రహస్యంగా పెళ్లి చేసుకున్న నటి..? | Priyanka Chopra Mangalsutra Bracelet Raise More Doubts About Her Marriage | Sakshi
Sakshi News home page

రహస్యంగా పెళ్లి చేసుకున్న నటి..?

Published Mon, Apr 30 2018 5:44 PM | Last Updated on Mon, Apr 30 2018 7:57 PM

Priyanka Chopra Mangalsutra Bracelet Raise More Doubts About Her Marriage - Sakshi

ఈ మధ్యకాలంలో బాలీవుడ్‌లో ఎక్కువగా పెళ్లి కబుర్లే వినిపిస్తున్నాయి. గతేడాది డిసెంబర్ వరకు అనుష్క శర్మ- విరాట్‌ కోహ్లి పెళ్లి గురించి జరిగిన చర్చలు కాస్తా ఇప్పుడు సోనమ్‌ కపూర్‌ వివాహం వైపు మళ్లాయి. తాజాగా ఈ కోవలోకి మరో నటి చేరింది. ‘క్వాంటికో’ సిరిస్‌తో హలీవుడ్‌లో అడుగుపెట్టిన బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా ప్రస్తుతం హిందీ చిత్రాల్లో నటిచండం చాలా వరకూ తగ్గించేసింది. వరుస హలీవుడ్‌ చాన్స్‌లతో బిజీగా ఉన్న ప్రియాంకను అసోం ప్రభుత్వం రాష్ట్ర టూరీజం ప్రచారకర్తగా నియమించింది. ఈ సందర్భంగా అసోం పర్యాటక రంగంపై ప్రచారం చేయడానికి ప్రియాంక చాలా కాలం తర్వాత స్వదేశానికి వచ్చింది. ఈ ప్రయాణంలో తీసిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. అది కాస్తా ఇప్పుడు హట్‌టాపిక్‌గా మారింది. ప్రియాంక షేర్‌ చేసిన ఫొటోల్లో ఒక అంశం ఇప్పుడు అభిమానుల్ని తెగ ఆకర్షిస్తుంది.

అది ప్రియాంక ధరించిన బ్రాస్లెట్. చూడ్డానికి మంగళసూత్రంలా ఉన్న ఈ బ్రాస్లెట్ ప్రియాంక వివాహానికి సంబంధించి పలు అనుమానాలకు తావిస్తుంది. ప్రియాంక రహస్యంగా పెళ్లి చేసుకున్నదనే గుసగుసలు ఇప్పుడు బీ టౌన్‌లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. తన వ్యక్తిగత జీవితం గురించి ప్రియాంక ఎప్పుడు మౌనంగానే ఉంటుంది. గతంలో ఒకసారి తాను అందరిలానే వివాహం చేసుకుంటానని, పిల్లల్ని కంటానని కానీ ఇదంతా తనకు సరైన వ్యక్తి తారస పడినప్పుడు మాత్రమే జరుగుతాయని చెప్పింది. అలానే పిల్లలంటే నాకు చాలా ఇష్టం..వారితో గడపుతుంటే సమయమే తెలియదు..కాబట్టి నా జీవతంలో పిల్లలు తప్పనిసరి అంది. ప్రస్తుతం ‘క్వాంటికో’ మూడో సిరీస్‌లో నటిస్తున్న ప్రియాంక చాలాకాలం తర్వాత సల్మాన్‌ ఖాన్‌కు జోడిగా ‘భరత్‌’లో నటిస్తోంది. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2019 ఈద్‌ సందర్భంగా విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement