చిరాకు పడుతున్న స్టార్ హీరోయిన్! | Priyanka Chopra do not want bollywood mark | Sakshi

చిరాకు పడుతున్న స్టార్ హీరోయిన్!

Published Wed, Mar 23 2016 5:04 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

చిరాకు పడుతున్న స్టార్ హీరోయిన్! - Sakshi

చిరాకు పడుతున్న స్టార్ హీరోయిన్!

లాస్ ఏంజెలిస్: బాలీవుడ్ నుంచి హాలీవుడ్ స్థాయికి ఎదిగిన హీరోయిన్ ప్రియాంక చోప్రా. అయితే, ఈ మధ్య ఆమె కాస్త చిరాకు పడుతోందట. అసలు కారణం ఏంటని ఆరాతీస్తే.. ఓ చిన్న విషయంలో ఆమె అప్ సెట్ అయినట్లు తెలిసింది. తనను కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం చేయవద్దని, తనపై ఆ ముద్ర ఉండటం ఇష్టం లేదని పేర్కొంది. భారతీయ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ గా తనను గుర్తించాలని.. అంతేకానీ, కేవలం ఓ ప్రాంతానికి చెందిన ఇండస్ట్రీకి ఆమె పరిధిని నిర్ణయించడం ఆమెకు నచ్చడం లేదని చెబుతోంది.

'క్వాంటికో' సీరీస్తో సిరీస్ తో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ మాజీ ప్రపంచ సుందరి 1990లలో సూపర్ హిట్ అయిన టీవీ సిరీస్ 'బేవాచ్' పేరుతో తెరకెక్కిస్తోన్న సినిమాలో విలన్ రోల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హాలీవుడ్ లోనూ మంచి మార్కులు కొట్టేసిన ప్రియాంక బాలీవుడ్ అనే 'మార్క్' పైనే అసహనం అంటూ పేర్కొంది. ఇందుకు ఉదాహరణగా... హాలీవుడ్ నటులను ఫ్రెంచ్ నటుడు, స్పెయిన్ స్టార్ అంటూ ప్రత్యేకంగా పిలవరని ఈ సుందరి చెప్పుకొచ్చింది. అక్కడ లేని ఈ తీరు భారత్ లో మాత్రం ఎందుకు కనిపిస్తోందంటూ ప్రియాంక ప్రశ్నించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement