జిమ్‌లలో మహిళలకు పురుషులు ట్రెయినింగ్ ఇవ్వరాదు
దుస్తుల షాపులు, కోచింగ్ సెంటర్లు, జిమ్‌లలో సీసీటీవీలు తప్పనిసరి
యూపీ మహిళా కమిషన్ సిఫారసులు
లక్నో: అసభ్యకరంగా తాకుతూ దురుద్దేశంతో వ్యవహరించే పురుషుల నుంచి మహిళలకు రక్షణ కల్పించడానికంటూ ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ పలు సంచలనాత్మక సిఫారసులను రూపొందించింది. వీటి ప్రకారం పురుషులు..టైలరింగ్ షాపుల్లో మహిళల కొలతల్ని తీసుకోరాదు.సెలూన్లలో మహిళల జుత్తు కత్తిరించరాదు. దుస్తుల దుకాణాలు, జిమ్‌లు, కోచింగ్ సెంటర్లలో సీసీటీవీలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.
స్కూల్ బస్సుల్లో భద్రత కోసం మహిళా సిబ్బందిని నియమించాలి..వంటివి ఉన్నాయి. అక్టోబర్ 28వ తేదీన సమావేశమైన కమిషన్ ఈ మేరకు నిబంధనలను ఆమోదించింది. బహిరంగ ప్రదేశాల్లో పురుషుల నుంచి మహిళలను వేరుగా ఉంచేందుకు, మహిళలకు భద్రతను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన ఈ మార్గదర్శకాలను అమలు చేయాలంటూ అన్ని జిల్లాల మేజి్రస్టేట్లకు లేఖలు రాసింది.
‘చాలా చోట్ల జిమ్‌లలో మగ ట్రెయినర్లు, మహిళల బొటిక్‌లలో మగ దర్జీలు ఉంటున్నారు. వీరు మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లుగా ఇటీవలి కాలంలో ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి’అని యూపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ బబితా చౌహాన్ తెలిపారు. ‘టైలర్లుగా మగవాళ్లుండటంపై మాకెలాంటి సమస్యా లేదు. మహిళల కొలతల్ని పురుషులు తీసుకోడంపైనే మా అభ్యంతరమంతా’అని ఆమె వివరించారు. ‘ఇలాంటి అన్ని చోట్లా శిక్షణ పొందిన మహిళల్ని నియమించుకోవాలి. ఇందుకు కొంత సమయం పట్టొచ్చు. కానీ, ఈ నిబంధనలను అమలు చేయడం వల్ల మహిళలకు మరిన్ని ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి’అని ఆమె తెలిపారు.
ఇదీ చదవండి: సీఎం సమోసాలు ఎవరు తీసుకున్నారు.. సీఐడీ దర్యాప్తు
Comments
Please login to add a commentAdd a comment