Hindu Americans
-
USA Presidential Elections 2024: కమలా హారిస్‌పై తులసి అస్త్రం!
వాషింగ్టన్: ఒక డిబేట్‌తో బైడెన్‌ను అధ్యక్ష రేసు నుంచే వైదొలిగేలా చేసిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్రత్యరి్థపై పైచేయి సాధించేందుకు పెద్ద కసరత్తే చేస్తున్నారు. సెపె్టంబరు 10న ట్రంప్, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ మధ్య ఏబీసీ ఛానల్లో అధ్యక్ష చర్చ జరగనున్న విషయం తెలిసిందే. దీంట్లో కమలను ఏయే అంశాల్లో ఇరుకున పెట్టొచ్చనే అంశంలో తనకు మార్గనిర్దేశనం చేయడానికి మాజీ డెమొక్రాట్ (ప్రతినిధుల సభ మాజీ సభ్యురాలు), హిందూ– అమెరికన్ తులసి గబార్డ్ సహాయం తీసుకుంటున్నారు ట్రంప్. ఫ్లోరిడాలోని ట్రంప్‌కు చెందిన గోల్ఫ్ రిసార్ట్స్‌లో తులసి ఆయనకు సహాయపడుతున్నారు. ‘రాజకీయ చరిత్రలోనే మంచి డిబేటర్లలో ఒకరిగా ట్రంప్ పేరుగాంచారు. జో బైడెన్‌ను నాకౌట్ చేశారు. చర్చకు సన్నద్ధం కావాల్సిన అవసరం ట్రంప్‌కు లేదు. అయితే విధానపరమైన సలహాదారులను, తులసి గబార్డ్ లాంటి సమర్థులైన వక్తలను కలుస్తూనే ఉంటారు’ అని ట్రంప్ ప్రతినిధి కరోలిన్ లీవిట్ తెలిపారు. అయితే 2016, 2020ల కంటే ఈసారి డిబేట్లకు సిద్ధమవడానికి ట్రంప్ అధిక సమయం వెచి్చస్తున్నారని న్యూయార్క్ టైమ్స్ పత్రిక తెలిపింది. 2020 డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థత్వానికి బైడెన్‌తో పోటీపడిన వాళ్లలో కమలా హారిస్, తులసి గబార్డ్లు కూడా ఉన్నారు. ప్రైమరీల్లో భాగంగా 2019 జూలైలో హారిస్, తులసిల మధ్య డిబేట్ జరిగింది. దీంట్లో కమలా హారిస్‌ను తులసి తీవ్రంగా ఇరుకునపెట్టి పైచేయి సాధించారు. -
హిందూ అమెరికన్ల ఆగ్రహం
అఘోరాలపై అసత్య కథనాన్ని ప్రచారం చేశారని సీఎన్ఎన్పై మండిపాటు వాషింగ్టన్: ప్రముఖ వార్తా సంస్థ సీఎన్ఎన్పై అమెరికాలోని హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎన్ఎన్ చానెల్లో ఆదివారం ప్రసారమైన ‘బిలీవర్ విత్ రెజా అస్లాన్’ అనే ఆరు ఎపిసోడ్ల కార్యక్రమంలో అఘోరాల గురించి అసత్యాలు ప్రసారం చేశారని.. అది హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా ఉందని మండిపడ్డారు. ప్రముఖ భారత అమెరికన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుడు శలభ్ కుమార్ ఈ కథనంపై తీవ్రంగా మండిపడ్డారు. ‘హిందూయిజంపై జరుగుతున్న దాడి ఇది. అమెరికాలోని మెజారిటీ భారతీయులు, హిందువులు గత ఎన్నికల్లో ట్రంప్‌కు మద్దతు తెలిపినందుకు ప్రతీకారంగానే ఉద్దేశపూర్వకంగానే హిందూత్వంపై దాడిచేస్తున్నారు’ అని ట్విటర్ వేదికగా విమర్శించారు. అమెరికాలోని పలు హిందూ సంస్థలు, వ్యక్తులు కుమార్ వ్యాఖ్యలకు మద్దతు తెలపాయి. ‘ఇటీవల అమెరికాలోని మైనారిటీల (భారతీయులు)పై దాడులు జరగుతున్న సమయంలో ఇలాంటి విద్వేషపూరిత, అసత్య కథనాలను ప్రసారం చేయటం మరింత ఘర్షణకు దారితీస్తాయి’ అని కాలిఫోర్నియా హిందూ సమాజం నేత ఖండేరావ్ కాంద్ ఆవేదన వ్యక్తం చేశారు. యూఎస్ ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ చైర్మన్ సంజయ్ పురీ కూడా ఓ ప్రకటనలో ఈ కథనాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమ ప్రసారాన్ని వెంటనే నిలిపేయాలని ఆయన సీఎన్ఎన్ను కోరారు.