
కథానాయికగా పుష్కరం దాటినా దక్షిణాదిన స్టార్ హీరోయిన్‌లలో ఒకరిగా దూసుకెళుతున్నారు కాజల్ అగర్వాల్. బాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తున్న ఈ బ్యూటీ తాజాగా ఓ వెబ్ సిరీస్‌లో నటించేందుకు పచ్చజెండా ఊపారని సమాచారం. బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రాకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టిన అమెరికన్ వెబ్ సిరీస్ ‘క్వాంటికో’ ఇండియన్ వెర్షన్‌లో కాజల్ నటించనున్నారట.
‘క్వాంటికో’కి మంచి ప్రేక్షకాదరణ దక్కడంతో భారత్‌లోని పలు భాషల్లో వెబ్ సిరీస్‌గా రూపొందించేందుకు నెట్‌ఫ్లిక్స్ సన్నాహాలు చేస్తోందని టాక్. ప్రియాంక పాత్రకు కాజల్‌ని అడిగితే, ఆమె అంగీకరించారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రియాంకది బోల్డ్ క్యారెక్టర్. చాలా గ్లామరస్‌గా కనిపించారు. ఇండియన్ వెర్షన్‌లో కాజల్ కూడా గ్లామరస్‌గా కనిపిస్తారని ఊహించవచ్చు. ఆల్రెడీ తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు రుపొందిస్తున్న ఓ వెబ్ సిరీస్ నటిస్తున్నారు కాజల్ అగర్వాల్.
Comments
Please login to add a commentAdd a comment