న్యూఢిల్లీ: రైల్వేలకు చెందిన కేటరింగ్, ఆన్‌లైన్ సంస్థ ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో మరో లగ్జరీ రైలు పట్టాలెక్కబోతోంది. రెండు సంవత్సరాల విరామం తర్వాత గోల్డెన్ చారియట్ రైలు మార్చి 22 నుంచి సేవలు అందిస్తుందని ఐఆర్‌సీటీసీ అధికారులు వెల్లడించారు. కర్ణాటక స్టేట్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (కేఎస్‌టీడీసీ) 2008లో ఈ రైలుని ప్రారంభించింది. నిర్వహణ భారంతో 2018 మార్చిలో దాని సేవల్ని నిలిపివేశారు. తాజాగా ఐఆర్‌సీటీసీ ఈ రైలు నిర్వహణ, మార్కెటింగ్ వ్యవహారాలను తీసుకుంటూ కేఎస్‌టీడీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు మార్చి 22 నుంచి ఈ కొత్త రైలుని నడపనుంది. మొత్తం ఆరు రాత్రులు/ఏడు పగళ్లు ప్యాకేజీతో యశ్వంతపూర్ నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు బందీపూర్ నేషనల్ పార్క్, మైసూర్, హలైబీడు, చిక్‌మంగళూరు, హంపి, బాదామి, గోవాలకు వెళ్లి తిరిగి బెంగళూరుకు చేరుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment