త్వరలో పెళ్లి! మూవీ యూనిట్‌తో కలిసి అమ్మవారి దర్శనం | Hansika Visits Lord Kalikambal Temple in Chennai With Movie Team | Sakshi
Sakshi News home page

Hansika Motwani: త్వరలో పెళ్లి! మూవీ యూనిట్‌తో కలిసి కాళియంబాళ్‌ అమ్మవారి దర్శనం

Published Mon, Nov 14 2022 10:26 AM | Last Updated on Mon, Nov 14 2022 2:47 PM

Hansika Visits Lord Kalikambal Temple in Chennai With Movie Team - Sakshi

నటి హన్సిక పేరు ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. కారణం ఈమె పెళ్లికి సిద్ధమవడమే. డిసెంబర్‌ 4వ తేదీన హన్సిక పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈమె ఆదివారం చెన్నైలోని కాళియంబాళ్‌ ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకుంది. ఈమె తాజాగా నటిస్తున్న చిత్రం యూనిట్‌ కూడా దైవ దర్శనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్లే.. తాజాగా హన్సిక్‌ ఓ లేడీ ఓరియంటెడ్‌ చిత్రంలో నటిస్తోంది. ఇందులో ఈమె తొలిసారిగా ద్విపాత్రాభినయం చేయడం విశేషం. దర్శకుడు ఆర్‌.కన్నన్‌ స్వీయ దర్శకత్వంలో తన మసాలా ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఇందులో మెట్రో సిరీష్‌ , మయిల్‌ సామి, తలైవాసల్‌ విజయ్, ప్రజిత, పవన్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

చదవండి: పెళ్లి పీటలు ఎక్కబోతోన్న హీరో-హీరోయిన్‌! ముహుర్తం కూడా ఫిక్స్‌?

ఈ చిత్రం గత నెలలో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. మసాలా ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపొందుతున్న 10వ చిత్రం ఇది. ఈమె చిత్ర షూటింగ్‌ను ఆదివారం చెన్నైలో ప్రారంభించారు. ముందుగా హన్సికతో పాటు చిత్ర యూనిట్‌ కాళియంబాళ్‌ ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకున్నారు. ఆ ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది ఎమోషనల్‌తో కూడిన హార్రర్, కామెడీ థ్రిల్లర్‌ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. చిత్ర షూటింగ్‌ను నిర్విరామంగా ఈ నెలపాటు నిర్వహించి పూర్తి చేయనున్నట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement