
యశవంతపుర: వివాదాస్పద శాండల్‌వుడ్ నటుడు దునియా విజయ్‌పై రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసు ఇచ్చినా విచారణకు హాజరుకాకపోవటంపై విజయ్‌కు మరో నోటీసును జారీ చేసింది. వారంలోపు తమ ముందు హాజరు కావాలని స్పష్టంచేసింది.
భర్త రెండవ పెళ్లి చేసుకుని తనను దూరంగా ఉంచడంతో జీవనం కష్టమైందని మొదటి భార్య నాగరత్న పిల్లలతో కలిసి ఇటీవల కమిషన్‌కు ఫిర్యాదు చేయటంతో కమిషన్ స్పందించింది. సినిమా షూటింగ్‌లో బీజీగా ఉన్నందున తను హాజరు కాలేక పోతున్నట్లు, కొంత సమయం కావాలని విజయ్ కోరినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment