మరో హాలీవుడ్ ప్రాజెక్టులో ప్రియాంక | Priyanka Chopra joins cast of 'Baywatch' movie | Sakshi
Sakshi News home page

మరో హాలీవుడ్ ప్రాజెక్టులో ప్రియాంక

Published Wed, Feb 17 2016 10:46 AM | Last Updated on Tue, Aug 14 2018 3:48 PM

మరో హాలీవుడ్ ప్రాజెక్టులో ప్రియాంక - Sakshi

మరో హాలీవుడ్ ప్రాజెక్టులో ప్రియాంక

క్వాంటికో సీరీస్తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మరో హాలీవుడ్ ప్రాజెక్ట్కు రెడీ అవుతోంది. 1990లలో సూపర్ హిట్ అయిన టీవీ సీరిస్ బేవాచ్ ఆధారంగా అదే పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో విలన్ రోల్లో నటిస్తోంది. ఈ విషయాన్ని ఆ మూవీలో లీడ్ రోల్లో నటిస్తున్న డెయాన్ జాన్సన్ ఆన్ లైన్ వీడియోలో ప్రకటించారు.

బాలీవుడ్లో నెగెటివ్ రోల్ తోనే ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక.. తరువాత మాత్రం పాజిటివ్ పాత్రలే చేస్తూ వచ్చింది. ఇన్నేళ్ల తరువాత మరోసారి హాలీవుడ్లో విలన్ రోల్లో నటిస్తుండటం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. బాలీవుడ్ సినిమాల్లోనే స్విమ్ సూట్ అందాలతో అలరించిన ప్రియాంక హాలీవుడ్ బేవాచ్లో ఎలా కనిపిస్తోందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement