
తులసి గబ్బార్డ్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి 2020లో జరిగే ఎన్నికల్లో హిందూమతానికి చెందిన కాంగ్రెస్ సభ్యురాలు తులసి గబ్బార్డ్(37) పోటీ పడనున్నారు. లాస్ ఏంజెలెస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రముఖ భారతీయ అమెరికన్ డాక్టర్ సంపత్ శివాంగి ఈ విషయం ప్రకటించారు. అమెరికా అధ్యక్ష పదవికి డెమొక్రటిక్ పార్టీ తరఫున తులసి గబ్బార్డ్ పోటీ చేస్తారని ఆమె ప్రకటించగానే ఆహూతులంతా లేచి హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. అనంతరం ప్రసంగించిన గబ్బార్డ్.. అధ్యక్ష పదవికి రేసులో ఉండేదీ లేనిదీ స్పష్టం చేయలేదు. అమెరికా లోని హవాయి రాష్ట్రం నుంచి నాలుగో విడత కాంగ్రెస్‌కు ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment