Bracelet
-
మందేసుకుంటే కనిపెట్టేస్తుంది
మద్యం తాగి వాహనాలు నడపడం, ప్రమాదాలకు కారణమవడం దాదాపు ప్రపంచవ్యాప్త సమస్య. వాహనాలను నడిపే మందుబాబులను పట్టుకోవడానికి పోలీసులు నగరాల్లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుంటారు. మూతి దగ్గర గొట్టం పెట్టి ఊదమంటారు. ఊదితే ఎంత మందేశారో తెలిసిపోతుంది. కొందరు తెలివిమీరిన మందుబాబులు గొట్టం ముందు ఊదడానికి నానా విన్యాసాలు చేస్తారు. ఊదాల్సిన అవసరం లేకుండానే, మందుబాబులు ఏ డోసులో తాగారో ఇట్టే కనిపెట్టేసే బ్రాస్లెట్ ఇది. ‘సోబర్సేఫ్’ అనే అమెరికన్ కంపెనీ ‘సోబర్స్యూర్’ పేరుతో ఈ హైటెక్ బ్రాస్లెట్ను గత నెలలోనే మార్కెట్లోకి తెచ్చింది. ఇందులో జీపీఎస్ టెక్నాలజీని కూడా అమర్చడంతో, దీనిని తొడుక్కున్న వారు ఎక్కడ ఉన్నారో తేలికగా కనిపెట్టవచ్చు. దీనిని వాచీలా చేతికి తొడుక్కుంటే, ఒంట్లో ఆల్కహాల్ ఎంత మోతాదులో ఉందో ఇట్టే తెరపై చూపిస్తుంది. దీని ధర 38 డాలర్లు (రూ.3,159) మాత్రమే! -
పెళ్లి కూతురు చేతులను మరింత ఆకర్షణీయంగా మార్చే బ్రేస్లెట్ రింగ్!
పెళ్లి కూతురు అలంకరణలో రకరకాల మోడల్స్‌లో ఉన్న బ్రేస్లెట్ రింగ్స్ మెహెందీ చేతులను మరింత ఆకర్షణీయంగా మార్చేస్తాయి. ఇక గెట్ టు గెదర్ వంటి వెస్ట్రన్ వేడుకల్లో స్టైలిష్ డ్రెస్‌లకు మరింత స్టైలిష్ లుక్‌నిస్తున్నాయి ఈ బ్రేస్లెట్ రింగ్స్. అమ్మాయిల అలంకరణలో ప్రతిదీ ప్రత్యేకతను నింపుతుంది. అందమైన దుస్తులే కాదు ఆభరణాలూ అంతే ఘనంగా ఉండాలనుకుంటారు. ఏ వేడుక అయినా మెడలో హారాలు, కాళ్లకు పట్టీలు, చేతులకు గాజులు మ్యాచింగ్‌గా ఎంపిక చేసుకుంటుంటారు. బంగారు, వెండి లేదా ఫ్యాన్సీ ఆభరణాలను సందర్భానుసారం ఉపయోగిస్తుంటారు. వీటిలో బ్రేస్లెట్ రింగ్స్ ఇప్పుడు కీలకంగా మారాయి. ముంజేతిని చుట్టేసే బ్రేస్లెట్... దాని నుంచి వేలి ఉంగరానికి జత చేస్తూ ఉన్నట్టుగా ఉండే ఈ మోడల్స్ చేతులను మరింతగా హైలైట్ చేస్తున్నాయి. పూసలు వరసలు... ఇవి సంప్రదాయ దుస్తుల మీదకు బాగా నప్పుతున్నాయి. అంటే, సంప్రదాయ వేడుకల సమయాల్లో వీటిని అలంకరించుకోవచ్చు. బ్లాక్బీడ్స్ వరసతో ఈ అల్లికను గమనించవచ్చు. రత్నాల రాశులు... నవరత్నాలు, డైమండ్స్ పొదిగిన బ్రేస్లెట్ రింగ్స్ పెద్ద పెద్ద వేడుకల్లో మరింత గ్రాండ్‌గా వెలిగిపోతున్నాయి. బంగారు హంగు... బంగారు తీగెలతో రూపుకట్టిన ఈ ఆభరణం. ఇటు సంప్రదాయ, అటు స్టైలిష్ వేర్లా కూడా పార్టీకి తగిన హంగును తీసుకువస్తుంది. వెండి జిలుగులు... వెండి జిలుగుకు పెద్ద పెద్ద స్టోన్స్ జత కలిసిన బ్రేస్లెట్ రింగ్స్ మోడర్న్ ఔట్‌ఫిట్స్‌కు స్టైలిష్ లుక్‌ని ఇస్తున్నాయి. ఇవి ఏ కాలమైనా యూత్‌ని మెప్పిస్తూనే ఉన్నాయి. -
మహిళల భద్రతకు.. అక్షరాలా రక్షణ ఇస్తాయి
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మహిళల భద్రతకు ఉపయోగపడే బ్రేస్లెట్ తయారుచేసి అభినందనలు అందుకున్నారు. గోరఖ్‌పుర్‌లోని ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఇంజినీరింగ్ కాలేజీ’కి చెందిన స్నేహ, అక్షితలు తయారుచేసిన ఈ బ్రేస్‌లెట్‌కు ‘నిర్భయ’ అని పేరు పెట్టారు. ఈ బ్రేస్లెట్ ఉమెన్ సేఫ్టీ యాప్‌కు అనుసంధానమై ఉండడంతో పాటు, అయిదు నంబర్లతో కనెక్టై ఉంటుంది. మరికొన్ని గ్యాడ్జెట్స్ గురించి... ‘బర్డ్ఐ’ అనేది పర్సనల్ సేఫ్టీ అలారమ్. అన్నివేళలా దీన్ని వెంట తీసుకెళ్లవచ్చు. ఆపద సమయంలో పెద్ద శబ్దం, వెలుగుతో ఎటాకర్ను భయపెడుతుంది. చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేస్తుంది. సేఫ్టీగా ఫీలైన సమయంలో డీయాక్టివేట్ చేయవచ్చు. బ్యాగు, పర్స్‌లలో కూడా ఈ పరికరాన్ని తీసుకెళ్లవచ్చు. డ్రైవ్ చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు కింద పడితే, చుట్టుపక్కల ఎవరూ లేకుంటే... ఇలాంటి సమయంలో యాపిల్ వాచ్ ఎస్ఇ(సిరీస్4)లోని ‘ఫాల్ డిటెక్ట్ ఫీచర్’ ఉపయోగపడుతుంది. ఎమర్జెన్సీ కాంటాక్ట్స్‌ను అప్రమత్తం చేస్తుంది. ‘ది రోడ్ ఐడీ బ్రేస్లెట్’ కూడా ఇలాంటిదే. ‘ది గార్డెడ్ రింగ్’ అనేది ఉత్త రింగ్ మాత్రమే కాదు. సెల్ఫ్ డిఫెన్స్ యాక్సెసరీ కూడా. ఆపద సమయంలో ఈ రింగ్‌లో రహస్యంగా అమర్చిన పదునైన బ్లేడ్‌ను ఉపయోగించుకోవచ్చు. (క్లిక్ చేయండి: ప్రాణాలు కాపాడుతున్న ఐఫోన్లు.. ఎలాగంటే..) -
ఛండీగడ్ గార్డుకు సలాం.. ఏం చేశాడంటే
చండీగఢ్ : పది రూపాయలు దొరికినా గుట్టుగా జేబులో వేసుకునే ఈ రోజుల్లో చండీగడ్‌లో ఒక సినిమా హాల్లోని సెక్యూరిటీ గార్డు చూపించిన నిజాయితీ ఆదర్శంగా నిలిచింది. లక్షల రూపాయల విలువ చేసే డైమండ్ బ్రాస్లెట్ను తిరిగి నిజమైన యజమానురాలికి ఇచ్చిన వైనం సోషల్ మీడియాలో ప్రశంసలు దక్కించుకుంటోంది. వివరాల్లోకి వెళితే..వివాహ వార్షికోత్సవ కానుకగా భర్త బహుమతిగా ఇచ్చిన ఖరీదైన డైమండ్ బ్రాస్లెట్ను మీనాక్షి గుప్తా సినీపోలిస్ సినిమా హాల్లో పోగొట్టుకున్నారు. దీనికోసం వెతికి వెతికి నిరాశ చెందిన మీనాక్షి చివరి ప్రయత్నంగా సినీపోలిస్ థియేటర్లోని పోలీసులను సంప్రదించారు. ఆ ఆశే ఆమెకు అంతులేని సంతోషాన్ని మిగిల్చింది. నిజాయితీగల, నిఖార్సైన సెక్యూరిటీ గార్డును ప్రపంచానికి పరిచయం చేసింది. తన భర్త ప్రేమతో ఇచ్చిన గిఫ్ట్ పోవడంతో చాలా షాకయ్యాననీ, కానీ గార్డు నిజాయితీ తనకు అంతులేని సంతోషాన్ని తీసుకొచ్చిందంటూ సోషల్ మీడియాలో వెల్లడించారు మీనాక్షి. నాలుగు సంవత్సరాల క్రితం దీని విలువ రూ. 2 లక్షలు అని తెలిపారు. ఇంతకీ ఈ స్టోరీలోని రియల్ హీరో పేరు సూరజ్, చండీగఢ్ నివాసి. గత ఏడు నెలలుగా సినీపోలిస్ సినిమా హాల్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షో అయిపోగానే ప్రతీ సీటును క్షుణ్ణంగా పరిశీలిస్తామని సూరజ్ చెప్పారు. ప్రతీరోజు సెల్‌ఫోన్, బంగారు నగలు లాంటి విలువైన వస్తువులు దొరుకుతూనే ఉంటాయనీ వాటిని జాగ్రత్తగా దాచిపెట్టి పోగొట్టుకున్నవారికి అందిస్తామన్నారు. నిజాయితీగా సంపాదించిన డబ్బు మాత్రమే మనకు మిగులుతుంది.. అప్పనంగా వచ్చింది ఏదో ఒక రూపంలో పోతుందంటూ సూరజ్ పేర్కొనడం విశేషం. అంతేకాదు బ్రాసెలెట్ను జాగ్రత్తగా భద్రపరిచిన పెట్టిన సూరజ్..అడిగిన వెంటనే అలవోకగా మీనాక్షికి ఆ నగను స్వాధీనం చేయలేదు. దాని ఖరీదుకు సంబంధించిన బిల్లు, ఫోటో, ఆధార్‌కార్డు లాంటివి తీసుకుని పూర్తిగా ధృవీకరించుకున్న తరువాత మాత్రమే అప్పగించడం గమనార్హం. -
పెళ్లి వార్తలపై ప్రియాంక క్లారిటీ
ముంబై : తాను రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు వస్తున్న వార్తలపై బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా స్పందించారు. మంగళసూత్రంలా ఉన్న బ్రాస్లెట్ ధరించడంతో ప్రియాంక రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తలను ప్రియాంక ట్వీటర్ వేదికగా ఖండించారు. ‘‘హాహాహా.. నా పెళ్లిపై ఊహాగానాలు.. ఇది కేవలం దిష్టి తగలకుండా గాయ్స్..ఇక ఆపండి. నేను పెళ్లి చేసుకున్నప్పుడు ఖచ్చితంగా చెబుతాను. రహస్యంగా ఏమి చేసుకోను’’ అని బ్రాస్లెట్ ఫొటోను ట్వీట్ చేశారు. ‘క్వాంటికో’ సిరిస్‌తో హలీవుడ్లో అడుగుపెట్టిన ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రస్తుతం హిందీ చిత్రాల్లో నటిచండం చాలా వరకూ తగ్గించేశారు. వరుస హలీవుడ్ చాన్స్‌లతో బిజీగా ఉన్న ప్రియాంకను అసోం ప్రభుత్వం రాష్ట్ర టూరీజం ప్రచారకర్తగా నియమించింది. ఈ సందర్భంగా అసోం పర్యాటక రంగంపై ప్రచారం చేయడానికి ప్రియాంక చాలా కాలం తర్వాత స్వదేశానికి వచ్చారు. ఈ ప్రయాణంలో తీసిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోల్లో ప్రియాంక ధరించిన బ్రాస్లెట్.. చూడ్డానికి మంగళసూత్రంలా ఉండటంతో ఈ ముద్దుగుమ్మ రహస్యంగా పెల్లి చేసుకున్నారనే వార్తలు ప్రచారం అయ్యాయి. https://t.co/EkUEgfbO75 Hahahah!heights of speculation! This is an evil eye guys! Calm down! I’ll tell u when I get married and it won’t be a secret! Lol pic.twitter.com/WPdIxXIx1I — PRIYANKA (@priyankachopra) 30 April 2018 -
రహస్యంగా పెళ్లి చేసుకున్న నటి..?
ఈ మధ్యకాలంలో బాలీవుడ్లో ఎక్కువగా పెళ్లి కబుర్లే వినిపిస్తున్నాయి. గతేడాది డిసెంబర్ వరకు అనుష్క శర్మ- విరాట్ కోహ్లి పెళ్లి గురించి జరిగిన చర్చలు కాస్తా ఇప్పుడు సోనమ్ కపూర్ వివాహం వైపు మళ్లాయి. తాజాగా ఈ కోవలోకి మరో నటి చేరింది. ‘క్వాంటికో’ సిరిస్‌తో హలీవుడ్లో అడుగుపెట్టిన బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా ప్రస్తుతం హిందీ చిత్రాల్లో నటిచండం చాలా వరకూ తగ్గించేసింది. వరుస హలీవుడ్ చాన్స్‌లతో బిజీగా ఉన్న ప్రియాంకను అసోం ప్రభుత్వం రాష్ట్ర టూరీజం ప్రచారకర్తగా నియమించింది. ఈ సందర్భంగా అసోం పర్యాటక రంగంపై ప్రచారం చేయడానికి ప్రియాంక చాలా కాలం తర్వాత స్వదేశానికి వచ్చింది. ఈ ప్రయాణంలో తీసిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. అది కాస్తా ఇప్పుడు హట్‌టాపిక్‌గా మారింది. ప్రియాంక షేర్ చేసిన ఫొటోల్లో ఒక అంశం ఇప్పుడు అభిమానుల్ని తెగ ఆకర్షిస్తుంది. అది ప్రియాంక ధరించిన బ్రాస్లెట్. చూడ్డానికి మంగళసూత్రంలా ఉన్న ఈ బ్రాస్లెట్ ప్రియాంక వివాహానికి సంబంధించి పలు అనుమానాలకు తావిస్తుంది. ప్రియాంక రహస్యంగా పెళ్లి చేసుకున్నదనే గుసగుసలు ఇప్పుడు బీ టౌన్లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. తన వ్యక్తిగత జీవితం గురించి ప్రియాంక ఎప్పుడు మౌనంగానే ఉంటుంది. గతంలో ఒకసారి తాను అందరిలానే వివాహం చేసుకుంటానని, పిల్లల్ని కంటానని కానీ ఇదంతా తనకు సరైన వ్యక్తి తారస పడినప్పుడు మాత్రమే జరుగుతాయని చెప్పింది. అలానే పిల్లలంటే నాకు చాలా ఇష్టం..వారితో గడపుతుంటే సమయమే తెలియదు..కాబట్టి నా జీవతంలో పిల్లలు తప్పనిసరి అంది. ప్రస్తుతం ‘క్వాంటికో’ మూడో సిరీస్‌లో నటిస్తున్న ప్రియాంక చాలాకాలం తర్వాత సల్మాన్ ఖాన్‌కు జోడిగా ‘భరత్’లో నటిస్తోంది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2019 ఈద్ సందర్భంగా విడుదల కానుంది. -
‘స్మార్ట్’గా కాపాడుతుంది..
ఈ ఫొటోలోని బ్రేస్లెట్ చాలా అందంగా ఉంది కదా.. ముత్యాలతో తయారు చేసిన ఈ బ్రేస్‌లెట్‌ను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ అలబామాకు చెందిన పలువురు విద్యార్థులు రూపొందించారు. ఇలాంటివి చాలా చూశాం.. ఇందులో కొత్తేముందనే కదా మీ ప్రశ్న.. ఈ బ్రేస్‌లెట్‌కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. ప్రమాదంలో ఉన్న మహిళలను ఇది రక్షిస్తుందట. ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఎవరైనా దుండగులు అటకాయిస్తే.. వెంటనే చేతికి తొడుక్కునే ఈ బ్రేస్లెట్ బిగ్గరగా శబ్దం చేస్తుందట. దీంతో చుట్టుపక్కల ఉన్న వారిని అలర్ట్ చేస్తుంది. అంతేకాదు ఎర్రని లైట్లు వెలుగుతూ దుండగుడు భయపడి పారిపోయేలా చేస్తుంది. పైగా ప్రమాద సమయంలో పోలీసులకు ఫోన్ చేయాలన్నా కూడా కొన్నిసార్లు కుదరదు. ఆ సమయంలో కృత్రిమ మేధస్సుతో ప్రమాదంలో ఉన్న వ్యక్తి స్మార్ట్‌ఫోన్‌కు బ్లూటూత్ ద్వారా పోలీసులకు మెసేజ్ పంపుతుంది. వ్యక్తి రక్త ప్రసరణ వేగాన్ని అంచనా వేయడం ద్వారా ఈ బ్రేస్లెట్ ప్రమాద పరిస్థితులను గుర్తిస్తుందట. దీన్ని యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ రాగిబ్ హసన్, విద్యార్థులు జయున్ పటేల్ కలసి తయారు చేశారు. అయితే ఇది ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని కొన్ని పరీక్షలు నిర్వహించి అందుబాటులోకి తీసుకొస్తామని హసన్ తెలిపారు. -
చూసిన పాపానికి.. స్పృహకోల్పోయింది!
బీజింగ్: కొన్నిసార్లు షాపింగ్‌కు వెళ్లినప్పుడు అక్కడ కనిపించే కొన్ని వస్తువులు విపరీతంగా ఆకర్షిస్తుంటాయి. అయితే ఆ వస్తువులను కొనడానికి సరిపడేంత డబ్బులేనప్పుడు.. వాటిని కాసేపు పట్టుకొని చూసి అక్కడ పెట్టేసి రావడం చేస్తుంటారు కొందరు. సరిగ్గా ఇలాచేసే ఓ చైనా మహిళ స్పృహతప్పి పడిపోయింది! యునాన్ ప్రావిన్స్ రూయిలి పట్టణంలో ఓ షాపులోకి వెళ్లిన మహిళ.. పచ్చరాయితో చేసిన బ్రాస్లెట్ను చూసి ముచ్చటపడింది. కొనకపోయినా కనీసం చూద్దామని చేతిలోకి తీసుకుంది. అయితే.. అదికాస్తా జారి కిందపడటంతో రెండు ముక్కలైంది. ఈ విషయాన్ని గమనించిన షాప్ ఓనర్ బ్రాస్‌లెట్‌కు డబ్బు చెల్లించాల్సిందిగా దాని ఖరీదును ఆ మహిళకు చెప్పాడు. అంతే.. ఒక్కసారిగా ఆ మహిళ అపస్మారకస్థితిలోకి వెళ్లింది. కాసేపు ఫిట్స్ వచ్చినట్లు నేలపై పడి కొట్టుకోవడంతో అక్కడివారికి ఏం చేయాలో పాలుపోలేదు. మొహం మీద కాసిన్ని నీళ్లు చల్లాక లేచి కూర్చున్న ఆ మహిళ.. బ్రాస్లెట్ రేటు 3,00,000 యువాన్లు అని వినగానే స్పృహతప్పానని చెప్పింది. ఆ మహిళ తరఫువారు 70,000 యువాన్లు చెల్లిస్తామని చెప్పినా షాప్‌వారు ఒప్పుకోకపోవడంతో.. చివరకు 1,80,000 యువాన్లకు బేరం కుదుర్చుకొని పగిలిపోయిన బ్రాస్లెట్ను పట్టుకెళ్లారు. -
'ఆయనిచ్చిన బ్రాస్లెట్ వేలం వేస్తున్నా'
హైదరాబాద్: ఇటీవల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో వీహెచ్ తనకు బహుకరించిన బంగారు బ్రాస్లెట్ను వేలం వేయనున్నట్లు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. శనివారం(10 వ తేది) గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీఎల్పీనేత జానారెడ్డి సమక్షంలో ఈ వేలం కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. బ్రాస్లెట్ వేలం ద్వారా వచ్చిన డబ్బును ఖమ్మంలో బేడీలు వేసిన రైతులకు ఆర్థిక సాయంగా అందజేస్తామని జగ్గారెడ్డి తెలిపారు. -
బ్రాస్లెట్లలో జీపీఎస్!
బీజింగ్: మతిమరుపు లాంటి సమస్యలతో బాధ పడుతున్న వృద్ధుల కోసం చైనా అధికారులు ఓ కొత్త ఆలోచన చేశారు. ఇంటి నుంచి బయటకెళ్లిన వృద్ధులు మళ్లీ ఇళ్లు చేరడంలో సమస్యలను ఎదుర్కొంటున్నట్లు గుర్తించి.. వారికి ప్రత్యేక బ్రాస్లెట్లు ఇవ్వాలని నిర్ణయించారు. జీపీఎస్‌తో కూడిన బ్రాస్లెట్ను వృద్ధులు ధరించడం ద్వారా తప్పిపోయినప్పుడు వారిని గుర్తించడం సులభమౌతుందని.. అందుచేత మతిమరుపు సమస్యలున్న 12,000 మంది వృద్ధులకు త్వరలోనే బ్రాస్లెట్లను పంపిణీ చేయనున్నట్లు బీజింగ్ డిప్యూటీ మేయర్ వాంగ్ నింగ్ తెలిపారు. దీంతో వృద్ధులకు సంబంధించిన వారు తమ స్మార్ట్ ఫోన్లలో యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా వారి ఆచూకీని తెలుసుకోగలరని తెలిపారు. అంతే కాదు ఆ బ్రాస్లెట్తో వృద్ధులు ఎమర్జెన్సీ కాల్స్ సైతం చేసుకోవడానికి అవకాశం ఉంది. 2015లోని సమాచారం ప్రకారం చైనా జనాభాలో 22 కోట్ల మంది 60 ఏళ్లకు పైబడినవారే. -
సేఫ్ గా ఇంటికి చేరేందుకు బ్రాస్లెట్..!
తప్పిపోయిన వారిని వెతికేందుకు ఎంతో కష్టపడుతుంటాం. పోలీసులకు ఫిర్యాదు చేస్తుంటాం. వారి జాడ తెలుసుకునేందుకు ప్రకటనలు కూడ ఇస్తాం. అయితే ఇటువంటి కష్టాలకు ఇప్పుడు దూరం కావచ్చు అంటున్నారు క్వీన్స్ ల్యాండర్ పోలీసులు. సమస్యను అధిగమించేందుకు ఓ బ్రాస్ లెట్ ప్రాజెక్టును ప్రయోగించారు. ఈ ప్రాజెక్టు ద్వారా చిత్త వైకల్యం కలిగిన వ్యక్తుల జాడ తెలుసుకొని, వారిని భద్రంగా ఇంటికి చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా యూనిక్ నెంబర్ చెక్కి ఉన్న బ్రాస్ లెట్ ను జారీ చేస్తున్నారు. నిజానికి ఈ ప్రోగ్రామ్ ను పోలీస్ మినిస్టర్ ఏప్రిల్ లోనే ప్రారంభించారు. క్వీన్స్ ల్యాండ్ లోని సుమారు మూడు వందల ఇళ్ళలో ఉండే వైకల్యం కలిగిన వ్యక్తులకు ఈ బ్రాస్ లెట్ ను అందజేశారు. ఈ బ్రాస్లెట్ ధరించడం వల్ల బయటకు వెళ్ళి తప్పిపోయినవారి జాడ సులభంగా తెలుసుకోగల్గుతారు. అయితే క్వీన్స్ ల్యాండ్ లో సుమారు అరవై రెండువేల మంది వరకూ చిత్త వైకల్యంతో బాధపడుతున్న వారు ఉన్నట్లుగా గుర్తించారు. క్రమంగా వీరందరికీ బ్రాస్లెట్ లు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. క్వీన్స్ ల్యాండ్ పోలీస్ సర్వీస్, అల్జిమర్స్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉమ్మడి ప్రాజెక్టు ద్వారా చిత్త వైకల్యంతో బాధపడే వ్యక్తులు సురక్షితంగా ఇంటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రోసర్ పైన్ రెస్పైట్ కేర్ సెంటర్ పేరున ఓ పబ్లిక్ ఫోరమ్ ను కొత్తగా ప్రారంభిస్తున్నారు. సేఫ్లీ హోమ్ బ్రాస్లెట్లతోపాటు, ప్రాజెక్టు ద్వారా మరిన్ని సేవలు అందించనున్నారు. -
వాయనం: మీ నగలకు మీరే డిజైనర్!
వేసవి వస్తోంది. బోలెడన్ని ఫంక్షన్లు ఉంటాయి. ప్రతిసారీ దుస్తుల మీదికి మ్యాచింగ్ జ్యూయెలరీ వెతుక్కోవడం పెద్ద పని. అలాగని ప్రతిసారీ కొనాలన్నా ఇబ్బందే. అదే... మనమే నగలు చేసేసుకున్నామనుకోండి... తక్కువ ఖర్చుతో ఎక్కువ నగలు పోగేసుకోవచ్చు. సరదాగా ఈ బ్రేస్లెట్ ట్రై చేసి చూడండి... కావలసినవి: వెండి తీగ, ముత్యాలు (చేతి సైజును బట్టి సంఖ్య), క్రిస్టల్ బీడ్స్ (వీటి సంఖ్య ముత్యాలను బట్టి ఉంటుంది), టాగుల్ రింగ్ - 1 (షాపులో అడిగితే ఇస్తారు. ఇది రెండు విభాగాలుగా ఉంటుంది. బ్రేస్లెట్కి ఇరువైపులా ఫిక్స్ చేసుకోవాలి) తయారీ: ముందుగా మీ చేతి సైజును బట్టి వెండితీగను కత్తిరించుకోవాలి. టాగుల్ రింగులో ఒక భాగానికి తీగని ముడివేయాలి. తరువాత తీగకు ఒక క్రిస్టల్ బీడ్ని ఎక్కించాలి. తర్వాత ఒక ముత్యం ఎక్కించాలి. ఇలా బీడ్స్‌ని, ముత్యాల్ని ఓ వరుసక్రమంలో ఎక్కించి, చివరగా తీగెను టాగుల్ రింగులో రెండో భాగానికి ముడి వేసి, రెండిటినీ కలిపి ఫిక్స్ చేయాలి. అంతే... అందమైన ముత్యాల బ్రేస్లెట్ రెడీ! రెడీమే డ్కి అయ్యే ఖర్చులో సగం కూడా అవ్వదు దీని తయారీకి! వెరీ‘గుడ్డు’ సెపరేటర్! గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే రోజుకో గుడ్డు తినమని వైద్యులు చెబుతుంటారు. అయితే చిన్నప్పుడు ఫర్వాలేదు కానీ... టీనేజ్ దాటినప్పట్నుంచీ గుడ్డులోని పచ్చసొనను తినడం మంచిది కాదని, దానివల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందని అంటారు. కాబట్టి పచ్చసొన తీసేసి తెల్లదాన్ని మాత్రమే తినాలి. అయితే రెండు సొనలనీ సెపరేట్ చేయడం ఓ పెద్ద పని. ఎంత జాగ్రత్తగా తీద్దామన్నా పచ్చసొన పగిలి కలిసిపోతుంటుంది. ఆ సమస్యను తీర్చడానికే ‘ఎగ్ వైట్ సెపరేటర్’ని కనిపెట్టారు. ఇందులో నాలు గైదు మోడల్స్ ఉన్నాయి. మోడల్ని బట్టి రేటు. ఈ ఫొటోలో కనిపిస్తున్నది 200 రూపాయల్లో వచ్చేస్తుంది. 150 రూ.కే దొరికేవి కూడా ఉన్నాయి. దీన్ని వెంటనే తెచ్చుకుంటే మీ పని ఈజీ అయిపోతుంది! ఫటాఫట్ పరిష్కారాలు! * వేసవిలో పాలు విరిగిపోకుండా ఉండాలంటే కాచేముందు పాలలో చిటికెడు వంటసోడాని కలపాలి! * ఒక్కోసారి ఎంత కడిగినా ఫ్లాస్క్ వాసన వస్తూంటుంది. అలాంటప్పుడు మజ్జిగతో కడిగి ఆపైన నీటితో కడిగితే వాసన పోతుంది! * పిండి వంటలు చేసేటప్పుడు నూనె పొంగుతుంటే, ఒక తమలపాకును నూనెలో వేసి, కాసేపుంచి తీస్తే... నూనె పొంగకుండా ఉంటుంది! * పెసరపిండిలో నిమ్మరసం కలిపి తోమితే వెండి సామాన్లు తళతళలాడతాయి! * బ్రెడ్ ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే... ప్యాకెట్లో చిన్న బంగాళాదుంప ముక్కను పెట్టాలి!