Woman Commission
-
టార్గెట్ యడ్యూరప్ప..? మహిళా కమిషన్ కీలక ఆదేశాలు
బెంగళూరు: కర్నాటక మాజీ సీఎం యడ్యూరప్ప తన కూతురుని లైంగికంగా వేధించాడని ఆరోపణలు చేసిన మహిళ మృతి కేసు కొత్త మలుపు తిరిగింది. సదరు మహిళ మృతి చెందడం, ఆమె మృతదేహాన్ని హడావిడిగా పూడ్చిపెట్టిన తీరు అనుమానాస్పదంగా ఉందని కర్నాటక మహిళా కమిషన్ పేర్కొంది. ఈ కేసులో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని బెంగళూరు పోలీసులను కమిషన్ ఆదేశించింది.ఈ మేరకు మహిళా కమిషన్ చైర్పర్సన్ నాగలక్ష్మి చౌదరి బెంగళూరు పోలీస్ కమిషనర్‌కు ఒక లేఖ రాశారు. మహిళ మృతి కేసును వేగంగా దర్యాప్తు చేయాలని లేఖలో కోరారు. తన 17 ఏళ్ల కూతురితో కలిసి బెంగళూరులోని యడ్యూరప్ప ఇంటికి వెళ్లినపుడు ఆయన తన కూతురిని లైంగికంగా వేధించారని ఈ ఏడాది ఫిబ్రవరిలో మహిళ కేసు పెట్టింది. ఈ కేసు విచారణ జరుగుతుండగానే మే నెలలో ఆ మహిళ మృతి చెందింది. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తోనే ఆ మహిళ చనిపోయిందని డాక్టర్లు తెలిపారు. -
మహిళా కమిషన్ నీలాంటి వారికి సుప్రీమే: వాసిరెడ్డి పద్మ
సాక్షి, విజయవాడ: అత్యాచారానికి గురైన మతిస్థిమితంలేని బాధితురాలిని భయాందోళనలకు గురిచేసేలా.. ఘటన వివరాలు తెలుసుకునేందుకు వచ్చిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ను అగౌరవపరిచేలా దౌర్జన్యం చేసిన మీ తీరు కు సమన్లు ఇవ్వకుండా చప్పట్లు కొట్టాలా?.. అం టూ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. విజయవాడ ఆర్ అండ్‌బీ భవనంలోని మీడియా పాయింట్లో ఆమె శనివారం మాట్లాడారు. విజయవాడ ప్రభుత్వాçస్పత్రిలో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా, ఆ పార్టీ నేతలు శుక్రవారం వ్యవహరిం చిన తీరు దారుణమన్నారు. ఇంకా ఏమన్నారంటే.. యుద్ధానికి వెళ్తున్నట్లు కౌరవమూక మాదిరిగా జనాన్ని వేసుకొచ్చి అలజడి సృష్టిస్తే అది పరామర్శ అవుతుందా? బాధితురాలితో ఎలా వ్యవహరించా లో చంద్రబాబుకు తెలీదని నిన్న అర్థమైంది. మన సు, శరీరం గాయమైన బాధిత యువతితో ఎలా వ్యవహరించాలో తెలుసుకోవాలి. అక్కడ బల ప్రదర్శన చేయటమేమిటి? అవును.. కమిషన్ సుప్రీమే.. మహిళా కమిషన్ ఏమైనా సుప్రీమా? అని బొండా ఉమా ప్రశ్నించడంపై వాసిరెడ్డి పద్మ తీవ్రంగా స్పందించారు. ‘అవును బొండా ఉమా లాంటి ఆకురౌడీలకు మహిళా కమిషన్ సుప్రీమే. చంద్రబాబు హ యాంలో మహిళా కమిషన్ అంటే తూతూమంత్రంగా, కంటితుడుపుగా నడిపి ఉండొచ్చేమో.. కా నీ, మహిళా కమిషన్‌కు ఉండే హక్కులు, కమిషన్ శక్తి ఏమిటో అర్థమైన తర్వాత వారికి దిమ్మతిరిగి బొమ్మ కనబడుతోంది. నేను ఇప్పుడు కోట్లాది మం ది మహిళలకు బాధ్యురాలిని. చంద్రబాబు, ఉమా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంటే కమిషన్ తలవంచుకోదు. ఈ నెల 27న వారిద్దరూ కమిషన్ ఎదుట హాజరుకావాల్సిందే. చేసిన తప్పుకు క్షమాపణలు అడగాల్సిందిపోయి ఎదురుదాడి చేస్తున్నారు’. లోకేశ్.. మీ నాన్నను అడుగు ‘బాధిత మహిళలపట్ల ఎలా వ్యవహరించారో మీ నాన్నను అడుగు లోకేశ్.. రిషితేశ్వరి కేసులో ఆర్నెళ్లు ఏం చేశారని.. వనజాక్షి కేసులో ఏం చేయలేకపోయారెందుకని కూడా లోకేశ్ తన తండ్రిని అడగాలి. బాధితులపట్ల, మహిళా కమిషన్ పట్ల రాజకీయ పార్టీలు ఎలా వ్యవహరించాలో తెలియజెప్పేందుకే విచారణకు రావాలని చంద్రబాబుకు, ఉమాకు సమన్లు ఇచ్చాం’.. అని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. సమన్లు అందజేత మరోవైపు.. టీడీపీ అధినేత చంద్రబాబుకు శనివా రం మహిళా కమిషన్ సమన్లు అందజేసింది. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి కమిషన్ సిబ్బంది వెళ్లి వాటిని అందజేశారు. అదేవిధంగా విజయవాడలోని బొండా ఉమా ఇంటికి వెళ్లి అందజేశారు. 22వ తేదీ శుక్రవారం ప్రభుత్వాసుపత్రిలో మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మను బాధితురాలి తో మాట్లాడనివ్వకపోగా.. ఆమెను బెదిరించేలా వ్యవహరించడంపై ఏపీ మహిళా కమిషన్ యాక్ట్–1998లోని సెక్షన్ 15(1) ప్రకారం ఈ నోటీసులు అందచేస్తున్నామని ఆ సమన్లలో పేర్కొన్నారు. పోలీసు కమిషనర్‌తో భేటీ విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాతో వాసిరెడ్డి పద్మ ఆయన కార్యాలయంలో శనివారం భేటీ అయ్యారు. కేసుకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేయాలని కోరారు. అంతకుముందు.. ప్రభుత్వాసుపత్రిలో బా«ధిత యువతిని పరామర్శించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఆస్పత్రి నుంచి బాధితురాలి డిశ్చార్జి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న అత్యాచార బాధితురాలిని శనివారం డిశ్చార్జి చేశారు. ఆమె ఆరోగ్యం కుదుటపడటంతో ఏఆర్ఎంఓ డాక్టర్ శిరీష ఆమెను తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో ఇంటికి పంపారు. ఆమెపై మేమూ ఫిర్యాదు చేస్తాం : బొండా ‘వైఎస్సార్సీపీ ప్రభుత్వం నా వెంట్రుక కూడా పీకలేదు’ అంటూ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా వ్యాఖ్యానించారు. మొగల్రాజపురంలోని తన నివాసంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబుకు, తనకు సమన్లు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇలాంటి నోటీసులకు తాము భయపడబోమని, వాసిరెడ్డి పద్మపై తాము కూడా జాతీయ మహిళా కమిషన్‌కు, హైకోర్టుకు, చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేస్తామన్నారు. చదవండి: (విశాఖలో జాబ్‌మేళాను ప్రారంభించిన ఎంపీ విజయసాయిరెడ్డి) -
బాలిక ఆత్మహత్య ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది: వాసిరెడ్డి పద్మ
సాక్షి, విజయవాడ: టీడీపీ నేత వినోద్ జైన్ వేధింపులతో విజయవాడలో బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. 'ఈ ఘటన జరగడం దురదృష్టకరం. బాలిక ఆత్మహత్య ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. టీడీపీ నేత వేధింపులే కారణమని బాలిక తన సూసైడ్ నోట్లో రాసింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. పోలీసుల విచారణలో అన్నీ విషయాలు తెలుస్తాయి. ఘటనకు కారణమైన నిందితులను వదిలిపెట్టే ప్రసక్తేలేదు’ అని వాసిరెడ్డి పద్మ అన్నారు. చదవండి: (విజయవాడ: టీడీపీ నేత వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య) -
హీరోకు మరోసారి మహిళా కమిషన్ నోటీసులు
యశవంతపుర: వివాదాస్పద శాండల్‌వుడ్ నటుడు దునియా విజయ్‌పై రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసు ఇచ్చినా విచారణకు హాజరుకాకపోవటంపై విజయ్‌కు మరో నోటీసును జారీ చేసింది. వారంలోపు తమ ముందు హాజరు కావాలని స్పష్టంచేసింది. భర్త రెండవ పెళ్లి చేసుకుని తనను దూరంగా ఉంచడంతో జీవనం కష్టమైందని మొదటి భార్య నాగరత్న పిల్లలతో కలిసి ఇటీవల కమిషన్‌కు ఫిర్యాదు చేయటంతో కమిషన్ స్పందించింది. సినిమా షూటింగ్లో బీజీగా ఉన్నందున తను హాజరు కాలేక పోతున్నట్లు, కొంత సమయం కావాలని విజయ్ కోరినట్లు తెలిసింది. -
లైంగిక వేధింపులపై ఇంత నిర్లక్ష్యమా?
దామోదర్ వ్యాలీ కార్పొరే షన్లో మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి ఎన్ని ఫిర్యాదులొచ్చాయి, వాటిపైన ఏ చర్యలు తీసు కున్నారు. 2012 నుంచి ఇప్పటిదాకా ఎన్ని ఫిర్యా దులు పరిష్కరించారో, ఎన్ని పరిష్కరించలేదో తెలియజేయాలని ఆర్టీఐ కింద సౌమెన్ సేన్ కోరారు. అసిస్టెంట్ ఇంజినీర్ శంభుదాస్పైన చేసిన ఫిర్యా దుపై ఆయన నుంచి వాంగ్మూలం రికార్డు చేసి ఉంటే దాని ప్రతిని ఇవ్వాలని కోరారు. సీపీఐఓ గానీ మొదటి అప్పీలు అధికారి గాని జవాబు ఇవ్వలేదు. కమిషన్ ముందు సౌమెన్ సేన్, ఆమె భర్త హాజరై నిజాలను దాచి నిందితుడిని డీవీసీ అధికారులు కాపాడుతున్నారని ఆరోపించారు. దామోదర్ వ్యాలీ సంస్థగానీ, జాతీయ మహిళా కమి షన్గానీ ఏ జవాబూ ఇవ్వకపోవడం న్యాయం కాదని, ఈ రెండు సంస్థల సమాచార అధికారులపై జరిమానా విధించాలని, అడిగిన సమాచారం ఇప్పిం చాలని కోరారు. ఇంటర్నల్ కమిటీని నియమించి ప్రాథమిక విచారణ జనవరి 2013లోనే జరిపించి నప్పటికీ ఇంతవరకు విచారణ ముందడుగు వేయ లేదని, అనేక సార్లు కమిటీలను మార్చుతూ కాలం గడుపుతున్నారని వివరించారు. బాధిత మహిళ ఫిర్యాదు చేసిన తరువాత నేర సంఘటన జరిగిన మూడు నెలల్లోగా లోకల్ కమిటీని గానీ ఇంటర్నల్ కమిటీనిగానీ నియమించాలని 2013 చట్టం సెక్షన్ 9 వివరిస్తున్నది. నిందితుడు సంస్థలో ఉద్యోగి అయితే సర్వీసు నియమాలను అనుసరించి ఎంక్వయిరీ జరిపించాల్సి ఉందని సెక్షన్ 11 నిర్దేశిస్తున్నది. ప్రాథమికంగా ఆరోపించిన నేరం జరిగిందని తేలితే సెక్షన్ 509 ఇండియన్ పీనల్ కోడ్ కింద కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేయాలి. సెక్షన్ 12 కింద బాధితురాలు తనను గానీ, తనను బాధించిన వ్యక్తినిగానీ మరో చోటికి బదిలీ చేయాలని కమిటీని కోరవచ్చు. అయితే విచారణ నివేదిక ప్రతిలేకుండా ఈ హక్కులను బాధితురాలు కోరడానికి వీల్లేదు. సెక్షన్ 13 బాధితురాలికి విచారణ నివేదిక ప్రతిని విచారణ ముగిసిన పదిరోజులలో ఇచ్చితీరాలని నిర్దేశిస్తున్నది. విచారణలో ఆరోప ణలు రుజువైతే జిల్లా అధికారి నిందితుడిపై ఏ చర్యలు తీసుకోవాలో కమిటీ ఆదేశించే వీలుంది. ఈ పనిని దుష్ప్రవర్తనగా భావించి అందుకు రూల్స్ ప్రకారం చర్య తీసుకోవాలి. అతని జీతం నుంచి కొంత సొమ్మును మినహాయించి, ఆ సొమ్మును బాధితురాలికి పరిహారంగా చెల్లించాలని కూడా ఆదేశించవచ్చు. ఈకేసులో బాధితురాలైన మహిళకు విచారణ నివేదిక ప్రతిని ఇవ్వకపోగా, ఆర్టీఐలో అడిగిన తరు వాత కూడా పీఐఓ ఇవ్వలేదు. అంటే 2013 చట్టాన్ని అమలు చేయలేదు. జీవన హక్కుతో పాటు, పనిచేసే హక్కు కూడా ఉల్లంఘిస్తూ ఉంటే అందుకు సంబం ధించిన సమాచారాన్ని కోరినప్పుడు కేవలం రెండు రోజుల్లో ఇవ్వాలని దామోదర్ వ్యాలీ సంస్థ గానీ, జాతీయ మహిళా కమిషన్‌గానీ భావించలేదు. మహి ళలపై వివక్ష నిర్మూలన ఒప్పందం (సెడా) విశాఖ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇటువంటి చర్య లను నిరోధించవలసి ఉంటుందని మాజీ ప్రధాన న్యాయమూర్తి జేఎస్ వర్మ అభిప్రాయ పడ్డారు. రెండు చట్టాలు ఆమెకు ఇచ్చిన హక్కులను రెండు ప్రభుత్వ సంస్థలు, (దామోదర్ వ్యాలీ, జాతీయ మహిళా కమిషన్) ఉల్లంఘించాయని సమాచార కమిషన్ భావించింది. కనుక ఆ రెండు సంస్థల పీఐఓలకు జరిమానా ఎందుకు విధించకూ డదో కారణాలు వివరించాలని నోటీసు జారీ చేసింది. దామోదర్ వ్యాలీ సంస్థ అడిగిన పూర్తి సమా చారాన్ని వెంటనే ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. 2012లో ఇచ్చిన ఫిర్యాదుపైన అయిదేళ్లు దాటినా ఏ చర్య తీసుకోలేదని బాధితురాలు ఫిర్యాదు చేశారు. సమాచార కమిషన్ ఆదేశాల తరువాత 29 పేజీలు ఇచ్చినా అనేక కీలకపత్రాలు ఇవ్వలేదు. కొత్త కమిటీ విచారణ జరుపుతుందని తెలిపినా, ఇంతవరకూ ఏ చర్యా తీసుకోలేదని వివ రించింది. బాధితురాలికి పరిష్కారం చూపకపోగా ఫిర్యాదును ఉపసంహరించుకోలేదన్న ఆగ్రహంతో ఆమెని అనేక పర్యాయాలు బదిలీ చేశారు. చివరకు ఆమె ప్రమోషన్ కూడా నిలిపివేశారు. మహిళా కమిషన్ తనకు అందిన ఆర్టీఐ దర ఖాస్తును దామోదర్ వ్యాలీ సంస్థకు బదిలీ చేసింది. లైంగిక వేధింపుల కేసులను పర్యవేక్షించే బాధ్యత కమిషన్‌కు లేదని వాదించింది. సమాచార కమిషన్ ఆదేశించిన తరువాత 30 పుటలు ఇచ్చాం కనుక జరి మానా విధించరాదని దామోదర్ వ్యాలీ అధికారిణి కోరారు. డీవీసీ అధికారిణి అంశుమన్ మండల్ పైన 25 వేలరూపాయల జరిమానా విధిస్తూ కమిషన్ ఆదే శించింది. అంతేకాకుండా బాధితురాలికి లక్ష రూపా యల పరిహారం ఇవ్వాలని కూడా ఆదేశించింది. (16.10.2018న సౌమెన్ సేన్ కేసులో సీఐసీ ఆదేశం ఆధారంగా) వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార కమిషనర్, professorsridhar@gmail.com -
‘మగాళ్లు మారండి’.. కలకలం రేపిన వ్యాఖ్యలు
జైపూర్ : బీజేపీ నేత, రాజస్థాన్ మహిళా కమిషన్ చైర్పర్సన్ సుమన్ శర్మ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. మగవాళ్ల వేషాధారణ మారాలంటూ ఉపన్యాసం ఇచ్చిన ఆమె.. ఈ క్రమంలో చేసిన వ్యాఖ్యలతో విమర్శలు ఎదుర్కుంటున్నారు. ‘ప్రస్తుతం ట్రెండ్ పేరుతో మగవాళ్ల వేషధారణ మొత్తం మారిపోయింది. లో వెస్ట్ జీన్లు వేసుకునే మగాళ్లకి వాళ్ల బట్టలే వాళ్ల కంట్రోల్లో ఉండవు. అలాంటోళ్లు వాళ్ల ఇళ్లలోని మహిళలను ఎలా రక్షించుకుంటారు?. ఆడాళ్లు ఒకప్పుడు విశాలమైన ఛాతీ.. దాని నిండా జట్టు ఉన్న మగాళ్లను కావాలని కలలు కనేవాళ్లు. కానీ, ఇప్పుడు అలాంటోళ్లు కనిపించట్లేదు’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఆడాళ్లలా చెవి పోగులు ధరిస్తున్న పురుషులు.. మరి జీరో ఫిగర్ ఎందుకు మెయింటెన్ చెయ్యరని ఆమె ప్రశ్నిస్తున్నారు. ‘మగాళ్లు మగాళ్లలా బతకండి. నేనేం వారిని విమర్శించటం లేదు. కానీ, ఈ పద్ధతుల్లో మార్పు రావాల్సి ఉందని మాత్రమే చెబుతున్నా’ అని ఆమె తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సుమన్ శర్మ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ విమర్శలపై పలువురు మండిపడుతున్నారు. తమ వస్త్ర ధారణ ఎలా ఉంటే మీకేం బాధంటూ యువత ఆమెను సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. వీరికి పలువురు యువతులు కూడా మద్ధతు నిలుస్తుండటం ఇక్కడ విశేషం. ప్రస్తుతం దీనిపై రాజస్థాన్‌లో పెద్ద చర్చే నడుస్తోంది. -
‘భార్యా బాధితులే ఎక్కువ’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం భార్యా బాధితుల ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి పేర్కొన్నారు. మహిళా కమిషన్‌కు మహిళలపై జరిగే గృహహింస కేసుల కన్నా ‘భార్యా బాధితులవే’ ఎక్కువయ్యాయని ఆమె అన్నారు. అసెంబ్లీ లాబీల్లో శుక్రవారం ఆమె మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. మహిళలపై గృహహింసకు సంబంధించి తమకు వస్తున్న ఫిర్యాదుల్లో కొన్ని తప్పుడు ఫిర్యాదులు కూడా ఉంటున్నాయని అన్నారు. తమపై కూడా తమ భార్యలు హింసకు దిగుతున్నారని, తమకు న్యాయం చేయాలంటూ పలువురు పురుషుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు. తమది మహిళా కమిషన్ కనుక వాటిని స్వీకరించి విచారించే అధికారం తమకు లేదని చెబుతున్నా పలువురు తమ గోడు వెళ్లబోసుకొనేందుకు కమిషన్ వద్దకు వస్తున్నారన్నారు. తాము తిరస్కరిస్తున్న ఫిర్యాదులను తిరిగి వారి తల్లి ద్వారానో, చెల్లెల ద్వారా ఇప్పిస్తున్నారని తెలిపారు. తమ కుమారుడిని భార్య వేధిస్తోందని వారితో ఫిర్యాదులు చేయిస్తున్నారని చెప్పారు. మహిళల ద్వారా అందుతున్న ఆ ఫిర్యాదులను నిబంధనల ప్రకారం స్వీకరించి విచారిస్తున్నామని చెప్పారు. ఇటీవల ఓ మహిళ తమ కమిషన్‌ను కలసి తనను భర్త వేధిస్తున్నాడని, తన చేతులపై గాయాలు చేశారని చూపించింది. తాము ఫిర్యాదును స్వీకరించి విచారిస్తే ఆమె చేతులకు ఉన్న గాయాలను తనకు తాను గాజులను పగులగొట్టుకోవడం వల్ల అయ్యాయని తేలిందని నన్నపనేని రాజకుమారి తెలిపారు. తమకు మాత్రం తన భర్తే తన రెండు చేతులను కొట్టి గాయపర్చినట్లు ఆమె ఫిర్యాదు చేసిందన్నారు. అయితే ఆమె కుమార్తె స్వయంగా తన తల్లే గాజులు పగులగొట్టుకున్నట్లు తెలిపిందని వివరించారు. మరో కేసులో ఎన్ఆర్ఐ భర్త తనను వేధించాడని ఒక మహిళ ఫిర్యాదు చేసింది. కానీ, ప్రాథమిక విచారణ చేయించి కేసు పెట్టించామని, దాంతో అతను అరెస్టు అయ్యాడన్నారు. తరువాత లోతుగా విచారస్తే ఆమె వైపు నుంచే పొరపాట్లు ఉన్నాయని తెలిపారు. అయితే అప్పటికే అరెస్టు అవ్వడంతో ఆయన తిరిగి తన ఉద్యోగం చేస్తున్న దేశానికి వెళ్లే పరిస్థితి లేకుంగా పోయిందన్నారు. ఇలాంటి తప్పుడు ఫిర్యాదులు కూడా అందుతున్న నేపథ్యంలో తాము గృహహింస కేసుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నన్నపనేని రాజకుమారి అభిప్రాయపడ్డారు. -
నిర్భయ చట్టం పక్కా అమలుకు చర్యలు
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి గుంటూరు వెస్ట్: నిర్భయ చట్టం అమలులో ఉన్నా మహిళలపై దాడులు ఎక్కువగానే జరుగుతున్నాయని, చట్టం పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటానని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. కమిషన్ ప్రథమ సమావేశం రాజకుమారి అధ్యక్షతన గుంటూరులోని ఒక ప్రైవేట్ హాస్పటల్లో సోమవారం జరిగింది. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ మహిళల సమస్యల పరిష్కారానికి షీ టీమ్స్, టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. మహిళా కమిషన్‌కు వెబ్సైట్ రూపొందిస్తామన్నారు. బాల్య వివాహాలతో సమాజం అనారోగ్యంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నచిన్న విషయాలకే విడాకులు తీసుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. మహిళా కమిషన్‌కు ప్రభుత్వ కార్యాలయం, సిబ్బంది కొరత ఉందని, ఇంకా బడ్జెట్ కేటాయింపు జరగలేదని చెప్పారు. ప్రస్తుతం వికాస్‌నగర్ రెండో లైన్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ కార్యాలయాన్ని గుంటూరులోనే పెద్ద భవనంలోకి మార్చే ప్రయత్నంలో ఉన్నామని ఆమె వెల్లడించారు. సమావేశంలో మహిళా కమిషన్ సభ్యులు పర్వీన్‌భాను, ఎం మణికుమారి, శ్రీవాణి, డాక్టర్ ఎస్ రాజ్యలక్ష్మి, టీ రమాదేవి, కమిషన్ డైరెక్టర్ సూయెజ్, సెక్రటరీ భాను తదితరులు పాల్గొన్నారు.