
రైలు పట్టాలపై ఉన్న పిల్లి
యశవంతపుర : మెట్రో పట్టాలపై ఓ పిల్లి హల్‌చల్ చేయడంతో పది నిముషాల పాటు మెట్రో రైలు సంచారాన్ని నిలిపివేసిన ఘటన శుక్రవారం రాత్రి జాలహళ్లి మెట్రో స్టేషన్‌లో జరిగింది. శుక్రవారం రాత్రి పది గంటల సమయంలో జాలహళ్లి నుంచి మెట్రో రైలు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఇంతలో ఓ తెల్లపిల్లి పట్టాలపై తచ్చాడుతూ కనిపించింది. వెంటనే అప్రమత్తమైన పైలెట్ మెట్రో అధికారులు సమాచారం ఇచ్చారు.
విద్యుత్ తీగలను తాకుతుందనే ఉద్దేశ్యంతో ఆ ట్రాక్‌లో విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేయించారు. ఇంతలో అటు ఇటు తిరిగిన పిల్లి చివరకు అక్కడి నుంచి వెళ్లిపోయింది. పిల్లి కోసం సిబ్బంది గాలించినా అది కనిపించలేదు. దాదాపు పది నిముషాల పాటు అన్ని స్టేషన్లలో రాకపోకలకు పిల్లి కారణంగా అంతరాయం ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment