Quantico
-
క్వాంటికో రీమేక్‌లో...
కథానాయికగా పుష్కరం దాటినా దక్షిణాదిన స్టార్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకెళుతున్నారు కాజల్ అగర్వాల్. బాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తున్న ఈ బ్యూటీ తాజాగా ఓ వెబ్ సిరీస్‌లో నటించేందుకు పచ్చజెండా ఊపారని సమాచారం. బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రాకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టిన అమెరికన్ వెబ్ సిరీస్ ‘క్వాంటికో’ ఇండియన్ వెర్షన్లో కాజల్ నటించనున్నారట. ‘క్వాంటికో’కి మంచి ప్రేక్షకాదరణ దక్కడంతో భారత్‌లోని పలు భాషల్లో వెబ్ సిరీస్‌గా రూపొందించేందుకు నెట్‌ఫ్లిక్స్ సన్నాహాలు చేస్తోందని టాక్. ప్రియాంక పాత్రకు కాజల్‌ని అడిగితే, ఆమె అంగీకరించారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రియాంకది బోల్డ్ క్యారెక్టర్. చాలా గ్లామరస్‌గా కనిపించారు. ఇండియన్ వెర్షన్లో కాజల్ కూడా గ్లామరస్‌గా కనిపిస్తారని ఊహించవచ్చు. ఆల్రెడీ తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు రుపొందిస్తున్న ఓ వెబ్ సిరీస్ నటిస్తున్నారు కాజల్ అగర్వాల్. -
దేశాన్ని అవమానించే సీరియల్లో నటిస్తావా..!
ప్రముఖ నటి ప్రియాంక చోప్రా అమెరికన్ టీవీ సీరియల్ క్వాంటికోలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 1 వ తేదీన ప్రసారం అయిన ఏపిసోడ్లోని దృశ్యాలపై పలువురు ఇండియన్ నెటిజన్లు మండిపడుతున్నారు. న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్ పేలుళ్లకు యత్నించింది భారతీయులే అనే విధంగా ఆ సీరియల్లో చూపెట్టడంపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశ ప్రతిష్టకు చెడ్డ పేరు తీసుకొచ్చే సీరియల్లో నటిస్తావా అంటూ ప్రియాంకపై సోషల్ మీడియాలో విమర్శలు కురిస్తున్నారు. అసలు ఏం చూపెట్టారు : ‘పాకిస్తాన్ ముసుగులో భారతీయులే న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్‌లో పేలుడుకు ప్రయత్నిస్తారని.. దానిని ఎఫ్‌బీఐ అధికారి హోదాలో ప్రియాంక చోప్రా అడ్డుకుంటుందనే కథాసారంతో తాజా ఏపిసోడ్‌ను చిత్రీకరించారని’ ట్విటర్లో నెటిజన్లు పోస్ట్ చేశారు. ఇలాంటి సీరియల్లో ప్రియాంక ఎలా నటిస్తుందని పలువురు తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతున్నారు. ప్రియాంకపై, క్వాంటికో యూనిట్‌పై ట్విటర్ వేదికగా దాడికి దిగారు. క్వాంటికో మొదటి సీజన్ విజయవంతమైనప్పటికి, రెండో సీజన్లో ఈ సీరియల్‌కు రేటింగ్‌లు దారుణంగా పడిపోవడంతో మూడో సీజనే చివరిదని నిర్మాణ సంస్థ ప్రకటించింది. -
బ్రిటీష్ ప్రిన్స్ పెళ్లికి ప్రియాంక
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా బ్రిటీష్ రాయల్ వెడ్డింగ్‌కి హాజరు కానున్నారు. తన హాలీవుడ్ స్నేహితురాలు మేఘన్ మార్కెల్- బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ హ్యారీల వివాహ మహోత్సవంలో పాల్గొనాలని ఆమెకు పిలుపు అందింది. ఈ నెల 19న లండన్‌లోని విండ్సర్ క్యాజిల్‌లో జరగబోయే పెళ్లి వేడుకకు ప్రియాంక హాజరు కానున్నారు. తన స్నేహితురాలి పెళ్లి వేడుకకు ఆహ్వానం అందడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. పెళ్లి కూతురు మేఘన్‌తో తన మూడేళ్ల స్నేహ బంధాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. ‘మార్కెల్ మాటతీరు, నడవడిక ఎంతో బాగుంటాయి. ఆమె తన కొత్త జీవితంలో చక్కగా ఒదిగిపోతుంద’ని ప్రియాంక అన్నారు. ప్రియాంక సన్నిహితురాలు రేచల్ రే దీనిపై స్పందించారు. ‘ఏమో మేఘన్ సాధారణ గృహిణి మాత్రమే కావచ్చునేమో’నని వ్యాఖ్యానించగా.. ‘ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి అనేంత చక్కని చుక్క నా ఫ్రెండ్. అమ్మాయిలకు మార్గదర్శిగా నిలిచే గొప్ప వ్యక్తిత్వం గల ముద్దుగుమ్మ మేఘన్’ అని ప్రియాంక తన స్నేహితురాలిపై అభిమానాన్ని చాటుకున్నారు. మార్కెల్‌తో మూడేళ్ల ప్రయాణంలో తాను ఎంతో నేర్చుకున్నానని ప్రియాంక అన్నారు. ఆమె గొప్పింటికి కోడలుగా వెళ్లబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. కాగా, ప్రియాంక తన పాపులర్ షో ‘క్వాంటీకో’ మూడో సీజన్‌ను ఈ వారం ప్రారంభించిన విషయం తెలిసిందే. -
పెళ్లి వార్తలపై ప్రియాంక క్లారిటీ
ముంబై : తాను రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు వస్తున్న వార్తలపై బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా స్పందించారు. మంగళసూత్రంలా ఉన్న బ్రాస్లెట్ ధరించడంతో ప్రియాంక రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తలను ప్రియాంక ట్వీటర్ వేదికగా ఖండించారు. ‘‘హాహాహా.. నా పెళ్లిపై ఊహాగానాలు.. ఇది కేవలం దిష్టి తగలకుండా గాయ్స్..ఇక ఆపండి. నేను పెళ్లి చేసుకున్నప్పుడు ఖచ్చితంగా చెబుతాను. రహస్యంగా ఏమి చేసుకోను’’ అని బ్రాస్లెట్ ఫొటోను ట్వీట్ చేశారు. ‘క్వాంటికో’ సిరిస్‌తో హలీవుడ్లో అడుగుపెట్టిన ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రస్తుతం హిందీ చిత్రాల్లో నటిచండం చాలా వరకూ తగ్గించేశారు. వరుస హలీవుడ్ చాన్స్‌లతో బిజీగా ఉన్న ప్రియాంకను అసోం ప్రభుత్వం రాష్ట్ర టూరీజం ప్రచారకర్తగా నియమించింది. ఈ సందర్భంగా అసోం పర్యాటక రంగంపై ప్రచారం చేయడానికి ప్రియాంక చాలా కాలం తర్వాత స్వదేశానికి వచ్చారు. ఈ ప్రయాణంలో తీసిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోల్లో ప్రియాంక ధరించిన బ్రాస్లెట్.. చూడ్డానికి మంగళసూత్రంలా ఉండటంతో ఈ ముద్దుగుమ్మ రహస్యంగా పెల్లి చేసుకున్నారనే వార్తలు ప్రచారం అయ్యాయి. https://t.co/EkUEgfbO75 Hahahah!heights of speculation! This is an evil eye guys! Calm down! I’ll tell u when I get married and it won’t be a secret! Lol pic.twitter.com/WPdIxXIx1I — PRIYANKA (@priyankachopra) 30 April 2018 -
రహస్యంగా పెళ్లి చేసుకున్న నటి..?
ఈ మధ్యకాలంలో బాలీవుడ్లో ఎక్కువగా పెళ్లి కబుర్లే వినిపిస్తున్నాయి. గతేడాది డిసెంబర్ వరకు అనుష్క శర్మ- విరాట్ కోహ్లి పెళ్లి గురించి జరిగిన చర్చలు కాస్తా ఇప్పుడు సోనమ్ కపూర్ వివాహం వైపు మళ్లాయి. తాజాగా ఈ కోవలోకి మరో నటి చేరింది. ‘క్వాంటికో’ సిరిస్‌తో హలీవుడ్లో అడుగుపెట్టిన బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా ప్రస్తుతం హిందీ చిత్రాల్లో నటిచండం చాలా వరకూ తగ్గించేసింది. వరుస హలీవుడ్ చాన్స్‌లతో బిజీగా ఉన్న ప్రియాంకను అసోం ప్రభుత్వం రాష్ట్ర టూరీజం ప్రచారకర్తగా నియమించింది. ఈ సందర్భంగా అసోం పర్యాటక రంగంపై ప్రచారం చేయడానికి ప్రియాంక చాలా కాలం తర్వాత స్వదేశానికి వచ్చింది. ఈ ప్రయాణంలో తీసిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. అది కాస్తా ఇప్పుడు హట్‌టాపిక్‌గా మారింది. ప్రియాంక షేర్ చేసిన ఫొటోల్లో ఒక అంశం ఇప్పుడు అభిమానుల్ని తెగ ఆకర్షిస్తుంది. అది ప్రియాంక ధరించిన బ్రాస్లెట్. చూడ్డానికి మంగళసూత్రంలా ఉన్న ఈ బ్రాస్లెట్ ప్రియాంక వివాహానికి సంబంధించి పలు అనుమానాలకు తావిస్తుంది. ప్రియాంక రహస్యంగా పెళ్లి చేసుకున్నదనే గుసగుసలు ఇప్పుడు బీ టౌన్లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. తన వ్యక్తిగత జీవితం గురించి ప్రియాంక ఎప్పుడు మౌనంగానే ఉంటుంది. గతంలో ఒకసారి తాను అందరిలానే వివాహం చేసుకుంటానని, పిల్లల్ని కంటానని కానీ ఇదంతా తనకు సరైన వ్యక్తి తారస పడినప్పుడు మాత్రమే జరుగుతాయని చెప్పింది. అలానే పిల్లలంటే నాకు చాలా ఇష్టం..వారితో గడపుతుంటే సమయమే తెలియదు..కాబట్టి నా జీవతంలో పిల్లలు తప్పనిసరి అంది. ప్రస్తుతం ‘క్వాంటికో’ మూడో సిరీస్‌లో నటిస్తున్న ప్రియాంక చాలాకాలం తర్వాత సల్మాన్ ఖాన్‌కు జోడిగా ‘భరత్’లో నటిస్తోంది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2019 ఈద్ సందర్భంగా విడుదల కానుంది. -
హాలీవుడ్‌కు ప్రియాంక గుడ్‌బై
సాక్షి, ముంబై : నటి ప్రియాంక చోప్రా హాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పబోతోంది. తిరిగి ఆమె బాలీవుడ్ చిత్రాల్లో నటించేందుకు సిద్ధమైపోతున్నట్లు తెలుస్తోంది. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన నటించే ఛాన్స్ రావటంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుందంట. సల్మాన్ ఖాన్ హీరోగా అలీ అబ్బాస్ జఫర్ డైరెక్షన్లో ‘భరత్’ అనే సినిమాను తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రియాంకను సంప్రదించటం.. స్క్రిప్ నచ్చటంతోపాటు హీరో సల్మాన్ కావటంతో పిగ్గీ చోప్స్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె అమెరికన్ టెలివిజన్ సిరీస్ ‘క్వాంటికో’ తర్వాతి సిరీస్‌లో నటించలేనని నిర్వాహకులకు చెప్పేసిందని సమాచారం. అయితే దీనిపై భరత్ మేకర్లు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. గతంలో సల్లూతో కలిసి ప్రియాంక ‘ముజ్సే షాదీ కరోగీ, సలామ్-ఇ-ఇష్క్, గాడ్ తుస్సీ గ్రేట్ హో చిత్రాల్లో నటించారు. చివరగా ప్రియాంక చోప్రా ప్రకాశ్ ఝా జై గంగాజల్(2016)లో నటించిన విషయం తెలిసిందే. సౌత్ కొరియన్ మూవీ ఒడే టూ మై ఫాదర్(2014) చిత్రానికి రీమేక్‌గా భరత్ తెరకెక్కబోతోంది. 2019 ఈద్ సందర్భంగా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరోయిన్లను లోబరుచుకోవటంపై ప్రియాంక, అలాంటి కామాంధులు అంతటా ఉంటారు -
బాలీవుడ్ సినిమా అంగీకరిస్తుందా..?
చాలా రోజులుగా బాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉంటున్న ప్రియాంక చోప్రా త్వరలో ఓ హిందీ సినిమాలో నటించేందుకు రెడీ అవుతోంది. వరుసగా హాలీవుడ్ సినిమాలతో టీవీ సీరిస్‌లతో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ బాజీరావ్ మస్తాని తరువాత ఒక్క హిందీ సినిమా కూడా చేయలేదు. దీంతో ప్రియాంక బాలీవుడ్ సినిమాలో చూసేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇదే పని మీద ముంబై చేరుకున్న ప్రియాంక చోప్రా మూడు రోజుల పాటు ఇక్కడ దర్శక నిర్మాతలతో చర్చలు జరపనున్నారు. త్వరలోనే ఓ బాలీవుడ్ సినిమా సైన్ చేసి ఇక్కడి ప్రేక్షకులను అలరించాలన్న ప్లాన్‌లోనే ప్రియాంక ముంబై వచ్చారన్న టాక్ వినిపిస్తోంది. కొద్ది రోజులుగా కల్పనా చావ్లా బయోపిక్ లో ప్రియాంక నటించనుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్ ను ఈ ట్రిప్ లోనే ఫైనల్ చేస్తారో లేదో చూడాలి. మూడు రోజుల పాటు ముంబైలో గడపనున్న పీసీ తరువాత క్వాంటికో 3 సీరిస్ కోసం ఐర్లాండ్ వెళ్లనున్నారు. -
ప్రియాంక చోప్రా మొబైల్ చూస్తే.. షాకింగే!
పరిచయం అక్కర్లేని పేరు... ప్రియాంక చోప్ర. మాజీ మిస్ వరల్డ్, బాలీవుడ్ అందాల తార, హాలీవుడ్ హాట్ స్టార్, ఐక్యరాజ్యసమితి గుడ్‌విల్ అంబాసిడర్‌గా తిరుగులేని ఐడెంటిటీ ప్రియాంక సొంతం. హాలీవుడ్లో నటించిన క్వాంటికో సీరియల్లో అమెరికన్ల మనసును కొల్లగొట్టింది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంకు.. ఫోన్‌కు మెసేజ్‌లు, ఈ మెయిల్స్ ఎన్ని వస్తుంటాయనే దానిపై చాలామందికి సందేహాలు ఉండడం సహజం. అదే సమయంలో ఎన్నింటికి ప్రియాంక రిప్లై ఇస్తుందనేది కూడా ఆసక్తికరం. ప్రియాంకు సంబంధించిన ఈ ఆసక్తిర విషయంపై ఆమె సహచర నటుడు అలన్ పావెల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫొటో పోస్ట్ చేశారు. ప్రస్తుతంఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రియాంక చోప్రా ఫోన్ ఈ మెయిల్స్ ఇన్‌బాక్స్‌లో.. అక్షరాలా 2 లక్షల 57 వేల 623 చదవని మెయిల్స్ ఉన్నాయి. ఈ సంఖ్య చుట్టూ రెడ్‌మార్క్ వేసి మరీ అలెన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. Guys ... guys ... don't ever email @priyankachopra ... she apparently NEVER reads it! This is is the record ... I defy anyone to beat it. #unbelievable #ithoughtiwasbad #commaplacementconfusesme A post shared by Alan Powell (@alanpowell10) on Dec 5, 2017 at 4:17pm PST -
అమీఃఅమెరికన్ టీవీ సూపర్‌గాళ్
‘క్వాంటికో’తో ప్రియాంకా చోప్రా, ఇప్పుడు ‘సూపర్ గాళ్’తో అమీ జాక్సన్... ఈ లిస్టులో చేరబోయే నెక్ట్స్ ఇండియన్ హీరోయిన్ ఎవరో మరి! అమీది బ్రిటన్ అయినా.. ఇండియన్ సినిమాలతోనే హీరోయిన్గా పేరొచ్చింది. ఇండియాలో ఆమెకున్న ఫాలోయింగ్ చూసే అమెరికన్ టీవీ సిరీస్ ‘సూపర్ గాళ్’లో ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారట! అందులో అమీ ‘సాటర్న్ గాళ్’ క్యారెక్టర్లో కనిపించనున్నారు. వచ్చే నెల 9వ తేదీ నుంచి సీడబ్ల్యూ ఛానల్లో ‘సూపర్ గాళ్’ టెలికాస్ట్ కానుంది. సినిమాల సంగతికొస్తే... హిందీ హిట్ ‘క్వీన్’ సౌతిండియన్ రీమేక్స్‌తో పాటు కన్నడ ‘విలన్’లో అమీ నటిస్తున్నారు. రజనీకాంత్ పక్కన ఆమె హీరోయిన్గా నటించిన ‘2.0’ వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది. -
కామెడీ టీవీ సీరీస్‌లో స్టార్ హీరోయిన్స్
త్వరలో హాలీవుడ్లో ఓ కామెడీ టీవీ సిరీస్ కోసం ప్రియాంక చోప్రా, మాధురీ దీక్షిత్‌లు కలిసి పనిచేయనున్నట్లు తెలుస్తోంది. ఈ టీవీ సిరీస్ మాధురీ దీక్షిత్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే హాలీవుడ్లో 'క్వాంటికో' సిరీస్ ద్వారా యాక్షన్ యాంగిల్ చూపించిన ప్రియాంక, ఈ టీవీ సిరీస్ ద్వారా తనలోని కామెడీ కోణం చూపించనుంది. ఈ టీవీ సిరీస్‌కు ప్రియాంక చోప్రా, మాధురీ దీక్షిత్ లు కూడా నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఈ సిరీస్ కోసం బాలీవుడ్ స్క్రీన్‌రైటర్ శ్రీ రావు ప్రస్తుతం స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నారు. ఈ విషయాన్ని శ్రీ రావు తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇద్దరు గ్రేట్ యాక్టర్స్ నా నెక్ట్స్ ప్రాజెక్టు చేయబోతున్నాను అంటూ మాధురీ, ప్రియాంకలతో దిగిన ఫొటోను పోస్ట్ చేశాడు శ్రీరావ్. ఈ సీరీస్ ను క్వాంటికో ను టెలికాస్ట్ చేస్తున్న ఏబీసీ చానల్ ప్రసారం చేయనుంది. Thrilled to finally announce my exciting new project with these two legends and icons @MadhuriDixit @priyankachopra https://t.co/520RhMOrcU pic.twitter.com/W0pQGid2wD — Sri Rao (@NewYorkSri) 28 July 2017 -
హలో..నా పేరు ప్రియాంక!
సొంత గడ్డ మీద ప్రియాంకా చోప్రా స్టార్. పరాయి దేశంలో నాన్–స్టార్. ఇది నిన్నటి మాట. ఎప్పుడైతే అమెరికన్ టీవీ సిరీస్ ‘క్వాంటికో’లో నటించడం మొదలుపెట్టారో అప్పుడు ప్రియాంకా చోప్రా విదేశాల్లోనూ చాలా పాపులర్ అయిపోయారు. హాలీవుడ్ చిత్రం ‘బేవాచ్’ అంగీకరించాక మరింత పాపులార్టీ పెరిగిపోయింది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పుడు ప్రియాంక ఎక్కడికెళ్లినా అందరూ గుర్తుపడుతున్నారు. అయితే, ‘క్వాంటికో’ ఒప్పుకున్నప్పుడు విదేశాల్లో ప్రియాంకా చోప్రాను గుర్తుపట్టేవాళ్ల సంఖ్య తక్కువగానే ఉండి ఉంటుంది. ఆమెను నాన్–స్టార్‌గా చూసినవాళ్లూ ఉండే ఉంటారు. ఆ సమయంలో మీ ఫీలింగ్స్ ఏంటి? అనే ప్రశ్న ప్రియాంకా చోప్రా ముందుంచితే – ‘‘ నేను ఇండియాలో స్టార్ అయినంత మాత్రాన ప్రపంచమంతా గుర్తిస్తుందని అనుకోను. ప్రతి దేశంలోనూ ఎంతమంది గొప్ప స్టార్లు ఉంటారు. ఒకవేళ నా తోటి యాక్టర్లకు నేను తెలియకపోతే వారి దగ్గరికి వెళ్లి ‘హలో నా పేరు ప్రియాంక.. నేను ఇండియన్ యాక్టర్’ను అని పరిచయం చేసుకుంటాను. ఇందులో చిన్నతనంగా ఫీలవ్వడానికి ఏం లేదు. ఈ విషయంలో నాకు ఎటువంటి ఈగో లేదు’’ అన్నారామె. నిజంగా ప్రియాంక గ్రేట్ కదూ! -
షూటింగ్లో ప్రమాదం.. ఆస్పత్రిలో ప్రముఖ హీరోయిన్
లాస్ఏంజిల్స్: ప్రముఖ హీరోయిన్ ప్రియాంకా చోప్రా ప్రమాదానాకి గురై ఆస్పత్రిలో చేరారు. బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు వెళ్లిన ప్రియాంక.. ప్రఖ్యాత అమెరికన్ టీవీ షో ‘క్వాంటికో’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ప్రియాంక.. ‘క్వాంటికో’ షూటింగ్లో ఉండగా ప్రమాదానికి గురైనట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. గాయపడ్డ ఆమెను సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది. -
ఆ ప్రశ్న వింటే నాకు ఒళ్లు మంట
ఫస్ట్ లవ్.. ఫస్ట్ బైక్/కార్.. ఫస్ట్ జాబ్.. ఇలా జీవితంలో తొలిసారి జరిగే ముఖ్యమైన విషయాలు మనకు తీపి గుర్తు అవుతాయి. అందుకే మొదటి లవ్ గురించి, మొదటి వాహనం, ఉద్యోగం గురించి అడిగితే టకీమని సమాధానం చెప్పేస్తారు. అదే, ఈ మధ్య చివరిగా ఎప్పుడు అబద్ధం ఆడారు? ఫలానా వర్క్ లాస్ట్ టైమ్ ఎప్పుడు చేశారు? అని అడిగితే ఠక్కున సమాధానాలు చెప్పేవారు ఎంత మంది ఉంటారు? కష్టమే కదూ! ప్రియాంకా చోప్రా మాత్రం ఫటాఫట్ చెప్పేశారు. మరో పది రోజుల్లో ఈ ఏడాదికి టాటా చెప్పేయడానికి రెడీ అవుతోన్న ప్రియాంకా చోప్రా... ‘2016 లాస్ట్ థింగ్స్’ పేరిట చెప్పిన కబుర్లు చదవండి. ► ‘షూటింగ్ లేట్ కావడంతో రాత్రి ఆలస్యంగా నిద్రపోయా. అందువల్లే ఉదయం లేటుగా నిద్రలేచా’ – నేను లేటుగా లేచిన ప్రతిసారీ ఈ అబద్ధం చెబుతుంటా. బహుశా ఈ ఏడాది నేను చెప్పే చివరి అబద్ధం ఇదే అవుతుందేమో. వచ్చే ఏడాది నిజాలే చెబుతారా? అని అడగకండి. ఇప్పుడే చెప్పలేను. ► నేను ఓ ఫొటోషూట్‌కి వెళితే అక్కడ నా చుట్టూ ఓ కుక్కపిల్ల తిరిగింది. ఆ పప్పీని వదలడం ఇష్టం లేక ఇంటికి తీసుకెళ్లా. దాన్ని దత్తత తీసుకున్నా. డయానా అని పేరు పెట్టా. భలే ముద్దు ముద్దుగా ఉంటుంది తెలుసా. డయానాతో ఫొటోలు తీసుకోవడం నాకో అలవాటుగా మారింది. చివరగా తనతోనే ఓ ఫొటో (సెల్ఫీ) తీసుకున్నా. ► నేను ప్రముఖ హాలీవుడ్ నటి ఇవా మెండిస్లా ఉన్నానని అంటుంటారు. ఈ మధ్య నన్నొకరు ఆమెతోనే పోల్చారు. ఆ తర్వాత ఎవరూ పోల్చలేదు. సో.. ఇవా మెండిస్‌తో నన్ను పోల్చడం ఇదే చివరిసారి అవుతుందేమో. ► 2005 లేదా 2006లో నిద్రలేకుండా షూటింగ్స్ చేసిన రోజులున్నాయి. ఎందుకంటే ఒకేసారి నాలుగైదు సినిమాలు అంగీకరించా. ఆ తర్వాత మళ్లీ ఈ ఏడాది ఆ పరిస్థితి వచ్చింది. ఇండియాలో ‘బాజీరావ్ మస్తానీ ప్రమోషన్లు, అమెరికాలో ‘క్వాంటికో’ టీవీ సిరీస్ షూటింగ్.. ఇలా ఈ ఏడాది ప్రారంభంలో కంటిన్యూస్‌గా వర్క్ చేశా. అప్పుడు నిద్రలేని రాత్రులు గడిపా. ఇండియా, అమెరికాల మధ్య చక్కర్లు కొట్టా. ఒక్కోసారి ఫ్లైట్‌లోనే చిన్నపాటి కునుకు తీసేదాన్ని. నిద్ర లేకుండా పని చేయడం ఇదే చివరిసారి అయితే బాగుంటుందనుకుంటున్నా. ► వరుస చిత్రీకరణలు, ప్రయాణాలతో ఈ ఏడాదంతా క్షణం తీరిక లేకుండా గడిపా. కానీ, లాస్ట్ టైమ్ షాపింగ్ చేసినప్పుడు నాకోసం నేను ఓ డైమండ్ నెక్లెస్ కొనుక్కున్నా. త్వరలో ఆ నెక్లెస్‌ను మీకు చూపిస్తా! ► సాధారణంగా చాలామంది ప్రతి సందర్భంలోనూ ‘ఎలా ఉన్నారు?’ అనే ప్రశ్న వేస్తారు. ఆ ప్రశ్న అంటే నాకు చిరాకు. ఆ ప్రశ్న వింటే కోపం వచ్చేస్తుంది. అప్పుడు నేను ‘ఆకలి వేస్తుందనో, చలిగా ఉందనో’ చెబుతుంటా. చివరిసారిగా కోపం వచ్చింది కూడా ఎవరో ఈ ప్రశ్న అడిగినప్పుడే. ► ఈ ఇయర్ ఎండింగ్లో దేవుడు నన్నో కోరిక కోరుకోమంటే ఈ వయసులోనే ఓ వారం రోజులు ఉంచేయమంటా. ఇప్పుడు నాకు 34 ఏళ్లు. ఈ ఏడాదంతా గొప్పగా గడిచింది. -
'నా కాళ్లు కోట్లు సంపాదిస్తున్నాయి'
బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్ సినిమాతోనూ సత్తా చాటుతున్న హాట్ బ్యూటి ప్రియాంక చోప్రా, తన బ్రాండ్ ఇమేజ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సినిమాలతో పాటు పలు అంతర్జాతీయ సినీ వేదికల మీద కనిపించే ఈ బ్యూటి, సౌందర్యోపకరణాలు, బ్రాండెడ్ దుస్తులు, చెప్పులు, నెయిల్ పాలిష్‌లు వంటి ఎన్నో వస్తువులకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. వరుస షూటింగ్‌లతో బిజీగా ఉన్న పీసీ డబ్ల్యూ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కాళ్లకు సంబందించి ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకుంది. చిన్న వయసులో ప్రియాంకా టామ్ బాయ్‌ల ఉండటం వల్ల బాగా దెబ్బలు తగిలేవట. అయితే అప్పట్లో శరీరాన్ని సుకుమారంగా చూసుకోవటం ఎంత అవసరమో తెలిసేది కాదని, కానీ ఇప్పుడు శరీరం విలువ తెలిసిందని చెప్పింది. చిన్నతనంలో తన కాళ్లు అస్సలు అందంగా కనిపించేవి కావని, దెబ్బలు తగిలి, గీరుకు పోయిన ఇబ్బందిగా ఉండేవని తెలిపింది. అయితే ప్రస్తుతం తన కాళ్లు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాయని తెలిపింది. దాదాపు తన కాళ్లతోనే 15కు పైగా ఉత్పత్తులకు ప్రచారం చేస్తున్నంటూ మురిసిపోతోంది. ఈ ముంబై ముద్దుగుమ్మ. -
'అయ్యో అమెరికా కాదు.. నా ఇల్లు ముంబై'
ముంబయి: ఎప్పటికీ తన ఇళ్లు ముంబయేనని ప్రముఖ బాలీవుడ్ నటి, ప్రస్తుతం హాలీవుడ్లో సైతం బిజీ అయిన ప్రియాంక చోప్రా చెప్పింది. తాను లాస్ ఎంజెల్స్‌లో స్థిరపడతానని వస్తున్న వార్తలన్నీ కేవలం ఊహాగానాలేనని కొట్టిపారేసింది. యాక్టింగ్ కెరీర్ కోసం పశ్చిమ దేశాలకు వెళ్లడం సరైన నిర్ణయం అని చెప్పింది. ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉన్న ప్రియాంక చోప్రా అక్కడ అమెరికన్ టీవీ సిరీస్ క్వాంటికోలో నటిస్తోంది. అయితే, ఆమె త్వరలోనే ముంబయి నుంచి మకాం ఎత్తేస్తారని, లాస్ ఎంజెల్స్ లో స్థిరపడబోతోందని మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. 'కొన్ని వార్తలు వింటే నాకు నిజంగా ఆశ్చర్యంగా, హాస్యాస్పందంగా అనిపిస్తుంటుంది. ఇలాంటి విషయాల్లో కచ్చితంగా వివరణ ఇవ్వాలి. ప్రస్తుతం న్యూయార్క్‌లో క్వాంటికో షూటింగ్ లో ఉన్న.. నా ఇళ్లు ముంబయి.. లాస్ ఎంజెల్స్ కాదు' అని ట్విట్టర్లో ప్రియాంక బదులిచ్చింది. -
సస్పెన్స్ కొనసాగిస్తున్న ప్రియాంక
ముంబై: భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి కల్పనా చావ్లా జీవితకథ ఆధారంగా తెరకెక్కనున్న సినిమాపై బాలీవుడ్ అందాల భామ ప్రియాంక చోప్రా సస్పెన్స్ కొనసాగిస్తోంది. అమెరికా టీవీ సిరీస్ 'క్వాంటికో' రెండో సీజన్ పూర్తయ్యే వరకు హిందీ సినిమాలు చేయబోనని ప్రియాంక చెప్పింది. అయితే కల్పనా చావ్లా సినిమాపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. 'క్వాంటికో రెండో సీజన్ పూర్తయ్యే వరకు హిందీ సినిమాలు చేయలేను. ఒక ప్రాజెక్టు మాత్రమే చేతిలో ఉండడంతో నాకు చాలా ఖాళీ సమయం చిక్కింది. అందుకే ముంబైలో తీరిగ్గా గడుపుతున్నా. పలువురు దర్శకులు నాకు కథలు వినిపించారు. వచ్చే ఏడాదికి క్వాంటికో పూర్తవుతుంది. ఇప్పుడు హిందీలో గొప్ప సినిమాలు వస్తున్నాయి. ఏడాదికి నాలుగు సినిమాలు చేసే దాన్ని, ఇప్పుడు ఒకటి లేదా రెండు మాత్రమే చేస్తున్నాను. నాకున్న సమయాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించు కోవాలనుకుంటున్నా. 2017, మార్చి వరకు వేరే సినిమాల్లో నటించడానికి అవకాశం లేద'ని ప్రియాంక చోప్రా చెప్పింది. 'జై గంగా జల్' హిందీ సినిమాలో చివరిసారిగా కనిపించింది. హాలీవుడ్ లో తన తొలి సినిమా 'బే వాచ్' షూటింగ్ ఇటీవలే పూర్తి చేసింది. -
ఆ కంఫర్టే వేరబ్బా!
సొంత ఇంట్లో లైట్ స్విచ్‌లు, ఫ్యాన్ స్విచ్‌లు వెతుక్కోవడం, వంట గదిలో పంచదార, ఉప్పు ఎక్కడున్నాయో వెతుక్కోవడం అంటే.. ఆ ఇంటి యజమానిలా కాదు.. గెస్ట్‌లా ఉన్నట్లే. ప్రస్తుతం ప్రియాంకా చోప్రా పరిస్థితి అదే. అమెరికన్ టీవీ సిరీస్ ‘క్వాంటికో’, హాలీవుడ్ చిత్రం ‘బేవాచ్’ షూటింగ్స్‌లో భాగంగా ఈ మధ్య ఆమె ఎక్కువగా అమెరికాలోనే ఉన్నారు. ‘బేవాచ్’ షూటింగ్ ముగిసింది. ‘క్వాంటికో’ రెండో సీజన్ చిత్రీకరణ ఆరంభం కావడానికి ఇంకాస్త టైమ్ పడుతుంది. అందుకని అమెరికా నుంచి ముంబయ్ వచ్చేశారామె. వచ్చీ రావడంతోనే తాను ఈ మధ్య కొత్తగా కట్టుకున్న ఇంటిని మురిపెంగా చూసుకున్నారట. ‘‘ఇలా గృహప్రవేశం అయ్యానో లేదో అలా షూటింగ్స్ కోసం విదేశాలు వెళ్లిపోయాను. దాంతో కొత్తింట్లో ఎక్కువ రోజులు ఉండలేదు. అందుకని నా ఇల్లు నాకే కొత్తగా అనిపిస్తోంది. కానీ, ఎంతైనా సొంత గూటిలో ఉంటే ఆ కంఫర్టే వేరబ్బా’’ అని పేర్కొన్నారు. గతేడాది విడుదలైన ‘బాజీరావ్ మస్తానీ’ తర్వాత ప్రియాంక వేరే హిందీ చిత్రాలు ఒప్పుకోలేదు. ఇప్పుడు విదేశీ కమిట్మెంట్స్ లేవు కాబట్టి, హిందీ చిత్రాలు సైన్ చేయాలనుకుంటున్నారట. ముంబయ్ వచ్చీ రాగానే తనకోసం ఎదురు చూస్తున్న దర్శకులకు, రచయితలకు కథలు చెప్పడానికి అపాయింట్మెంట్ ఇచ్చేశారట. -
ఒబామాతో ప్రియాంక డిన్నర్
న్యూయార్క్: ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆమెకు వైట్ హౌస్ నుంచి డిన్నర్‌కు ఆహ్వానం అందింది. ప్రతి ఏటా ఒక సాధారణ డిన్నర్ కార్యక్రమాన్ని నిర్వహించడం అమెరికా శ్వేతభవనం పాటిస్తున్న ఆనవాయితీ. ది నాన్ ఫ్రాఫిట్ వైట్ హౌజ్ కరస్పాండెంట్ అసోసియేషన్ ప్రతి ఏటా ఒక డిన్నర్ నిర్వహిస్తుంటుంది. ఈ అసోసియేషన్ లో రిపోర్టర్లు, నిర్మాతలు, కెమెరా ఆపరేటర్లు, జర్నలిస్టులు ఉంటారు. జర్నలిజంలో స్కాలర్ షిప్పులు అందజేసేందుకు కావాల్సిన డబ్బుకోసం వైట్ హౌజ్ తరపున ఈ డిన్నర్‌కు ఆహ్వానిస్తుంటారు. అందులో భాగంగానే ఇప్పటికే క్వాంటికో అనే టీవీ కార్యక్రమంతోపాటు బే వాచ్ అనే హాలీవుడ్ చిత్రంలో నటిస్తూ అందరి దృష్టిని ఆకర్షించిన ప్రియాంకను వారు డిన్నర్‌కు ఆహ్వానించారు. ఈ విందు కార్యక్రమంలో అధ్యక్షుడు బరాక్ ఒబామాతోపాటు, మిషెల్లీ ఒబామా కూడా పాల్గొంటారు. ప్రియాంకతోపాటు ఇతర హాలీవుడ్ నటులు బ్రాడ్లీ కూపర్, ల్యూసీ లియూ, జేన్ ఫాండా, గ్లేడీస్ నైట్ కూడా ఈ విందుకు హాజరవుతారు. -
చిరాకు పడుతున్న స్టార్ హీరోయిన్!
లాస్ ఏంజెలిస్: బాలీవుడ్ నుంచి హాలీవుడ్ స్థాయికి ఎదిగిన హీరోయిన్ ప్రియాంక చోప్రా. అయితే, ఈ మధ్య ఆమె కాస్త చిరాకు పడుతోందట. అసలు కారణం ఏంటని ఆరాతీస్తే.. ఓ చిన్న విషయంలో ఆమె అప్ సెట్ అయినట్లు తెలిసింది. తనను కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం చేయవద్దని, తనపై ఆ ముద్ర ఉండటం ఇష్టం లేదని పేర్కొంది. భారతీయ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ గా తనను గుర్తించాలని.. అంతేకానీ, కేవలం ఓ ప్రాంతానికి చెందిన ఇండస్ట్రీకి ఆమె పరిధిని నిర్ణయించడం ఆమెకు నచ్చడం లేదని చెబుతోంది. 'క్వాంటికో' సీరీస్‌తో సిరీస్ తో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ మాజీ ప్రపంచ సుందరి 1990లలో సూపర్ హిట్ అయిన టీవీ సిరీస్ 'బేవాచ్' పేరుతో తెరకెక్కిస్తోన్న సినిమాలో విలన్ రోల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హాలీవుడ్ లోనూ మంచి మార్కులు కొట్టేసిన ప్రియాంక బాలీవుడ్ అనే 'మార్క్' పైనే అసహనం అంటూ పేర్కొంది. ఇందుకు ఉదాహరణగా... హాలీవుడ్ నటులను ఫ్రెంచ్ నటుడు, స్పెయిన్ స్టార్ అంటూ ప్రత్యేకంగా పిలవరని ఈ సుందరి చెప్పుకొచ్చింది. అక్కడ లేని ఈ తీరు భారత్ లో మాత్రం ఎందుకు కనిపిస్తోందంటూ ప్రియాంక ప్రశ్నించింది. -
బాలీవుడ్ భామను హాలీవుడ్ స్టార్ తెగ పొగిడేశాడు!
లాస్ ఏంజెలిస్: నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రల్లో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా చాలా బాగా నటించగలదని హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్ (రాక్ గా అందరికీ తెలుసు) పేర్కొన్నాడు. బాలీవుడ్ సుందరి ఇటీవలే హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అమెరికాలోని టీవీ ప్రోగ్రామ్ 'క్వాంటికో' సీరీస్‌తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఆ వెంటనే ఈ బాలీవుడ్ హీరోయిన్ మరో హాలీవుడ్ ప్రాజెక్ట్‌కు సిద్ధం అవుతోంది. 1990లలో సూపర్ హిట్ అయిన టీవీ సిరీస్ 'బేవాచ్' ఆధారంగా అదే పేరుతో తెరకెక్కిస్తోన్న సినిమాలో విలన్ రోల్లో కనిపించనుంది. ఈ విషయంపై ఆ మూవీలో లీడ్ రోల్లో నటిస్తున్న డ్వేన్ జాన్సన్ అభిమానులతో మరిన్ని ముచ్చట్లు షేర్ చేసుకున్నాడు. మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక బాలీవుడ్లో నెగెటివ్ రోల్ తోనే ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అన్నీ లీడ్ రోల్స్ మాత్రమే చేస్తూ వచ్చింది. చాలా ఏళ్ల తరువాత మరోసారి హాలీవుడ్లో నెగెటివ్ రోల్ లో కనిపించనుంది. ఆమె విలన్ రోల్ లో నటిస్తుండటంపై డ్వేన్ జాన్సన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచంలోని బిగ్గెస్ట్ స్టార్స్ లో ప్రియాంక ఒకరని పేర్కొన్నాడు. ఆమె చాలా తెలివైన నటి, ఈ మూవీకి ప్రియాంక ఫర్ఫెక్ట్ గా సరిపోతుందని పొగిడేశాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా వచ్చే వారం నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. డేవిడ్ హాస్సెల్ హోఫ్, పమేలా అండర్సన్ తదితర స్టార్స్ ఇందులో కనిపించనున్నారు. కాలిఫోర్నియా లోని లాస్ ఏంజెలిస్ బీచ్ లల్లో పనిచేసే సెక్యూరిటీ గార్డ్స్, పోలీసులను కథాంశంగా తీసుకుని 'బేవాచ్' చిత్రీకరించనున్నట్లు డ్వేన్ జాన్సన్ వెల్లడించాడు. -
మరో హాలీవుడ్ ప్రాజెక్టులో ప్రియాంక
క్వాంటికో సీరీస్‌తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మరో హాలీవుడ్ ప్రాజెక్ట్‌కు రెడీ అవుతోంది. 1990లలో సూపర్ హిట్ అయిన టీవీ సీరిస్ బేవాచ్ ఆధారంగా అదే పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో విలన్ రోల్లో నటిస్తోంది. ఈ విషయాన్ని ఆ మూవీలో లీడ్ రోల్లో నటిస్తున్న డెయాన్ జాన్సన్ ఆన్ లైన్ వీడియోలో ప్రకటించారు. బాలీవుడ్లో నెగెటివ్ రోల్ తోనే ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక.. తరువాత మాత్రం పాజిటివ్ పాత్రలే చేస్తూ వచ్చింది. ఇన్నేళ్ల తరువాత మరోసారి హాలీవుడ్లో విలన్ రోల్లో నటిస్తుండటం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. బాలీవుడ్ సినిమాల్లోనే స్విమ్ సూట్ అందాలతో అలరించిన ప్రియాంక హాలీవుడ్ బేవాచ్‌లో ఎలా కనిపిస్తోందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. -
ఆ భామకు అంత తీరికలేదట!
ముంబై: బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వైపు అడుగులు అడుగులు వేసి సక్సెస్ అయిన తార ప్రియాంక చోప్రా. క్వింటాకో సిరీస్ తో ఆమె గత కొన్ని నెలలుగా హాలీవుడ్ లో బిజీబిజీగా ఉంటున్న విషయం తెలిసిందే. వచ్చే నెలలో క్వింటాకో టీవీ షో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో 'జై గంగాజల్' మూవీలో నటిస్తోంది. దాదాపు ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. వచ్చే నెలలో విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రియాంక ఇందులో పోలీసు అధికారిణిగా, కీలక పాత్రలో కనిపించనుంది. దర్శకుడు ప్రకాశ్ ఝా 15 నిమిషాలు మాత్రమే కథ చెప్పగానే మాజీ ప్రపంచ సుందరి ఈ సినిమాకు ఓకే చెప్పిన విషయం తెలిసిందే. ఇటు బాలీవుడ్, అటు హాలీవుడ్ లో బిజీ షెడ్యూల్ కారణంగా 'జై గంగాజల్' మూవీ ప్రమోషన్లలో పాల్గోనే అవకాశం ఉన్నట్లు కనపించడం లేదు. సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసేందుకు ఆమె సిద్ధమైంది. అపహరణ్, రాజ్‌నీతి, అరక్షణ్, సత్యాగ్రహ లాంటి ఎన్నో సమాజ అంశాలు సమస్యలపై మూవీలు తీసిన ప్రకాశ్ ఝా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తొలిసారిగా ఈ మూవీలో కనిపించనున్నారు. నటుడు మనవ్ కౌల్ తో కలిసి ప్రకాశ్ ఝా ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ముంబై నగరంలో ప్రచారం చేస్తున్నారు. -
మొబైల్లో కొత్త షో!
కథానాయికగా వెండితెరపై దూసుకెళుతున్న ప్రియాంకా చోప్రా అమెరికన్ టీవీ సిరీస్ ‘క్వాంటికో’ ద్వారా బుల్లితెరపై కూడా తన సత్తా చాటుకున్నారు. ఇప్పుడీ బ్యూటీ మొబి-సిరీస్‌లో కూడా హల్చల్ చేయనున్నారు. అంటే.. మొబైల్ ఫోన్లో వచ్చే సిరీస్ అన్నమాట. ముంబైలో ఓ ఫ్లాట్లోనివసించే నలుగురు అమ్మాయిలు ఎదుర్కొనే సమస్యల నేపథ్యంలో ఈ సిరీస్ సాగుతుంది. ఆ నలుగురి అమ్మాయిలకు గార్డియన్‌గా ప్రియాంక స్పెషల్ రోల్ చేస్తున్నారు. అది మాత్రమే కాదు... ఈ సిరీస్‌ను ఆమే స్వయంగా నిర్మించడం విశేషం. ‘ఇట్స్ మై సిటీ’ పేరుతో రూపొంద నున్న ఈ సిరీస్ మొత్తం 14 ఎపిసోడ్స్‌గా సాగుతుంది. వారానికి రెండుసార్లు ప్రసారమవుతుంది. ‘‘ఈ సిరీస్ స్టోరీ నా నిజజీవితానికి దగ్గరగా ఉంటుంది. ఏదో సాధించాలనే తపనతో, ఎన్నో కలలతో ఒకప్పుడు నేను ముంబైలో అడుగుపెట్టిన రోజులు గుర్తుకొస్తు న్నాయి. నేను మాత్రమే కాదు... చాలామంది ఈ కథతో రిలేట్ అవుతారు. నేటి తరం వారికి స్ఫూర్తినివ్వాలనే ఆకాంక్షతోనే ఈ మొబి-సిరీస్ ప్లాన్ చేశాను. ఇవాళ మొబైల్ ఫోన్ లేని కుర్రకారు ఉండరు కదా. అందరూ మొబైల్లో చూడచ్చు’’ అని ప్రియాంకా చోప్రా పేర్కొన్నారు. -
ప్రియాంక చోప్రా డిజిటల్ ప్రయోగం
హాలీవుడ్ టీవీ సీరీస్ 'క్వాంటికో'తో అంతర్జాతీయ స్ధాయిలో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా. ఈ సిరీస్‌తో హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వటంతో పాటు ఎన్నో అవార్డులు రివార్డులను సొంతం చేసుకుంది. ఇదే జోష్‌లో సొంత గడ్డ మీద కూడా సత్తా చాటడానికి రెడీ అవుతోంది. 'క్వాంటికో' స్పూర్తితో ఇండియాలో కూడా ఓ సీరియల్‌ను నిర్మించాలని భావిస్తోంది ప్రియాంక చోప్రా. ఇటీవల పర్పల్ పెబల్ పిక్చర్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించిన ప్రియాంక చోప్రా, ఆ బ్యానర్లో మూడు ప్రాంతీయ చిత్రాలు ప్రారంభించింది. బోజ్పురిలో భమ్ భమ్ బోల్ రహామై, మరాఠిలో వెంటిలేటర్, పంజాబీలో ఓంకార్ సినిమాలను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటోంది. ఈ సినిమాలతో పాటు 'ఇట్స్ మై సిటీ' పేరుతో ఓ సీరియల్‌ను కూడా ప్రారంభిస్తోంది. అయితే ఈ సీరియల్‌ను ఏ టీవీ ఛానల్లో ప్రసారం చేయకుండా నేరుగా ప్రేక్షకులు డిజిటల్ టెక్నాలజీ సాయంతో మొబైల్ ఫోన్లో చూసుకునే వీలు కల్పించడానికి ప్రయత్నిస్తోంది. నెక్స్ జీటీవీ(nexGTV) మొబైల్ యాప్ ద్వారా సీరియల్‌ను నేరుగా మొబైల్ ఫోన్లో చూసే విధంగా ఏర్పాట్లు చేస్తోంది. ముంబైలో ఒకే ఫ్లాట్ లో నివసించే నలుగురు అమ్మాయిల కథతో రూపొందుతున్న ఈ సీరియల్లో, ప్రియాంక చోప్రా ఓ కీలక పాత్రలో నటించనుంది. -
ప్రియాంకకు అంతర్జాతీయ అవార్డు
హాలీవుడ్ టీవీ సిరీస్ క్వాంటికోతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్న ప్రియాంకచోప్రా మరో అరుదైన ఘనత సాధించింది. ఇప్పటికే ఈ టీవీ సిరీస్ అత్యంత ప్రజాదరణ కలిగిన టీవీ షోగా రికార్డ్ సృష్టిస్తుండగా, అందులో లీడ్ రోల్లో నటించిన ప్రియాంక నటనను ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్వాంటికో టీవీ సిరీస్‌తో మరోసారి వార్తల్లో నిలిచింది ప్రియాంక. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా భావించే పీపుల్స్ ఛాయిస్ అవార్డ్ 2016కు ప్రియాంక చోప్రా ఎంపికైంది. ఆన్లైన్ ఓటింగ్ ద్వారా నిర్వహించే ఈ కాంపిటీషన్లో హాలీవుడ్ స్టార్స్ ఎమ్మా రోబర్ట్స్, లీ మిచెల్, మార్షియాగే హార్డన్ లాంటి స్టార్స్‌ను వెనక్కి నెట్టి ప్రియాంక అవార్డ్ దక్కించుకుంది. ముఖ్యంగా హిందీలో సక్సెస్ఫుల్ సినిమాలతో ఆకట్టుకోవటంతో పాటు, ప్రియాంక నటించిన క్వాంటికో హాలీవుడ్లో ఘనవిజయం సాధించటంతో ఈ హాట్ బ్యూటీని పీపుల్స్ ఛాయిస్ అవార్డ్ వరించింది. తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది ప్రియాంక. అవార్డుతో తాను దిగిన ఫొటోను ట్వీట్ చేస్తూ తనకు ఓటు చేసినవారికి కృతజ్ఞతలు తెలియజేసింది. I am so fortunate!Thank U to everyone who voted for me at the #PCAs! My #PCManiacs-I am nothing without you!Big love pic.twitter.com/Omg31wG7oa — PRIYANKA (@priyankachopra) January 7, 2016