ప్రియాంక నటనకు అంతర్జాతీయ గుర్తింపు | Priyanka Praised By International News Paper | Sakshi
Sakshi News home page

ప్రియాంక నటనకు అంతర్జాతీయ గుర్తింపు

Published Thu, Oct 1 2015 12:21 PM | Last Updated on Sun, Sep 3 2017 10:18 AM

ప్రియాంక నటనకు అంతర్జాతీయ గుర్తింపు

ప్రియాంక నటనకు అంతర్జాతీయ గుర్తింపు

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తన హాలీవుడ్ ఎంట్రీతో ఒక్కసారిగా ఇంటర్నేషనల్ స్టార్ గా మారిపోయింది. ఎబిసి ఛానల్ లో టెలికాస్ట్ అవుతున్న క్వాంటికో సీరియల్ లో లీడ్ రోల్లో నటిస్తోంది ఈ బ్యూటి. షూటింగ్ సమయం నుంచి క్వాంటికో సక్సెస్కు మెయిన్ ఎసెట్ ప్రియాంక పర్ఫామెన్సే అవుతుందని భావిస్తూ వచ్చారు. అందుకు తగ్గట్టుగానే తొలి ఎపిసోడ్ తోనే అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్శించింది ఈ బాలీవుడ్ హీరోయిన్.

సెప్టెంబర్ 27 రాత్రి పది గంటలకు ఎబిసి చానల్ లో ప్రసారం అయిన తొలి ఎపిసోడ్ తో ఒక్కసారిగా ఇంటర్ నేషనల్ స్టార్ అయిపోయింది ప్రియాంక. అంతర్జాతీయ పత్రికలు ప్రియాంక నటనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నాయి. క్వాంటికో సీరిస్ కు ప్రియాంక నటనే మెయిన్ ఎసెట్ అంటూ ప్రశంసిస్తున్నాయి. ఈ సీరీస్ పూర్తయ్యే సరికి పాపులారిటీ విషయంలో ప్రియాంక చోప్రా, హాలీవుడ్ టాప్ స్టార్స్ తో పోటి పడటం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement