Hindu women
-
Manisha Ropeta: పాకిస్తాన్లో హిందూ మహిళ హిస్టరీ క్రియేట్
దాయాది దేశం పాకిస్తాన్లో మరో అరుదైన ఘటన చోటుచేసుకుంది. అక్కడ హిందువులకు తక్కువ ప్రాధాన్యత ఉంటుంది. వారిని చిన్నచూపు చూస్తారు. కానీ, తాజాగా ఓ హిందూ మహిళ.. పాకిస్తాన్లో సంచలనం క్రియేట్ చేశారు. పోలీసు శాఖలో కీలక బాధ్యతలు అందుకుని.. ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. వివరాల ప్రకారం.. పాకిస్తాన్‌కు చెందిన హిందూ మహిళ మనీషా రోపేటా(26) రికార్డులు బ్రేక్ చేశారు. పోలీస్ శాఖలో ఉన్నతంగా భావించే డిప్యూటీ సూపరింటెండెంట్ పదవిని అందుకుందన్న తొలి హిందూ మహిళగా గుర్తింపు పొందారు. ఈ స్థానానికి చేరిన తొలి హిందు మహిళగా హిస్టరీ క్రియేట్ చేశారు. సింధ్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ నిర్వహిచిన పరీక్ష్లలో 468 మంది అభ్యర్థుల్లో 16వ స్థానంలో మనీషా నిలిచారు. కాగా, ప్రస్తుతం.. మనీషా రోపేటా డీఎస్పీగా లియారీ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా.. సింధ్ ప్రావిన్స్ జకోబాబాద్ చెందిన మనీషా.. మధ్య తరగతి కుటుంబానికి చెందినవారు. ఆమె 13వ ఏట తండ్రి మరణించడంతో.. తల్లి కరాచీకి తీసుకువచ్చి పిల్లలను ఎంతో కష్టపడి చదివించారు. డీఎస్పీగా బాధత్యలు స్వీకరించిన తర్వాత మనీషా రోపేటా మాట్లాడుతూ.. చిన్నతనం నుంచి.. తాను, తన సోదరీమణులు పితృస్వామ్య వ్యవస్థను చూసినట్టు తెలిపారు. సమాజంలో మహిళలు అణచివేతకు గురవుతున్నారని అన్నారు. అలాంటి వారికి అండగా ఉండాలన్న ఉద్దేశ్యంతోనే పోలీస్ ఉద్యోగం కోసం ప్రయత్నించినట్టు స్పష్టం చేశారు. పాకిస్తాన్లో అమ్మాయిలకు ఎక్కువగా.. డాక్టర్ లేదా టీచర్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని వెల్లడించారు. పోలీసు శాఖల్లో కూడా మహిళా ప్రాతినిథ్యం ఉండాలనే ఉద్దేశ్యంతోనే పోలీస్ శాఖలో చేరినట్లు పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: యుద్ధానికి కాలుదువ్వుతున్న ఉత్తరకొరియా...యూఎస్‌కి స్ట్రాంగ్ వార్నింగ్ -
అమెరికా అధ్యక్ష పదవి రేసులో తులసి గబ్బార్డ్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి 2020లో జరిగే ఎన్నికల్లో హిందూమతానికి చెందిన కాంగ్రెస్ సభ్యురాలు తులసి గబ్బార్డ్(37) పోటీ పడనున్నారు. లాస్ ఏంజెలెస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రముఖ భారతీయ అమెరికన్ డాక్టర్ సంపత్ శివాంగి ఈ విషయం ప్రకటించారు. అమెరికా అధ్యక్ష పదవికి డెమొక్రటిక్ పార్టీ తరఫున తులసి గబ్బార్డ్ పోటీ చేస్తారని ఆమె ప్రకటించగానే ఆహూతులంతా లేచి హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. అనంతరం ప్రసంగించిన గబ్బార్డ్.. అధ్యక్ష పదవికి రేసులో ఉండేదీ లేనిదీ స్పష్టం చేయలేదు. అమెరికా లోని హవాయి రాష్ట్రం నుంచి నాలుగో విడత కాంగ్రెస్‌కు ఎన్నికయ్యారు. -
తీర్పులు కాదు..సంప్రదాయాలే ముఖ్యం!
చెన్నై: శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలు ప్రవేశించొచ్చని సుప్రీంకోర్టు తీర్పునిచ్చినా సంప్రదాయాలను ఉల్లంఘించలేమని హిందూ మహిళా భక్త సంఘాలు అంటున్నాయి. 50 ఏళ్ల వయసు వచ్చే వరకు వేచిచూస్తామని, తర్వాతే ఆలయాన్ని దర్శిస్తామని సంఘాలు తేల్చాయి. చెన్నైలోని గంగాదీశ్వర ఆలయంలో శనివారం భారత్ హిందూ మున్నాని ఆధ్వర్యంలో ‘లైట్‌ల్యాంప్’ ప్రార్థనా సమావేశం జరిగింది. రుతుక్రమం ముగిసేదాకా(50 ఏళ్లు) శబరిమల ఆలయాన్ని సందర్శించమని ఈ సందర్భంగా మహిళా భక్తులు ప్రతినబూనారు. ‘కోర్టు తీర్పులు ఎలా వచ్చినా పురాతన సంప్రదాయాలను గౌరవిస్తాం. సంప్రదాయాలపై నమ్మకాన్ని చాటిచెప్పడానికే లైట్‌ల్యాంప్ ప్రార్థన నిర్వహించాం. విశ్వాసాల మేరకే శబరిమలను సందర్శించాలని మహిళా భక్తులు ప్రతినబూనారు’ అని హిందూ మక్కల్ కచ్చి చీఫ్ అర్జున్ సంపత్ చెప్పారు. -
‘మీషా’ను నిషేధించలేం!
న్యూఢిల్లీ: హిందూ మహిళలు దేవాలయాలను సందర్శించడాన్ని అభ్యంతరకరంగా వర్ణించిన ‘మీషా’ పుస్తకం (మలయాళ)పై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. పద ప్రయోగంలో ఈ పుస్తక రచయిత్రి ఎస్ హరీశ్ నైపుణ్యాన్ని గౌరవించాలని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మీషా పుస్తకంలో రచయిత బ్రాహ్మణుల గురించి, మహిళల దేవాలయ సందర్శన గురించి అభ్యంతరకరంగా రాశారని.. దీనిపై కేరళ ప్రభుత్వం కూడా చర్య లు తీసుకోలేదని ఢిల్లీకి చెందిన రాధాకృష్ణన్ పిటిషన్ వేశారు. ‘సెన్సార్‌షిప్‌కు సంబంధించి పుస్తకంలోని విషయసంవేదనను కోర్టువరకు తేవడం సరికాదు. చిత్రకారుడు రంగులతో అద్భుతాన్ని సృష్టించినట్లే.. రచయితల పద విన్యాసాన్ని చూడాలి’ అని బెంచ్ చెప్పింది. -
ఇదో బుజ్జి గణేశుడి కథ
ముంబై: ఒకవైపు దాద్రి హత్యోందంతో దేశం అట్టుడికి పోతోంటే ముంబైలో మత సామరస్యానికి అద్దం పట్టే ఘటన చోటు చేసుకుంది. కష్టకాలంలో ఉన్న మైనారిటీ మహిళను ఆదుకొని మానవత్వానికి మతం అడ్డురాదని ముంబై మహిళలు నిరూపించారు. మనుషులంతా ఒక్కటే అని చాటిచెప్పారు. ఇల్వాజ్ షేక్ నూర్జహాన్ భార్యభర్తలు. ముంబైలో నివసించే ఇల్వాజ్ భార్యకు అనుకున్న సమయాని కంటే ముందుగానే పురుటి నొప్పులు మొదలయ్యాయి. హుటాహుటిన కారులో ఆమెను హాస్పిటల్‌కు తీసుకెళుతుండగా నొప్పులు ఎక్కువయ్యాయి. అయితే మానవత్వం చూపించాల్సిన కారు డ్రైవర్ నిర్దాక్షిణ్యంగా వ్యవహరించి వారిని నడిరోడ్డుమీదే వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో దిక్కుతోచని భర్త నూర్జహాన్ ను పక్కనే ఉన్న గణేష్ ఆలయంలోకి తీసు కెళ్లాడు. దేవాలయం దగ్గర కూర్చొని ఉన్న హిందూ మహిళలు దీన్ని గమనించారు. క్షణం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగారు. నూర్జహాన్ను ఊరడించి ధైర్యం చెప్పారు. అప్పటికప్పుడు చీరలతో ల్యాబర్ రూమును తయారు చేశారు. అందరూ కలిసి ఆమెకు పురుడు పోసి పండంటి బిడ్డను చేతిలో పెట్టారు. దీంతో నూర్జహాన్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరైంది. తన బిడ్డకు గణేశ్ అని పేరు పెట్టుకుంటానని పొత్తిళ్లల్లోని బిడ్డను చూసి మురిసిపోయింది. అటు పురుడు పోసిన మహిళలు సైతం 'చిన్ని గోవిందా' అంటూ పసిపిల్లాడిని ముద్దు చేశారు. అనంతరం తల్లీబిడ్డలను ఆసుపత్రికి తరలించారు. కాగా, బుజ్జి గణేశుడు పుట్టిన సందర్భంగా ఇల్యాజ్, నూర్జహాన్ దంపతులతో కలిసి వేడుకలు జరుపుకునేందుకు ఇరుగుపొరుగు సిద్దమవుతున్నారట. -
అక్కడ హిందూ మహిళలకు నరకం
కరాచి: పాకిస్తాన్లో హిందువులు, ముఖ్యంగా మహిళలు ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు. వారిపై కొనసాగుతున్న అత్యాచారాలను అంతులేకుండా పోతోంది. బలవంతపు మత మార్పిడులకు, అత్యాచారాలకు, కిడ్నాప్‌లకు గురవుతున్నారు. జీవితాంతం సెక్స్ బానిసలుగా బతుకీడుస్తున్నారు. దీనికి ప్రధాన కారణం... పాకిస్తాన్లో హిందువుల వివాహానికి చట్టమంటూ లేకపోవడమే. అక్కడి హిందూ మహిళలెవరూ తమకు పెళ్లయిందని నిరూపించుకోలేరు. ఈ కారణంగా భర్త మరణిస్తే అతని పేరిట ఉన్న ఆస్తులేవీ భార్యకు దక్కవు. భర్తపోతే రోడ్డున పడాల్సిందే. లేదా మత మార్పిడి చేసుకొని ఓ ముస్లిం వద్ద నాలుగో భార్యగానో, ఐదో భార్యగానో బానిస బతుకు బతకాల్సిందే. స్వాతంత్య్రానంతరం నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతున్నా పాక్‌లో హిందువుల వివాహ చట్టం కోసం అటు పాకిస్తాన్ ప్రభుత్వంగానీ, ఆ దేశంతో ప్రజా సంబంధాలను బలంగా కోరుకుంటున్నామని పదే పదే చెప్పే భారత ప్రభుత్వంగానీ చిత్త శుద్ధిగా ఎలాంటి చ ర్యలు తీసుకోలేదు. 2008, 2011, 2012లలో హిందూ వివాహ చట్టం కోసం పాకిస్తాన్ పార్లమెంట్ బిల్లులు తీసుకొచ్చింది. అయితే సంకుచిత రాజకీయాల కారణంగా ఆ బిల్లులు పార్లమెంట్ ఆమోదానికి నోచుకోలేదు. ఈ ఏడాది గత జూలై నెలలో మరోసారి బిల్లును పాకిస్తాన్ పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చినా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే మూలన పడేసింది. పాకిస్తాన్‌తో చర్చలకు అవకాశం వచ్చినప్పుడల్లా భారత ప్రభుత్వం రాజకీయ ఎజెండాకే ప్రాధాన్యత ఇచ్చింది తప్పా పాక్‌లోని హిందువుల పరిస్థితికి ఏనాడు ప్రాధాన్యత ఇవ్వలేదు. అక్కడ అరాచకాలను తట్టుకోలేక భారత్ శరణుజొచ్చిన హిందువుల కుటుంబాలకు కాందిశీకుల కింద ఢిల్లీలో ఆశ్రయం ఇచ్చిందేతప్పా వారికి పౌరసత్వం కూడా ఇవ్వలేదు. హిందువులు ఎక్కువగా ఉంటున్న సింధు రాష్ట్రంలో కూడా వివాహ చట్టం లేకపోవడం వల్ల హిందూ మహిళలు దారుణ పరిస్థితులను ఎదొర్కుంటున్నారని ప్రముఖ చరిత్రకారుడు సురేందర్ కొచ్చార్ తెలియజేశారు. కనీసం హిందువులకు పాకిస్తాన్‌లోని ‘నేషనల్ డేటాబేస్ రెగ్యులేషన్ అథారిటీ’ కింద గుర్తింపు కార్డులు పొందే అవకాశం కూడా లేదని రహీం యార్ ఖాన్ సిటీలోని హైకోర్టు అడ్వకేట్ అమర్ నదీమ్ తెలిపారు. నదీప్ పాకిస్తాన్‌లోని మైనారిటీల పట్ల ప్రభుత్వ న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. -
'నలుగురు భార్యలు,40 మంది పిల్లలు'
న్యూఢిల్లీ: 'నలుగురు భార్యలు,40 మంది పిల్లలు' అనే భావన మన దేశంలో పనిచేయదని బీజేపీ ఎంపి సాక్షి మహారాజ్ అన్నారు. అందువల్ల హిందూ మతాన్ని రక్షించుకోవాలంటే ప్రతి హిందూ మహిళ తప్పనిసరిగా నలుగురు పిల్లలను కనాలని ఆయన పునరుద్ఘాటించారు. మీరట్‌లో ఈ రోజు ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సాక్షి మహారాజ్ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ బీజేపీని ఇరకాటంలో పెడుతున్నారు. ఇంతకు ముందు ఒకసారి జాతిపిత మహాత్మాగాంధీని చంపిన నాథురామ్ గాడ్సే గొప్ప దేశ భక్తుడని కొనియాడి పార్లమెంట్లో క్షమాపణలు చెప్పారు. వివాదస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లోకి ఎక్కుతున్న సాక్షి మహరాజ్‌కు పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఇచ్చిన ఆదేశాల మేరకు బీజేపీ షోకాజ్ నోటీసు జారీచేసింది. ''పార్టీ హెచ్చరించినా లెక్కచేయకుండా వివాదస్పద వ్యాఖ్యలు చేసిన మీపై ఎందుకు చర్య తీసుకోకూడదో తెలపాలి'' అని ఆ నోటీస్‌లో పేర్కొంది. ఈ నోటీస్ విషయమై విలేకరులు ఆయన వద్ద ప్రస్తావించగా, పార్టీ షోకాజ్ నోటీస్ జారీ చేయడం పార్టీ అంతర్గత వ్యవహారం అని మహారాజ్ అన్నారు. నోటీస్ అందిన తరువాత సమాదానం చెబుతామని చెప్పారు. ''ఈ విషయమై నేను మా పార్టీతో మాట్లాడతాను.మీతో మాట్లాడను'' అని విలేకరులకు చెప్పారు. పార్టీ షోకాజ్ నోటీస్ జారీ చేసినప్పటికీ ఆయన మళ్లీ మళ్లీ ఆ వ్యాఖ్యలు కొనసాగిస్తూనే ఉన్నారు.