న్యూఢిల్లీ: హిందూ మహిళలు దేవాలయాలను సందర్శించడాన్ని అభ్యంతరకరంగా వర్ణించిన ‘మీషా’ పుస్తకం (మలయాళ)పై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. పద ప్రయోగంలో ఈ పుస్తక రచయిత్రి ఎస్ హరీశ్ నైపుణ్యాన్ని గౌరవించాలని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మీషా పుస్తకంలో రచయిత బ్రాహ్మణుల గురించి, మహిళల దేవాలయ సందర్శన గురించి అభ్యంతరకరంగా రాశారని.. దీనిపై కేరళ ప్రభుత్వం కూడా చర్య లు తీసుకోలేదని ఢిల్లీకి చెందిన రాధాకృష్ణన్ పిటిషన్ వేశారు. ‘సెన్సార్‌షిప్‌కు సంబంధించి పుస్తకంలోని విషయసంవేదనను కోర్టువరకు తేవడం సరికాదు. చిత్రకారుడు రంగులతో అద్భుతాన్ని సృష్టించినట్లే.. రచయితల పద విన్యాసాన్ని చూడాలి’ అని బెంచ్ చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment