comfort
-
సౌశీల్యం అంటే,,?
రాముడి పదహారు గుణాలలో ప్రత్యేక గుణం అని చెప్పదగినది సౌశీల్యం. శ్రీరామచంద్రుడు అరణ్యవాసానికి బయలుదేరి వెడుతున్నప్పుడు గుహుడి రాజ్యంలో ప్రవేశించాడు. అప్పుడు గుహుణ్ణి ‘‘ఆత్మవత్సఖః’’ అంటాడు. అంటే గుహుడు రాముడికి ఎంత అంటే తనతో సమానమైన వాడు. అరమరికలు లేకుండా ఎవరితో ఉండ గలడో అతడు. రాముడు వస్తున్నాడని తెలిసి గుహుడు వద్ధులైన మంత్రులతో కలిసి రాముడికి ఎదురు వెళ్ళాడు స్వాగతం చెప్పటానికి. రాముడు తానే ముందుగా అతడిని పలుకరించి కౌగిలించుకున్నాడు. రాముడు చక్రవర్తి కుమారుడు. గుహుడు సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఒక సామాన్యమైన వనచర రాజ్యానికి అధిపతి మాత్రమే. రాముడికి అటువంటి భేదాలు లేవు. రాముడికి పట్టాభిషేకం అని ప్రకటించిన తరువాత సుమంత్రుడు రాముడి అంతఃపురంలో ప్రవేశించటానికి అనుమతి అడుగుతుంటే అటువంటిది అవసరం లేదు అంటాడు. తాను కాబోయే రాజు అయినా చిన్నతనం నుండి ఎత్తుకుని ఆడించిన వాడు కనుక తారతమ్యం చూపించ లేదు. జటాయువుని పక్షి అని చూడకుండా అంత్యక్రియలు నిర్వర్తించాడు. దశరథుడు కూడా అటువంటి సౌశీల్యం కలవాడు కనుకనే జటాయువుతో మైత్రి నెర΄ాడు. దేవతలు దశరథుడితో మైత్రి కలిగి ఉండటానికి ఈ గుణమే కారణమేమో! కృష్ణ సుధాముల మైత్రి కూడా ఇటువంటిదే. పైగా కుచేలుడుగా ప్రఖ్యాతి పోందిన సుధాముడు కృష్ణుడి ఐశ్వర్యాన్ని చూసి చనువుగా ఉండటానికి కొంచెం సందేహిస్తుంటే, తానే ఎదురు వెళ్ళి, తీసుకు వచ్చి, కాళ్ళు కడిగి, సకల మర్యాదలు చేసి, అతడిలో ఉన్న ఆ కాస్త బెరుకుని పోగొట్టటానికి గురుకులంలో గడిపిన కాలాన్ని గుర్తు చేస్తాడు. పైగా అతడికి ఏమీ ఇచ్చి పంపలేదు వెళ్లేటప్పుడు. అతడి లేమిని ఎత్తి చూపి, తన ఆధిక్యం చూపించుకున్నట్టు అవుతుంది అని. ఇంటికి చేరే సరికి గుట్టు చప్పుడు కాకుండా అన్నీ సమకూర్చాడు. ఎంతటి సౌశీల్యం! దీనికి భిన్నమైన ఉదాహరణలు కూడా ఉన్నాయి. ద్రుపదుడు విద్యాభ్యాస సమయంలో ఇచ్చిన మాట తప్పి తనను చూడటానికి వచ్చిన ద్రోణుణ్ణి అవమాన పరుస్తాడు. తగిన ఫలం అనుభవించాడు. లోకంలో తరచుగా ఇటువంటివారే ఎక్కువగా కనపడుతూ ఉంటారు. స్నేహానికి కూడా అంతస్తు చూస్తారు. అవసరానికి స్నేహం నటించటం ఉంటుంది. పని అయిపోయిన తరువాత అంతకు ముందు ఉన్న సుహద్భావం కనపడదు. అవసరం వచ్చి నప్పుడు అడ్డు రాని అంతస్తులు, హోదాలు, పదవులు, ఆర్థిక వ్యత్యాసాలు అప్పుడు కనపడతాయి. మరొక ప్రధానమైన గుణం – మిత్రులు తక్కువ స్థాయిలో ఉన్నారు కనుక వారిని తమ స్థాయికి తీసుకు రావటానికి ప్రయత్నం చేయరు. అంటే, వారి స్థాయిని గుర్తించినట్టే కదా! అది వారిని అవమానించినట్టే అవుతుంది. వారు ఉన్న స్థితి వారికి నచ్చినది, తప్తి కలిగించేది. వారికి కావలసినది ప్రేమ, ఆత్మీయత, ఆదరణ. దానిని చూపించటమే సౌశీల్యం. ఈ లక్షణం ఎంత అపురూపమో కదా! – డా. ఎన్. అనంత లక్ష్మి‘‘మహతః మందై స్సహ నీరంధ్రేణ సంశ్లేషః సౌశీల్యం’’ జాతి చేత విద్య చేత ఐశ్వర్యం చేత చాలా గొప్పవాడైనా తన కంటే తక్కువ వారితో అరమరికలు లేక కలిసి ఉండటం సౌశీల్యం.ఒక్కసారి మైత్రి ఏర్పడిన తరువాత అది జిడ్డు లాగా అంటుకు పోతుంది. అందుకే దానిని స్నేహం అన్నారు. స్నేహం అంటే నూనె, పట్టుకుంటే వదలని జిడ్డు అని అర్థం. చిన్నతనంలో ఇటువంటి తేడాలు తెలియవు కనుక అందరితో కలిసి మెలిసి ఉంటారు. ఎదుగుతున్న కొద్ది దూరం జరగుతూ ఉంటారు. కానీ, సజ్జనులు అటువంటి భావాలని దారికి రానీయరు. -
అమ్మా... నా పేరు గుర్తుందా?
తల్లిని కౌగిలించుకొని కూతురు ఏడ్చింది. ఆ తల్లి కూతురిని ఓదారుస్తున్న వీడియో వైరల్ అయింది. దశాబ్దకాలంగా డిమెన్షియాతో బాధ పడుతోంది తల్లి. తన ముందు మరో వ్యక్తి ఉన్నట్లుగానే భావిస్తుంది తప్ప తన కూతురుకు సంబంధించిన విలువైన జ్ఞాపకాలేవీ ఆ తల్లిలో లేవు. అయినప్పటికీ సహజాతమైన తల్లి ప్రేమతో... ఏడుస్తున్న కూతురిని ఓదార్చుతుంది. ఇది ఏ దేశంలో వీడియో అయితేనేం?అందరూ కనెక్ట్ అయ్యి కన్నీళ్లు తెచ్చుకునే వీడియోగా మారింది.‘దే నెవర్ ఫర్గెట్ లవ్’ క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో ΄ోస్ట్ చేసిన ఈ వీడియో క్లిప్ వైరల్‌గా మారింది. కామెంట్ సెక్షన్ కన్నీళ్లతో తడిసి΄ోయింది. ఈ వైరల్ వీడియో క్లిప్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది కూతుళ్లు, కుమారులు అనారోగ్యం బారిన పడిన తమ తల్లిని గుర్తు తెచ్చుకుంటూ బాధపడ్డారు.‘నీ పేరు గుర్తుకు రావడం లేదు అని అమ్మ అన్నప్పుడు ఎంతో బాధగా అనిపించింది’ అని ఒక కుమారుడు అలై్జమర్స్ బారిన పడిన తన తల్లి గురించి బాధపడ్డాడు. ఇది చూసి ఒక యూజర్ – ‘తల్లిప్రేమ అనేది జ్ఞాపకం కాదు. అది శాశ్వతం’ అని కామెంట్ పెట్టాడు. -
Ramayana and Indian poetry: వాటిని ఎందుకు చదవాలి?
మనిషి జీవితంలో సంతరించుకోవలసిన గొప్ప గుణాలను గురించి గురజాడ అప్పారావుగారు ఒకచోట ఇలా అన్నారు... ‘‘ ఈవియుదియ్యని మాటయు భావంబున జేయతగిన పనితెలియుటయున్ ఠీవియగు ధైర్యభావము రావు సుమీ యొకని వలన రావలె తనతోన్’’... ఈవియు .. అంటే త్యాగం. మనిషి తనకుతాను సుఖపడితే తప్పుకాదు. మనిషి త్యాగంతో గొప్పవాడు అవుతాడు. ఇతరుల గురించి ఆలోచించి, వాళ్ళను కష్టాల్లోంచి పైకి తీసుకురావడానికి.. తాను ఎంత శక్తిని వినియోగించుకోగలడో, అంత శక్తినీ, ఏ విధమైన గుర్తింపునీ కోరకుండా అది తన కర్తవ్యం అన్న భావనతో ప్రేమ భావనతో చేయదగిన వ్యక్తి ఎవరున్నారో ఆయన త్యాగశీలి. అటువంటి మహానుభావులు ఎందరో పుట్టకపోతే అసలీ దేశానికి స్వాతంత్య్రం ఎలా సిద్ధించి ఉండేది? మన దగ్గర విషయమే తీసుకుంటే... బెజవాడ గోపాలరెడ్డి గారు పుట్టుకతో శ్రీమంతుడయినా దేశంకోసం చాలా శ్రమించాడు, చివరకు జైళ్ళకు కూడా వెళ్ళాడు. ఆయనకేం కర్మ! అలాగే టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆరోజుల్లో లక్షల సంపాదన ఉన్న న్యాయవాద వృత్తిని వదిలి దేశంకోసం సర్వస్వం ధారపోశారు. స్వాతంత్య్రోద్యమ విశేషాలను, సందేశాలను ప్రజలకు చేరవేయడానికి తన స్వార్జితంతో ‘స్వతంత్ర’ పత్రిక నడిపారు. లక్షలు ఖర్చుపెట్టారు... అటువంటి వారిది త్యాగమయ జీవితం. అంటే... త్యాగం మనిషిని శాశ్వతమైన కీర్తికి అర్హుణ్ణి చేస్తుంది. తియ్యని మాటలు మాట్లాడడం ఒక మంచి సంస్కారం. తిరస్కరించవలసి వచ్చిన సందర్భాల్లోనూ ఎదుటివారిని నొప్పించకుండా మృదువుగా మాట్లాడగలగాలి. హనుమ నూరు యోజనాల సముద్రాన్ని దాటిపోతున్నప్పుడు మార్గమధ్యంలో మైనాకుడు తన ఆతిథ్యం స్వీకరించి వెళ్ళాలని కోరితే... కటువుగా తిరస్కరించలేదు. ‘‘నాయనా! రామకార్యం మీద పోతున్నాను. వేళ మించిపోతోంది. నీవు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే, నేను పుచ్చుకున్నట్లే...’’ అంటూ మృదువుగా చేతితో స్పృశించి వెళ్ళాడు తప్ప... ఎక్కడా కటువుగా మాట్లాడలేదు. రామాయణ భారతాది కావ్యాలు ఎందుకు చదవాలంటే... మాట మధురంగా ఉండడం కోసం, సంస్కారవంతమైన వాక్కు తయారవడం కోసం, మాట పదిమందికి పనికొచ్చేదిగా ఉండడం కోసం చదువుకుంటారు. ఎవ్వరికీ ఉపకారం చేయలేకపోవచ్చు. మనం చెప్పే ఓదార్పు మాటలు ఎదుటి వాళ్ళకు స్వాంతన కలిగిస్తాయి. చెడు మార్గంలో ఉన్న వాళ్లను మంచిమార్గం వైపు మళ్ళిస్తాయి. భావంబున చేయదగిన పనిచేయుటయున్... భావం మనోగతం. తాను ఏ పనిచేయాలో ఆ పనినే మనసు తనకు జ్ఞాపకం చేస్తూ ఉంటే ఆ వ్యక్తి గొప్ప శీలవంతుడవుతాడు. అటువంటి సౌశీల్యం ఉండాలి. ఠీవియగు ధైర్య భావము... ఠీవి అంటే వైభవం.. పిరికితనం చూపకుండా తెగువ, పోరాట పటిమ చూపే సందర్భంలో కాకుండా... ఇక్కడ ధైర్యం అంటే... ఎంత కష్టం కలిగినా ఓర్చుకుని నిలబడి ప్రయత్నాన్ని కొనసాగించి కృతకృత్యులు కావడం.. ఆయన ధైర్యశాలి. ఆ ధైర్యం వైభవోపేతం... ఇటువంటి గొప్పగుణాలు జన్మతః లేకపోయినా ప్రతివారూ ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవాలి. -
శతక నీతి..కలిసుంటే కలదు సుఖం
దూరకుమీ బంధుజనుల.. అంటే బంధువులను దూషిస్తూ వారిని దూరం చేసుకోవద్దంటున్నారు బద్దెన. రామాయణంలో వాలిసుగ్రీవులు అన్నదమ్ములు. ఇద్దరూ బతికున్నంతకాలం దెబ్బలాడుకున్నారు. ఆఖరికి వాలి చచ్చిపోయాడు. సుగ్రీవుడు ఏడ్చాడు. ఏం ఉపయోగం? రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు అన్నదమ్ములు. విభీషణుడు చెప్పాడు, కుంభకర్ణుడూ చెప్పాడు... అయినా రావణాసురుడు వినలేదు. రావణుడు, కుంభకర్ణుడూ ఇద్దరూ మరణించారు. విభీషణుడు ఒక్కడే మిగిలిపోయాడు. ఎంత ఏడిస్తే మాత్రం ఆ అన్నదమ్ములు తిరిగొస్తారా !!! ఎందరో చెప్పారు... స్వయంగా ధర్మరాజు చెప్పాడు, చిట్టచివరకు శ్రీ కృష్ణరాయబారం సమయంలో భీముడు కూడా చెప్పాడు. ‘‘మనం ఐదుగురం. ఆ దుర్యోధనాదులు నూరుగురు. అందరం అన్నదమ్ములం. పెదతండ్రి, పినతండ్రి పిల్లలం. మేం దెబ్బలాడుకోవడమేమిటి? మా మధ్య యుద్ధాలేమిటి? మాకు సాయం చేయడానికి దేశంలో రాజులందరూ రెండు పక్షాలుగా విడిపోవడమేమిటి? 18 అక్షౌ హిణులతో మారణ హోమం ఏమిటి ? ఎందుకీ అన్నదమ్ముల కలహాలు...వద్దు... అందరం కలిసుందాం’’ అన్నాడు.. ధర్మరాజు,అర్జునుడు, నకులుడు, సహదేవుడు, గాంధారి, ధృతరాష్ట్రుడు, విదురుడు, అప్పుడక్కడికి వచ్చిన వ్యాసుడు, మైత్రేయుడు చెప్పారు. ఇంతమంది రుషులు, పెద్దలు, మంత్రులు, తండ్రి... ఎందరు చెప్పినా దుర్యోధనుడు వినలేదు. తమ్ముళ్ళమీద, అన్నగారు ధర్మరాజు మీద యుద్ధమే చేస్తానన్నాడు. చిట్టచివరకు తొడలు విరిగి యుద్ధభూమిలో పడిపోతే చనిపోబోయేముందు రాబందులు, గద్దలు పైన ఎగురుతుంటే... అప్పుడు ఏడ్చాడు. మహానుభావుడు, మా పినతండ్రి విదురుడు చెప్పిన మాట వినలేదు. అలా విని ఆ ఐదుగురితో సఖ్యంగా ఉంటే ఈవేళ అఖండ సామ్రాజ్యాన్ని పాలిస్తూ ఎంత గొప్పగా ఉండేవాళ్ళమో... మేం 105 మందిమి కలిసి ఉంటే... మాకు కీడు తలపెట్టడానికి మా వైపు కన్నెత్తి చూడగల వారెవరయినా ఉండేవారా? అది లేకపోగా నా తమ్ముళ్ళను నేనే చంపుకున్నా...పెద్దలు భీష్ముడు, ద్రోణుడు వంటి వారి మరణానికి నేనే కారణమయ్యా. ఆఖరుకు బంధువులతో గొడవలు పెట్టుకుని ఏం సాధించాను ?...అంటూ చిట్టచివరన ఏడ్చాడు... ఏం లాభం.. ఆఖరికి మరణించాడు. అయినవారు అందరూ మరణించారని మిగిలిన ఐదుగురు కూడా ఏడ్చారు. పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు. నా కూతురుగా రమ్మని కోరుతూ దక్షప్రజాపతి తపస్సు చేస్తే ఆయనకు కూతురయి దాక్షాయణి అని పేరు పెట్టుకుంది. మామా అల్లుళ్ళు కలిసి ఉండాల్సిన వాళ్లు. అక్కర్లేని గొడవలకు వెడితే... నిండు సభలో శివుడిని అవమానించాడు. అల్లుడిని ఇంత అమర్యాద చేసిన వాడివి ఇంక నీకు గౌరవం ఉండమంటే ఎక్కడుంటుంది.. ఇక నీ కూతురుగా ఉండలేను అంటూ దాక్షాయణి యోగాగ్నిలో దూకేసింది. శంకరుడికి కోపమొచ్చింది. దక్ష ప్రజాపతికి తలకాయ పోయింది. గొర్రె తలకాయతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. శివపార్వతుల శక్తేమిటో తెలుసుకోలేక కేవలం అల్లుడన్న చిన్నచూపుతో అంతటి ఉపద్రవాన్ని కొనితెచ్చుకున్నాడు. కాబట్టి బంధువులు దెబ్బలాడుకోకూడదు. ఎప్పుడూ ప్రేమానురాగాలతో ఉండాలి. ఒకరిమీద ఒకరు అదేపనిగా దోషాలు, లోపాలు ఎంచే ప్రయత్నం చేయడం, చాడీలు చెప్పుకోవడం, ఫిర్యాదులు చేసుకోవడం, కేసులు పెట్టుకోవడం ఎన్నటికీ మంచి పద్ధతి కాదు. రామాయణం చదవండి, భాగవతం చదవండి, భారతం చదవండి.. అప్పటినుంచి ఇప్పటివరకు ఎన్నోసార్లు నిరూపితమయిన సత్యం ఇది. మేం 105 మందిమి కలిసి ఉంటే... మాకు కీడు తలపెట్టడానికి మా వైపు కన్నెత్తి చూడగల వారెవరయినా ఉండేవారా? అది లేకపోగా నా తమ్ముళ్ళను నేనే చంపుకున్నా.. పెద్దలు భీష్ముడు, ద్రోణుడు వంటి వారి మరణానికి నేనే కారణమయ్యా. ఆఖరుకు బంధువులతో గొడవలు పెట్టుకున ఏం సాధించాను? -
చిదంబరానికి ఊరట
న్యూఢిల్లీ: ఎయిర్‌సెల్–మ్యాక్సిస్ కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరంనకు ఊరట లభించింది. ఆయన్ను ఆగస్ట్ 7వ తేదీ వరకు అరెస్ట్ చేయరాదంటూ సీబీఐ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అదే విధంగా ఈ కేసుకు సంబంధించి చిదంబరం పెట్టుకున్న దరఖాస్తుకు 3 వారాల్లోగా బదులివ్వాలని స్పెషల్ కోర్టు జడ్జి సీబీఐను ఆదేశించారు. ఎయిర్‌సెల్–మ్యాక్సిస్ కేసులో చిదంబరంతోపాటు ఆయన కొడుకు కార్తీపై సీబీఐ చార్జిషీటు వేసింది. దీంతో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. విదేశాలకు వెళ్లేందుకు కార్తీకి అనుమతి ఎయిర్‌సెల్–మ్యాక్సిస్, ఐఎన్ఎక్స్ మీడియా కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న చిదంబరం కొడుకు కార్తీ విదేశాలకు వెళ్లేందుకు సుప్రీంకోర్టు ఓకేచెప్పింది. వ్యక్తిగత కారణాల రీత్యా ఈనెల 23 నుంచి 31వ తేదీ వరకు బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికాలకు వెళ్లేందుకు కోర్టు షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసింది. చిదంబరం కుటుంబంపై అసంతృప్తి సాక్షి ప్రతినిధి, చెన్నై: విదేశాల్లో ఉన్న ఆస్తుల వివరాలను దాచిన కేసులో చిదంబరం కుటుంబం విచారణకు హాజరు కాకపోవడాన్ని చెన్నై ఎగ్మూరు న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భార్య నళిని, కొడుకు కార్తీ, కోడలు శ్రీనిధిలకు బ్రిటన్, అమెరికాలో ఉన్న ఆస్తులకు సంబంధించి నల్లధనం చట్టం కింద ఐటీ శాఖ కేసు వేసింది. ఈ కేసు సోమవారం విచారణకు రాగా ఆ ముగ్గురూ హాజరు కాలేదు. దీంతో వారిపై న్యాయమూర్తి మలర్విళి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈనెల 30వ తేదీన వారంతా తప్పనిసరిగా కోర్టుకు హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు. -
హెచ్–1బీ భాగస్వాములకు ఊరట
వాషింగ్టన్: హెచ్–1బీ వీసాదారుల భాగస్వాములను ఉద్యోగాల నుంచి తొలగించే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ట్రంప్ యంత్రాగం వెల్లడించింది. దీంతో పెద్ద సంఖ్యలో అక్కడ పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులు, వారి కుటుంబాలకు తాత్కాలికంగా ఊరట లభించినట్లయ్యింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్ఎస్) ప్రకటించింది. ‘హెచ్–4 వీసాల మీద వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న హెచ్–1బీ వీసాదారుల భాగస్వాములను ఉద్యోగాల నుంచి తొలగించే అంశంపై జూన్ వరకు ఏ నిర్ణయం తీసుకోం. ఈ నిర్ణయం దేశంపై ఆర్థికంగా ఎటువంటి ప్రభావం చూపుతుందనే దాన్ని పరిశీలించాల్సి ఉంది. అప్పటి వరకు హెచ్–1బీ భాగస్వాముల ఉద్యోగాలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు’ అని డీహెచ్ఎస్ వెల్లడించింది. 2015లో అప్పటి ఒబామా ప్రభుత్వం హెచ్–1బీ వీసాదారుల భాగస్వాములు, గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూసే వారి భార్యలు/భర్తలు అమెరికాలోని వివిధ కంపెనీల్లో హెచ్–4 డిపెండెంట్ వీసాల కింద పనిచేసేందుకు అవకాశం కల్పించింది. దాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి తొలగిస్తామని ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఇప్పుడు హెచ్–4 వీసాదారుల తొలగింపుపై నిర్ణయం తీసుకోలేదని అందుకు కొద్దిగా సమయం పడుతుందని తాజాగా ట్రంప్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ విధానంలో గణనీయమైన మార్పులు చేయాలని.. వాటిని ఆర్థికపరంగా కూడా విశ్లేషించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని డీహెచ్ఎస్ పేర్కొంది. ఇందుకు మరికొన్ని వారాలు పడుతుందని తెలిపింది. -
కొపాక్జోన్ పేటెంటుపై మైలాన్‌కు ఊరట
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొపాక్జోన్ ఔషధ పేటెంట్లకు సంబంధించి తెవా ఫార్మాస్యూటికల్స్‌తో వివాదంలో మైలాన్‌కు ఊరట లభించింది. ఈ ఔషధం 40 మి.గ్రా.ల మోతాదుకు సంబంధించి తెవాకు ఉన్న పేటెంట్లలో రెండు చెల్లవంటూ తమ భాగస్వామ్య సంస్థ మైలాన్‌కు అనుకూలంగా అమెరికా పేటెంట్ అండ్ ట్రేడ్‌మార్క్ ఆఫీస్ (పీటీవో) ఆదేశాలిచ్చిందని నాట్కో ఫార్మా వెల్లడించింది. మూడో పేటెంటుపై సెప్టెంబర్ 1 లోగా ఆదేశాలు రావొచ్చని పేర్కొంది. కేంద్ర నాడీమండల వ్యవస్థపై ప్రభావం చూపే మల్టిపుల్ స్లెరోసిస్ చికిత్సలో 20, 40 మి.గ్రా./మి.లీ. మోతాదుల్లో కొపాక్జోన్ (గ్లాటిరామెర్ ఎసిటేట్ ఇంజెక్షన్)ను ఉపయోగిస్తారు. ఈ ఔషధ జనరిక్ వెర్షన్ తయారీ, విక్రయాల కోసం నాట్కో, మైలాన్ కలిసి వీటి పేటెంట్లను సవాలు చేశాయి. ఒప్పందం ప్రకారం నాట్కో వీటిని సరఫరా చేస్తే.. అమెరికాలో మైలాన్ మార్కెటింగ్ చేస్తుంది. లాభాలను రెండు సంస్థలు పంచుకుంటాయి. 20 మి.గ్రా. ఫార్ములేషన్‌పై పలు పేటెంట్ల గడువు ముగిసిపోగా జనరిక్ వెర్షన్ తయారీ కోసం నాట్కోకు ఇంకా అనుమతులు రావాల్సి ఉంది. తాజాగా 40 మి.గ్రా. మోతాదుకు సంబంధించి 2 పేటెంట్ల విషయంలో అనుకూల ఆదేశాలు లభించినందున.. మూడో పేటెంటు అంశంలోనూ సానుకూల స్పందన రాగలదని మైలాన్, నాట్కో భావిస్తున్నాయి. -
ఆ కంఫర్టే వేరబ్బా!
సొంత ఇంట్లో లైట్ స్విచ్‌లు, ఫ్యాన్ స్విచ్‌లు వెతుక్కోవడం, వంట గదిలో పంచదార, ఉప్పు ఎక్కడున్నాయో వెతుక్కోవడం అంటే.. ఆ ఇంటి యజమానిలా కాదు.. గెస్ట్‌లా ఉన్నట్లే. ప్రస్తుతం ప్రియాంకా చోప్రా పరిస్థితి అదే. అమెరికన్ టీవీ సిరీస్ ‘క్వాంటికో’, హాలీవుడ్ చిత్రం ‘బేవాచ్’ షూటింగ్స్‌లో భాగంగా ఈ మధ్య ఆమె ఎక్కువగా అమెరికాలోనే ఉన్నారు. ‘బేవాచ్’ షూటింగ్ ముగిసింది. ‘క్వాంటికో’ రెండో సీజన్ చిత్రీకరణ ఆరంభం కావడానికి ఇంకాస్త టైమ్ పడుతుంది. అందుకని అమెరికా నుంచి ముంబయ్ వచ్చేశారామె. వచ్చీ రావడంతోనే తాను ఈ మధ్య కొత్తగా కట్టుకున్న ఇంటిని మురిపెంగా చూసుకున్నారట. ‘‘ఇలా గృహప్రవేశం అయ్యానో లేదో అలా షూటింగ్స్ కోసం విదేశాలు వెళ్లిపోయాను. దాంతో కొత్తింట్లో ఎక్కువ రోజులు ఉండలేదు. అందుకని నా ఇల్లు నాకే కొత్తగా అనిపిస్తోంది. కానీ, ఎంతైనా సొంత గూటిలో ఉంటే ఆ కంఫర్టే వేరబ్బా’’ అని పేర్కొన్నారు. గతేడాది విడుదలైన ‘బాజీరావ్ మస్తానీ’ తర్వాత ప్రియాంక వేరే హిందీ చిత్రాలు ఒప్పుకోలేదు. ఇప్పుడు విదేశీ కమిట్మెంట్స్ లేవు కాబట్టి, హిందీ చిత్రాలు సైన్ చేయాలనుకుంటున్నారట. ముంబయ్ వచ్చీ రాగానే తనకోసం ఎదురు చూస్తున్న దర్శకులకు, రచయితలకు కథలు చెప్పడానికి అపాయింట్మెంట్ ఇచ్చేశారట. -
సహారా చీఫ్ కు మరింత ఊరట!
♦ జూలై 11 వరకూ పెరోల్‌ను పొడిగించిన సుప్రీం కోర్టు ♦ సెబీకి రూ. 200 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశం... న్యూఢిల్లీ: సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్‌కు సుప్రీం కోర్టులో మరింత ఊరట లభించింది. తల్లి మరణం కారణంగా అంతిమ సంస్కారాలకు హాజరయ్యేందుకు వీలుకల్పిస్తూ చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్‌తో కూడిన ధర్మాసనం నాలుగు వారాలపాటు పెరోల్‌ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీంతో రాయ్‌తో పాటు గ్రూప్ డెరైక్టర్ అశోక్ రాయ్ చౌదరిలు ఈ నెల 6న జైలు నుంచి విడుదలయ్యారు. ఇప్పుడు ఈ పెరోల్‌ను జూలై 11 వరకూ పొడిగించేందుకు కోర్టు బుధవారం అంగీకరించింది. అయితే, స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి రాయ్, చౌదరిలు రూ.200 కోట్లు చెల్లించేందుకు వీలుగా ఈ వెసులుబాటు ఇస్తున్నట్లు సుప్రీం పేర్కొంది. సహారా గ్రూప్ కంపెనీలు ఇన్వెస్టర్ల నుంచి అక్రమంగా డిపాజిట్లు సమీకరించిన కేసులో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సుబ్రతా రాయ్ 2014 మార్చి నుంచి తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. కాగా, జూలై 11కల్లా రూ200 కోట్లు గనుక డిపాజిట్ చేయకపోతే మళ్లీ తీహార్ జైలుకి వెళ్లాల్సి వస్తుందని ధర్మాసనం తన ఆదేశాల్లో పేర్కొంది. పెరోల్‌పై బయట ఉన్న సమయంలో రాయ్, చౌదరిలు సహారా ఆస్తుల అమ్మకానికి వీలుగా ఔత్సాహిక కొనుగోలుదార్లను కలవొచ్చని సుప్రీం పేర్కొంది. అయితే, దేశంలోపలే ఉండటంతో పాటు పోలీస్ ఎస్కార్ట్లోనే ఎక్కడికైనా వెళ్లాలని స్పష్టం చేసింది. మరోపక్క, సహారా ఆస్తుల వేలానికి సంబంధించి సెబీ తన చర్యలను కొనసాగించవచ్చని ధర్మాసనం పేర్కొంది. బ్యాంక్ గ్యారంటీగా చెల్లించాల్సిన రూ.5,000 కోట్లు, బెయిల్ కోసం అదనంగా కట్టాల్సిన రూ.5,000 కోట్లను సమీకరించేందుకుగాను సహారా ఇతర ఆస్తుల అమ్మకం ప్రక్రియను చేపట్టవచ్చని సుప్రీం సూచించింది.