ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మహిళల భద్రతకు ఉపయోగపడే బ్రేస్‌లెట్ తయారుచేసి అభినందనలు అందుకున్నారు. గోరఖ్‌పుర్‌లోని ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ ఇంజినీరింగ్ కాలేజీ’కి చెందిన స్నేహ, అక్షితలు తయారుచేసిన ఈ బ్రేస్‌లెట్‌కు ‘నిర్భయ’ అని పేరు పెట్టారు. ఈ బ్రేస్‌లెట్ ఉమెన్ సేఫ్టీ యాప్‌కు అనుసంధానమై ఉండడంతో పాటు, అయిదు నంబర్లతో కనెక్టై ఉంటుంది.
మరికొన్ని గ్యాడ్జెట్స్ గురించి...
‘బర్డ్‌ఐ’ అనేది పర్సనల్ సేఫ్టీ అలారమ్. అన్నివేళలా దీన్ని వెంట తీసుకెళ్లవచ్చు. ఆపద సమయంలో పెద్ద శబ్దం, వెలుగుతో ఎటాకర్‌ను భయపెడుతుంది. చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేస్తుంది. సేఫ్టీగా ఫీలైన సమయంలో డీయాక్టివేట్ చేయవచ్చు. బ్యాగు, పర్స్‌లలో కూడా ఈ పరికరాన్ని తీసుకెళ్లవచ్చు.
డ్రైవ్ చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు కింద పడితే, చుట్టుపక్కల ఎవరూ లేకుంటే... ఇలాంటి సమయంలో యాపిల్ వాచ్ ఎస్‌ఇ(సిరీస్4)లోని ‘ఫాల్ డిటెక్ట్ ఫీచర్’ ఉపయోగపడుతుంది. ఎమర్జెన్సీ కాంటాక్ట్స్‌ను అప్రమత్తం చేస్తుంది. ‘ది రోడ్ ఐడీ బ్రేస్‌లెట్’ కూడా ఇలాంటిదే.
‘ది గార్డెడ్ రింగ్’ అనేది ఉత్త రింగ్ మాత్రమే కాదు. సెల్ఫ్ డిఫెన్స్ యాక్సెసరీ కూడా. ఆపద సమయంలో ఈ రింగ్‌లో రహస్యంగా అమర్చిన పదునైన బ్లేడ్‌ను ఉపయోగించుకోవచ్చు. (క్లిక్ చేయండి: ప్రాణాలు కాపాడుతున్న ఐఫోన్‌లు.. ఎలాగంటే..)
Comments
Please login to add a commentAdd a comment