![Priyanka Co-Star Alan Powell Shared shocking Image - Sakshi](/styles/webp/s3/article_images/2017/12/6/priyanka.jpg.webp?itok=0YAvusne)
పరిచయం అక్కర్లేని పేరు... ప్రియాంక చోప్ర. మాజీ మిస్ వరల్డ్, బాలీవుడ్ అందాల తార, హాలీవుడ్ హాట్ స్టార్, ఐక్యరాజ్యసమితి గుడ్‌విల్ అంబాసిడర్‌గా తిరుగులేని ఐడెంటిటీ ప్రియాంక సొంతం. హాలీవుడ్‌లో నటించిన క్వాంటికో సీరియల్‌లో అమెరికన్ల మనసును కొల్లగొట్టింది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంకు.. ఫోన్‌కు మెసేజ్‌లు, ఈ మెయిల్స్ ఎన్ని వస్తుంటాయనే దానిపై చాలామందికి సందేహాలు ఉండడం సహజం. అదే సమయంలో ఎన్నింటికి ప్రియాంక రిప్లై ఇస్తుందనేది కూడా ఆసక్తికరం.
ప్రియాంకు సంబంధించిన ఈ ఆసక్తిర విషయంపై ఆమె సహచర నటుడు అలన్ పావెల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫొటో పోస్ట్ చేశారు. ప్రస్తుతంఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రియాంక చోప్రా ఫోన్ ఈ మెయిల్స్ ఇన్‌బాక్స్‌లో.. అక్షరాలా 2 లక్షల 57 వేల 623 చదవని మెయిల్స్ ఉన్నాయి. ఈ సంఖ్య చుట్టూ రెడ్‌మార్క్ వేసి మరీ అలెన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment