USA Presidential Elections 2024: కమలా హారిస్‌పై తులసి అస్త్రం! | USA Presidential Elections 2024: Donald Trump ropes in Tulsi Gabbard to prepare for debate with Kamala Harris | Sakshi
Sakshi News home page

USA Presidential Elections 2024: కమలా హారిస్‌పై తులసి అస్త్రం!

Published Sun, Aug 18 2024 5:41 AM | Last Updated on Sun, Aug 18 2024 11:48 AM

USA Presidential Elections 2024: Donald Trump ropes in Tulsi Gabbard to prepare for debate with Kamala Harris

డిబేట్‌ కోసం ట్రంప్‌కు తరీ్ఫదు 

వాషింగ్టన్‌: ఒక డిబేట్‌తో బైడెన్‌ను అధ్యక్ష రేసు నుంచే వైదొలిగేలా చేసిన రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ కొత్త ప్రత్యరి్థపై పైచేయి సాధించేందుకు పెద్ద కసరత్తే చేస్తున్నారు. సెపె్టంబరు 10న ట్రంప్, డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌ మధ్య ఏబీసీ ఛానల్‌లో అధ్యక్ష చర్చ జరగనున్న విషయం తెలిసిందే. 

దీంట్లో కమలను ఏయే అంశాల్లో ఇరుకున పెట్టొచ్చనే అంశంలో తనకు మార్గనిర్దేశనం చేయడానికి మాజీ డెమొక్రాట్‌ (ప్రతినిధుల సభ మాజీ సభ్యురాలు), హిందూ– అమెరికన్‌ తులసి గబార్డ్‌ సహాయం తీసుకుంటున్నారు ట్రంప్‌. ఫ్లోరిడాలోని ట్రంప్‌కు చెందిన గోల్ఫ్‌ రిసార్ట్స్‌లో తులసి ఆయనకు సహాయపడుతున్నారు. ‘రాజకీయ చరిత్రలోనే మంచి డిబేటర్లలో ఒకరిగా  ట్రంప్‌ పేరుగాంచారు. జో బైడెన్‌ను నాకౌట్‌ చేశారు.

 చర్చకు సన్నద్ధం కావాల్సిన అవసరం ట్రంప్‌కు లేదు. అయితే విధానపరమైన సలహాదారులను, తులసి గబార్డ్‌ లాంటి సమర్థులైన వక్తలను కలుస్తూనే ఉంటారు’ అని ట్రంప్‌ ప్రతినిధి కరోలిన్‌ లీవిట్‌ తెలిపారు. అయితే 2016, 2020ల కంటే ఈసారి డిబేట్‌లకు సిద్ధమవడానికి ట్రంప్‌ అధిక సమయం వెచి్చస్తున్నారని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక తెలిపింది. 2020 డెమొక్రాటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యరి్థత్వానికి బైడెన్‌తో పోటీపడిన వాళ్లలో కమలా హారిస్, తులసి గబార్డ్‌లు కూడా ఉన్నారు. ప్రైమరీల్లో భాగంగా 2019 జూలైలో హారిస్, తులసిల మధ్య డిబేట్‌ జరిగింది. దీంట్లో కమలా హారిస్‌ను తులసి తీవ్రంగా ఇరుకునపెట్టి పైచేయి సాధించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement