Abc Channel
-
USA Presidential Elections 2024: కమలదే పై చేయి
డిబేట్ కోసం ప్రత్యర్థులిద్దరూ ఏబీసీ వేదికపైకి రాగానే హారిసే చొరవ తీసుకుని ట్రంప్ దగ్గరికి వెళ్లి కరచాలనం చేశారు. తద్వారా ముందే పైచేయి సాధించారు. డిబేట్ చక్కగా సాగాలని ఆమె ఆకాంక్షించగా, ‘హావ్ ఫన్’ అంటూ ట్రంప్ స్పందించారు.గంటా నలభై ఐదు నిమిషాల పాటు సాగిన డిబేట్ ముగిశాక మాత్రం కరచాలనం వంటివేమీ లేకుండానే ఎవరికి వాళ్లు వేదిక నుంచి నిష్క్రమించారు.డిబేట్ పొడవునా హారిస్ పదేపదే ట్రంప్‌ను ఉడికించే వ్యాఖ్యలు చేశారు. పలు కేసుల్లో ఆయన దోషి అని ఇప్పటికే నిరూపణ అయిందంటూ ఎత్తిచూపారు. ఆయనపై మరెన్నో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. ట్రంప్ మాట్లాడుతుండగా పదేపదే నవ్వులు, ప్రశ్నార్థక చూపులతో ఆయన్ను ఒత్తిడిలోకి నెట్టారు.ఈ ఎత్తుగడలన్నీ బాగా ఫలించాయి. హారిస్ ఇలాంటి విమర్శలు చేసినప్పుడల్లా ట్రంప్ తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఆగ్రహంలో అదుపు తప్పి పదేపదే అబద్ధాలు, అవాస్తవాలు చెప్పారు.ఆఫ్రో అమెరికన్ల ఓట్ల కోసం హారిస్ ఇటీవల ఆమె నల్లజాతి మూలాలను పదేపదే చెప్పుకుంటున్నారన్న తన గత వ్యాఖ్యలపై స్పందించేందుకు ట్రంప్ నిరాకరించారు. హారిస్ మాత్రం పలు సందర్భాల్లో ట్రంప్ చేసిన వివాదాస్పద జాతి వివక్షపూరిత, విద్వేష వ్యాఖ్యలన్నింటినీ ఏకరువు పెట్టారు.వాషింగ్టన్: అంతా అత్యంత ఉత్కంఠతో ఎదురు చూసిన తొలి, బహుశా ఏకైక ప్రెసిడెన్షియల్ డిబేట్లో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59)దే పై చేయి అయింది. ఆమె దూకుడు ముందు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (78) వెలవెలబోయారు. మంగళవారం రాత్రి పెన్సిల్వేనియాలో ఏబీసీ వార్తా సంస్థ వేదికగా జరిగిన డిబేట్లో మాజీ అధ్యక్షునిపై హారిస్ ఆద్యంతం స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించారు. దాదాపుగా ప్రతి అంశంలోనూ ట్రంప్‌ను చిత్తు చేశారు. ఆమె పక్కాగా హోం వర్క్ చేసి వచి్చన తీరు డిబేట్లో అడుగడుగునా కని్పంచింది. తొలుత కాస్త తడబడ్డా డిబేట్ సాగుతున్న కొద్దీ హారిస్ దూకుడు కనబరిచారు. పదునైన పంచ్‌లతో, టైమ్లీ వన్ లైనర్లతో ఎక్కడికక్కడ ట్రంప్‌ను ఇరుకున పెట్టారు. ఆర్థిక వ్యవస్థ మొదలుకుని విదేశీ విధానం, వలసలు, అబార్షన్ల దాకా ప్రతి అంశం మీదా చర్చను తను కోరుకున్న దిశగా నడిపించడంలో విజయవంతమయ్యారు. పూర్వాశ్రమంలో లాయర్ అయిన హారిస్ వాదనా పటిమ ముందు ట్రంప్ నిలువలేకపోయారు. చాలావరకు ఆమె ప్రశ్నలకు, లేవనెత్తిన అంశాలకు వివరణలు ఇచ్చుకోవడానికే పరిమితమయ్యారు. తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్లో అధ్యక్షుడు జో బైడెన్‌ను ట్రంప్ ఓ ఆటాడుకోవడం తెలిసిందే. ట్రంప్ పచ్చి అబద్దాలు చెప్పినా బైడెన్ కనీసం వాటిని వేలెత్తి చూపలేకపోయారు. పైగా ప్రసంగం మధ్యలో పదేపదే ఆగుతూ, పదాల కోసం తడుముకుంటూ, వయోభారంతో వణుకుతూ అభాసుపాలయ్యారు. ఈ దారుణ వైఫల్యంతో చివరికి పోటీ నుంచే బైడెన్ తప్పుకోవాల్సి వచి్చంది. ఆయన స్థానంలో అధ్యక్ష రేసులోకి వచ్చిన హారిస్ మాత్రం తాజా డిబేట్లో ట్రంప్‌కు చెమటలు పట్టించారు. ‘‘మన దేశాన్ని ఎలా నడపాలన్న ప్రధానాంశంపై ఈ రాత్రి మీరు ఇంతసేపూ రెండు భిన్నమైన వాదనలు విన్నారు. ఒకటి భవిష్యత్తుపై దృష్టి పెట్టిన నా వాదన. రెండోది గతం గురించి మాత్రమే మాట్లాడిన, దేశాన్ని వెనక్కే తీసుకెళ్లజూస్తున్న ట్రంప్ వాదన’’ అంటూ డిబేట్‌ను అంతే ప్రభావవంతంగా ముగించారు హారిస్.అబార్షన్‌పై హారిస్ → ట్రంప్ గెలిస్తే అబార్షన్లను నిషేధిస్తూ చట్టం తెస్తారు. → గర్భధారణలు, అబార్షన్లను ప్రభుత్వం వేయి కళ్లతో గమనిస్తుంటుంది. → అమెరికన్ల శరీరాలకు సంబంధించిన కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకోరాదన్నదే నా వైఖరి. → ట్రంప్ మాత్రం మహిళల శరీరాలపై హక్కులు ప్రభుత్వాలవేనంటున్నారు.ట్రంప్ → అబార్షన్లపై నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉండాలన్నదే నా విధానం. → అదిప్పటికే అమల్లో ఉంది. కనుక దీనిపై అసలు గొడవ గానీ, భిన్నాభిప్రాయాలు గానీ లేవు. → అంతే తప్ప నేనేమీ అబార్షన్లను నిషేధించబోవడం లేదు. → ఈ విషయంలో హారిస్ చెప్పేవన్నీ అబద్ధాలే.ఎన్నికల ర్యాలీలపైహారిస్ → ట్రంప్ ఎన్నికల ర్యాలీలు ఆద్యంతం పరమ బోరుగా సాగుతున్నాయి.→ జనాన్ని ఆకట్టుకునేలా మాట్లాడటంలో ఆయన ఘోరంగా విపలమవుతున్నారు. → విండ్ మిల్లుల వల్ల క్యాన్సర్ వస్తుంది వంటి కామెంట్లతో అభాసుపాలవుతున్నారు. → ట్రంప్ ప్రసంగం వినలేక జనం మధ్యలోనే వెళ్లిపోతున్నారు.ట్రంప్ → అన్నీ శుద్ధ అబద్ధాలు. బైడెన్–హారిస్ విధానాలతో అమెరికా అన్ని రంగాల్లోనూ కుదేలవుతోంది. అందుకే అమెరికన్లు పాత రోజులను కోరుకుంటున్నారు.→ దాంతో నా ర్యాలీలకు జనం పోటెత్తుతున్నారు. → వాటికి అమెరికా చరిత్రలోనూ అపూర్వమైన ఆదరణ దక్కుతోంది. → హారిస్ తన ర్యాలీలకు డబ్బులిచ్చి జనాన్ని రప్పించుకుంటున్నారు.ఆర్థిక వ్యవస్థపైట్రంప్: ఈ విషయంలో నేనేం చేయబోతున్నదీ అందరికీ తెలుసు. నా హయాంలో కరోనా కల్లోలాన్ని తట్టుకుంటూ అమెరికా ఆర్థిక వ్యవస్థను గొప్పగా మలిచా. దాన్ని మరోసారి చేసి చూపిస్తా. పన్నులకు భారీగా కోత పెడతా. హారిస్ మార్క్సిస్టు. మార్క్సిస్టు తండ్రి నుంచి పాఠాలు నేర్చుకున్నారు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్థిక విధానాల్లో ఆమె ఇప్పుడు నా భాషనే మాట్లాడుతున్నారు. కానీ గెలిచారంటే మాత్రం దేశాన్ని సర్వనాశనం చేస్తారు. బైడెన్‌కు, ఆమెకు తేడా లేదు. హారిస్: నేను బైడెన్నూ కాను, ట్రంప్‌ను అంతకన్నా కాను. ఈ విషయంలో నేను చెప్పదలచుకున్నది ఒక్కటే. దేశానికి కొత్త తరం నాయకత్వాన్ని అందిస్తా. ఉత్త మాటలే తప్ప నిజానికి ఆర్థిక వ్యవస్థను మెరుగు పరిచేందుకు ట్రంప్ వద్ద ఎలాంటి ప్రణాళికా లేదు. తన క్షేమం తప్ప ఆయనకు మీరెవరూ పట్టరు. మధ్యతరగతి నేపథ్యం నుంచి వచి్చన నాకు ఆర్థికంగా దేశానికి ఏం కావాలో బాగా తెలుసు.వలసలపైట్రంప్ సరిహద్దుల నుంచి లక్షలాది మంది చొరబడుతున్నారంటే వలసల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న హారిసే ప్రధాన కారణం. వాళ్లు మన పెంపుడు జంతువులను కూడా తినేస్తున్నారు. ఈ చొరబాట్లు అమెరికాకు చాలా చేటు చేస్తాయి.హారిస్ ట్రంప్ వల్లే వలసల బిల్లు బుట్టదాఖలైందని విమర్శించడం మినహా ఈ అంశంపై పెద్దగా ఏమీ మాట్లాడలేదు. వలసదారులు పెంపుడు జంతువులను తింటున్నారన్న ట్రంప్ వ్యాఖ్యలపై అమెరికన్లే పెదవి విరుస్తున్న నేపథ్యంలో వాటిపై వ్యూహాత్మక మౌనం పాటించారు.యుద్ధాలు, విదేశీ వ్యవహారాలపై... ట్రంప్ → నేను గెలిస్తే ఉక్రెయిన్ యుద్ధానికి ఒక్క రోజులో ముగింపు పలుకుతా. నేను ప్రెసిడెంట్‌గా ఉంటే యుద్ధం జరిగేదే కాదు. (ఉక్రెయిన్ గెలవాలనుకుంటున్నారా అన్న మోడరేటర్ల ప్రశ్నకు బదులు దాటవేశారు. పైగా యుద్ధానికి మిలియన్ల మంది బలయ్యారని అవాస్తవాలు చెప్పారు) → 2021లో అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సైన్యం వైదొలగడం దేశ చరిత్రలోనే అత్యంత సిగ్గుచేటైన సందర్భం. → ఇజ్రాయెల్‌ను హారిస్ ద్వేషిస్తారు. హారిస్ గెలిస్తే రెండేళ్లలోనే ఇజ్రాయెల్ సర్వనాశనం ఖాయం. అరబ్బులన్నా ఆమెకు ద్వేషమే.హారిస్ → అఫ్గాన్ నుంచి వైదొలగాలన్న బైడెన్ నిర్ణయం నాటి పరిస్థితుల్లో పూర్తిగా సబబే. ట్రంప్ తాలిబన్లతో అత్యంత బలహీన ఒప్పందం చేసుకున్నారు.→ నియంతలంటే ట్రంప్‌కు మహా ఆరాధన.→ నేను ఇజ్రాయెల్‌ను ద్వేషిస్తానన్నది పచ్చి అబద్ధం. యూదు రాజ్యాన్ని మొదటినుంచీ సమర్థిస్తున్నా. అక్టోబర్ 7 దాడి తర్వాత ఇజ్రాయెల్‌కు స్వీయరక్షణకు అన్ని హక్కులూ ఉన్నాయి. కానీ అమాయక పాలస్తీనియన్లు భారీ సంఖ్యలో యుద్ధానికి బలవుతున్నారన్నది కూడా వాస్తవమే. కనుక యుద్ధం తక్షణం ఆగాలి. కాల్పుల విరమణ, బందీల విడుదలే అందుకు మార్గం. దానికోసం కృషి చేస్తా.2020 ఎన్నికల ఫలితాలపైట్రంప్: వాటిలో నిజమైన విజేతను నేనే. క్యాపిటల్ హిల్ భవనంపై దాడితో నాకు సంబంధం లేదు. హారిస్: అమెరికా చరిత్రపై చెరగని మచ్చ ఏదన్నా ఉంటే అది కాపిటల్ హిల్‌పై దాడే. దాన్ని మర్చిపోయి ముందుకు సాగాలి. ట్రంప్‌పై హారిస్ పంచ్‌లు → ట్రంప్ ఓ బలహీన నాయకుడు. తప్పుడు నేత. ఆయన్ను చూసి ప్రపంచ దేశాధినేతలంతా నవ్వుతున్నారు. → అధ్యక్ష పదవికి ట్రంప్ కళంకమని ఆయనతో కలిసి పని చేసిన సైనిక ఉన్నతాధికారులే అంటున్నారు. → ట్రంప్ అంటేనే అబద్ధాలు, అభూత కల్పనలు. ఈ డిబేట్లో కూడా ఆయన చేసేదదే. → ట్రంప్ ఎంతసేపూ తన గురించే మాట్లాడతారు. ప్రజలు ఆయనకు అసలే పట్టరు. దేశానికి కావాల్సింది ప్రజల కోసం పాటుపడే నాయకుడే తప్ప ట్రంప్ వంటి స్వార్థపరుడు కాదు. → ఆయన 2020 ఎన్నికల్లో ఓడిపోయారు. 8.1 కోట్ల మంది ఆయనకు అధ్యక్ష పదవి నుంచి ఉద్వాసన పలికారు (బైడెన్‌కు ఓటేసిన వారి సంఖ్యను ఉటంకిస్తూ). దాన్ని ట్రంప్ ఇప్పటికీ అస్సలు జీరి్ణంచుకోలేకపోతున్నారు.హారిస్‌కే 63 శాతం మంది ఓటు → డిబేట్లో ట్రంప్‌ను హారిస్ చిత్తు చేశారని సీఎన్ఎన్ వార్తా సంస్థ నిర్వహించిన ఫ్లాష్ పోల్‌లో 63 శాతం మంది పేర్కొన్నారు! → ట్రంప్‌కు బాగా అనుకూలమని పేరున్న ఫాక్స్ న్యూస్ కూడా డిబేట్ విజేత హారిసేనని అంగీకరించడం విశేషం. → చర్చకు వేదికైన ఏబీసీ న్యూస్ అభ్యర్థులిద్దరి వ్యాఖ్యలు, ప్రకటనలను లైవ్‌లో అప్పటికప్పుడు ఫ్యాక్ట్ చెక్ చేసింది.ట్రంప్ చెప్పిన వాటిలో చాలావరకు అవాస్తవాలేనని తేలడం విశేషం. -
USA Presidential Elections 2024: కమలా హారిస్‌పై తులసి అస్త్రం!
వాషింగ్టన్: ఒక డిబేట్‌తో బైడెన్‌ను అధ్యక్ష రేసు నుంచే వైదొలిగేలా చేసిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్రత్యరి్థపై పైచేయి సాధించేందుకు పెద్ద కసరత్తే చేస్తున్నారు. సెపె్టంబరు 10న ట్రంప్, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ మధ్య ఏబీసీ ఛానల్లో అధ్యక్ష చర్చ జరగనున్న విషయం తెలిసిందే. దీంట్లో కమలను ఏయే అంశాల్లో ఇరుకున పెట్టొచ్చనే అంశంలో తనకు మార్గనిర్దేశనం చేయడానికి మాజీ డెమొక్రాట్ (ప్రతినిధుల సభ మాజీ సభ్యురాలు), హిందూ– అమెరికన్ తులసి గబార్డ్ సహాయం తీసుకుంటున్నారు ట్రంప్. ఫ్లోరిడాలోని ట్రంప్‌కు చెందిన గోల్ఫ్ రిసార్ట్స్‌లో తులసి ఆయనకు సహాయపడుతున్నారు. ‘రాజకీయ చరిత్రలోనే మంచి డిబేటర్లలో ఒకరిగా ట్రంప్ పేరుగాంచారు. జో బైడెన్‌ను నాకౌట్ చేశారు. చర్చకు సన్నద్ధం కావాల్సిన అవసరం ట్రంప్‌కు లేదు. అయితే విధానపరమైన సలహాదారులను, తులసి గబార్డ్ లాంటి సమర్థులైన వక్తలను కలుస్తూనే ఉంటారు’ అని ట్రంప్ ప్రతినిధి కరోలిన్ లీవిట్ తెలిపారు. అయితే 2016, 2020ల కంటే ఈసారి డిబేట్లకు సిద్ధమవడానికి ట్రంప్ అధిక సమయం వెచి్చస్తున్నారని న్యూయార్క్ టైమ్స్ పత్రిక తెలిపింది. 2020 డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థత్వానికి బైడెన్‌తో పోటీపడిన వాళ్లలో కమలా హారిస్, తులసి గబార్డ్లు కూడా ఉన్నారు. ప్రైమరీల్లో భాగంగా 2019 జూలైలో హారిస్, తులసిల మధ్య డిబేట్ జరిగింది. దీంట్లో కమలా హారిస్‌ను తులసి తీవ్రంగా ఇరుకునపెట్టి పైచేయి సాధించారు. -
USA Presidential Elections 2024: ఫాక్స్ డిబేట్‌కు రాను: కమల
వాషింగ్టన్: ఫాక్స్ న్యూస్ చానెల్లో డిబేట్‌కు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనను డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ తోసిపుచ్చారు. నిజానికి అధ్యక్షుడు జో బైడెన్ ఆ పార్టీ అభ్యర్థిగా ఉండగా ఆయనతో సెప్టెంబర్ 10న ఏబీసీ చానల్లో రెండో డిబేట్‌కు ట్రంప్ అంగీకరించారు. అనంతరం బైడెన్ బదులు హారిస్ అభ్యర్థి అవడం తెలిసిందే. ఏబీసీ బదులు ఫాక్స్ న్యూస్ చానల్లో సెప్టెంబర్ 4న డిబేట్‌కు సిద్ధమని ట్రంప్ శనివారం ప్రకటించారు. దీన్ని హారిస్ తప్పుబట్టారు. ‘‘ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు సిద్ధమన్న ట్రంప్ ఇప్పుడేమో ఫలానా సమయంలో, ఫలానా చోటే అనడం ఆశ్చర్యకరం. అంగీకరించిన మేరకు సెప్టెంబర్ 10న ఏబీసీ న్యూస్‌లో చర్చకు నేను సిద్ధం. ఆయన పాల్గొంటారని ఆశిస్తున్నా’’ అన్నారు. డిబేట్‌కు ట్రంప్ భయపడుతున్నారని హారస్ ప్రచార బృందం వ్యాఖ్యానించింది. ఆయన తమాషాలు మానుకోవాలని హితవు పలికింది. -
Donald Trump: ‘ఫాక్స్’లో అయితేనే డిబేట్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులైన డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రెసిడెన్షియల్ డిబేట్ జరిగే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. సెపె్టంబర్ 10న ఏబీసీ చానల్లో హారిస్‌తో జరగాల్సిన డిబేట్ నుంచి తప్పుకుంటున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ‘‘నిజానికది జో బైడెన్‌తో జరగాల్సిన డిబేట్. ఆయన ఎన్నికల బరి నుంచి తప్పుకున్నందున ఆ డిబేట్ కూడా రద్దయినట్టే’’ అని వాదించారు. ఈ మేరకు సొంత సోషల్ మీడియా హాండిల్ ‘ట్రూత్’లో తాజాగా ట్రంప్ పలు పోస్టులు పెట్టారు. ఫాక్స్ న్యూస్ చానల్లో అయితేనే డిబేట్‌కు వస్తానంటూ మెలిక పెట్టారు. ‘‘సెప్టెంబర్ 4న పెన్సిల్వేనియాలో ఫాక్స్ స్టూడియోలో హారిస్ చర్చకు రావాలి. ఖాళీ స్టూడియోలో కాకుండా కిక్కిరిసిన ప్రేక్షకుల నడుమ డిబేట్ చేద్దాం’’ అని సవాలు విసిరారు. దీనిపై హారిస్ వర్గం మండిపడింది. పిరికితనంతో డిబేట్ నుంచి ట్రంప్ పారిపోతున్నారంటూ ఎద్దేవా చేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ రాకపోయినా కేవలం హారిస్‌తో ఏబీసీ డిబేట్ కొనసాగుతుందా అన్నది చూడాల్సి ఉంది. డెమొక్రాట్ల తరఫున అధ్యక్షుడు బైడెన్‌కు బదులు హారిస్ అధ్యక్ష రేసులో అడుగు పెట్టినప్పటి నుంచీ ఆమెతో డిబేట్‌కు ట్రంప్ వెనకా ముందాడుతూ వస్తున్నారు. తామిద్దరి గురించీ అమెరికన్లకు ఇప్పటికే అంతా తెలుసంటూ వ్యాఖ్యలు చేశారు. కానీ తనతో డిబేట్‌కు రావాల్సిందేనని హారిస్ పట్టుబడుతున్నారు. గూగుల్‌పై ట్రంప్ మండిపాటుతన వార్తలను, ఫొటోలను గూగుల్ సెన్సార్ చేస్తోందని, ప్రజలకు వాస్తవాలు చేరనివ్వడం లేదని ట్రంప్ మండిపడ్డారు. తనకు సంబంధించిన వార్తలను, సమాచారాన్ని ఫేసుబుక్‌లో సెన్సార్ చేసినందుకు సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తనకు క్షమాపణ చెప్పారన్నారు. -
దేవుడు తప్ప నన్నెవరూ... తప్పించలేరు: బైడెన్
వాషింగ్టన్: తన ఆరోగ్యంపై వ్యక్తమవుతున్న ఆందోళనలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (81) కొట్టిపారేశారు. అధ్యక్ష రేసు నుంచి వైదొలగాలని దేవుడు తప్ప తననెవరూ ఒప్పించలేరని ఏబీసీ ఛానల్ ఇంటర్వ్యూలో అన్నారు. గత వారం రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో చర్చలో బైడెన్ పదేపదే తడబటడం, ఆగి ఆగి మాట్లాడటంతో ఆయన మానసిక సంతులతపై డెమొక్రాట్లలో తీవ్ర ఆందోళన నెలకొంది. బైడెన్ వైదొలగాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సర్వేల్లోనూ ఆయనకు ప్రజాదరణ పడిపోయింది. విరాళాలు ఇచ్చే దాతలు కూడా బైడెన్ తప్పుకుంటేనే తమ ఆర్థిక సహకారం కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు. ఒత్తిళ్లు పెరుగుతున్నా బైడెన్ మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటున్నారు. ప్రపంచాన్ని నడుపుతున్నానని, అధ్యక్షుడిగా ఉండటానికి తనకంటే మరెవరికీ యోగ్యత లేదన్నారు. మెదడు పనితీరుపై పరీక్ష చేయించుకొని ఫలితాలను ప్రజల ముందు పెడతారా అని ప్రశ్నించగా తాను రోజూ పరీక్ష ఎదుర్కొంటున్నానని బదులిచ్చారు.మూడున్నరేళ్ల పాలనలో తాను ఎన్నో విజయాలు సాధించాననీ, అవి ట్రంప్‌తో గంటన్నర పాటు జరిపిన చర్చ వల్ల వమ్ము కావన్నారు. కొవిడ్ నుంచి అమెరికాను గట్టెక్కించి ప్రపంచంలోనే అత్యంత బలీయ ఆర్థిక వ్యవస్థగా నిలిపానని బైడెన్ తెలిపారు. తన ముదిమి వయసు గురించి చాలా చర్చ జరుగుతోందనీ, కోటిన్నర కొత్త ఉద్యోగాలు సృష్టించడానికి తన వయసు అడ్డురాలేదని పేర్కొన్నారు. -
USA Presidential Elections 2024: బైడెన్, ట్రంప్ రె‘ఢీ’
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఇరు పారీ్టల అభ్యర్థులు వాదనలతో ఎదురెదురుగా బలాబలాలు తేల్చుకునే ‘చర్చల’ అంకానికి డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తెరలేపారు. సీఎన్ఎన్ టీవీ ఛానల్లో జూన్ 27వ తేదీన, ఏబీసీ ఛానల్లో సెప్టెంబర్ పదో తేదీన ఈ డిబేట్లు ఉంటాయి. మూడు దశాబ్దాలుగా డిబేట్లు నిర్వహించే ‘కమిషన్ ఆన్ ప్రెసిడెన్షియల్ డిబేట్’ను కాదని ఈసారి మీడియాసంస్థల ఆధ్వర్యంలో టీవీ ఛానళ్లలో డిబేట్‌కు బైడెన్ ప్రచార బృందం ఓకే చెప్పింది. ‘‘అట్లాంటా స్టూడియోలో ఈ డిబేట్‌ను నిర్వహిస్తాం’ అని సీఎన్ఎన్ తెలిపింది. జనం మధ్యలో డిబేట్ జరిపితే బాగుంటుందని ట్రంప్ అన్నారు. -
ప్రియాంక నటనకు అంతర్జాతీయ గుర్తింపు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తన హాలీవుడ్ ఎంట్రీతో ఒక్కసారిగా ఇంటర్నేషనల్ స్టార్ గా మారిపోయింది. ఎబిసి ఛానల్ లో టెలికాస్ట్ అవుతున్న క్వాంటికో సీరియల్ లో లీడ్ రోల్లో నటిస్తోంది ఈ బ్యూటి. షూటింగ్ సమయం నుంచి క్వాంటికో సక్సెస్‌కు మెయిన్ ఎసెట్ ప్రియాంక పర్ఫామెన్సే అవుతుందని భావిస్తూ వచ్చారు. అందుకు తగ్గట్టుగానే తొలి ఎపిసోడ్ తోనే అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్శించింది ఈ బాలీవుడ్ హీరోయిన్. సెప్టెంబర్ 27 రాత్రి పది గంటలకు ఎబిసి చానల్ లో ప్రసారం అయిన తొలి ఎపిసోడ్ తో ఒక్కసారిగా ఇంటర్ నేషనల్ స్టార్ అయిపోయింది ప్రియాంక. అంతర్జాతీయ పత్రికలు ప్రియాంక నటనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నాయి. క్వాంటికో సీరిస్ కు ప్రియాంక నటనే మెయిన్ ఎసెట్ అంటూ ప్రశంసిస్తున్నాయి. ఈ సీరీస్ పూర్తయ్యే సరికి పాపులారిటీ విషయంలో ప్రియాంక చోప్రా, హాలీవుడ్ టాప్ స్టార్స్ తో పోటి పడటం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. -
క్వాంటికో తొలి ఎపిసోడ్‌కు కౌంట్‌డౌన్
బాలీవుడ్ సెలబ్రిటీలు హాలీవుడ్లో నటించటం కామన్ అయితే హాలీవుడ్ సీరియల్స్‌లో నటించటం మాత్రం చాలా అరుదు. గతంలో అనిల్ కపూర్ లాంటి స్టార్స్ హాలీవుడ్ స్మాల్ స్క్రీన్ మీద సందడి చేసినా పెద్దగా గుర్తింపు మాత్రం తెచ్చుకోలేకపోయారు. అయితే ఈ హద్దులను చెరిపేస్తూ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఓ ఇంగ్లీష్ టివి సీరియల్‌తో హల్చల్ చేస్తుంది. సెప్టెంబర్ 27న ప్రారంభమవుతున్న క్వాంటికో టెలివిజన్ సీరీస్‌తో హాలీవుడ్ స్మాల్ స్క్రీన్ మీద సత్తాచాటడానికి రెడీ అవుతోంది ప్రియాంక. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్స్‌తో పాటు, ఇన్సైడ్ టాక్ ప్రకారం ఈ సీరీస్ సక్సెస్ లో ప్రియాంక పాత్రే కీలకం అన్న టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే తన లుక్స్‌తో ఆకట్టుకున్న ప్రియాంక యాక్షన్ సీన్స్‌లోనూ అదే స్ధాయిలో నటించింది. ఈ సీరీస్ లో ఎఫ్బిఐ ఏజెంట్ గా నటిస్తుంది ప్రియాంక. ఇక కథ విషయానికి వస్తే ఎఫ్బిఐలో రిక్రూట్ అయిన కొత్త మంది యువతి, యువకుల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. వర్జీనియాలోని క్వాంటికోలో ట్రైనింగ్ తీసుకున్న ఈ టీంలో ప్రతి ఒక్కరికి ఎఫ్బిఐలో చేరటం వెనుక ఓ ప్రత్యేకమైన బ్యాక్‌గ్రౌండ్ ఉంటుంది. ఆ కథ ఏంటి ఎఫ్బిఐలో చేరిన ఈ టీం ట్రైనింగ్ తరువాత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది అన్నదే క్వాంటికో సీరిస్ కథ. సెప్టెంబర్ 27 రాత్రి పది గంటలకు ఎబిసి ఛానల్ లో ఈ సీరిస్ తొలి ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. అంతర్జాతీయ స్ధాయిలో భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సీరిస్ టెలివిజన్ టిఆర్పీ చరిత్రలో సరికొత్త రికార్డ్లను సెట్ చేస్తుందని భావిస్తున్నారు.