'నా కాళ్లు కోట్లు సంపాదిస్తున్నాయి' | Priyanka chopra About Her Body Transformation | Sakshi
Sakshi News home page

'నా కాళ్లు కోట్లు సంపాదిస్తున్నాయి'

Published Thu, Sep 15 2016 8:11 AM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM

'నా కాళ్లు కోట్లు సంపాదిస్తున్నాయి'

'నా కాళ్లు కోట్లు సంపాదిస్తున్నాయి'

బాలీవుడ్తో పాటు హాలీవుడ్ సినిమాతోనూ సత్తా చాటుతున్న హాట్ బ్యూటి ప్రియాంక చోప్రా, తన బ్రాండ్ ఇమేజ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సినిమాలతో పాటు పలు అంతర్జాతీయ సినీ వేదికల మీద కనిపించే ఈ బ్యూటి, సౌందర్యోపకరణాలు, బ్రాండెడ్ దుస్తులు, చెప్పులు, నెయిల్ పాలిష్లు వంటి ఎన్నో వస్తువులకు అంబాసిడర్గా వ్యవహరిస్తోంది.

వరుస షూటింగ్లతో బిజీగా ఉన్న పీసీ డబ్ల్యూ మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కాళ్లకు సంబందించి ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకుంది. చిన్న వయసులో ప్రియాంకా టామ్ బాయ్ల ఉండటం వల్ల బాగా దెబ్బలు తగిలేవట. అయితే అప్పట్లో శరీరాన్ని సుకుమారంగా చూసుకోవటం ఎంత అవసరమో తెలిసేది కాదని, కానీ ఇప్పుడు శరీరం విలువ తెలిసిందని చెప్పింది.

చిన్నతనంలో తన కాళ్లు అస్సలు అందంగా కనిపించేవి కావని, దెబ్బలు తగిలి, గీరుకు పోయిన ఇబ్బందిగా ఉండేవని తెలిపింది. అయితే ప్రస్తుతం తన కాళ్లు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాయని తెలిపింది. దాదాపు తన కాళ్లతోనే 15కు పైగా ఉత్పత్తులకు ప్రచారం చేస్తున్నంటూ మురిసిపోతోంది. ఈ ముంబై ముద్దుగుమ్మ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement