ఆ కంఫర్టే వేరబ్బా! | Meet Priyanka Chopra, the Bollywood actress | Sakshi
Sakshi News home page

ఆ కంఫర్టే వేరబ్బా!

Published Thu, Jun 2 2016 11:52 PM | Last Updated on Mon, Sep 4 2017 1:30 AM

ఆ కంఫర్టే వేరబ్బా!

ఆ కంఫర్టే వేరబ్బా!

సొంత ఇంట్లో లైట్ స్విచ్‌లు, ఫ్యాన్ స్విచ్‌లు వెతుక్కోవడం, వంట గదిలో పంచదార, ఉప్పు ఎక్కడున్నాయో వెతుక్కోవడం అంటే.. ఆ ఇంటి యజమానిలా కాదు.. గెస్ట్‌లా ఉన్నట్లే. ప్రస్తుతం ప్రియాంకా చోప్రా పరిస్థితి అదే. అమెరికన్ టీవీ సిరీస్ ‘క్వాంటికో’, హాలీవుడ్ చిత్రం ‘బేవాచ్’ షూటింగ్స్‌లో భాగంగా ఈ మధ్య ఆమె ఎక్కువగా అమెరికాలోనే ఉన్నారు. ‘బేవాచ్’ షూటింగ్ ముగిసింది. ‘క్వాంటికో’ రెండో సీజన్ చిత్రీకరణ ఆరంభం కావడానికి ఇంకాస్త టైమ్ పడుతుంది. అందుకని అమెరికా నుంచి ముంబయ్ వచ్చేశారామె. వచ్చీ రావడంతోనే తాను ఈ మధ్య కొత్తగా కట్టుకున్న ఇంటిని మురిపెంగా చూసుకున్నారట.

‘‘ఇలా గృహప్రవేశం అయ్యానో లేదో అలా షూటింగ్స్ కోసం విదేశాలు వెళ్లిపోయాను. దాంతో కొత్తింట్లో ఎక్కువ రోజులు ఉండలేదు. అందుకని నా ఇల్లు నాకే కొత్తగా అనిపిస్తోంది. కానీ, ఎంతైనా సొంత గూటిలో ఉంటే ఆ కంఫర్టే వేరబ్బా’’ అని పేర్కొన్నారు. గతేడాది విడుదలైన ‘బాజీరావ్ మస్తానీ’ తర్వాత ప్రియాంక వేరే హిందీ చిత్రాలు ఒప్పుకోలేదు. ఇప్పుడు విదేశీ కమిట్‌మెంట్స్ లేవు కాబట్టి, హిందీ చిత్రాలు సైన్ చేయాలనుకుంటున్నారట. ముంబయ్ వచ్చీ రాగానే తనకోసం ఎదురు చూస్తున్న దర్శకులకు, రచయితలకు కథలు చెప్పడానికి అపాయింట్‌మెంట్ ఇచ్చేశారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement