Woman safety
-
మహిళల దుస్తుల కొలతలు పురుషులు తీసుకోవద్దు
లక్నో: అసభ్యకరంగా తాకుతూ దురుద్దేశంతో వ్యవహరించే పురుషుల నుంచి మహిళలకు రక్షణ కల్పించడానికంటూ ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ పలు సంచలనాత్మక సిఫారసులను రూపొందించింది. వీటి ప్రకారం పురుషులు..టైలరింగ్ షాపుల్లో మహిళల కొలతల్ని తీసుకోరాదు.సెలూన్లలో మహిళల జుత్తు కత్తిరించరాదు. దుస్తుల దుకాణాలు, జిమ్‌లు, కోచింగ్ సెంటర్లలో సీసీటీవీలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. స్కూల్ బస్సుల్లో భద్రత కోసం మహిళా సిబ్బందిని నియమించాలి..వంటివి ఉన్నాయి. అక్టోబర్ 28వ తేదీన సమావేశమైన కమిషన్ ఈ మేరకు నిబంధనలను ఆమోదించింది. బహిరంగ ప్రదేశాల్లో పురుషుల నుంచి మహిళలను వేరుగా ఉంచేందుకు, మహిళలకు భద్రతను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన ఈ మార్గదర్శకాలను అమలు చేయాలంటూ అన్ని జిల్లాల మేజి్రస్టేట్లకు లేఖలు రాసింది. ‘చాలా చోట్ల జిమ్‌లలో మగ ట్రెయినర్లు, మహిళల బొటిక్‌లలో మగ దర్జీలు ఉంటున్నారు. వీరు మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లుగా ఇటీవలి కాలంలో ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి’అని యూపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ బబితా చౌహాన్ తెలిపారు. ‘టైలర్లుగా మగవాళ్లుండటంపై మాకెలాంటి సమస్యా లేదు. మహిళల కొలతల్ని పురుషులు తీసుకోడంపైనే మా అభ్యంతరమంతా’అని ఆమె వివరించారు. ‘ఇలాంటి అన్ని చోట్లా శిక్షణ పొందిన మహిళల్ని నియమించుకోవాలి. ఇందుకు కొంత సమయం పట్టొచ్చు. కానీ, ఈ నిబంధనలను అమలు చేయడం వల్ల మహిళలకు మరిన్ని ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి’అని ఆమె తెలిపారు.ఇదీ చదవండి: సీఎం సమోసాలు ఎవరు తీసుకున్నారు.. సీఐడీ దర్యాప్తు -
రెడ్ ఐ పై కన్నెర్ర చేద్దాం!
‘గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజ్ లేడీస్ హాస్టల్ బాత్రూంలో 29వ తేదీ సాయంత్రం హిడెన్ కెమెరా పట్టు బడింది’. రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన ఇది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అసాంఘిక కార్యకలాపాలకు దుర్వినియోగం చేస్తున్న వాళ్లు కూడా విద్యావంతులే. ఇలాంటి ఒక సంఘటన జరిగినప్పుడు వ్యవస్థ మొత్తం నిద్రలేవడం, ఆ తర్వాత మర్చిపోవడమే జరుగుతోంది. స్పై కెమెరాల దుర్వినియోగం మీద నిఘా వ్యవస్థ రోజూ పని చేయాల్సిందేనన్నారు ‘యాంటీ రెడ్ ఐ’ యాక్టివిస్ట్ వరలక్ష్మి. ఈ డేగకన్ను గురించి సామాన్యుల్లో అవగాహన కల్పించడానికి సినిమా హాళ్లలో ప్రకటనల రూపంలో స్పై కెమెరాలు ఎన్ని రకాలుగా అమర్చే అవకాశం ఉంటుందో బొమ్మలతో చూపిస్తూ న్యూస్ రీల్ వేయాలన్నారు. తరచూ తనిఖీలు తప్పనిసరి! విద్యాసంస్థలకు అనుమతులిచ్చేటప్పుడే అమ్మాయిలు, అబ్బాయిల హాస్టల్ భవనాలు ఏ దిశలో ఉన్నాయి. రెండు భవనాల్లో బాత్రూమ్లు ఒకరికొకరు కనిపించని విధంగా నిర్మాణం ఉండాలి. షీ టీమ్స్, భరోసా టీమ్ సభ్యులు ప్రతి విద్యాసంస్థ నుంచి కొందరు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ ఉమెన్ క్యాడెట్లను సమీకరించి వర్క్‌షాపులు నిర్వహించాలి. ఆ ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడెట్లు తమ విద్యాసంస్థలో వర్క్‌షాపులు నిర్వహిస్తూ స్పై కెమెరాలను గుర్తించడం, గుర్తించిన వెంటనే ఇంటర్నల్ కమిటీలకు తెలియచేయడం మీద చైతన్యవంతం చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ పట్టణం, నగరంలోని విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, హాస్పిటళ్లు, హోటళ్లు, షాపింగ్ మాల్స్‌లో తనిఖీలు చేసి ‘ఫలానా తేదీన, ఫలానా టైమ్‌లో తనిఖీ జరిగింది. అసాంఘికంగా ఎటువంటి స్పై కెమెరాలు లేవు’ అనే స్టిక్కర్ అతికించాలి. స్పై కెమెరాను గుర్తిస్తే ఆ విద్యాసంస్థ, వ్యాపార సంస్థ ఏదైనా సరే తక్షణమే మూసివేయడం, యజమాని మీద నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం వంటి కఠినచర్యలు ఉండాలి. రోజూ నగరంలో ఏదో ఒక చోట తనిఖీలు జరుగుతుంటే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు కళ్లెం పడుతుంది. వ్యాపార సంస్థల ప్రకటనల హోర్డింగ్‌లో స్పై కెమెరా లోగో, ‘మహిళల భద్రత మా బాధ్యత’ అనే క్యాప్షన్ ముద్రించడం తప్పనిసరి చేయాలి. స్పై కెమెరాలు లక్షల్లో అమ్ముడవుతున్నాయి! స్పై కెమెరాల అమ్మకం మీద కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి. స్పై కెమెరా కొంటున్న వారి ఆధార్ నంబరు, స్పై కెమెరా కొంటున్న అవసరం ఏమిటో స్పష్టంగా తెలియచేయాలనే నిబంధన పెట్టాలి. ప్రతి జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో లోకల్ కమిటీలున్నాయి. జిల్లా కలెక్టర్, షీ టీమ్స్ సేవలను విస్తృతం చేయడంతోపాటు బాధితులు సమాచారం అందించడానికి జిల్లాకో ఫోన్ నంబరును ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. అప్పుడే ఇలాంటి దుశ్చర్యలకు అడ్డుకట్ట పడుతుంది. కెమెరా లేదనే భరోసానిద్దాం! హెవెన్ హోమ్స్ సొసైటీ ద్వారా ఆపదలో ఉన్న అమ్మాయిలను రక్షించడం, వారికి సాధికారమైన ఉ΄ాధి కల్పించడం, వివిధ సామాజికాంశాలపై అవగాహన కోసం సదస్సులు, శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ‘యాంటీ రెడ్ ఐ’ పేరుతో స్పై కెమెరాల మీద యుద్ధం మొదలు పెట్టాం. ఈ దుర్మార్గాన్ని అరికట్టడానికి ఒక నియమావళిని రూపొందించాను. ఆ సూచనలతో తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 15న స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా మహిళల భద్రత కోసం ‘నో హిడెన్ కెమెరా ఇన్సైడ్’ అనే ప్రోగ్రామ్ మొదలు పెట్టింది. సీసీటీవీలున్న చోట ‘మీరు సర్వేలెన్స్ కెమెరా నిఘాలో ఉన్నారు’ అనే హెచ్చరిక ఉన్నట్లే... ‘స్పై కెమెరా లేదా హిడెన్ కెమెరా లేదు, మీరు ధైర్యంగా ఉండవచ్చు’ అని భరోసా కలిగించే క్యాప్షన్ కూడా ఉండాలి. నిర్భయ నిధులు ప్రతి రాష్ట్రానికీ విడుదలవుతుంటాయి. కానీ ఖర్చు చేయకుండా ఉండి పోతుంటాయి. ఆ నిధులను ఇలా సద్వినియోగం చేయాలి. – అడపా వరలక్ష్మి, సామాజిక కార్యకర్త – వాకా మంజులారెడ్డి,సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
చైతన్య పథం
ఐక్యరాజ్య సమితి ‘గర్ల్ అప్’ మూవ్‌మెంట్‌కు ఇండియా కంట్రీ మేనేజర్ అయిన అదితి అరోరా ఆ సంస్థ ద్వారా మహిళల మానసిక ఆరోగ్యం నుంచి ఉపాధి అవకాశాల వరకు ఎన్నో అంశాలపై పని చేస్తోంది. ‘స్టోరీ టెల్లింగ్’లో శిక్షణ ఇస్తోంది. మహిళలపై జరిగే హింసకు వ్యతిరేకంగా ΄పోరాడుతోంది. ‘పీరియడ్ ΄పావర్టీ’ని దృష్టిలో పెట్టుకొని అవగాహన కార్యమ్రాలు నిర్వహిస్తోంది. మహిళా సాధికారత, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన అంశాలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న అమెరికాకు చెందిన ‘జస్ట్ ఏ గర్ల్ ఇంక్’ స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తోంది....ప్రపంచవ్యాప్తంగా 130 దేశాలలో ఎంతోమంది మహిళలను నాయకులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పొషించింది ‘గర్ల్ అప్’.‘ప్రపంచాన్ని మార్చే అద్భుత శక్తి అమ్మాయిలకు ఉంది’ అంటున్న అదితి అరోరా వారి హక్కుల గురించి అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపోందిస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కొత్త అవకాశాల ప్రపంచంలోకి తీసుకు వెళుతోంది.‘గర్ల్ అప్ ఇండియా’ ద్వారా దేశవ్యాప్తంగా లింగ సమానత్వం, సామాజిక మార్పుపై ఎన్నో అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది అదితి.యువతలో ఎంతోమందిని చేంజ్‌మేకర్స్‌గా తీర్చిదిద్దింది.పాలిటికల్ సైన్స్ చదువుకున్న అదితి కాలేజీ రోజుల నుంచి మహిళా హక్కులు, స్త్రీ సాధికారతకు సంబంధించిన అంశాలపై పని చేస్తోంది. జెనీవాలో చదువుతున్నప్పుడు ‘జెండర్ అండ్ మైన్ యాక్షన్’ పోగ్రాంలో భాగంగా మందు పాతర బాధిత దేశాలలో మహిళల భద్రత కోసం పనిచేసింది.‘గర్ల్ అప్’ పనితీరు విషయానికి వస్తే సంస్థలో సిబ్బంది, కన్సల్టెంట్ల సంఖ్య చాలా తక్కువగా ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా వేగంగా విస్తరించడానికి అదేమీ అడ్డంకి కాలేదు. ‘ఓపెన్ టు ఎవ్రీ వన్’ అంటున్న ‘గర్ల్ అప్’ దేశంలోని వివిధ పాంతాలలోని వాలంటీర్లతో కలిసి పనిచేస్తోంది.తమలోని శక్తిని అమ్మాయిలు గుర్తించేలా కార్యక్రమాలు రూపోందిస్తోంది.విధాన నిర్ణయాలలో వారి అభిప్రాయాలకు అధికరపాధాన్యత ఇస్తోంది.‘లింగ సమానత్వం’ విషయంలో క్రియాశీలంగా పనిచేస్తోంది గర్ల్ అప్.‘అబ్బాయిలను ఒకరకంగా, అమ్మాయిలను ఒకరకంగా చూసే విధానంలో మార్పు రావాలి. లింగ సమానత్వానికి ఇదే తొలిమెట్టు. అమ్మాయిలు చదువులో తమ ప్రతిభను నిరూపించుకొని శక్తిమంతులు కావాలి. ఎవరికీ తీసిపోము అని నిరూపించాలి. లింగ సమానత్వం విషయంలో ΄పార సమాజం, విధాన నిర్ణేతలు, విద్యావేత్తల పాత్ర కీలకం’ అంటుంది అదితి.మనకు తెలియకుండానే పురుషాధిపత్య భావజాలం మనలో లీనమై ఉంటుంది. రకరకాల సందర్భాలలో అది వ్యక్తం అవుతుంటుంది. ‘ఇలాంటివి నివారించాలంటే ఏం చేయాలి?’ అనేదానిపై కూడా తన అభిప్రాయాలను ప్రకటించింది అదితి.‘శరీరం నుంచి దుస్తుల ఎంపిక వరకు మహిళలు ఏదో ఒక సందర్భంలో కామెంట్స్ రూపంలో హింసను ఎదుర్కొంటున్నారు’ అంటున్న అదితి తాను కూడా అలాంటి హింస బాధితురాలే. ‘కామెంట్స్ విని బాధపడడం కాకుండా అలాంటి కామెంట్స్ మళ్లీ వినిపించకుండా చేయాలి’ అంటుంది అదితి.‘మార్పు సాధ్యపడదు’ అనేది నిరాశావాదం.‘తప్పకుండా సాధ్యపడుతుంది’ అనేది శాస్త్రీయ ప్రాతిపదికపై ఏర్పడిన ఆశావాదం.మార్పు రావడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయం త్వరగా రావడానికి ‘గర్ల్ అప్’లాంటి సంస్థలు, అదితిలాంటి వ్యక్తులు క్షేత్రస్థాయిలో చేస్తున్న కార్యక్రమాలు కీలకం అవుతాయి.‘నిన్న నువ్వు ఏమిటో తెలుసుకొనే జ్ఞాపకం నీలో ఉన్నట్లే రేపు నువ్వు ఏమిటో నిరూపించుకునే జ్ఞానం, శక్తి నీలో ఉన్నాయి’ అంటుంది అదితి అరోరా.దిశానిర్దేశంలింగ సమానత్వం, స్త్రీవాదం గురించి మాట్లాడడానికి స్కూల్స్, కాలేజీలకు వెళుతుంటుంది అదితి అరోరా. విద్యార్థుల మనసుల్లో దాగున్న ఎన్నో సందేహాలు ఆ సమయంలో బయటికి వస్తాయి. వాటికి సమాధానం ఇవ్వడమే కాదు దిశానిర్దేశం కూడా చేస్తుంది అదితి అరోరా. ఎన్నో బడులు, కాలేజీలలో గర్ల్ అప్ క్లబ్‌లను ఏర్పాటు చేసింది. ప్రతి క్లబ్లో అయిదుగురు సభ్యులతో పాటు ప్రెసిడెంట్, వైస్–ప్రెసిడెంట్, సెక్రెటరీలు ఉంటారు. నిర్దిష్టమైన అంశాలపై ఈ క్లబ్‌ల కోసం వర్క్‌షాప్‌లు కూడా నిర్వహించింది. అయితే కొన్ని విద్యాసంస్థలు మాత్రం ‘ఇలాంటి విషయాలు అమ్మాయిలకు ఎందుకు’ అన్నట్లుగానే వ్యవహరించాయి. వారి ధోరణితో ఎప్పుడూ నిరాశపడలేదు అదితి. -
ట్రాక్‌లో పడేదెప్పుడు? దశాబ్దకాలంగా అమలుకు నోచని వెహికిల్ ట్రాకింగ్
సాక్షి, హైదరాబాద్: మహిళలు, చిన్నారుల భద్రత కోసం అన్ని రకాల ప్రజా రవాణా వాహనాలను నిఘా చట్రంలోకి తేవాలన్న ప్రతిపాదన తాజాగా మరోసారి తెరపైకి వచ్చింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి రాత్రి పూట ఆలస్యంగా క్యాబ్‌లో వెళ్లేందుకు భయపడాల్సి వస్తోందని, ఇలాంటి వాహనాలపై పోలీసులు లేదా ఏదైనా ప్రభుత్వ సంస్థ నిఘా ఉంటే బాగుంటుందని ఇటీవల ఓ ప్రయాణికురాలు ట్వీట్ చేశారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన వెహికిల్ ట్రాకింగ్ అంశాన్ని పరిశీలించాలంటూ డీజీపీకి సూచించారు. ఢిల్లీ నిర్భయ ఘటన తరువాత అన్ని ప్రజా రవాణా వాహనాల్లో జీపీఎస్ ఆధారిత వెహికల్ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ముందుకు వచ్చింది. ఈ మేరకు అప్పట్లో రాష్ట్ర రవాణా శాఖ కూడా ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా గ్రేటర్లో తిరిగే క్యాబ్‌లు, ఆటోలు, ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు, తదితర అన్ని రకాల వాహనాల్లో జీపీఎస్ ట్రాకింగ్ పరికరాల ఏర్పాటును తప్పనిసరి చేయాలని నిర్ణయించారు. కానీ ఇప్పటివరకు అది అమలుకు నోచలేదు. దారుణం జరగినప్పుడే.. ఢిల్లీలో 2012లో చోటుచేసుకున్న నిర్భయ ఘటన దేశవ్యాప్తంగా మహిళల భద్రతను ప్రశ్నార్ధకం చేసింది. ముఖ్యంగా రాత్రి వేళ ప్రజా రవాణా వాహనాల వినియోగంపై భయాందోళనలను పెంచింది. క్యాబ్‌లు, ఆటోరిక్షాలు, ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణం ఏ మాత్రం క్షేమం కాదనే భావన నెలకొంది. ఆ తర్వాత కొద్దిరోజులకే హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని మాదాపూర్ నుంచి క్యాబ్‌లో ఇంటికి వెళ్లే సమయంలో అత్యాచారానికి గురైంది. ఆ తర్వాత జరిగిన మరికొన్ని ఘటనలు రాత్రివేళ ప్రయాణించే మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేశాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి వాహనంపై నిఘా తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు 2017లో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మేరకు చట్టాన్ని రూపొందించింది. ప్రజా రవాణా వాహనాలపై నిఘా ఏర్పాటు చేసేందుకు నిర్భయ నిధి కింద కేంద్రం ఇచ్చే నిధులను ఖర్చు చేయవచ్చునని రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు నిర్భయ నిధులు వచ్చాయి. కానీ మరోమారు ఈ అంశం అటకెక్కింది. నిఘా వ్యవస్థ ఏర్పాటు కాలేదు. గ్రేటర్లో తిరిగే క్యాబ్‌లలో ఆయా సంస్థలకు చెందిన వెహికిల్ ట్రాకింగ్ వ్యవస్థ ఉన్నప్పటికీ అవి పోలీసు నిఘా పరిధిలో లేవు. దీంతో ఫిర్యాదులొస్తే తప్ప పోలీసులు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకునేందుకు అవకాశం లేకుండా పోతోంది. మరోవైపు క్యాబ్ డ్రైవర్లు తమ వాహనాల్లోని డివైస్‌లను స్విచ్ ఆఫ్ చేస్తే వాటిని ట్రాక్ చేయడం కష్టంగా మారుతోంది. ట్రాకింగ్‌తో పక్కా నిఘా ప్రతి వాహనంలో జీపీఎస్ వెహికిల్ ట్రాకింగ్ డివైస్‌ను ఏర్పాటు చేయడం వల్ల దాని కదలికలపైన కచ్చితమైన నిఘా ఉంటుంది. ట్రాకింగ్ డివైస్ నుంచి ప్రతి 10 సెకన్లకు ఒకసారి వాహనం కదలికలు కమాండ్ కేంద్రానికి అందుతాయి. ఏదైనా ఇబ్బంది కలిగితే ప్రయాణికులు ఎస్ఓఎస్ బటన్ నొక్కితే కమాండ్ కంట్రోల్లో అలారం మోగుతుంది. వెంటనే పోలీసులు అప్రమత్తం అవుతారు. ప్రస్తుతం వాహనాల్లో అమర్చిన డివైస్‌లను తొలగించేందుకు ఏ మాత్రం అవకాశం లేకుండా పటిష్టంగా ఏర్పాటు చేసే సాంకేతిక వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ఏపీ, మహారాష్ట్ర, పంజాబ్, కేరళ, ప.బెంగాల్లో మైనింగ్ వాహనాలకు ఈ సాంకేతికతను వినియోగిస్తున్నారు. హైదరాబాద్‌లో ఆర్టీసీ కొన్ని బస్సులకు ఏర్పాటు చేసింది. రూ.5000 లోపు లభించే ట్రాకింగ్ డివైస్‌లను తప్పనిసరి చేయడం వల్ల మహిళలు, యువతులు, విద్యార్ధినులకు భద్రతతో కూడిన ప్రయాణాన్ని అందజేయవచ్చు. ఆచరణ సాధ్యమే వెహికిల్ ట్రాకింగ్ వ్యవస్థ ప్రతిపాదన దశలోనే ఉంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ప్రతి వాహనంలో ఈ డివైస్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ప్రభుత్వం ఆదేశిస్తే ఆచరణసాధ్యమే. – రమేశ్, సంయుక్త రవాణా కమిషనర్, ఐటీ విభాగం తక్కువ ఖర్చుతో భద్రత వెహిల్ ట్రాకింగ్ డివైస్‌లు ఏ మాత్రం భారం కాదు. కేవలం నాలుగైదు వేల రూపాయల ఖర్చుతో మంచి భద్రత కలి్పంచవచ్చు. ఇప్పుడు మరింత కచి్చతమైన ప్రమాణాలతో రూపొందించిన డివైస్‌లు అందుబాటులో ఉన్నాయి. ఒకసారి వాటిని వాహనంలో ఏర్పాటు చేస్తే తొలగించడం సాధ్యం కాదు. – ఆర్.ఎల్ రెడ్డి, సాంకేతిక నిపుణులు చదవండి: 'మంత్రి పీఏనే లీకేజీ సూత్రధారి.. జైలులో ప్రవీణ్,రాజశేఖర్‌కు బెదిరింపులు' -
అమ్మాయిలు అన్నీ చెప్పేస్తారు.. మోసపోయిన తర్వాత కానీ..
మోసం చేశాడని చేతుల్లో ముఖం దాచుకుంటే మోసపోయానని తనను తాను హింసించుకుంటే పోయిన కాలం తిరిగి రాదు... జీవితం కూడా. సాంకేతికత మన పురోగతికి సాధనం మాత్రమే. సాంకేతికత మన జీవితాన్ని నిర్దేశించే ఆయుధం కాదు. అది ప్రశ్నించి... పరిహసించే పరిస్థితికి లోనుకావద్దు. ‘అబ్బాయిల చేతిలో అమ్మాయిలు మోసపోతున్నారు’... ఈ మాట పందొమ్మిది వందల అరవైలలో ఉండేది, ఎనభైలలోనూ ఉండేది. ఇరవై ఒకటో శతాబ్దంలోనూ వింటున్నాం. ‘మోసపోతున్నది అమ్మాయిలేనా అబ్బాయిలు మోసపోవడం లేదా, మోసం చేస్తున్నది అబ్బాయిలేనా మోసం చేస్తున్న అమ్మాయిలు లేరా’ అనే కౌంటర్ వాదన కూడా అప్పుడూ ఉంది, ఇప్పుడూ ఉంది... తేడా అంతా మోసపోతున్న తీరులోనే. టెక్నాలజీ విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. సద్వినియోగంతో పాటు దుర్వినియోగమూ ఎక్కువైంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో వేగం వచ్చింది, మోసం చేయడం సులువైంది. సోషల్ మీడియా ఇద్దరి జీవితాలను నిర్దేశించే స్థాయికి వెళ్లిందంటే... ఆ తప్పు టెక్నాలజీది కాదు, టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలో తెలియని మనిషిదే. అమ్మాయిలు తమకు చట్టపరమైన రక్షణ ఉందా లేదా అనే ఆలోచన లేకుండా తమకు తాముగా జీవితాన్ని అభద్రతవలయంలోకి నెట్టివేసుకుంటున్నారని చెప్పారు సీనియర్ న్యాయవాది పార్వతి. ‘‘మా దగ్గరకు వచ్చే మహిళలనే గమనిస్తే... ఒకప్పుడు ఎక్కువ శాతం భర్త, అత్తింటి వారి నుంచి వేధింపులు, గృహహింస కారణాలతో వచ్చేవారు. ప్రేమ పేరుతో మోసం చేశాడని కూడా వచ్చేవారు. ఇప్పుడు ‘కొంతకాలం లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండి, ఇప్పుడు మొహం చాటేశాడనే కేసులు ఎక్కువయ్యాయి. ఇలాంటి కేసుల వివరాల్లోకి వెళ్తే ఆ ఇద్దరి మధ్య పరిచయానికి వేదిక సోషల్ మీడియానే అయి ఉంటోంది. ముఖాముఖి కలవడానికి ముందే ఒకరి గురించి ఒకరు అన్ని విషయాలనూ షేర్ చేసుకుని ఉంటున్నారు. సరిగ్గా ఇక్కడే అమ్మాయిలు గమనించాల్సింది, జాగ్రత్త పడాల్సిందీ. ఎందుకంటే... అబ్బాయిలు మాటల్లో పెట్టి అమ్మాయిల వివరాలన్నీ తెలుసుకుంటున్నారు, తన గురించిన వివరాలను చాలా జాగ్రత్తగా ఇస్తారు. అతడు మొహం చాటేశాక, అతడి గురించి ఈ అమ్మాయిలను ఏ వివరం అడిగినా తెల్లమొహం వేస్తారు. ‘అన్ని వివరాలనూ షేర్ చేస్తున్నామని చెప్పారు కదా, అతడి గురించి నువ్వు తెలుసుకున్న దేంటి?’ అని అడిగినప్పుడు అమ్మాయిలు చెప్పే వివరాల్లో అతడి అభిరుచులు, ఇష్టమైన క్రీడాకారులు, అతడు చూసిన సినిమాలు, జీవితం పట్ల అతడి ఆకాంక్ష లు, చదివిన పుస్తకాలు... ఇలా ఉంటుంది జాబితా. అతడి ఉద్యోగం, చదువు, ఊరు, అమ్మానాన్నలు ఎక్కడ ఉంటారు, అక్కచెల్లెళ్లు, అన్నదమ్ముల వివరాలు... ఏమీ చెప్పలేరు. ఒకవేళ అప్పటికే పెళ్లయిన వాడా అని కూడా తెలుసుకోరు. అతడు ఫోన్ నంబర్ మార్చేస్తే ఇక ఏ రకంగానూ అతడిని ట్రేస్ చేయలేని స్థితిలో ఉంటుంది పరిస్థితి. అమ్మాయిలు అన్నీ చెప్పేస్తారు! అమ్మాయిలు మాత్రం తనతో పాటు ఇంట్లో అందరి ఫొటోలు షేర్ చేయడం, ఇంటి అడ్రస్, అమ్మానాన్నల పేర్లు, ఉద్యోగం, బ్యాంకు బాలెన్స్, నగలు... అన్నీ చెప్పేసి ఉంటారు.‘పరిచయమైన వ్యక్తి ఫోన్ చేసి పలకరించేటప్పుడు చాలా సాధారణమైన మాట ‘భోజనం చేశావా’ అని అడిగితే దానిని తన మీదున్న కన్సర్న్ అని మురిసిపోతారు. తనకు సమయానికి అన్నం వండి పెట్టిన అమ్మ, తనకు అన్నీ అమర్చి పెడుతున్న నాన్న ఆ పనులన్నీ తన మీద ప్రేమతోనే చేస్తున్నారనే ఆలోచన రావడం లేదు. అతడి నుంచి ‘గుడ్‌నైట్’ మెసేజ్ వస్తుంది, దానికి అమ్మాయి నుంచి వెంటనే రిప్లయ్ వస్తే ‘ఇంకా నిద్రపోలేదా’ అని అడుగుతాడు. ఇవన్నీ చెప్పి.. ‘నా మీద అంత ప్రేమగా ఉండేవాడు. మా అమ్మానాన్నల కంటే ఎక్కువ ప్రేమ చూపించాడు. అందుకే ఇంటి నుంచి వెళ్లిపోయి ఇద్దరం సహజీవనంలో ఉన్నాం’ అని చెబుతారు. అవతలి వ్యక్తి పెళ్లి ప్రస్తావన రానివ్వకుండా జాగ్రత్తపడిన విషయం మోసపోయిన తర్వాత కానీ అమ్మాయిలకు తెలియడం లేదు. ఈలోపు అమ్మాయి బ్యాంకు బాలెన్స్, నగలు ఖర్చయిపోయి ఉంటాయి. శ్రద్ధావాకర్ కేసులో దారుణం జరిగింది కాబట్టి సమాజం దృష్టిలోకి వస్తుంది. కానీ అలాంటి పరిస్థితి రాలేదనే మాటే కానీ మోసపోయి... న్యాయపోరాటం చేయలేక, ఆవేదనతో మానసికంగా కృంగిపోతున్న వాళ్లు ఎందరో’’ అని చెప్పారు లాయర్ పార్వతి. వంచనకు సాధనం అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ప్రేమ పేరుతో వంచించడానికి సోషల్ మీడియాను సాధనంగా ఉపయోగించుకుంటున్నారు. ఒక వ్యక్తితో ముఖాముఖి మాట్లాడితే ఒకసారికి కాకపోయినా ఐదారు దఫాలు మాట్లాడిన తర్వాతకైనా ముసుగు జారిపోతుంది. ఇక ఫేస్బుక్, వాట్సాప్ చాటింగ్‌లో అవతలి వ్యక్తి మనోభావాలను పసిగట్టడం సాధ్యం కానే కాదు. మోసపోతున్నది అమ్మాయిలు మాత్రమే అని కాదు, మోసపోతున్న వాళ్లలో ఎక్కువ శాతం అమ్మాయిలే ఉంటున్నారు. ఒకప్పుడు కలం స్నేహాలు ఎక్కడో ఉన్న ఇద్దరు వ్యక్తులను అనుసంధానం చేసేవి. అవి పరస్పరం అభిప్రాయాలు, అభిరుచులను షేర్ చేసుకోవడానికే పరిమితమయ్యేవి. సోషల్ మీడియా స్నేహాలు జీవితాలను నిర్దేశిస్తున్నాయి, తప్పుదారిలో నడిపిస్తున్నాయంటే... ఆ తప్పు సాంకేతికతది కాదు. మెదడు ఉన్న, విచక్షణ ఉండాల్సిన మనిషిదే. – వాకా మంజులారెడ్డి చట్టాలున్నాయి...కానీ! పెళ్లి చేసుకున్న మహిళకు చట్టపరంగా ఎలాంటి రక్షణ ఉందో, సహజీవనం విషయంలో కూడా అలాంటి రక్షణను కల్పించింది చట్టం. అయితే సహజీవనాన్ని నిరూపించుకోవాలి. చాలా సందర్భాల్లో నిరూపణ కష్టమవుతోంది. ఆ ఇద్దరూ ఒకే కప్పు కింద జీవించారని చుట్టుపక్కల వాళ్లు సాక్ష్యం చెప్పాలి. అలాగే ఆ ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్నట్లు సెల్‌ఫోన్ సిగ్నల్స్ వంటి సాంకేతిక ఆధారాలను చూపించవచ్చు. కానీ న్యాయస్థానం ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్‌ని ప్రధాన సాక్ష్యంగా పరిగణించడం లేదు, సెకండరీ ఎవిడెన్స్‌గా మాత్రమే తీసుకుంటుంది. సహజీవనాన్ని నిరూపించలేని పరిస్థితుల్లో ‘క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, చీటింగ్’ కేసులు పెట్టవచ్చు. కానీ అమ్మాయిలు, వారి తల్లిదండ్రులకు, సమాజానికి భయపడి ఈ పని చేయలేకపోతున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు కూడా కేసులు పెట్టి జీవితంలో మరింత అల్లకల్లోలంలోకి వెళ్లడానికి ఇష్టపడరు. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండడమే చెప్పదగిన సూచన. పుట్టిన రోజుకి ఫ్లవర్ బొకేలు పంపించినంత మాత్రాన అతడిది సంపూర్ణమైన ప్రేమ అనే భ్రమలోకి వెళ్లవద్దు. – ఈమని పార్వతి, హైకోర్టు న్యాయవాది -
Delhi Acid Attack: జాగ్రత్త... ప్రమాదం పొంచే ఉంది
యాసిడ్ అమ్మకాల మీద నిఘా పెట్టాం. మహిళల రక్షణకు చట్టాలు కఠినతరం చేశాం. షీ టీమ్స్ సిద్ధంగా ఉన్నాయి. యాప్స్ డెవలప్ అయ్యాయి. నిజమే. కాని ప్రమాదం పొంచే ఉంది. ఢిల్లీలో తాజా యాసిడ్ దాడి ఘటన ఈ విషయమే నిర్థరిస్తోంది. ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ (ఎన్.సి.ఆర్.బి) నివేదిక ప్రకారం 2021లో దేశవ్యాప్తంగా 176 యాసిడ్ దాడులు నమోదయ్యాయి. మరో 73 అటెంప్ట్స్ జరిగాయి. అంటే ప్రమాదం పొంచే ఉంది. నిర్లక్ష్యం ఏ మాత్రం పనికి రాదు. వాస్తవాలు ఆందోళన కలిగిస్తున్నప్పుడు ఎవరి జాగ్రత్తలో వారు ఉండటం మంచిది. 2013లో సుప్రీం కోర్టు యాసిడ్ అమ్మకాల మీద జవాబుదారీ ఉండాలని చెప్పింది. రిజిస్టర్ మెయింటెయిన్ చేయాలని చెప్పింది. అంతే కాదు ఐ.డి.ప్రూఫ్ లేకుండా యాసిడ్ అమ్మకూడదు. అలా చేస్తే 50 వేల రూపాయల ఫైన్ ఉంది. అయితే 2016లో ఢిల్లీలో కొంతమంది పోలీసులు మఫ్టీలో యాసిడ్ కొన ప్రయత్నిస్తే 23 షాపులు ఎవరు ఏమిటి అనకుండా అమ్మారు. అప్పుడు గగ్గోలు అయ్యింది. తాజాగా ఢిల్లీలో జరిగిన యాసిడ్ దాడిలో నిందితుడు ఫ్లిప్‌కార్ట్ ద్వారా యాసిడ్‌ను కొన్నాడని పోలీసులు గుర్తించారు. ఇప్పుడు ఆన్లైన్ అమ్మకం దారులను యాసిడ్ అమ్మకాలపై జాగ్రత్త వహించవలసిందిగా తాకీదులు పంపుతున్నారు. అంటే చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమే. పరిస్థితి దారుణం కోవిడ్ కాలంలో తప్ప దేశంలో యాసిడ్ దాడులు జరుగుతూనే ఉన్నాయి. స్త్రీలు బలవుతూనే ఉన్నారు. ప్రేమ వద్దన్నారని, ప్రేమలో ఉన్నాక బ్రేకప్ చెప్పారని, పెళ్లయ్యాక విడిపోయారని రకరకాల కారణాల వల్ల పురుషులు ద్వేషంతో యాసిడ్ దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. 2016 నుంచి 2021 మధ్య 1300 యాసిడ్ దాడులు జరిగాయి. విషాదం ఏమిటంటే ఈ యాసిడ్ దాడుల్లో నేరస్తులకు శిక్ష పడుతున్న శాతం అతి తక్కువగా ఉండటం. 400 కేసులు నమోదు అయితే 10 మందికి మాత్రమే శిక్ష పడుతోందంటే ఎన్ని విధాలుగా తప్పించుకుంటున్నారో, తప్పించుకోవచ్చులే అనే ధైర్యంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అప్రమత్తత అవసరం విద్యార్థినులు, యువతులు, స్త్రీలు తమకు తారసపడుతున్న ప్రేమ, వైవాహిక బంధాలలో పురుషుల ధోరణి పట్ల అప్రమత్తంగా ఉండాలి. బెదిరిస్తున్నవారిని, వద్దనుకున్నా వెంటపడుతున్నవారిని, ఒకవేళ బంధం నుంచి బయటపడాలనుకుంటే ఆ మగవారిని గమనించి వారి ధోరణి ప్రమాదకరంగా అనిపిస్తే ముందే కుటుంబ సభ్యుల, పోలీసుల మద్దతు తీసుకోవాలి. ముఖ్యంగా ఇష్టం లేని ప్రేమ ప్రతిపాదిస్తున్నప్పుడు, ప్రేమలో నుంచి బ్రేకప్ చెబుతున్నప్పుడు, విడాకుల సందర్భాలలో ఒంటరిగా తిరిగేటప్పుడు అప్రమత్తంగా ఉండటం, ఎవరైనా అపరిచితుడు లేదా పాత మిత్రుడు దగ్గరిగా వస్తుంటే జాగ్రత్త పడటం, అసలు వీలైనంత సామరస్యంగా, ఒప్పుదలతో బంధాల నుంచి బయటపడటం... ఇవన్నీ ముఖ్యమైనవే. దేశంలో యాసిడ్ దాడులను నిర్మూలించామని ఎవరూ హామీ ఇవ్వడం లేదు. కనుక మన రక్షణకు మనమే బాధ్యత వహించాలి. కుటుంబం, పోలీసుల వద్ద సమస్యను దాచకుండా సాయం పొందాలి. (క్లిక్ చేయండి: వరతమ్మా నీకు వందనాలమ్మా!) -
మహిళల భద్రతకు.. అక్షరాలా రక్షణ ఇస్తాయి
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మహిళల భద్రతకు ఉపయోగపడే బ్రేస్లెట్ తయారుచేసి అభినందనలు అందుకున్నారు. గోరఖ్‌పుర్‌లోని ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఇంజినీరింగ్ కాలేజీ’కి చెందిన స్నేహ, అక్షితలు తయారుచేసిన ఈ బ్రేస్‌లెట్‌కు ‘నిర్భయ’ అని పేరు పెట్టారు. ఈ బ్రేస్లెట్ ఉమెన్ సేఫ్టీ యాప్‌కు అనుసంధానమై ఉండడంతో పాటు, అయిదు నంబర్లతో కనెక్టై ఉంటుంది. మరికొన్ని గ్యాడ్జెట్స్ గురించి... ‘బర్డ్ఐ’ అనేది పర్సనల్ సేఫ్టీ అలారమ్. అన్నివేళలా దీన్ని వెంట తీసుకెళ్లవచ్చు. ఆపద సమయంలో పెద్ద శబ్దం, వెలుగుతో ఎటాకర్ను భయపెడుతుంది. చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేస్తుంది. సేఫ్టీగా ఫీలైన సమయంలో డీయాక్టివేట్ చేయవచ్చు. బ్యాగు, పర్స్‌లలో కూడా ఈ పరికరాన్ని తీసుకెళ్లవచ్చు. డ్రైవ్ చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు కింద పడితే, చుట్టుపక్కల ఎవరూ లేకుంటే... ఇలాంటి సమయంలో యాపిల్ వాచ్ ఎస్ఇ(సిరీస్4)లోని ‘ఫాల్ డిటెక్ట్ ఫీచర్’ ఉపయోగపడుతుంది. ఎమర్జెన్సీ కాంటాక్ట్స్‌ను అప్రమత్తం చేస్తుంది. ‘ది రోడ్ ఐడీ బ్రేస్లెట్’ కూడా ఇలాంటిదే. ‘ది గార్డెడ్ రింగ్’ అనేది ఉత్త రింగ్ మాత్రమే కాదు. సెల్ఫ్ డిఫెన్స్ యాక్సెసరీ కూడా. ఆపద సమయంలో ఈ రింగ్‌లో రహస్యంగా అమర్చిన పదునైన బ్లేడ్‌ను ఉపయోగించుకోవచ్చు. (క్లిక్ చేయండి: ప్రాణాలు కాపాడుతున్న ఐఫోన్లు.. ఎలాగంటే..) -
‘మహిళా ఉద్యోగులకు వేధింపులపై మహిళా కమిషన్ దృష్టి’
సాక్షి, విశాఖపట్నం: మహిళా ఉద్యోగుల వేధింపులపై మహిళా కమిషన్ దృష్టి సారించిందని ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. ఆమె సోమవారం మీడియాతో మట్లాడుతూ.. అంతర్గత కమిటీలపై కమిటీలు వేస్తున్నామని తెలిపారు. దిశా యాప్, స్పందన, వాలంటీర్ ద్వారా ఎన్నో ఘటనలో వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ పరిపాలనలో మహిళా సంక్షేమాని పెద్దపీట వేశారని పేర్కొన్నారు. బాలికలు దగ్గర నుంచి పండు ముసలి వరకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. చదవండి: బీజేపీ విధానాలను తిప్పికొడతాం: రాఘవులు రాజకీయం రంగంలో పురుషులకు సమానంగా మహిళలకు సీఎం జగన్ సముచిత స్థానం కల్పించారని వాసిరెడ్డి పద్మ అన్నారు. మహిళా సాధికారత కోసం మహిళా కమీషన్ రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తోందని తెలిపారు. గత ప్రభుత్వంలో మహిళలకు అన్యాయం జరిగినా స్పందించని చంద్రబాబు, ఇప్పుడు విమర్శలు చేయడం సమంజసం కాదని మండిపడ్డారు. చదవండి: లోకేశ్ రచ్చ.. సామాన్య కుటుంబానికి శిక్ష -
4 నిమిషాల్లో ‘దిశ’ రక్షణ
నెల్లూరు (క్రైమ్): ఆటోడ్రైవర్ ప్రవర్తనను అనుమానించి ఆటోలోంచి దూకేసిన యువతిని 4 నిమిషాల్లోనే పోలీసులు ఆదుకున్నారు. దిశ యాప్ ఆ యువతికి నిమిషాల్లోనే రక్షణ కల్పించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం నెల్లబల్లి వద్ద జాతీయ రహదారిపై శనివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. డీఐజీ త్రివిక్రమవర్మ, జిల్లా ఎస్పీ సీహెచ్ విజయారావు ఆదివారం నెల్లూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన యువతి శ్రీసిటీలో ఉద్యోగం చేస్తూ సూళ్లూరుపేటలో తన సహచరులతో కలిసి నివాసం ఉంటోంది. ఇటీవల మార్కాపురం వెళ్లిన ఆమె శనివారం సూళ్లూరుపేటకు బయలుదేరింది. రాత్రి 9.25 గంటలకు నాయుడుపేటలో బస్సు దిగింది. సూళ్లూరుపేట వెళ్లేందుకు 10.30 గంటల వరకు చూసినా బస్సు లేకపోవడంతో బస్టాండ్ బయటకు వచ్చి ఆటో మాట్లాడుకుంది. ఒంటరిగా వెళ్లలేక ప్రయాణికులను ఎక్కించుకోమని డ్రైవర్‌కు సూచించింది. బైపాస్ వద్ద ఎక్కించుకుంటానని చెప్పిన ఆటో డ్రైవర్ ఎవరినీ ఎక్కించుకోకుండా వేగంగా వెళ్లసాగాడు. అతడి ప్రవర్తనను అనుమానించిన ఆమె బస్‌స్టాప్ వద్ద ఆపమని కోరినా అతడు పట్టించుకోకుండా వెళ్లసాగాడు. దీంతో ఆ యువతి ఈ విషయాన్ని ఫోన్లో తన సోదరికి తెలిపి, నెల్లబల్లి వద్ద ఆటోలోంచి దూకేసింది. బాధిత యువతి సోదరి తన స్నేహితురాలి మొబైల్లోని దిశ యాప్‌ను ఓపెన్ చేసి ఎస్‌వోఎస్ బటన్ నొక్కి పోలీసులకు సమాచారం ఇచ్చింది. బాధిత యువతి ఫోన్ నంబరు తెలిపింది. నెల్లూరు పోలీసు కమాండ్ కంట్రోల్ నుంచి 10.38 గంటలకు సమాచారం అందుకున్న హైవే మొబైల్ పోలీసులు 10.40 గంటలకు బాధిత యువతితో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. దొరవారిసత్రం పోలీసులు, హైవే మొబైల్ సిబ్బంది 10.42 గంటలకు యువతి వద్దకు చేరుకుని ఆమెను తమ వాహనంలో ఎక్కించుకుని సురక్షితంగా సూళ్లూరుపేటలోని ఆమె సోదరి వద్దకు తీసుకెళ్లారు. నిమిషాల్లోనే యువతిని రక్షించిన పోలీసు సిబ్బందిని, అధికారుల్ని డీఐజీ, ఎస్పీ అభినందించారు. బాధిత యువతి, ఆమె సోదరి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. దిశ యాప్ తమను రక్షించిందని పేర్కొన్నారు. -
అమ్మా.. మీ రక్షణకే ఈ ‘దిశ’ ( ఫోటోలు )
-
ఏపీ: భారీగా పెరిగిన దిశ యాప్ డౌన్లోడ్లు
సాక్షి, విజయవాడ: మహిళల రక్షణే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశా యాప్‌నకు మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ యాప్ గురించి అవగాహనా సదస్సు నిర్వహించిన తర్వాత దిశ యాప్ డౌన్లోడ్ భారీగా పెరగడమే ఇందుకు నిదర్శనం. గతంలో రోజుకు 5వేల మంది మాత్రమే ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటే.. ఇప్పుడు రోజుకు 20వేలకు పైగా డౌన్లోడ్లు నమోదవుతున్నాయి. ఇక ఇప్పటివరకు 2 లక్షల మందికి పైగా మహిళలు దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. కాగా విపత్కర పరిస్థితుల్లో దిశ యాప్ ఓపెన్ చేసేందుకు తగిన సమయం లేకపోతే ఫోన్‌ను గట్టిగా అటుఇటూ ఊపితే చాలు .. యాప్ ద్వారా పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌కి మెసేజ్ వెళ్తుంది. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఫోన్‌కి కాల్ చేసి వివరాలు సేకరిస్తారు. పోలీసుల ఫోన్‌కి ఎవరూ స్పందించకపోతే పోలీస్ వెహికల్స్‌లో అమర్చిన మొబైల్ డేటా టెర్మినల్ సహాయంతో జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా బాధితులు ఉన్న లోకేషన్‌కి పోలీసులు వేగంగా చేరుకునేలా ఏర్పాటు. 2020 ఫిబ్రవరిలో ఈ యాప్‌ను ఆండ్రాయిడ్, ఆపిల్ ఫోన్లలలో ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. -
ఆకాంక్షలను గుర్తిస్తున్న కాలం!
పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న వేళ.. రోజువారీ జీవితం తీపి, చేదుల మిశ్రమంగానే కనిపించడం సహజం. ప్రపంచ పరిణామాలూ, దేశీయ ఘటనలు కూడా ఈ క్రమానికి అనుగుణంగానే సాగడం గమనార్హం. నూతన సంవత్సర ప్రారంభం నాటికి ప్రపంచంలో కొట్టొచ్చినట్లు కనిపించే విశేషం ఏమిటంటే సమస్యల రాజకీయాల స్థానంలో ఆకాంక్షల పరిష్కారాల దిశగా మార్పు కొట్టొచ్చినట్లు కనిపించడమే. 2019 సంవత్సరం హాంకాంగ్, లెబనాన్, సూడాన్ వంటి ప్రపంచ దేశాల్లోనూ, భారతదేశంలోనూ విద్యార్థుల తిరుగుబాటుకు సంకేతంగానే నిలించింది. హాంకాంగ్, లెబనాన్, చీలీ, కేటలోనియా, ఇరాక్, రష్యా వంటి పలు దేశాల్లో నగర వీధులు ప్రభుత్వ వ్యతిరేక నిరసన ప్రదర్శనలతో దద్దరిల్లాయి. ముఖ్యంగా 10 నుంచి 16 ఏళ్ల లోపు వయసున్న పిల్లలు తమ తమ దేశ ప్రభుత్వాలపై తీవ్రనిరసనలతో వీధుల్లోకి రావడమే. ముఖ్యంగా చైనా ప్రభుత్వం తమపై మోపిన నిరంకుశ చట్టానికి వ్యతిరేకంగా హాంకాంగ్‌లో పసిపిల్లలు లక్షల సంఖ్యలో వీధుల్లోకి వచ్చారు. చీలీలో నిరసనలు వెల్లువెత్తడంతో ఆ దేశాధ్యక్షుడు దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చింది. ఇక 16 ఏళ్ల స్వీడన్ బాలిక గ్రేటా థన్ బెర్గ్.. వాతావరణ మార్పుపై ప్రపంచవ్యాప్తంగా చైతన్యం తీసుకొచ్చిన గొప్ప మార్పుకు నాందిపలికింది. లెబనాన్‌లో దశాబ్దాలుగా ఒంటెత్తు రాజకీయాలు నడుపుతున్న నాయకత్వంపై యువత ఆకస్మికంగా తిరుగుబాటు ప్రకటించింది. ఇక సూడాన్‌లో 22 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థిని ఎలా షలాహ్ జనసమూహంలో కారుపై నిల్చుని ఒమర్ అల్ బషీర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన నినాదాలు, పాడిన పాటలు ప్రపంచవార్తగా మారాయి. భారత్ విషయానికి వస్తే ఢిల్లీలో విద్యార్థుల నిరసన ప్రదర్శనల దెబ్బకు మెట్రో, విమాన సర్వీసులను సైతం మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. టెక్నాలజీ ద్వారా ప్రజలకు సంక్రమించే సమాచారం ఎంతవేగంగా జన సమీకరణకు వీలుకల్పిస్తుందో అర్థమైన భారత ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు సందర్భంలో కశ్మీర్ వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను మూసివేసింది. ఇక రామ మందిర్ వివాదంపై శతాబ్దాల గొడవపై సుప్రీం కోర్టు తీర్పు ఇరుపక్షాల ప్రజల్లో ఆగ్రహావేశాలను కలిగించలేదు కానీ.. జాతీయ పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టిక రేపిన పెనుజ్వాలలు దేశాన్ని మండించాయి. ప్రజల ఆకాంక్షల్ని పట్టించుకోకుండా చట్టసభల్లో మెజారిటీ ప్రాతిపదికన మొండిగా తీసుకొచ్చే చట్టాలు ప్రజామోదం పొందవని ఇవి నిరూపించాయి. కాగా, డిసెంబర్ 12న ఎన్నార్సీకి వ్యతిరేకంగా ఢిల్లీలోని జామియా యూనివర్శిటీ విద్యార్థినులు వణికించే చలిలో రాత్రిపూట కారుపై నిలబడి చేసిన నినాదాలు విశేష చర్చకు దారి తీశాయి. ఎన్నార్సీ మాకు వద్దు అంటూ తమిళనాడులో ముగ్గుల రూపంలో యువతులు చేసిన నిరనన నిరంకుశత్వంపై సృజనాత్మక పోరాటానికి దారితీసింది. సంప్రదాయకరమైన ముగ్గులను నిరసన తెలిపేమార్గంగా ఎంచుకున్న యువతులను అరెస్ట్ చేయవచ్చు.. ఆ రాష్ట్ర వ్యాప్తంగా 50 వేలమందిపై కేసులు పెట్టవచ్చు కానీ యువత తిరుగుబాటును చట్టాలు, అరెస్టులు అడ్డుకోలేవని ఈ పరిమాణం తేల్చి చెప్పింది. ఏపీ ప్రభుత్వ దిశానిర్దేశం నిర్భయ ఉదంతం తర్వాత హైదరాబాద్‌లో దిశ ఘటన మన జాతి చైతన్యాన్ని మరోసారి కదిలించి ప్రభుత్వాలను నిలదీసింది. వేలాది మంది యువతులు, విద్యార్థినులు దిశ ఘటన తర్వాత ఈ దేశంలో తాము బతకగలమా అంటూ ఢిల్లీలో, డజన్ల కొద్దీ నగరాల్లో చేసిన నిరసన ప్రదర్శనలు ప్రభుత్వాలనే కదిలించివేశాయి, ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వ తీసుకున్న అనూహ్య చర్య (దిశహంతకుల ఎన్కౌంటర్) కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశ చరిత్రలో తొలిసారిగా మహిళల భద్రత పట్ల తీసుకొచ్చిన దిశా చట్టం కానీ.. యువత ఆకాంక్షలను పరిష్కరించే క్రమం మొదలైందని చాటి చెప్పాయి. చిన్నారులను లైంగిక వేధింపులకు గురిచేయడం లాంటి ఘటనలను తీవ్రంగా పరిగణించిన వైఎస్ జగన్ ప్రభుత్వం కఠిన చట్టం రూపకల్పనతో దిశానిర్దేశం చేసింది. 2019కి వీడ్కోలు చెబుతూ 2020కి స్వాగతం పలుకుతున్న సందర్భంగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా ప్రభుత్వాలు మరింత క్రియాశీలంగా నడుచుకుంటాయని ఆశిద్దాం. – కె. రాజశేఖరరాజు -
ఏపీలో ఆరు శాతం నేరాలు తగ్గుముఖం
సాక్షి, విజయవాడ: ఏపీలో ఆరు శాతం నేరాల సంఖ్య తగ్గిందని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 2019లో ఏపీ పోలీసుల పనితీరును వివరించారు. ఏపీలో మహిళాభద్రతకు ప్రధాన ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. కేవలం రెండు జిల్లాలకే (విశాఖ,తూర్పు) మావోయిస్ట్ కార్యకలాపాలు పరిమితమయ్యాయని తెలిపారు. గుట్కా, ఇసుక, బెల్టుషాపులు, గంజాయిపై ఉక్కుపాదం మోపామని చెప్పారు. సామాన్యులపై ప్రభావం చూపుతున్న జూదం, పేకాట క్లబ్‌లను మూసివేశామని పేర్కొన్నారు. సమర్థవంతంగా దిశ బిల్లు అమలు చేస్తున్నామని తెలిపారు. ఏపీలో అన్ని పోలీస్స్టేషన్లలో జీరో శాతం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నామని చెప్పారు. జాతీయస్థాయిలో ఏపీ పోలీసులకు గుర్తింపు వచ్చిందన్నారు. స్కోచ్, డీఎస్‌సీఐ జీ ఫైల్స్‌కు సంబంధించి ప్రధాని మోదీ ప్రశంసించారని తెలిపారు. పోలీసులకు వీక్లీ ఆఫ్‌లను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాల్లో పోలీసు వాలంటీర్ల నియామకం చేపట్టినట్లు వెల్లడించారు. దేశంలో మొదటిసారి కొత్త సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తున్నామని పేర్కొన్నారు. సమర్థవంతంగా స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నామని డీజీపీ తెలిపారు. -
మహిళను కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్
సికింద్రాబాద్: కదులుతున్న రైలు నుంచి కిందపడబోయిన మహిళను ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ సైఫుద్దీన్ అప్రమత్తతకు మెచ్చిన ఉన్నతాధికారులు శనివారం అభినందించారు. ఈ నెల 18న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి దానాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు కదులుతుండగా అందులోంచి ఒక మహిళ దిగేందుకు ప్రయత్నించింది. రైలులో తమ బంధువులను ఎక్కించి తిరిగి సదరు మహిళ దిగే క్రమంలో రైలు వేగం పుంజుకుంది. ఫుట్‌పాత్ మీద కాలువేయబోయిన మహిళ బోగీ నుంచి జారి బోగీ, ప్లాట్‌ఫామ్ మధ్యన పడబోయింది. అదే ప్లాట్‌ఫామ్‌పై విధులు నిర్వహిస్తున్న ఆర్పీఎఫ్ హెడ్‌కానిస్టేబుల్ మహిళ జారిపడుతున్న బోగీ వద్దకు పరుగున వెళ్లి ఆమెను పట్టుకుని ప్లాట్‌ఫామ్ మీదకు లాక్కొచ్చాడు. దీంతో రైలుబోగీ, ప్లాట్‌ఫామ్ అంచున నలిగిపోవాల్సిన మహిళ సురక్షితంగా బయటపడింది. సీసీ పుటేజీల ద్వారా సైఫుద్దీన్ అప్రమత్తతను గుర్తించిన అధికా రులు అతన్ని అభినందించారు. -
జీరో ఎఫ్ఐఆర్పై స్పష్టమైన ఆదేశాలిచ్చాం
సాక్షి, అమరావతి: మహిళల రక్షణ, భద్రతకు ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందని హోంమంత్రి మేకతోటి సుచరిత్ర తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజు మహిళా భద్రతపై చర్చ జరిగింది. మహిళల రక్షణ, సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి ఆమె శాసనసభలో వివరించారు. మహిళలు, కిశోర బాలికలను చైతన్యపరిచి సాధికార పరచటానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. 11వేల గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులు, 3వేల వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శుల పదవులను నోటిఫై చేశామన్నారు. ఈ నియామకాలు ద్వారా పోలీసు సేవలు మరింత మెరుగుపడతాయన్నారు. మహిళలు, చిన్నారులకు మరింత రక్షణ కల్పించేందుకు ‘మహిళా మిత్ర’ ఏర్పాటు చేశామని వెల్లడించారు. యువత, బాలలకు అవగాహన కల్పించి మహిళలపై నేరాలు తగ్గించడమే లక్ష్యమన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో ఇద్దరు పోలీస్ అధికారులు, మహిళా మిత్రలను సమన్వయకర్తలుగా చేసి మహిళా మిత్ర ఉద్దేశాలు, లక్ష్యాలపై శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. ఆపదలో ఉన్న మహిళలను తక్షణమే రక్షించడం కోసం ‘సైబర్ మిత్ర ప్రత్యేక వాట్సాప్ నంబర్ 9121211100’ ఏర్పాటు చేశామన్నారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించటం, మహిళల్లో విశ్వాసాన్ని నింపటానికి బహిరంగ ప్రచారాలు, అవగాహన కార్యక్రమాల్ని నిర్వహిస్తామని సుచరిత వివరించారు. మహిళల భద్రత కోసం కఠినమైన న్యాయ చర్యలు చేయటానికి వీలుగా నేరాలపై కేసులు తక్షణ నమోదు చేయటానికి అన్ని పోలీస్ స్టేషన్ అధికారులకు దీర్ఘకాలిక సూచనలు ఇచ్చామని తెలిపారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయటానికి ఏపీ డీజీపీకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నారు. మహిళలపై నేరాల పరిష్కారం కోసం ప్రత్యేక ఫాస్ట్ కోర్టులను 13 జిల్లాల్లో ఏర్పాటు చేశామన్నారు. వీటికి అదనంగా పోస్కో కేసుల పరిష్కారానికి 8 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పనిచేస్తున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ డబ్ల్యూసీ మంత్రిత్వశాఖ మహిళా పోలీస్ వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించిందని వివరించారు. గృహహింస, బాల్య వివాహాలు, వరకట్న వేధింపులు, బహిరంగ ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొంటున్న హింస వంటివి నివేదించటం మహిళా పోలీస్ వాలంటీర్ల కర్తవ్యం అని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతి జిల్లాల్లో 1500 మంది మహిళా పోలీసు వాలంటీర్లు పనిచేస్తున్నారని చెప్పారు. ఏపీలో మానవ రవాణా నిరోధక యూనిట్లు, ఏపీ మహిళాభ్యుదయం, శిశుసంక్షేమ శాఖ సభ్యులు, స్థానిక ఎన్జీవోల సభ్యుల సహకారంతో వ్యక్తుల రవాణా నిరోధించేందుకు చర్యలు చేపట్టామన్నారు. పోక్సో నేరస్తులపై హిస్టరీ షీట్లు తెరవాలని, పదేపదే అదే నేరాలకు పాల్పడుతున్న నేరస్తులను నిర్భందించాలని యూనిట్ అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. పైలట్ విధానంలో ప్రకాశం జిల్లా పోలీస్ స్టేషన్లల్లో ప్రాజెక్ట్ అభయ్ ప్రారంభించామని సుచరిత పేర్కొన్నారు. -
షాద్‌నగర్ ఘటన ఎఫెక్ట్: మెట్రో కీలక నిర్ణయం
బెంగళూరు: షాద్‌నగర్‌లో జరిగిన దిశ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో.. మహిళల రక్షణ కోసం నిబంధనలు మార్పు చేస్తూ బెంగళూరు మెట్రోరైల్ కార్పొరేషన్ లిమిటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా బెంగళూరు మెట్రో చేసిన ఆ ప్రకటన గురించి దేశం అంతా చర్చించుకుంటోంది. మహిళల రక్షణ కోసం ఇక నుంచి పెప్పర్ స్ప్రేలను కూడా మెట్రో స్టేషన్లోకి అనుమతిస్తామని ప్రకటించింది. లైంగిక దాడులు, వేధింపులను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మెట్రో ఉన్నతాధికారులు వెల్లడించారు. సాధారణంగా రైళ్లలో చెకింగ్ పాయింట్ దగ్గర గతంలో వీటిని పక్కన పడేసేవారు, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. సాధారణంగా మెట్రోలో టెక్నికల్ అంశాలు పరిశీలిస్తే ఎప్పుడూ పెప్పర్ స్ప్రే, నిప్పు వ్యాప్తి చేసే పదార్థాలను అనుమతించరు. పెప్పర్ స్ప్రేల వల్ల త్వరగా మంటలు వ్యాపించే అవకాశం ఉంది. దీన్ని ప్రమాదంగా భావించిన మెట్రో అధికారులు అలాంటివి మహిళల వద్ద గుర్తిస్తే ఇది వరకు వాటిని సీజ్ చేసేవారు. కానీ ఇక నుంచి మహిళలు తమ వెంట పెప్పర్ స్ప్రే తీసుకెళ్లొచ్చని ఆదేశాలు జారీ చేసింది. మెట్రోలో మహిళల రక్షణ కోసం ప్రతిక్షణం నిఘా ఉంచినట్టు అధికారులు వెల్లడించారు. -
అబలకు అండగా సబల
సాక్షి, గుంటూరు: ఐదేళ్ల పసిపాపల నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటే వణికిపోతున్నారు. రాష్ట్రంలో మహిళలపై ఆకృత్యాలు నిత్యకృత్యమైపోయాయి. ఈ కేసుల్లో కేవలం 20 శాతం మాత్రమే పోలీసు స్టేషన్ల వరకు వెళుతున్నాయి. మిగతా వారంతా పరువు పోతుందనో... కేసులకు భయపడో తమలో తామే కుంగిపోతున్నారు. ఇలాంటి వారి అండగా నిలిచేందుకు గుంటూరు రూరల్ ఎస్పీ సీహెచ్ వెంకటప్పలనాయుడు సరికొత్త అస్త్రాన్ని తయారు చేశారు. సబల పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గుంటూరు రూరల్ జిల్లా పరిధిలో 126 మంది మహిళా కానిస్టేబుళ్లతో 61 సబల బృందాలను ఏర్పాటు చేశారు. ♦ బాబాయే పలుమార్లు అత్యాచారానికి పాల్పడడంతో బయటకు చెప్పుకోలేక ఓ బాలిక తీవ్ర మనోవేదనకు గురైంది. సొంత బాబాయి కావడంతో విషయం బయటకు పొక్కితే కుటుంబం పరువుపోతుందని కొండంత బాధను గుండెల్లో పెట్టుకుని భరాయించింది. ♦ హాస్టల్లో ఉండే ఎనిమిదో తరగతి బాలిక తోటి బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడింది. ♦ ఫేస్బుక్లో పరిచయాన్ని అడ్డుపెట్టుకుని ఓ యువకుడు మెడిసిన్ చదివే యువతిని వేధించాడు. గంటకు రూ.5 వేలు చెల్లిస్తే చాలంటూ అసభ్యకరంగా పోస్టింగ్‌లు పెట్టాడు. ♦ వృద్ధుడు బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా రూ. 500 ఇచ్చి బాలికతో తాను సుఖం పొందానంటూ పుకార్లు పుట్టించాడు. ♦ ఓ ప్రభుత్వ కార్యాలయంలో పని చేస్తున్న మహిళా ఉద్యోగిని పట్ల తోటి ఉద్యోగి వెకిలి చేష్టలు, లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ♦ ఏడేళ్ల క్రితం తల్లిదండ్రులు విడిపోయారని, తల్లి కూలి పనులు చేస్తూ తనను చదివించడం కష్టంగా మారిందని ఓ బాలిక ఆవేదన వ్యక్తం చేసింది. అమ్మానాన్న కలపాలని కోరింది. ♦ ఇవన్నీ సబల దృష్టికి వచ్చిన ఫిర్యాదులు.. పోలీసుస్టేషన్ గడపతొక్కే ధైర్యం లేక, మనోవేదన భరించలేక ఆదుకోవాలంటూ సబలకు చేరిన అబలల కన్నీటి గాథలు.. నయానో, భయానో అన్నింటికీ ఇక్కడ పరిష్కారం దొరుకుతోంది. అబలకు కొండంత భరోసా కలుగుతోంది. మేమున్నామని.. జిల్లాలోని అన్ని గురుకుల పాఠశాలలు, బాలికల హాస్టళ్లు, కళాశాలలు, మహిళలు ఎక్కువగా ఉండే ప్రతి ఇనిస్టిట్యూట్‌కు సబల బృందాలను పంపి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకుంటున్నారు. గత నెల 29వ తేదీన అధికారికంగా ప్రారంభించి మూడు రోజుల వ్యవధిలో 39 ఫిర్యాదులను స్వీకరించారు. గతంలో వచ్చిన వంద ఫిర్యాదులతోపాటు, వీటన్నింటిని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. అకృత్యాలను అరికట్టడంతోపాటు తమ పేరు గోప్యంగా ఉంచుతుండటంతో సబలకు ఫిర్యాదు చేసేందుకు చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ధైర్యంగా ముందుకు వస్తున్నారు. అంతటా అవగాహన గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో తిరిగే సబల బృందాలకు సైకిల్‌తోపాటు వారి రక్షణకు పెప్పర్ స్ప్రే, లాఠీలను అందించేందుకు రూరల్ ఎస్పీ వెంకటప్పలనాయుడు నిర్ణయించారు. గుంటూరు ఎస్పీ కార్యాలయం పక్కనే ప్రత్యేకంగా సబల కంట్రోల్ రూమును ఏర్పాటు చేసి ఉదయం 9 నుంచి రాత్రి 10 గంటల వరకు సేవలందిస్తున్నారు. బాలికలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి విషయాలతోపాటు, వివిధ రకాలైన వేధింపుల నుంచి ఏ విధంగా బయటపడాలనే దానిపై వీడియోలు చిత్రీకరించి అవగాహన కల్పిస్తున్నారు. ఇదీ సబల కథ ♦ సబల కార్యక్రమం జూన్ 29న గుంటూరు రేంజ్ ఐజీ కేవీవీ గోపాలరావు చేతుల మీదుగా ప్రారంభించారు. ♦ సబల బృందంలో 126 మంది మహిళా కానిస్టేబుళ్లు పని చేస్తున్నారు ♦ జిల్లా వ్యాప్తంగా వీరిని 61 బృందాలుగా విభజించి 10 నుంచి 15 కిలోమీటర్ల మేరలో ఉన్న పాఠశాలలు, కళాశాలలు, బాలికల హాస్టళ్లు, మహిళలు ఎక్కువగా ఉండే ఆఫీసులు వంటి వాటికి పంపిస్తున్నారు. ఆయా ప్రదేశాల్లో సమస్యలు తెలుసుకుని, వేధింపుల నుంచి ఏ విధంగా బయటపడాలనే దానిపై డాక్యుమెంటరీ చిత్రాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ♦ సబలకు ఇప్పటి వరకు 133 ఫిర్యాదులు అందాయి. ♦ వీటిలో భార్యభర్త మధ్య జరిగే ఫ్యామిలీ కౌన్సెలింగ్‌లు మినహా పరిష్కారమయ్యాయి. ముగ్గురి ప్రాణాలు కాపాడగలిగాం ముగ్గురు యువతులు ఆత్మహత్యకు పాల్పడే సమయంలో సబలకు ఫోన్ చేసి చెప్పారు. మా బృందం ద్వారా వెంటనే వారి ఇళ్లకు వెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చాం. ఒకరిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అనంతరం కౌన్సెలింగ్ ద్వారా సమస్య పరిష్కరించి మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించేలా చేశాం. కుటుంబ సభ్యులకు చెప్పుకోలేని సమస్యలు కూడా మా దృష్టికి తీసుకొస్తున్నారు.– స్నేహిత, డీఎస్పీ, సబల నోడల్ ఆఫీసర్ నిర్భయంగా ఫిర్యాదు చేయండి సబల ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. కంట్రోల్ రూము ద్వారా పర్యవేక్షిస్తున్నాం. సొంత కుటుంబ సభ్యులకు చెప్పుకోలేని సమస్యలు, ఇబ్బందులను సబలతో పంచుకునే అవకాశం కల్పిస్తున్నాం. మహిళలు సబల సహాయాన్ని పొందాలి. ఫిర్యాది వివరాలను గోప్యంగా ఉంచుతాం. వారికి ఇష్టం లేకుంటే కేసులు నమోదు చేయం. రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు అందుతున్నాయి. సబల దగ్గరకు వచ్చిన ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చూపాలనేదే మా ధ్యేయం.– సుభాషిణి, సీఐ, సబల నోడల్ ఆఫీసర్ ఫేస్బుక్, వాట్సాప్ గ్రూపుల ద్వారా ఫిర్యాదులు చిన్న పిల్లలు, మహిళలు నేరుగా సబలకుగానీ, డయల్ 100కుగానీ, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫేస్బుక్, వాట్సాప్లకుగానీ ఫిర్యాదులు చేయొచ్చు. ఫేస్బుక్లో అయితే https:// www. facebook.com/ sabalagunturrural.9కు, వాట్సాప్ ద్వారా అయితే∙9440900866కు, ఈయిల్ ద్వారా అయితే sabalagrr@ gmail.comకు వచేచ ఫిర్యాదులన ఎప్పటికప్పుడు స్వీకరిం– Ðð ంటనే∙వారితోట్లాyì పరిష్కరించేదుకు అన్ని ర్యలు చే పడుతున్నారు. -
విజయవాడలో పోలీసు వ్యవస్థ వైఫల్యం!
-
ఊరూరా..‘షీ’ వలంటీర్స్!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో మహిళా భద్రతకు పెద్దపీట వేస్తూ పోలీసు శాఖ కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందులో భాగంగా మహిళా భద్రత విభాగం చీఫ్‌గా ఇటీవల నియమితులైన ఐజీ స్వాతి లక్రా నేతృత్వంలో గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు మహిళా భద్రత కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో షీ టీమ్స్ ఏర్పాటు, భరోసా కేంద్రం, చైల్డ్ కోర్టు.. ఇలా అనేక విప్లవాత్మక కార్యక్రమాలు నిర్వహించి పోలీస్ శాఖ విజయవంతమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇలాంటి వ్యవస్థలనే జిల్లాల్లోనూ ఏర్పాటు చేసి మహిళా భద్రతను కట్టుదిట్టం చేసేందుకు పోలీస్ శాఖ సన్నాహాలు చేస్తోంది. ప్రత్యేక విభాగం.. రాష్ట్ర పోలీస్ శాఖలో ఇప్పటివరకు ప్రత్యేకంగా మహిళా భద్రత విభాగం అంటూ ఏదీ లేదు. సీఐడీలోని ఉమెన్ ప్రొటెక్షన్ సెల్, జిల్లాల్లోని మహిళా పోలీస్ స్టేషన్లు మాత్రమే ఉన్నాయి. విప్లవాత్మకంగా తీసుకువచ్చిన షీ టీమ్స్, భరోసా, చైల్డ్ కోర్టు తదితరాలను ఒకే యూనిట్ కిందికి తీసుకొచ్చేందుకు పోలీస్ శాఖ ప్రత్యేకంగా ఉమెన్ సేఫ్టీ వింగ్‌ను ఏర్పాటు చేసింది. దీనికి స్వాతి లక్రా నేతృత్వం వహిస్తున్నారు. ఇప్పుడు ఈ విభాగం కింద ప్రతి గ్రామంలో మహిళా భద్రతతోపాటు చిన్న పిల్లలపై లైంగిక వేధింపుల నియంత్రణకు వలంటీర్ల వ్యవస్థను తీసుకురానున్నారు. ఇందుకోసం ప్రతి జిల్లాలో ఓ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. మహిళల కేసుల్లో న్యాయ సహాయం, ఇతర సేవలందించేందుకు ప్రతి జిల్లా పోలీసు శాఖల ఆధ్వర్యంలో కౌన్సెలర్లను నియమించాలని పోలీస్ శాఖ నిర్ణయించిన విషయం తెలిసిందే. వీరంతా గ్రామాల్లో పర్యటించి అంగన్వాడీ టీచర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను వలంటీర్లుగా నియమించుకోవాలని భావిస్తున్నారు. మహిళలపై దాడులకు పాల్పడితే జరిగే పరిణామాలను వివరించడం, పాఠశాలల్లో విద్యార్థులకు మహిళా భద్రత, లైంగిక వేధింపుల నియంత్రణపై అవగాహన తరగతులు నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇలా గ్రామీణ ప్రాంతాల నుంచే మహిళ భద్రతను పటిష్టం చేయవచ్చని, విద్యార్థి దశ నుంచే లింగ బేధ సమస్యలు, లైంగిక వేధింపులు– నియంత్రణపై అవగాహన ఏర్పాడుతుందని, భవిష్యత్‌లో సమస్యలు రాకుండా ఉంటుందని పోలీస్ శాఖ భావిస్తోంది. జిల్లా కేంద్రాల్లో ‘భరోసా’ కేంద్రాలు ప్రతి జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయాలని పోలీసు శాఖ నిర్ణయించింది. వరకట్న వేధింపులు, లైంగిక వేధింపులు, మహిళల సంబంధిత కేసుల్లో బాధితులకు న్యాయ సహాయం, పునరావాసం కల్పించేందుకు ఈ ఏర్పాటు చేయనున్నారు. అర్బన్ ప్రాంతాల్లో షీ టీమ్స్‌ను ఏర్పాటు చేయడంతోపాటు పోలీస్ స్టేషన్లలో ఉమెన్ హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి నెల మహిళా భద్రత, లైంగిక వేధింపుల నియంత్రణపై వలంటీర్లతో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గ్రామ సర్పంచ్‌తోపాటు ఉపాధ్యాయులు, తదితరులను వలంటరీల కమిటీల్లో ఉండేలా ఏర్పాటు చేయనున్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో ఈ వలంటీర్ల వ్యవస్థను రూపొందించి మహిళా రక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని పోలీస్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. -
సమున్నత భారతం కోసం ఆమె నిరంతరయానం!
సృష్టిద్దాం సురక్షిత భారతం.. ఆమె ప్రయాణం నిరంతరయానం.. సమున్నత భారతం కోసం.. సురక్షిత భారతం కోసం.. మహిళను శక్తిగా కొలిచే దేశంలో ఆమెకు దక్కాల్సిన గౌరవం కోసం.. ఒక్క అడుగు వేసి మహా యజ్ఞానికి శ్రీకారం చుట్టింది. ఆ అడుగుల ప్రయాణం వేల మైళ్ల వైపు సాగుతోంది. ఆమే క్రాస్బో మైల్స్ మూవ్మెంట్ ప్రతినిధి సృష్టి భక్షి. ఆమె పాదం మోపిన ప్రతిచోటా చైతన్యం గుండె చప్పుడై వినిపిస్తోంది. ఆయా ప్రాంతాల్లోని మహిళలతో మమేకమై కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తోంది. అందుకే ఆ మిలియన్ అడుగుల యాత్రలో యావత్ భారతం భాగమైంది. ఐరాస ఉమెన్ ఎంపవర్ చాంపియన్ (2016–17)గా ఆమెను ఎంపిక చేసింది. తన పర్యటనలో భాగంగా నగరానికి వచ్చిన సృష్టి... ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. – సాక్షి, సిటీబ్యూరో ‘మన దేశం గొప్పగా ఉంటుంది. విదేశాల్లో ఉంటే మరీ గొప్పగా ఉంటుంది. అక్కడ ఎవరైనా మన దేశాన్ని విమర్శిస్తే.. ఏ విషయంలోనైనా తీసిపారేస్తే చాలా కోపం వస్తుంది. అయినా మన దేశానికి మద్ధతుగా వాదించలేని పరిస్థితి వస్తే.. తలదించక తప్పని పరిస్థితి వస్తే.. అలాంటి నిస్సహాయ స్థితి నుంచే ‘క్రాస్బో మైల్స్’ మూవ్మెంట్ పుట్టింది. మహిళలకు భద్రత, ఆర్థిక స్వావలంబన, అక్షరాస్యత, డిజిటల్ లిటరసీని అందించాలనే నినాదంతో కాలినడకన దేశ వ్యాప్తంగా పర్యటిస్తున్నాను. మా నాన్న ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. డెహ్రాడూన్‌లో పెరిగి ముంబైలో మాస్ కమ్యూనికేషన్స్ చేశాను. తర్వాత హైదరాబాద్ ఐఎస్బీలో చదివాను. ఇండియా టుడే, ఐటీసీ లిమిటెడ్ వంటి కంపెనీల్లో పనిచేశాను. పెళ్లయ్యాక భర్తతో కలిసి హాంకాంగ్‌కు వెళ్లిపోయా. బహుశా ఇక అక్కడే ఉండిపోయేదాన్నేమో.. కానీ మన దేశంలో స్త్రీల మీద జరుగుతున్న దారుణాలే నన్ను తిరిగి ఇక్కడికి రప్పించాయి. వాదించలేక.. తలదించలేక.. నిర్భయ ఘటన తర్వాత మన దేశం మహిళలకు సురక్షితం కాదనే అభిప్రాయం కొందరు విదేశీయులు వినిపించేవారు. దీనికి తగ్గట్టుగా రోజుకో వార్త ఇక్కడి నుంచి రిపోర్ట్ అవుతుండేది. వారితో విపరీతంగా వాదించేదాన్ని. అయితే ఇలాంటి సంఘటనల్ని తరచూ ఎత్తి చూపుతూ వారు నన్ను నిస్సహాయ స్థితిలోకి నెట్టేసేవారు. అదే సమయంలో ఢిల్లీ–కాన్పూర్ హైవే మీద తల్లీ కూతుర్ల గ్యాంగ్ రేప్ వార్త వచ్చింది. అప్పటికే ఈ విషయంలో వాదించలేక.. తలదించలేక అన్నట్టున్న నాకు ఇది మరింత బాధించింది. అప్పుడే ఈ అంశం మీద నా వంతుగా ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాను. ఇక్కడ ఆరేళ్ల పిల్లయినా, అరవై ఏళ్ల బామ్మయినా లైంగిక దాడులు చాలా సాధారణమై పోయాయి. ప్రతి ఒక్కరూ నేనేం చేయగలను..? ప్రభుత్వం చేయాలి అని అనుకుంటున్నారు. జనంలో మార్పు తేవాలి అందుకే ఈ మూవ్మెంట్ ప్రారంభించాను. అవిశ్రాంతంగా 8 నెలలు.. కన్యాకుమారి నుంచి శ్రీనగర్ దాకా 260 రోజుల పాటు దాదాపు 3,800 కి.మీ. కాలి నడకన యాత్రకు శ్రీకారం చుట్టాను. వాహనాల్లో వెళితే సాధారణ ప్రజలకు చేరువ కావడం కష్టం. అందుకే నడకను ఎంచుకున్నాను. ఈ యాత్రలో నాకు విభిన్న సంస్థలు, వ్యక్తులు స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు. నాతో పాటు 12 మందితో కూడిన బృందం ఉంది. రోజుకి 30 కి.మీ. చొప్పున ఇప్పటికి సుమారు 1200 కి.మీ. నడిచాం. పట్టణాలు, నగరాల్లో వర్క్‌షాప్స్, అర్థవంతమైన చర్చలు కొనసాగుతున్నాయి. ఒక మహిళ చదువుకుంటే సరిపోతుందని ఒకప్పుడు అనుకున్నాం. కానీ అది సరిపోదు.. చదువు కూడా పెళ్లికి కావాల్సిన ఒక అర్హతగా మాత్రమే పరిగణిస్తున్న కుటుంబాలెన్నో ఉన్నాయి. మహిళల సంపాదనపై కూడా పురుషుల ఆధిపత్యమే కొనసాగుతోంది. చెప్పుకోదగినంత సంపాదిస్తున్నా బ్యాంకింగ్ గురించి ఏ మాత్రం పరిచయం లేని మహిళలున్నారు. ఇలాంటి వారిలో మార్పు తెచ్చేందుకు నేనే నడుం బిగించాను. వారి భద్రత, హక్కులు, ఆర్థిక స్వావలంబన, అక్షరాస్యత, నాయకత్వంపై అవగాహన కల్పిస్తున్నాను. నేను పర్యటించిన తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో మొత్తం 34 వర్క్‌షాప్స్ నిర్వహించాం. వాక్ పూర్తయ్యాక ప్రభుత్వానికి దీనిపై సమగ్ర నివేదిక అందిస్తాను. అర్ధరాత్రి స్వతంత్రం కోసం.. అవును.. పగలే రోడ్డు మీద మహిళకు భద్రత లేదు. అలాంటి సమయంలో అర్ధరాత్రిళ్లు తిరగడం అంటే.. నిజంగా అదో పెద్ద సాహసమే. ఈ పరిస్థితిని మార్చడానికే ‘నైట్‌వాక్స్’ను ఈ మూవ్మెంట్లో భాగంగా మార్చాను. పలు నగరాల్లో వీటిని నిర్వహిస్తున్నాం. క్రాస్బో మైల్స్ పేరుతో వెబ్సైట్, యాప్ అందుబాటులో ఉన్నాయి. నేడు వాక్ నెక్లెస్‌రోడ్‌లో శనివారం రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు వాక్ నిర్వహించనున్నట్లు సృష్టి భక్షి తెలిపారు. మహిళలకు తమ హక్కులపై అవగాహన అవసరమని సృష్టి భక్షి అన్నారు. హామ్స్టెక్ ఫ్యాషన్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో శుక్రవారం జేఎన్టీయూ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు తమ హక్కులు, చట్టాలను సులభంగా అర్థం చేసుకునేందుకు www.absamjhautanahin.com పేరుతో రూపొందించిన వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. శనివారం నిర్వహించనున్న నైట్‌వాక్‌లో ఇనిస్టిట్యూట్ విద్యార్థులు పాల్గొంటారని హామ్స్టెక్ నిర్వాహకులు అజితారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో సింగర్ ఎల్.రేవంత్ పాల్గొని సందడి చేశారు. – జూబ్లీహిల్స్ -
ఆకతాయిలకు షాక్
మృగాళ్ల అకృత్యాలకు ఎందరో అతివలుబలవుతున్నారు. దేశంలో ఏదో ఒక చోట రోజూ అత్యాచారాలు, మహిళలపై దాడులుజరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకోవడం ఆ యువశాస్త్రవేత్తలో ఆలోచనలు రేకెత్తించాయి. మహిళా భద్రతకు ఏదైనా చేయాలనే సంకల్పాన్నికల్పించాయి. నిర్భయ ఘటనను చూసి చలించిన ఆ యువకుడు... రెండేళ్లు శ్రమించి ‘ఎలక్ట్రో షూ’లను రూపొందించాడు.ఆకతాయిలు మహిళలపై దాడికి పాల్పడినప్పుడు ఈ షూల ద్వారా షాక్ రావడంతో పాటు...పోలీసులు, బంధువులకు అలర్ట్ మెసేజ్ వెళ్తుంది. ఈ పరికరం, తన పరిశోధన గురించి నగరానికి చెందిన సిద్ధార్థ్ మందల చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే... నాకు 12 ఏళ్లున్నప్పుడు నిర్భయ ఘటన జరిగింది. నిరసన ర్యాలీల్లో అమ్మతో పాటు నేనూ పాల్గొన్నాను. అప్పుడు మనసులో ఒకటే ఆలోచన... ఈ ఘోరం మనవాళ్లలో ఎవరికైనా జరిగితే? ఆ ఆలోచన చాలా రోజులు వెంటాడింది. అప్పుడే లక్ష్యం నిర్దేశించుకున్నాను. మహిళా భద్రతకు ఏదో ఒకటి చేయాలనుకున్నాను. నా ఆలోచనకు అనుగుణంగా స్నేహితుడు అభిషేక్ సహాయంతో ఈ ఎలక్ట్రో షూలను తయారు చేశాను. ఆటోమేటిక్ చార్జింగ్.. అలర్ట్ మెసేజ్ పీజోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఆధారంగా సర్క్యూట్ బోర్డులను తయారు చేసి ఈ షూలలో అమర్చాను. వీటిని ధరించిన మహిళలపై ఎవరైనా దాడికి పాల్పడితే.. వాటి ద్వారా 0.1 ఆంపియర్ షాక్ వస్తుంది. అదే సమయంలో పోలీసులు, బంధువులకు అలర్ట్ మెసేజ్ వెళ్తుంది. నడుస్తున్నప్పుడే ఆటోమేటిక్‌గా ఇవి చార్జింగ్ అవుతాయి. రెండేళ్ల శ్రమ... ఈ షూలను రూపొందించేందుకు చాలా కష్టపడ్డాం. సోషల్ మీడియా ద్వారా చాలా మంది గైడ్లను కాంటాక్ట్ చేశాను. వివిధ భాషల్లో ప్రోగ్రామింగ్ చేయడం నేర్చుకున్నాను. కొన్నిసార్లు కరెంట్ షాక్‌లు తగిలాయి. ఓసారి నా స్నేహితుడికి గాయమైంది. ఏదైతేనేం అనేక ప్రయత్నాల అనంతరం ఫలితం వచ్చింది. రెండేళ్ల తర్వాత నా ప్రయోగం సక్సెస్ అయింది. ఈ షూలు కొందరి జీవితాలు కాపాడినా చాలు. ఎలక్ట్రో షూతో పాటు పోర్టబుల్ వాటర్ ప్యూరిఫయర్నూ రూపొందించాను. మిత్రులతో కలిసి ‘కాగ్నిజెన్స్ వెల్ఫేర్ ఇనిషియేటివ్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. ఎన్నో చర్చలు.. సెషన్స్ వేసవి సెలవుల్లో డాక్టర్ ఏఎస్ కుమార్ దగ్గర ఇంటర్న్‌షిప్ చేశాం. జెనోమిక్స్, ప్రొటీన్, మలిగ్నంట్ మెలనోమా పనితీరుపై.. పోలరైజ్డ్ లెన్సెస్ సహాయంతో చర్మ కణాల తీరులో తేడాలు గుర్తించాను. అప్పుడే చిత్రాల ద్వారా కంప్యూటర్లో ఈ తేడాను గుర్తించే అవకాశం ఉందా? అని ఆలోచించాను. ప్రణీత్, నేను ట్రై చేయగా వర్కవుట్ అవుతుందనిపించింది. ఇక డాక్టర్‌తో అనేక చర్చలు, ప్రాక్టికల్ సెషన్స్ తర్వాత ఈ సాఫ్ట్వేర్ కనిపెట్టాం. – సిద్ధార్థ్ స్కిన్ కేన్సర్ గుర్తించే సాఫ్ట్వేర్ ఎలక్ట్రో షూని కనిపెట్టిన సిద్ధార్థ్... స్నేహితుడు ప్రణీత్ షాతో కలిసి మరో ఆవిష్కరణకు బీజం పోశాడు. వీరిద్దరు కలిసి చర్మ కేన్సర్‌ను కనుగొనే సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఈ సాఫ్ట్వేర్ చర్మ కేన్సర్ తొలి దశలో.. అంటే మలిగ్నంట్ మెలనోమాని గుర్తిస్తుంది. ఫోన్ కెమెరా సహాయంతో లైవ్ స్ట్రీమ్ చేస్తూ కంప్యూటర్లో కనిపించే ఫీడ్ ద్వారా అది కేన్సరో? కాదో? గుర్తించొచ్చు. ‘మాకు అందుబాటులో ఉన్న సాధనాలతోనే దీన్ని కనిపెట్టే విషయంలో అపోలో హాస్పిటల్ డాక్టర్ ఏఎస్ కుమార్ అవగాహన కల్పించారు. ఖరీదైన పరికరాలు అందుబాటులో లేని గ్రామీణ ప్రాంతాల్లో చర్మ కేన్సర్‌ను గుర్తించేందుకు ఇది ఉపయుక్తం’ అని చెప్పారు సిద్ధార్థ్. ఇంటర్నెట్ మాడ్యూల్‌కి మారుస్తా.. – ప్రణీత్ షా కాలిఫోర్నియా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్ చదువుతున్నాను. ఓ సోషల్ ఇంటర్న్‌షిప్‌లో సిద్ధార్థ్‌ని కలిశాను. ఈ ప్రయోగంలో టెక్నికల్‌కు సంబంధించి నేను సహాయం చేశాను. ఏ ప్రాంతంలో అయినా వినియోగించే విధంగా సాధారణ మొబైల్, కంప్యూటర్ని ఒకే రూటర్కి కనెక్ట్ చేయాలి. దీనిని భవిష్యత్తులో ఇంటర్నెట్ మాడ్యూల్‌కి మార్చే ప్రయత్నం చేస్తాం. -
ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే ఇక జైలే
షీ టీంకు దొరికిన ఖదీర్‌కు రెండు రోజుల జైలు శిక్ష సాక్షి, హైదరాబాద్: ఈవ్‌టీజింగ్‌కు పాల్పడిన నిందితులను పీటీ కేసు కింద నమోదు చేయడంతో పోలీసు స్టేషన్లోనే బెయిల్‌పై విడుదలయ్యేవారు. ఇక నుంచి అలా కాకుండా ఏకంగా జైలు శిక్షే పడేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. తొలి రోజే నాంపల్లి కోర్టు ఈవ్‌టీజింగ్‌కు పాల్పడిన ఓ నిందితుడికి రెండు రోజుల జైలు శిక్ష కూడా విధించింది. మంగళవారం మల క్‌పేట బస్‌స్టాప్‌లో ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతూ పతేషానగర్కు చెందిన ఎండీ అబ్దుల్ ఖదీర్ ఖురేషీ(37) సీసీఎస్ పోలీసు(షీటీమ్)లకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అతనిపై సిటీ పోలీసు యాక్ట్ 70 సీ కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని బుధవారం నాంపల్లిలోని ఏడవ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. మెజిస్ట్రేట్ కేసు వివరాలను పరిశీలించి ఖదీర్‌కు ఎనిమిది రోజుల జైలు శిక్ష విధించా రు. తనపై ఆధారపడిన భార్య, కూతురు ఇబ్బందులకు గురవుతారని ఖదీర్ మెజిస్ట్రేట్‌ను అభ్యర్ధించి, సారీ చెప్పాడు. దీంతో శిక్షను రెండు రోజులుగా మార్చి తీర్పునిచ్చారు. ఖదీర్‌ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. మహిళ భద్రతపై దృష్టి.... ఇప్పటివరకు నిందితులు స్టేషన్ స్థాయిలోనే చలానా చెల్లించడంతో కేసు మూసివేసేవారు. దీంతో ఈవ్‌టీజర్లలో మార్పు రాదని తలంచిన నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి నిందితులను కోర్టులో హాజరుపర్చేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా నగర మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి రజనికి ఇటీవల లేఖ రాసారు. దీన్ని పరిశీలించిన జడ్జి.. ఈవ్‌టీజింగ్‌కు పాల్పడే వారిని కోర్టులో హాజరుపర్చి జైలు శిక్ష కూడా విధించాలంటూ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్లను ఆదేశించారు. ఇది బుధవారం నుంచే మొదలైంది. ఇక నుంచి పట్టుబడితే ఎనిమిది రోజుల వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి.