‘మహిళా ఉద్యోగులకు వేధింపులపై మహిళా కమిషన్ దృష్టి’ | Vasireddy Padma Says Women Commission Focus Women Harassment In AP | Sakshi
Sakshi News home page

‘మహిళా ఉద్యోగులకు వేధింపులపై మహిళా కమిషన్ దృష్టి’

Published Mon, Aug 23 2021 12:13 PM | Last Updated on Mon, Aug 23 2021 12:25 PM

Vasireddy Padma Says Women Commission Focus Women Harassment In AP - Sakshi

సాక్షి, విశాఖపట్నం: మహిళా ఉద్యోగుల వేధింపులపై మహిళా కమిషన్ దృష్టి సారించిందని ఏపీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ తెలిపారు. ఆమె సోమవారం మీడియాతో మట్లాడుతూ.. అంతర్గత కమిటీలపై కమిటీలు వేస్తున్నామని తెలిపారు. దిశా యాప్, స్పందన, వాలంటీర్ ద్వారా ఎన్నో ఘటనలో వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు. సీఎం వైఎస్‌ జగన్‌ పరిపాలనలో మహిళా సంక్షేమాని పెద్దపీట వేశారని పేర్కొన్నారు. బాలికలు దగ్గర నుంచి పండు ముసలి వరకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

చదవండి: బీజేపీ విధానాలను తిప్పికొడతాం: రాఘవులు 

రాజకీయం రంగంలో పురుషులకు సమానంగా మహిళలకు సీఎం జగన్‌ సముచిత స్థానం కల్పించారని వాసిరెడ్డి పద్మ అన్నారు. మహిళా సాధికారత కోసం మహిళా కమీషన్ రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తోందని తెలిపారు. గత ప్రభుత్వంలో మహిళలకు అన్యాయం జరిగినా స్పందించని చంద్రబాబు, ఇప్పుడు విమర్శలు చేయడం సమంజసం కాదని మండిపడ్డారు. 

చదవండి: లోకేశ్‌ రచ్చ.. సామాన్య కుటుంబానికి శిక్ష

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement