yashwanthapur
-
శ్రీవారిని దర్శించుకున్న హీరో యశ్ అండ్ కేజీఎఫ్ 2 టీం
కన్నడ హీరో, రాక్‌స్టార్ యశ్, కేజీఎఫ్ 2 చిత్ర బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఏప్రిల్ 14న కేజీఎఫ్ 2 విడుదల కానున్న నేపథ్యంలో ఈ మూవీ టీం తీర్థ యాత్రలతో బిజీగా ఉంది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం వీఐపీ దర్శనంలో కేజీఎఫ్ 2 హీరో యశ్, దర్శకుడు ప్రశాంత్ నీల్, మూవీ టీం స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం వారిని ఆలయ అర్చకులు ఆశీర్వదించగా.. అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అలాగే నిన్న(ఆదివారం) ధర్మస్థల మంజునాథ్‌స్వామి, కుక్కే సుబ్రమణ్య స్వామిని దర్శించుకున్నారు. ఆయన వెంట కేజీఎఫ్– 2 బృందం ఉన్నారు. యశ్‌ను చూసిన భక్తులు ఆయనతో ఫోటో దిగడానికి ఎగపడ్డారు. ధర్మస్థల ధర్మాధికారి వీరేంద్ర హెగ్డేని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. అక్కడ ఎదురు చూస్తున్న మీడియాతో మాట్లాడకుండా కుక్కెకి వెళ్లిపోయారు. ఈ నెల 14న కేజీఎఫ్–2 దేశవ్యాప్తంగా విడుదలవుతున్న తరుణంలో చిత్రబృందం పుణ్యక్షేత్రాలను దర్శిస్తోంది. -
అక్కతో బావ గొడవ..తట్టుకోలేక బావమరిది
యశవంతపుర: పెళ్లయి అత్తింటికి పంపారు. అక్కడ తరచూ అక్కను బావ వేధించడంతో ఆమె తమ్ముడు తట్టుకోలేకపోయాడు. తన అక్కను వేధిస్తున్న బావపై అతడి బావమరిది దాడి చేసి హతమార్చాడు. ఈ ఘటన కర్నాకటలోని యశవంతపురలో చోటుచేసుకుంది. మొహమ్మద్ బాబా అలియాస్ బండి బాబా యశ్వంతపురలో ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ తన భార్యతో కలిసి నివసిస్తున్నాడు. అయితే భార్యతో తరచూ ఘర్షణ పడేవాడు. తాజాగా ఆదివారం కూడా గొడవ జరగడంతో ఈ విషయం తెలుసుకున్న ఆమె తమ్ముడు చాంద్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన అక్కను వేధిస్తున్న బావ మొహమ్మద్ బాబాతో గొడవకు దిగాడు. దాడి చేయడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. కాగా మృతుడిపై 2019లో ఒక హత్య కేసు నమోదై ఉండడం గమనార్హం. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కాపురాన్ని సరిదిద్దుకుని సంతోషంగా వెళ్తుంటే.. చదవండి: ప్రభుత్వ టీచర్ కుటుంబాన్ని చిదిమేసిన కరోనా -
ప్రభుత్వ టీచర్ కుటుంబాన్ని చిదిమేసిన కరోనా
యశవంతపుర: కరోనా భూతం ఒకే కుటుంబంలో నలుగురిని పొట్టనబెట్టుకున్న ఘటన బాగలకోట తాలూకా దేవినాళ గ్రామంలో జరిగింది. వెంకటేశ్ ఒంటగోడి (45) అయన భార్య రాజేశ్వరి (40), రాజేశ్వరి తండ్రి రామనగౌడ (74), తల్లి లక్ష్మీబాయి (68)లు బలయ్యారు. మే 3 నుండి 15 వరకు వీరందరూ బాగలకోటలోని కోవిడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వరుసగా మృతి చెందారు. రాజేశ్వరి ప్రభుత్వ టీచర్ కాగా, భర్త వెంకటేశ్ రామదుర్గలో ప్రభుత్వ బీసీ వసతిగృహంలో అధికారి. ఇటీవల బెళగావి ఉప ఎన్నికలలో పనిచేసిన రాజేశ్వరికి మొదట కరోనా సోకింది. తరువాత కుటుంబసభ్యులందరికీ వ్యాపించింది. మరోవైపు బాగలకోట జిల్లా వక్ఫ్‌బోర్డు అధ్యక్షుడు మైనుద్దీన్ నబివాలె (57) కరోనాతో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. చదవండి: కాపురాన్ని సరిదిద్దుకుని సంతోషంగా వెళ్తుంటే.. -
సదాశివ రావు బాపు సాహెబ్ భోసలే మృతి
యశవంతపుర: దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసి గెలిచిన స్వాతంత్య్ర సమరయోధుడు, గాంధేయవాది సదాశివ రావు బాపు సాహెబ్ భోసలే (101) కన్నుమూశారు. వృద్ధాప్యంతో బెళగావి తాలూకా కడోళి గ్రామంలో తన స్వగృహం లో గురువారం తుదిశ్వాస విడిచారు. 25 ఎకరాలు పేదలకు దానం చేశారు. భోసలే బెళగావి దక్షిణ, హిరేబాగేవాడి స్థానాల నుంచి కర్ణాటక శాసనసభకు రెండు సార్లు ఎన్నికయ్యారు. భూదా నోద్యంలో పాల్గొనడమే కాకుండా తనకున్న 25 ఎకరాల భూమిని పేదలకు పంచి పెట్టారు. ఉత్తర కర్ణాటకకి అన్యాయం జరుగుతోందనే బాధతో 12 ఏళ్లపాటు అనేక పోరాటాల్లో పాల్గొన్నారు. 1969లో ఎమర్జెన్సీ సమయంలో జైలుశిక్షను అనుభవించారు. తన స్వగ్రామంలో గాంధీ స్మారక నివాసాన్ని నిర్మించారు. భోసలే మృతికి గవర్నర్ వజూభాయ్ నివాళులు అర్పించారు. -
మళ్లీ పట్టాల పైకి గోల్డెన్ చారియెట్
న్యూఢిల్లీ: రైల్వేలకు చెందిన కేటరింగ్, ఆన్లైన్ సంస్థ ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో మరో లగ్జరీ రైలు పట్టాలెక్కబోతోంది. రెండు సంవత్సరాల విరామం తర్వాత గోల్డెన్ చారియట్ రైలు మార్చి 22 నుంచి సేవలు అందిస్తుందని ఐఆర్సీటీసీ అధికారులు వెల్లడించారు. కర్ణాటక స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (కేఎస్టీడీసీ) 2008లో ఈ రైలుని ప్రారంభించింది. నిర్వహణ భారంతో 2018 మార్చిలో దాని సేవల్ని నిలిపివేశారు. తాజాగా ఐఆర్సీటీసీ ఈ రైలు నిర్వహణ, మార్కెటింగ్ వ్యవహారాలను తీసుకుంటూ కేఎస్‌టీడీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు మార్చి 22 నుంచి ఈ కొత్త రైలుని నడపనుంది. మొత్తం ఆరు రాత్రులు/ఏడు పగళ్లు ప్యాకేజీతో యశ్వంతపూర్ నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు బందీపూర్ నేషనల్ పార్క్, మైసూర్, హలైబీడు, చిక్మంగళూరు, హంపి, బాదామి, గోవాలకు వెళ్లి తిరిగి బెంగళూరుకు చేరుకుంటుంది. -
హీరోకు మరోసారి మహిళా కమిషన్ నోటీసులు
యశవంతపుర: వివాదాస్పద శాండల్‌వుడ్ నటుడు దునియా విజయ్‌పై రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసు ఇచ్చినా విచారణకు హాజరుకాకపోవటంపై విజయ్‌కు మరో నోటీసును జారీ చేసింది. వారంలోపు తమ ముందు హాజరు కావాలని స్పష్టంచేసింది. భర్త రెండవ పెళ్లి చేసుకుని తనను దూరంగా ఉంచడంతో జీవనం కష్టమైందని మొదటి భార్య నాగరత్న పిల్లలతో కలిసి ఇటీవల కమిషన్‌కు ఫిర్యాదు చేయటంతో కమిషన్ స్పందించింది. సినిమా షూటింగ్లో బీజీగా ఉన్నందున తను హాజరు కాలేక పోతున్నట్లు, కొంత సమయం కావాలని విజయ్ కోరినట్లు తెలిసింది. -
యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ రైల్లో దారి దోపిడి
-
రైలు పట్టాలపై పిల్లి.. నిలిచిపోయిన రైలు
యశవంతపుర : మెట్రో పట్టాలపై ఓ పిల్లి హల్చల్ చేయడంతో పది నిముషాల పాటు మెట్రో రైలు సంచారాన్ని నిలిపివేసిన ఘటన శుక్రవారం రాత్రి జాలహళ్లి మెట్రో స్టేషన్లో జరిగింది. శుక్రవారం రాత్రి పది గంటల సమయంలో జాలహళ్లి నుంచి మెట్రో రైలు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఇంతలో ఓ తెల్లపిల్లి పట్టాలపై తచ్చాడుతూ కనిపించింది. వెంటనే అప్రమత్తమైన పైలెట్ మెట్రో అధికారులు సమాచారం ఇచ్చారు. విద్యుత్ తీగలను తాకుతుందనే ఉద్దేశ్యంతో ఆ ట్రాక్‌లో విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేయించారు. ఇంతలో అటు ఇటు తిరిగిన పిల్లి చివరకు అక్కడి నుంచి వెళ్లిపోయింది. పిల్లి కోసం సిబ్బంది గాలించినా అది కనిపించలేదు. దాదాపు పది నిముషాల పాటు అన్ని స్టేషన్లలో రాకపోకలకు పిల్లి కారణంగా అంతరాయం ఏర్పడింది. -
అదుపుతప్పి.. ఢీకొట్టి..
* కారు, బైక్‌ను ఢీకొన్న డిప్యూటీ సీఎం రాజయ్య ఎస్కార్ట్ వాహనం * నలుగురు పోలీసులతో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలు * వరంగల్ జిల్లా యశ్వంతాపూర్ శివార్లలో ఘటన జనగామ రూరల్: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య ఎస్కార్ట్ వాహనం అదుపుతప్పి కారును, బైక్‌ను ఢీకొట్టింది. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై జనగామ మండలం యశ్వంతాపూర్ సమీపంలో ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు పోలీసులతో పాటు కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రాజయ్య ఆదివారం జనగామలోని ఓ మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం వరంగల్ వైపు ఆయన కాన్వాయ్ బయలుదేరింది. ఇదే సమయంలో రఘునాథపల్లి పోలీస్‌స్టే షన్ కానిస్టేబుల్ కంజర్ల బాబు, హోంగార్డు వెంకటరత్నం బైక్‌పై జనగామ వైపు వస్తున్నారు. వారి వాహనం వెనుక నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన నయీముల్లాఖాన్ (ఎఫ్‌సీఐ ఏడీ) తన బంధువులతో కలిసి జనగామవైపు వస్తున్నారు. ఈ క్రమంలో యశ్వంతాపూర్ శివార్లలో ఎస్కార్ట్ వాహనం టైర్ పంక్చర్‌కావడంతో అదుపు తప్పి.. ఎదురుగా వస్తున్న బైక్, కారులను ఢీ కొట్టింది. ఈ ఘటనలో కంజర్ల బాబు, వెంకటరత్నంతో పాటు ఎస్కార్ట్ వాహనంలోని పోలీసులు జగన్మోహన్, విజయ్‌కుమార్, రాజ్‌కుమార్‌కు గాయాలయ్యాయి. కారులో ఉన్న నయీముల్లాఖాన్, ఉన్నిసాబేగం తీవ్రంగా గాయపడ్డారు.