కామెడీ టీవీ సీరీస్లో స్టార్ హీరోయిన్స్ | Priyanka Chopra Developing Comedy Series About Madhuri Dixit | Sakshi
Sakshi News home page

కామెడీ టీవీ సీరీస్లో స్టార్ హీరోయిన్స్

Published Sun, Jul 30 2017 3:25 PM | Last Updated on Tue, Sep 5 2017 5:13 PM

కామెడీ టీవీ సీరీస్లో స్టార్ హీరోయిన్స్

కామెడీ టీవీ సీరీస్లో స్టార్ హీరోయిన్స్

త్వర‌లో హాలీవుడ్‌లో ఓ కామెడీ టీవీ సిరీస్ కోసం ప్రియాంక చోప్రా, మాధురీ దీక్షిత్‌లు క‌లిసి ప‌నిచేయ‌నున్నట్లు తెలుస్తోంది. ఈ టీవీ సిరీస్ మాధురీ దీక్షిత్ జీవితం ఆధారంగా తెర‌కెక్కిస్తున్నార‌నే వార్తలు కూడా వ‌స్తున్నాయి. ఇప్పటికే హాలీవుడ్‌లో 'క్వాంటికో' సిరీస్ ద్వారా యాక్షన్ యాంగిల్ చూపించిన ప్రియాంక‌, ఈ టీవీ సిరీస్ ద్వారా త‌న‌లోని కామెడీ కోణం చూపించ‌నుంది.

ఈ టీవీ సిరీస్‌కు ప్రియాంక చోప్రా, మాధురీ దీక్షిత్ లు కూడా నిర్మాత‌లుగా వ్యవ‌హ‌రించనున్నారు. ఈ సిరీస్ కోసం బాలీవుడ్ స్క్రీన్‌రైట‌ర్ శ్రీ రావు ప్రస్తుతం స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నారు. ఈ విష‌యాన్ని శ్రీ రావు త‌న ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ఇద్దరు గ్రేట్ యాక్టర్స్ నా నెక్ట్స్  ప్రాజెక్టు చేయ‌బోతున్నాను అంటూ మాధురీ, ప్రియాంక‌ల‌తో దిగిన ఫొటోను పోస్ట్ చేశాడు శ్రీరావ్. ఈ సీరీస్ ను క్వాంటికో ను టెలికాస్ట్ చేస్తున్న ఏబీసీ చానల్ ప్రసారం చేయనుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement