ప్రియాంకా చోప్రా 'క్వాంటికో' సిరీస్‌పై కేసు | Priyanka Chopra Quantico faces legal problem over copied content | Sakshi
Sakshi News home page

ప్రియాంకా చోప్రా 'క్వాంటికో' సిరీస్‌పై కేసు

Published Sat, Oct 31 2015 10:37 AM | Last Updated on Sun, Sep 3 2017 11:47 AM

ప్రియాంకా చోప్రా 'క్వాంటికో' సిరీస్‌పై కేసు

ప్రియాంకా చోప్రా 'క్వాంటికో' సిరీస్‌పై కేసు

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రాను తొలిసారిగా హాలీవుడ్ బుల్లితెరకు పరిచయం చేస్తూ తెరకెక్కించిన టెలివిజన్ సిరీస్ క్వాంటికో. భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య ఇటీవల ప్రారంభమైన ఈ సిరీస్కు మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా ప్రియాంక నటన ఈ సీరియల్కు హైలైట్ అంటూ కితాబిస్తున్నారు హాలీవుడ్ విశ్లేషకులు. అయితే, హాలీవుడ్ బుల్లితెర మీద మోస్ట్ సక్సెస్ఫుల్ సిరీస్లలో ఒకటిగా పేరు తెచ్చుకుంటున్న క్వాంటికో సిరీస్ కాపీ అంటూ ఆరోపణలు వస్తున్నాయి.

1999లో సీఎన్ఎన్లో ప్రసారమైన ఓ అమెరికన్ సిరీస్లోని ఐడియాను ఎలాంటి అనుమతి లేకుండా క్వాంటికో సిరీస్ కోసం వినియోగించుకున్నారంటూ నిర్మాత మార్క్ గోర్డాన్ పై కేసు నమోదైంది. సిఎన్ఎన్లో ప్రసారమైన సీరియల్ ను తెరకెక్కించిన జెమ్మి హెల్మన్, బార్బరా లెబోవిట్జ్లు తన అభ్యంతరాలను తెలియజేస్తూ 35 పేజీల ఫిర్యాదును లాస్ ఏంజిల్స్లోని సుపీరియర్ కోర్ట్లో అందజేశారు.

ప్రియాంకా చోప్రా హాలీవుడ్ ఎంట్రీతో భారీ హైప్ క్రియేట్ అయిన ఈ టివి సిరీస్ ఎబిసి ఛానల్లో ప్రసారం అవుతోంది. ఎఫ్బిఐలో చేరిన కొంత మంది వ్యక్తుల కథగా ఈ సీరియల్ తెరకెక్కుతుంది. ఎఫ్బిఐ ట్రైనింగ్లో జాయిన్ కాకముందు వారి నేపథ్యంతో పాటు ట్రైనింగ్లో వారు ఎలా ఉన్నారు, ట్రైనింగ్ తరువాత ఎలాంటి ఆపరేషన్స్ ప్లాన్ చేశారు అన్నదే క్వాంటికో కథ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement