ప్రతీకాత్మక చిత్రం
బెంగళూర్ : నమ్మ మెట్రో మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి ఫేక్ వీడియో వాట్సాప్‌లో వైరల్ కావటంతో మైసూర్ నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది.
మైసూర్ సమీపంలో మెట్రో పిల్లర్ కూలిందంటూ కొన్ని దృశ్యాలు బుధవారం అర్ధరాత్రి దాటాక వాట్సాప్‌లో వ్యాపించాయి. దీనికి తోడు కొన్ని స్థానిక ఛానెళ్లు కూడా దాన్ని బ్రేకింగ్ న్యూస్ అంటూ ప్రసారం చేయటంతో ఆ వార్త ఒక్కసారిగా దావానంలా పాకింది. దీంతో ప్రజల్లో భయాందోళనలు చెలరేగి తమ బంధు మిత్రుల క్షేమ సమాచారాల గురించి ఆరా తీయటం మొదలుపెట్టారు.
ఈ క్రమంలో నగరంలో ఫోన్ సర్వీసులకు కాసేపు అంతరాయం కూడా కలిగింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీస్ శాఖ, బెంగళూర్ మెట్రో రైల్వే అధికారులు అదంతా అసత్యప్రచారమని, వందతులు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
జరిగిందేంటంటే...
శనివారం రాత్రి నయందహల్లి వద్ద నిర్మాణంలో ఉన్న ఓ పిల్లర్‌ను ఒక ట్రక్కు ఢీ కొట్టింది. దీంతో ఆ పిల్లర్ స్వల్పంగా దెబ్బతింది. ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్ కూడా గాయాలతో బయటపడ్డాడు. అయితే ఇది మైసూర్ రోడ్ మెట్రో స్టేషన్ వద్ద జరిగిందంటూ వార్త వైరల్ కావటం ఇక్కడ కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment