర్శనం క్యూలైన్. ► భక్తులను అంతరాలయం, గర్భగుడిలోనికి మరికొంత కాలం పాటు అనుమతించరు. ► ఆలయ మండపంలో ఒకే సమయంలో 30 మంది భక్తులకు మించి ఉండకూడదు. ► ఆలయాల్లో భక్తులకు శానిటైజేషన్ ఏర్పాట్లు అందుబాటులో ఉంచాలి. ► 50 ఏళ్ల పైబడి వయస్సు ఉండి, ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే ఆలయ సిబ్బందిని కార్యాలయ వ్యవహారాలకో లేదంటే రద్దీ తక్కువ ఉండే ప్రాంతాలలో విధులకు పరిమితం చేయాలి. భక్తులూ స్వీయ నియంత్రణ పాటించాలి : మంత్రి వెలంపల్లి ప్రస్తుత పరిస్థితుల్లో భక్తులు స్వీయ నియంత్రణ పాటించాలని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కోరారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణుతో పాటు ఆ శాఖ అధికారులతో కలిసి మంత్రి శనివారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. కంటైన్మెంట్ ప్రాంతాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో 8వ తేదీ నుంచి దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు. కేశ ఖండనశాలలు తెరిచే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. 65 ఏళ్లకు పైబడిన వారు చిన్న పిల్లలను తీసుకురావద్దని మంత్రి కోరారు. -
దేశంలో ఏం జరుగుతుందో యువత తెలుసుకోవాలి
‘‘కశ్మీరీ హిందువుల మారణహోమం, హత్య లు, వాళ్లపై సాగిన క్రూరత్వం గురించి ఎవ్వరూ సినిమా తీయలేదు. ఆ కథ అందరికీ తెలియ జేయాలనుకున్నా’’ అన్నారు బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. ‘ద కశ్మీర్ ఫైల్స్’ పేరుతో ఆయన ఓ సినిమా తెరకెక్కించబోతున్నారు. అభిషేక్ అగర్వాల్ నిర్మించనున్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని చార్మినార్ వద్ద ఉన్న లక్ష్మీ దేవి ఆలయాన్ని సందర్శించారు వివేక్. ఆ తర్వాత ఈ సినిమాకు మద్దతు తెలుపుతున్నవారితో సమావేశమయ్యారు. ‘‘దేశంలో ఏం జరుగుతుందో యువత తెలుసుకోవాలి. బయటకు వెల్లడికాని కశ్మీరీ పండిట్ల కథ వాళ్లు తెలుసుకోవాలి. ఈ విషయంపై బాగా పరిశోధన చేశా. అందుకే స్క్రిప్ట్ పూర్తి చేయడానికి చాలా సమయం పట్టింది. ఫిబ్రవరిలో చిత్రీకరణ ప్రారంభిస్తాం. సినిమా పూర్తయ్యాక ఈ సబ్జెక్ట్‌పై పుస్తకం రాయాలనుకుంటున్నాను’’ అన్నారు వివేక్ అగ్నిహోత్రి. నిర్మాతలు అనిల్ సుంకర, టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాకు మద్దతు తెలిపారు. -
ఎన్నికలప్పుడే ఆలయాల సందర్శన
బన్సుర్/జైపూర్: కాంగ్రెస్ నేతలు ఎన్నికలు సమీపించినప్పుడే ఆలయాల సందర్శనకు వెళతారని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. రాజస్తాన్‌లోని జైపూర్‌లో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘ఎన్నికలు వచ్చినప్పుడే కాంగ్రెస్ నేతలు ఆలయాలు సందర్శించి పూజలు నిర్వహిస్తారు. మిగతా సమయాల్లో వాళ్లు ఆ చుట్టుపక్కల కూడా కనిపించరు. ఆలయాలు, గోవులు ఆ పార్టీకి ఎన్నికల ప్రచారాంశాలు కావొచ్చు. కానీ బీజేపీకి అవి సాంస్కృతిక జీవనంలో అంతర్భాగం’ అని రాజ్‌నాథ్ అన్నారు. ఉగ్రవాదంపై పోరులో అవసరమైతే పాకిస్తాన్‌కు సాయం చేస్తామని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ‘నేను పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను ఒక్కటే చెబుతున్నా. అఫ్గానిస్తాన్‌లో ప్రభుత్వం తాలిబన్ ఉగ్రవాదులపై అమెరికా సాయంతో పోరాడుతోంది. పాక్‌లో ఉగ్రవాదులపై ఒంటరిగా పోరాడలేమని ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం భావిస్తే భారత్ సాయం కోరవచ్చు’ అని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. భారత్–పాక్‌ల మధ్య కశ్మీర్ అన్నది సమస్యే కాదనీ, అది భారత్‌లో అంతర్భాగమని రాజ్‌నాథ్ పునరుద్ఘా టించారు. సర్జికల్ స్ట్రైక్స్ యూపీఏ హయాంలోనూ జరిగాయని కాంగ్రెస్ చెప్పడంపై స్పందిస్తూ.. ‘ఈ విషయాన్ని దేశప్రజలకు ముందుగానే ఎందుకు చెప్పలేదు? సైన్యం అలాంటి సాహసోపేతమైన ఆపరేషన్ నిర్వహించి ఉంటే ప్రజలకు తెలిసేది కాదా? ఈ ఆపరేషన్‌ను ఎందుకు గోప్యంగా ఉంచారు? ఎవరికి భయపడ్డారు?’ అని రాజ్‌నాథ్ అన్నారు. ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని అల్లాహ్ ఓడిస్తాడన్న ఏఐఎంఐఎం అధినేత ఒవైసీ వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. ‘మతం, కులం ఆధారంగా చేసే రాజకీయాలపై మాకు నమ్మకం లేదు’ అని అన్నారు. -
‘మీషా’ను నిషేధించలేం!
న్యూఢిల్లీ: హిందూ మహిళలు దేవాలయాలను సందర్శించడాన్ని అభ్యంతరకరంగా వర్ణించిన ‘మీషా’ పుస్తకం (మలయాళ)పై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. పద ప్రయోగంలో ఈ పుస్తక రచయిత్రి ఎస్ హరీశ్ నైపుణ్యాన్ని గౌరవించాలని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మీషా పుస్తకంలో రచయిత బ్రాహ్మణుల గురించి, మహిళల దేవాలయ సందర్శన గురించి అభ్యంతరకరంగా రాశారని.. దీనిపై కేరళ ప్రభుత్వం కూడా చర్య లు తీసుకోలేదని ఢిల్లీకి చెందిన రాధాకృష్ణన్ పిటిషన్ వేశారు. ‘సెన్సార్‌షిప్‌కు సంబంధించి పుస్తకంలోని విషయసంవేదనను కోర్టువరకు తేవడం సరికాదు. చిత్రకారుడు రంగులతో అద్భుతాన్ని సృష్టించినట్లే.. రచయితల పద విన్యాసాన్ని చూడాలి’ అని బెంచ్ చెప్పింది. -
సంతాన నాగదేవత సన్నిధిలో ఆర్పీ పట్నాయక్
సిద్దిపేటజోన్ : ప్రముఖ సంగీత దర్శకుడు, సీని నటుడు ఆర్పీ పట్నాయక్ కోటిపడగల సంతాన నాగదేవత ఆలయాన్ని ఆదివారం సందర్శించారు. సిద్దిపేట పట్టణ శివారులో జరిగిన ఓ వివాహ వేడుకకు తన సోదరుడు గౌతమ్ పట్నాయక్‌తో హజరయ్యాడు. ఈ సందర్భంగా నాగదేవత దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక నాగపూజ చేశారు. అనంతరం అక్కడే ఉన్న పంచముఖాంజనేయస్వామి, నవగ్రహ దేవాలయాలను సందర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ శక్తిస్వరూపిణిగా భక్తుల పూజలు అందుకుంటున్న కోటిపడగల సంతాన నాగదేవత ఆలయ దర్శనం ఆధ్యాత్మికతతో కూడిన ఆనందాన్ని కలిగిందన్నారు. సంతాన నాగదేవత దేవాలయ విశిష్టతను తెలుసుకోని దర్శించుకోవాలని వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు దశరథం స్వామి , పూజారి శ్రీహరీలు వారికి తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఆర్పీ పట్నాయక్ సిద్దిపేటకు వచ్చిన విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు అక్కడికి చెరుకోని సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. -
ఆ గుడికి వెళ్లిన మొదటి విదేశీ నేత మోదీనే
ఖాట్మండ్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేపాల్ పర్యటనలో భాగంగా ముక్తినాథ్ దేవాలయాన్ని శనివారం సందర్శించారు. ప్రపంచ నేతలు ఎవరూ కూడా ఇప్పటివరకు ఈ దేవాలయాన్ని సందర్శించలేదు. ఈ ఆలయం గర్భగుడిలో పూజలు నిర్వహించిన మొదటి విదేశీ నేత మోదీనే అని నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ తెలిపారు. నేపాల్‌లో రెండో రోజు పర్యటనలో భాగంగా హిందూ బౌద్ధులకు పవిత్రమైన ముక్తినాథ్ వ్యాలీలోని ఆ దేవాలయాన్ని సందర్శించారు. ఆలయ సందర్శనానంతరం, అక్కడి ప్రజలతో మోదీ మాట్లాడారు. మోదీ బౌద్ధ మత ఆచారం ప్రకారం దుస్తులు ధరించారు. హిందూ, బౌద్ధ మతాల ఆచారాల ప్రకారం పూజలు నిర్వహించారు. ఇండియాకు తిరిగివచ్చే ముందు నేపాల్‌లోని పశుపతి దేవాలయాన్ని ప్రధాని మోదీ సందర్శించనున్నట్లు సమాచారం. రెండు దేశాల మధ్య సహకార ఒప్పందంలో భాగంగా నేపాల్‌లోని జనక్‌పూర్‌ను అభివృద్ధి చేయడానికి వందకోట్ల సహాయాన్ని అందించనున్నట్లు మోదీ తెలిపారు. సీతమ్మ వారి పుట్టినిల్లు జనక్‌పూర్ అని, అత్తవారిల్లు అయోధ్య అని.. అందుకే వీటి మధ్య బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేశామని ప్రధాని మోదీ తెలిపారు. జనక్‌పూర్ నుంచి అయోధ్య వరకు నడిచే నేపాల్-ఇండియా బస్సు సర్వీస్‌ను ఆయన ప్రారంభించారు. పర్యటనలో భాగంగా ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించినట్లు మోదీ, ఓలీలు తెలిపారు. అయితే కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ముక్తినాథ్ దేవాలయ సందర్శించడంంపై కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ విమర్శించారు. కర్ణాటకలోని హిందూ ఓటర్లను ప్రభావితం చేసే ఉద్దేశంతో మోదీ దేవాలయాన్ని సందర్శించారని కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. -
మఠాల చుట్టూ కర్నాటక రాజకీయాలు
-
పంచెకట్టులో అలయాన్ని సందర్శించిన రాహుల్
-
పంచెకట్టులో రాహుల్
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ బుధవారం చిక్‌మగలూర్‌లోని శృంగేరి శారదాంబ దేవాలయాన్ని సందర్శించారు. సంప్రదాయ పంచెను ధరించి పార్టీ సీనియర్ నేతలతో కలిసి ఆలయాన్ని దర్శించిన రాహుల్ ప్రత్యేక పూజలు జరిపారు. శృంగేరీ మఠాధిపతి జగద్గురు శంకరాచార్యను రాహుల్ కలవనున్నారు. అక్కడి వేదపాఠశాలలోని విద్యార్ధులతో ఆయన కొద్దిసేపు ముచ్చటిస్తారు. అనంతరం చిక్మగలూర్ ప్రాంతంలో రెండు బహిరంగ సభల్లో రాహుల్ పాల్గొంటారు. చిక్మగలూర్ దివంగత ప్రధాని, రాహుల్ నానమ్మ ఇందిరా గాంధీ రాజకీయ పునరామగమనానికి కేంద్ర బిందువు కావడం గమనార్హం. కాగా రాహుల్ మంగళవారం దక్షిణ కర్ణాటకలో జనాశీర్వాదయాత్రలో పాల్గొన్నారు. తన పర్యటనలో భాగంగా దేవాలయం, చర్చి, దర్గాలను సందర్శించారు. -
‘ఖలిస్తాన్’కు మద్దతు ఇవ్వం
అమృత్సర్: భారత పర్యటనలో భాగంగా బుధవారం పంజాబ్ చేరుకున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. కుటుంబ సమేతంగా పంజాబీ సంప్రదాయ వస్త్రధారణతో స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం ట్రూడో, కెనడా రక్షణమంత్రి హర్జిత్ సజ్జన్లు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌తో ఓ హోటల్లో దాదాపు 40 నిమిషాల సేపు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కెనడాలో ఉంటూ పంజాబ్‌లోని యువతను విద్వేష నేరాలు, ఉగ్రవాదంవైపు రెచ్చగొడుతున్న 9 ఖలిస్తాన్ వేర్పాటువాదుల జాబితాను అమరీందర్ ట్రూడోకు అందజేశారు. వీరిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన్ను కోరారు. భారత్ సహా మరెక్కడా వేర్పాటువాద ఉద్యమాలకు కెనడా మద్దతివ్వబోదని ట్రూడో హామీ ఇచ్చినట్లు పంజాబ్ సీఎం మీడియా సలహాదారు రవీన్ థుక్రల్ తెలిపారు. క్యూబెక్‌లో వేర్పాటువాద ఉద్యమాన్ని తాను ఎదుర్కొన్నాననీ, ఇలాంటి హింసతో వచ్చే ప్రమాదాలపై తనకు పూర్తి అవగాహన ఉందని ఈ సమావేశంలో ట్రూడో చెప్పినట్లు వెల్లడించారు. ‘తమ ప్రభుత్వం ఎలాంటి వేర్పాటువాద ఉద్యమానికి మద్దతివ్వబోదని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో హామీ ఇవ్వడం నిజంగా ఆనందకరమైన విషయం. ట్రూడో వ్యాఖ్యలు భారత్‌లోని అందరికీ చాలా ఊరట కల్గించాయి. భవిష్యత్‌లో కూడా వేర్పాటువాద శక్తుల్ని ఏరివేయడానికి కెనడా ప్రభుత్వ సహకారాన్ని కోరుతున్నాం’ అని భేటీ అనంతరం అమరీందర్ ట్వీట్ చేశారు. అంతకుముందు శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుక్బీర్ సింగ్ బాదల్, శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ అధ్యక్షుడు గోబింద్‌సింగ్ లంగోవాల్లు ట్రూడో కుటుంబానికి స్వర్ణ మందిరంలోకి ఘన స్వాగతం పలికారు. భార్య, ఇద్దరు చిన్నారులతో కలసి ఆలయంలో ప్రార్థనల్లో పాల్గొన్న ట్రూడో.. ఆ తర్వాత ఇక్కడి గురు రాందాస్‌జీ లంగర్లో కుటుంబ సభ్యులతో కలసి చపాతీలు తయారుచేశారు. -
మస్కట్ శివాలయంలో మోదీ పూజలు
మస్కట్ : ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం మస్కట్‌లోని మత్రా ప్రాంతంలోని 125 ఏళ్ల కిందటి పురాతన శివాలయంలో పూజలు నిర్వహించారు. మస్కట్ శివాలయంలో పూజలు చేయడం తనకు లభించిన అదృష్టంగా ప్రధాని ట్వీట్ చేశారు. గుజరాత్‌కు చెందిన వ్యాపార వర్గాలు 125 ఏళ్ల కిందట ఈ శివాలయాన్ని నిర్మించగా 1999లో పునరుద్ధరించారు.ఈ ప్రాంగణంలో శ్రీ ఆది మోతీశ్వర్ మహదేవ్, శ్రీ మోతీశ్వర్ మహదేవ్, శ్రీ హనుమాన్ దేవాలయాలున్నాయి. పవిత్ర దినాల్లో ఈ దేవాలయాన్ని దాదాపు 15,000కు పైగా భక్తులు సందర్శిస్తుంటారు. మరోవైపు 2001లో ప్రారంభించిన ఒమన్ ప్రధాన మసీదు సుల్తాన్ ఖబూస్ గ్రాండ్ మసీదునూ సందర్శించారు. ఇక తన ఒమన్ పర్యటన నేపథ్యంలో గల్ప్ దేశాలతో భారత ద్వైపాక్షిక బంధం మరింత బలోపేతమవుతుందని ప్రధాని ఆకాంక్షించారు. -
ఆగని ‘టెంపుల్ రన్’
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్ ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గుజరాత్లో మంచి ఫలితాలిచ్చిన హిందూ సానుకూల వ్యూహాన్నే రాజస్తాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక శాసనసభ ఎన్నికల్లోనూ అనుసరించాలని రాహుల్ గాంధీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గుజరాత్ ఎన్నికల్లో మొత్తం 14 ఆలయాలను రాహుల్ గాధీ సందర్శించారు. త్వరలో ఎన్నికలు జరగనున్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో హిందూ భావజాలం అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు హిందూ మనోభావాలను గుర్తించేలా వ్యవహరించాలని రాహుల్ భావిస్తున్నట్లు తెలిసింది. ఇదిలావుండగా.. ఆయా రాష్ట్రాల్లో రాహుల్ పర్యటించే సమయంలో.. పలు ఆలయాలు, మసీదులను కూడా సందర్శిస్తారని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. రాజకీయాలకు మతం రంగు పులమడం దేశానికి మంచిది కాదని సీనియర్ కాంగ్రెస్ నేత రాజ బబ్బర్ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ శివభక్తుడు కావడమే కాంగ్రెస్‌కు మేలు చేస్తుందని అన్నారు. బీజేపీ హిందూ పాచికలు ఇకపై పనిచేయవని రాజ్ బబ్బర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 2014 లోక్‌సభ, 2017 యూపీ ఎన్నికల్లో మైనారిటీ అనకూలవాదంతో ప్రజల్లోకి వెళ్లింది. అదే సమయంలో బీజేపీ హిందూ అనుకూల ముద్రతో ముందుకు వెళ్లింది. ఈ సమయంలో మెజారిటీ ఓటర్లు.. బీజేపీకి అనుకూలంగా తీర్పు నిచ్చారని.. కాంగ్రెస్ పార్టీ అంతర్గత చర్చల్లో నేతలు తేల్చారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ గుజరాత్లో హిందూ సానుకూల వాదంతో ముందకు వెళ్లడం తెలిసిందే. ఇక్కడ కాంగ్రెస్ సపార్టీ తృటిలో అధికారానికి దూరమైంది. కాంగ్రెస్ పార్టీ గుజరాత్లో హిందూ అనకూల వ్యూహాన్ని అనుసరించడంపై ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ సహా పలువురు ముస్లిం నాయకులు విమర్శలు గుప్పించారు. అయినా ఎక్కడా హిందూ సంస్థల మీద రాహుల్ గాంధీ, స్థానిక కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయలేదు. ఆలయాల జాబితా ఎన్నికలు జరగనున్న రాజస్తాన్‌లో ప్రఖ్యాత పుష్కర్‌లోని బ్రమ్మ, జోధ్‌పూర్‌లోని చాముండేశ్వరి మాత ఆలయాలను రాహుల్ సందర్శించనున్నారు. అలాగే కర్ణాటకలో రాహుల్ గాంధీ సందర్శించాల్సిన ఆలయాల జాబితాను స్థానిక నేతలు సిద్ధం చేస్తున్నారు. -
రాహుల్ పై అసదుద్దీన్ మాటల తూటాలు..
సాక్షి, హైదరాబాద్ : మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని మాటల తుటాలు పేల్చారు. రాహుల్‌కి మసీదులు, ముస్లింలు కంటపడారా? అని ఆయన ప్రశ్నిస్తున్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచార సమయంలో దేవాలయాలకు క్యూ కట్టిన రాహుల్ తాజాగా మళ్లీ సోమ్‌నాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ నేపథ్యంలో ఒవైసీ తీవ్రంగా స్పందించారు. ‘‘ రాహుల్ జీ.. మీకు గుళ్లు మాత్రమే కనిపిస్తున్నాయా? మసీదులు, ముస్లిం ప్రజలు కంటపడటం లేదా? వాటిని ఎందుకు పట్టించుకోవటం లేదు?’’ అని ఒవైసీ రాహుల్‌ను ప్రశ్నించారు. కేవలం మత రాజకీయాలతోనే పార్టీలు లబ్ధి పొందాలని చూస్తున్నాయని ఆయన ఆరోపించారు. గుజరాత్ ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలు కూడా ముస్లిం ప్రజల హామీల గురించి ప్రస్తావించలేదని.. ఇలా ఎన్నికల్లో గెలవటం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచటమేనని ఒవైసీ చెప్పారు. ఇక నిన్న రాత్రి హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ సభలో ఆయన ఆవేశపూరితంగా ప్రసంగించారు. ‘‘పార్టీకో రంగును పులుముని మత రాజకీయాలు చేస్తున్నాయ్. అవి తల్చుకుంటే ఏం చేయలేవ్. అదే మేం తల్చుకుంటే ఎంతకైనా తెగిస్తాం. ఆ దెబ్బకి మోదీ, కాంగ్రెస్.. ఇలా ఏవీ పనికి రాకుండా పోతాయ్’’ అని ఒవైసీ హెచ్చరించారు. -
దైవదర్శనానికి వెళ్తూ తరలిరాని లోకాలకు...
* తిరువులకు వెళుతూ తిరిగిరాని లోకాలకు * టవేరాను ఢీకొన్న కంటైనర్ * ఆరుగురు మృతి * మృతుల్లో ముగ్గురిది ఒకే కుటుంబం * సీతారాంపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చిత్తూరు : దైవ దర్శనానికి వెళుతున్న వారిని విధి వెక్కిరించింది. కంటైనర్ రూపంలో మృత్యువు కోరలు చాచింది. ఆరు వుంది ప్రాణాలను బలిగొంది. మృతుల్లో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో పెను విషాదం అలుముకుంది. చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేవూలు, వూసంపు ముద్దలు, నెత్తురోడిన రోడ్డు, క్షతగాత్రులు ఆర్తనాదాలతో సీతారాంపేట వద్ద మృత్యుఘోష మిన్నంటింది. శ్రీవారిదర్శనానికి వెళుతున్న టవేరా కారును శనివారం ఉదయుం 5.50 గంటలకు ఎదురుగా వస్తున్న కంటైనర్ ఢీ కొంది. ఈ దుర్ఘటనలో ఆరువుంది అక్కడికక్కడే మృతి చెందారు. ఐదువుంది తీవ్రంగా గాయుపడ్డారు. రేణిగుంట డీఎస్పీ నంజుండప్ప కథనం మేరకు..గుంటూరు జిల్లా, దాచేపల్లి వుండలం, గంగిరెడ్డి పాళెం గ్రావూనికి చెందిన వూమిడి వెంకటేశ్వర్లు కుటుంబం, ఆయున బంధువులు 11 వుంది ఓ ప్రైవేటు టవేరా అద్దె కారులో శుక్రవారం సాయంకాలం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు బయలు దేరారు. ఈ క్రమంలో పూతలపట్టు-నాయుడుపేట రోడ్డు సీతారాంపేట వులుపు వద్ద శనివారం తెల్లవారుజామున టవేరాను రాణిపేట నుంచి ఉత్తరప్రదేశ్‌కు వెళుతున్న కంటైనర్ ఎదురుగా ఢీ కొంది. ఈ దుర్ఘటనలో టవేరాలో ప్రయూణిస్తున్న వూమిడి వెంకటేశ్వర్లు(55), భార్గవి(25), నాగరాజు(25), కోటేశ్వరవ్ము(65), అగ్గిరాల తిరుపాలు(35), డ్రైవర్ ఖాజావల్లి(45)లు అక్కడికక్కడే మృతి చెందారు. గోపాలకృష్ణ(55), సత్యనారాయుణ(35), భూజేశ్వర్(68), శివసారు(01), నరేంద్ర(15)లు తీవ్రంగా గాయుపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు క్షతగాత్రులను 108లో తిరుపతి రుయూ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా మృతుల్లో తిరుపాలు, భార్గవి, కోటేశ్వరవ్ములు ఒకే కుటుంబానికి చెందిన వారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కావడంతో మృతదేహాలు లోపల ఇరుక్కుపోయాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయుంతో మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను శ్రీకాళహస్తి ఏరియూ ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ దుర్ఘటనతో రోడ్డుకిరువైపులా సువూరు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. ట్రాఫిక్‌ను క్రవుబద్ధీకరించేందకు పోలీసులు అవస్థలు పడ్డారు. * రెప్పపాటు మృత్యుకాటు.. డ్రైవర్ల కునుకుపాటు వల్లే ప్రవూదం జరిగిందని డీఎస్పీ వివరించారు. తెల్లవారుజాము కావడంతో ఇద్దరు డ్రైవర్లు ఒక్కసారిగా రెప్పపాటులో కునుకు తీశారని, దీంతో రెండు వాహనాలు ఎదరెదురుగా ఢీ కొని ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. డ్రైవర్ల నిర్లక్ష్యం ఆరుమంది నిండు ప్రాణాలు తీసిందని స్థానికులు వాపోయారు. కాగా ఇదే మలుపు వద్ద గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చెన్నైకి చెందిన ఏడు మంది సాప్ట్వేర్ ఇంజనీర్లు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఆ విషాదపు నెత్తుటి మరకులు ఆరకముందే వురో ఆరుమంది ప్రాణాలను విధి బలిగొనడం గమనార్హం. (ఏర్పేడు)