golden chariot
-
అశ్వ వాహనంపై విహరించిన శ్రీమలయప్పస్వామి(ఫొటోలు)
-
Tirumala Srivari Brahmotsavam 2023: స్వర్ణరథంపై శ్రీమలయప్ప స్వామి (ఫొటోలు)
-
‘అసని’ తుపాను తెచ్చిన ‘బంగారు’ మందిరం
సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో వింత చోటుచేసుకుంది. తుపాను కారణంగా ఇతర దేశానికి చెందిన ఓ మందిరం తీరానికి కొట్టుకువచ్చింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం సున్నాపల్లి రేవుకు చేరిన ఈ రథాన్ని బంగారు వర్ణం కలిగిన రథంగా స్థానికులు భావిస్తున్నారు. ఈ రథంపై 16-1-2022 అని విదేశీ భాషలో లిఖించి వుంది. చదవండి: అసని తుపాను ఎఫెక్ట్.. 37 రైళ్లు రద్దు.. వివరాలు ఇవే.. ఇది మలేషియా, థాయిలాండ్, జపాన్ దేశాలకు చెందినది అయి ఉండవచ్చునని కొంతమంది మత్స్యకారులు అంటున్నారు. ఇంతవరకూ తిత్లీ వంటి పెద్ద తుపానులు వచ్చినప్పుడు కూడా ఇటువంటి విచిత్రమైన రథాలు సముద్రంలో కొట్టుకురాలేదని స్థానికులు అన్నారు. ఆ రథం మయన్మార్ దేశానిది.. సముద్ర తీరానికి చేరిన స్వర్ణరథం మయన్మార్ దేశానికి చెందినదిగా గుర్తించారు. బంగారు వర్ణంతో కూడిన రథంపై విదేశీ భాష ఉండడంతో ప్రజలు ఆసక్తిగా తిలకించారు. బుధవారం తహసీల్దార్ చలమయ్య, భావనపాడు మెరైన్ సీఐ దేవుళ్లు, నౌపడ ఎస్ఐ ఐ.సాయికుమార్ తీరానికి చేరిన రథాన్ని పరిశీలించారు. రథంపై ఉన్న భాషను గూగుల్లో శోధించగా మయన్మార్ దేశం భాషగా తేలడంతో రథం మయన్మార్దిగా తేలింది. సముద్రంలో కొట్టుకుని వచ్చింది తప్ప ఇందులో విశేషం ఏమీ లేదని మెరైన్ సీఐ చెప్పారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కాణిపాకం వినాయకునికి స్వర్ణ రథం సిద్ధం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తిరుమల శ్రీవారి తర్వాత కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామికి బంగారు రథం సిద్ధమైంది. దాదాపు 15 కేజీలకు పైగా బంగారంతో రథాన్ని తయారు చేయించారు. ఈ నెల 16వ తేదీన సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య నూతన స్వర్ణ రథం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించేందుకు దేవదాయ శాఖ నిర్ణయించింది. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర సరస్వతి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ముఖ్య కార్యదర్శి వాణీమోహన్, కమిషనర్ హరిజవహర్లాల్ హాజరవుతారు. 2005లోనే ప్రతిపాదన 2005లోనే కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామికి బంగారు రథం తయారు చేయించాలని అప్పటి ఆలయ పాలకమండలి తీర్మానించగా.. దేవదాయ శాఖ అనుమతి తెలిపింది. బంగారు రథం కోసం దాతల నుంచి ప్రత్యేక విరాళాలు సేకరించడంతో పాటు ఆలయంలో ప్రత్యేక హుండీని ఏర్పాటు చేశారు. 2005 నుంచి గత ఏడాది సెప్టెంబర్ వరకు హుండీ ద్వారా రూ.3,57,85,102.85 విరాళాలు వచ్చాయి. దాతల నుంచి రూపంలో మరో రూ.1,67,09,616 కలిపి మొత్తం రూ.5.25 కోట్ల వరకు అందాయి. బంగారు రథం తయారీ బాధ్యతలను దేవదాయ శాఖ 2009లోనే టీటీడీకే అప్పగించింది. ఇందుకు ఆలయ నిధుల నుంచి రూ.కోటి 2010 ఫిబ్రవరిలో టీటీడీకి చెల్లించారు. సిద్ధమైన వినాయకుని బంగారు రథం 2019 అక్టోబర్లో ఊపందుకుని.. 2019లో అక్టోబర్లో బంగారు రథం నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. 1,690 కేజీల చెక్క రథానికి బంగారం తాపడం చేయడానికి రూ.9.70 కోట్లు ఖర్చవుతుందని టీటీడీ తేల్చగా.. ఆలయ నిధుల నుంచి మరో రూ.5 కోట్లను కాణిపాకం ఆలయ అధికారులు 2019 అక్టోబర్లో టీటీడీకి చెల్లించారు. చెక్క రథానికి బంగారు తాపడం చేసే పనులు 2020 నవంబర్లో మొదలు కాగా, 2021 సెప్టెంబర్ నాటికి పూర్తయ్యాయి. ప్రతి నెలా ఊరేగింపు! ప్రతి గురువారం లేదా ప్రతి నెలా పౌర్ణమి తర్వాత నాలుగో రోజున ఆలయంలో నిర్వహించే సంకటహర గణపతి వ్రతం సందర్భంగా బంగారు రథంపై స్వామివారి ఊరేగింపు నిర్వహించాలనే ఆలోచన ఉందని.. దీనిపై ఆలయ పాలకమండలి సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఈవో వెంకటేష్ చెప్పారు. బ్రహ్మోత్సవాల సమయంలో బంగారు రథం ఉపయోగించనున్నట్టు వివరించారు. బంగారు రథం తయారీకి ఇప్పటివరకు టీటీడీకి రూ.6 కోట్లను చెల్లించామని, తుది బిల్లు టీటీడీ నుంచి అందాల్సి ఉందని వెంకటేష్ తెలిపారు. -
మళ్లీ పట్టాల పైకి గోల్డెన్ చారియెట్
న్యూఢిల్లీ: రైల్వేలకు చెందిన కేటరింగ్, ఆన్లైన్ సంస్థ ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో మరో లగ్జరీ రైలు పట్టాలెక్కబోతోంది. రెండు సంవత్సరాల విరామం తర్వాత గోల్డెన్ చారియట్ రైలు మార్చి 22 నుంచి సేవలు అందిస్తుందని ఐఆర్సీటీసీ అధికారులు వెల్లడించారు. కర్ణాటక స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (కేఎస్టీడీసీ) 2008లో ఈ రైలుని ప్రారంభించింది. నిర్వహణ భారంతో 2018 మార్చిలో దాని సేవల్ని నిలిపివేశారు. తాజాగా ఐఆర్సీటీసీ ఈ రైలు నిర్వహణ, మార్కెటింగ్ వ్యవహారాలను తీసుకుంటూ కేఎస్టీడీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు మార్చి 22 నుంచి ఈ కొత్త రైలుని నడపనుంది. మొత్తం ఆరు రాత్రులు/ఏడు పగళ్లు ప్యాకేజీతో యశ్వంతపూర్ నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు బందీపూర్ నేషనల్ పార్క్, మైసూర్, హలైబీడు, చిక్మంగళూరు, హంపి, బాదామి, గోవాలకు వెళ్లి తిరిగి బెంగళూరుకు చేరుకుంటుంది. -
గోల్డెన్ చారియట్ మళ్లీ షురూ
న్యూఢిల్లీ: దక్షిణ భారతంలో అత్యంత విలాసవంతమైనదిగా పేరున్న గోల్డెన్ చారియట్ రైలు పునఃప్రారంభం కానుంది. బెంగళూరు నుంచి గోవా వరకు వెళ్ళే ఈ రైలు దేశవిదేశీ టూరిస్టులను అమితంగా ఆకర్షిస్తోంది. ఈ రైలులో 18 బోగీలుంటాయి. 84 మందికి సరిపోయే 44 గెస్ట్ రూములున్నాయి. అయితే ఈ రైల్లో ప్రయాణించే వారి సంఖ్య అతి తక్కువగా ఉండడంతో గత మార్చిలో దీన్ని రద్దు చేశారు. కొత్తగా నిర్ణయించిన రైలు వేళలు, టికెట్ ధరలు మరో వారంలో వెల్లడిస్తామని ఐఆర్సీటీసీ చెప్పింది. మొదట నెలకి రెండుసార్లు రాకపోకలు ప్రారంభించనున్నట్టు కెఎస్టీడీసీ మేనేజింగ్ డైరెక్టర్ కుమార్ పుష్కర్ తెలిపారు. గతంలో ఈ రైలు చార్జీ రూ. 43 వేలు (600 అమెరికన్ డాలర్లు)గా ఉండేది. బెంగళూరులో ప్రారంభమయ్యే ఈ రైలు బందిపూర్, మైసూర్, హలేబిద్, చిక్మంగుళూరు, హంపీ, బీజాపూర్ల మీదుగా గోవాకి చేరేది. ఇప్పుడు కూడా ఇదే మార్గంలో దీన్ని నడపనున్నారు. -
ఇది రైలు అంటే నమ్ముతారా...?
లగ్జరీ రూం.. బార్.. జిమ్ సెంటర్.. స్పా.. లగ్జరీ రెస్టారెంట్లు.. ఇలా ఒక్కటేమిటి? అన్ని రకాల హైఫై వసతులు మీ ప్రయాణంలో లభిస్తాయి. అదేంటి బస్సుకో, రైలుకో, ఫ్లైట్కో వెళ్తే ఇవ్వేమీ సాధ్యపడవు కదా? మహా అంటే పడుక్కోవడానికి మాత్రమే ఉంటుంది. కానీ ఈ సౌకర్యాలన్నింటితో లగ్జరీ జర్నీ ఎలా అనుకుంటున్నారా? దేశీయ రైల్వే లాంచ్ చేసిన గోల్డెన్ ఛారియట్ అనే రైలులో ఈ సదుపాయాలన్నింటిన్నీ అందిస్తోంది. భారత్లో పర్యాటక ప్రదేశాలన్నింటిన్నీ కలుపుతూ ఈ లగ్జరీ టూరిస్ట్ రైలును అందుబాటులోకి వచ్చింది. కర్నాటక, గోవా, కేరళ, తమిళనాడు, పుదేచ్చేరి వంటి ప్రాంతాల్లో పర్యాటక ప్రదేశాలన్నింటిన్నీ ఈ రైలులో చుట్టేయొచ్చు. మొత్తం 19 కోచ్లున్న ఈ రైలు, పర్పుల్, గోల్డ్ రంగుల్లో రూపొందింది. -
టూరిస్ట్ ట్రైన్లో లగ్జరీ జర్నీ
-
బంగారు రథంపై సత్యసాయి
పుట్టపర్తి: సత్యసాయి జయంతి వేడుకల్లో ప్రధాన ఘట్టమైన జోలోత్సవాన్ని గురువారం రాత్రి వైభవంగా నిర్వహించారు. సాయంత్రం సత్యసాయి చిత్రపటాన్ని బంగారు రథంపై అధిష్టింపజేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం యజుర్వేద మందిరం నుంచి ట్రస్ట్ సభ్యులు ఆర్జే రత్నాకర్, ప్రసాదరావు, చక్రవర్తి, నాగానంద, మోహన్, డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యనారాయణతో పాటు సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ సభ్యులు రథాన్ని లాగుతూ సాయికుల్వంత్ మందిరంలోకి తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేక పూజల అనంతరం మహా సమాధి వద్ద వెండి ఊయలలో బాబా చిత్రపటాన్ని ఉంచి జోలోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తి గీతాలు ఆలపిస్తూ సత్యసాయిని స్తుతించారు. సంగీత విద్వాంసులు అభిషేక్, రఘురాముల సంగీత కచేరి ఆకట్టుకుంది. మహామంగళ హారతి అనంతరం భజనలు చేపట్టారు. -
స్వర్ణరథంపై ఊరేగిన శ్రీనివాసుడు
తిరుమల : కలియుగ వైకుంఠ దైవం శ్రీనివాసుడు శనివారం స్వర్ణరథంపై ఊరేగారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల శ్రీవేకంటేశ్వరస్వామి వారు శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వర్థరథంపై ఊరేగారు. తిరువీధుల్లో భక్తులకు కటాక్షిస్తూ స్వామివారు విహరించారు. వేలాది మంది భక్తులు స్వామివారి రథాన్ని లాగుతూ శ్రీవారి సేవలో తరించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం శనివారం రావడంతో భక్తులు విశేషంగా ఈ వేడుకలో పాల్గొన్నారు. కర్పూర హారతులతో స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి ఏటా టీటీడీ ఈ ఉత్సవాన్ని ముక్కోటి ఏకాదశి రోజు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. రథోత్సవంలో టీటీడీ అధ్యక్షుడు కనుమూరి బాపిరాజు , ఈవో ఎంజీ గోపాల్, జేఈవో శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. -
స్వర్ణ రథంపై శ్రీవారు
రాత్రి గజ వాహనంపై విహరించిన శ్రీనివాసుడు సాక్షి, తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆరోరోజు గురువారం సాయంత్రం స్వర్ణరథోత్సవం (రథరంగ డోలోత్సవం) కన్నుల పండువగా సాగింది. శ్రీదేవి, భూదేవి సమేత తిరుమలేశుడు స్వర్ణరథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 5 నుంచి 6.50 గంటల వరకు స్వర్ణరథం ఊరేగింపు అశేష భక్తజన గోవింద నామస్మరణ మధ్య అత్యంత వైభవంగా సాగింది. భక్తులు భారీ సంఖ్యలో శ్రీవారి సేవల్లో పాల్గొన్నారు. ఉదయం శ్రీరామచంద్రుని రూపంలో మలయప్ప స్వామి భక్తశిఖామణి హనుమంతునిని వాహనంగా మలచుకుని భక్తులకు దర్శనమిచ్చారు. గజరాజుపై రారాజు విహారం : రాత్రి 9 నుంచి 11 గంటల వరకు స్వామివారు గజ వాహనంపై ఆశీనుడై భక్తులకు కనువిందు చేశారు. గజేంద్ర మోక్షం ఘట్టంలో ఏనుగును కాపాడిన విధంగానే తన శరణు కోరే వారిని కాపాడతానని చాటి చెప్పడానికి శ్రీనివాసుడు ఈ వాహనంపై ఊరేగారు. కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బాపిరాజు, అధికారులు పాల్గొన్నారు. సరస్వతీదేవిగా దుర్గమ్మ దసరా ఉత్సవాల్లో గురువారం మూల నక్షత్రం సందర్భంగా బెజవాడ కనకదుర్గమ్మ సరస్వతీదేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చింది. శ్వేతవర్ణపు చీర ధరించి ఒక చేతిలో పుస్తకం, మరో చేతిలో జపమాలతో హంసవాహనాన్ని అధిరోహించిన సరస్వతీదేవిని వర్షంలోనూ భక్తులు పెద్దసంఖ్యలో దర్శించుకున్నారు. దుర్గమ్మ జన్మనక్షత్రం కావటంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పార్థసారథి సతీసమేతంగా వచ్చి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రి బాలరాజు, ముఖ్యమంత్రి సతీమణి రాధికారెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. పూల పల్లకిలో మల్లన్న దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీశైల మహాక్షేత్రంలో కాత్యాయని రూపంలో శ్రీభ్రమరాంబాదేవి దర్శనమిచ్చారు. స్వామిఅమ్మవార్లు హంసవాహనంపై ఊరేగుతూ వచ్చి పుష్పపల్లకిని అధిష్టించారు. రాత్రి 8 గంటలకు గంగాధర మండపం నుంచి ప్రారంభమైన పుష్ప పల్లకి ఊరేగింపు అంకాలమ్మగుడి, నందిమండపం మీదుగా రథశాలకు చేరుకుంది. అక్కడి నుంచి స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులు ఆలయప్రాంగణం చేరుకున్నారు. -
రథ మండపం వద్దకు చేరుకున్న బంగారు రథం
తిరుమల: స్వామివారి బంగారురథం ట్రయల్ రన్ ముగిసింది. బంగారు రథం రథ మండపం వద్దకు చేరుకుంది. తిరుమలేశుని కైంకర్యసేవ కోసం తయారు చేసిన కొత్త స్వర్ణరథం ట్రయల్ రన్లో అపశ్రుతి చోటు చేసుకుంది. టీటీడీ అధికారులు సోమవారం ఉదయం దీనిని ఆలయ వీధుల్లో ప్రయోగాత్మకంగా ఊరేగించారు. ఎస్వీ మ్యూజియం నుంచి మాడవీధుల్లో రథ మండపానికి తరలించారు. సుమారు గంట సమయం పట్టింది. అయితే రథం తరలిస్తుండగా ఎస్వీ మ్యూజియం మలుపు వద్ద రథం భూమిలోకి కూరుకుపోయింది. రథ చక్రాలు మట్టిలోకి దిగబడిపోయాయి. దీంతో క్రేన్ సహాయంతో రథాన్ని టీటీడీ సిబ్బంది బయటకు తీశారు. బంగారు రథం ట్రయల్ రన్లో లోపాలున్నాయని టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు చెప్పారు. ఆ లోపాలను వెంటనే సవరిస్తామన్నారు. ఈ స్వర్ణ రథం ఎత్తు 32 అడుగులు. బరువు 28 టన్నులు. ఇటువంటి స్వర్ణరథం దేశంలో మరెక్కడా లేదు. రథం తయారీలో 74 కిలోల బంగారం, 2,900 కిలోల రాగి, 25 టన్నుల దారుచెక్క, ఇనుము వినియోగించారు. 18 అడుగుల గేజ్ కలిగిన రాగిపై 9సార్లు బంగారు పూత పూశారు. ఇందుకోసం రూ.24.34 కోట్లు వ్యయం అయింది. -
శ్రీవారి స్వర్ణరథం ట్రయల్ రన్లో అపశ్రుతి
తిరుమల: తిరుమలేశుని కైంకర్యసేవ కోసం తయారు చేసిన కొత్త స్వర్ణరథం ట్రయల్ రన్లో అపశ్రుతి చోటు చేసుకుంది. సోమవారం ఉదయం టీటీడీ అధికారులు... ఆలయ వీధుల్లో ప్రయోగాత్మకంగా ఊరేగించారు. ఎస్వీ మ్యూజియం నుంచి మాడవీధుల్లో రథ మండపానికి తరలించారు. సుమారు గంట సమయం పట్టింది. అయితే రథం తరలిస్తుండగా ఎస్వీ మ్యూజియం మలుపు వద్ద భూమిలోకి కూరుకుపోయింది. రథచక్రాలు మట్టిలోకి దిగబడిపోయాయి. దీంతో క్రేన్ సహాయంతో రథాన్ని టీటీడీ సిబ్బంది బయటకు తీశారు. కాగా స్వర్ణ రథం ఎత్తు 32 అడుగులు. బరువు 28 టన్నులు. ఇటువంటి స్వర్ణరథం దేశంలో మరెక్కడా లేదు. రథం తయారీలో 74 కిలోల బంగారం, 2,900 కిలోల రాగి, 25 టన్నుల దారుచెక్క, ఇనుము వినియోగించారు. 18 అడుగుల గేజ్ కలిగిన రాగిపై 9సార్లు బంగారుపూత పూశారు. ఇందుకోసం రూ.24.34 కోట్లు వ్యయం అయ్యింది. -
వెంకన్న స్వర్ణరథం ట్రయల్ రన్
తిరుమల : తిరుమలేశుని కైంకర్యసేవకు కొత్త స్వర్ణరథం ఎట్టకేలకు సిద్ధమైంది. సోమవారం ఉదయం టీటీడీ అధికారులు ... ఆలయ వీధుల్లో ప్రయోగాత్మకంగా ఊరేగించారు. ఎస్వీ మ్యూజియం నుంచి మాడవీధుల్లో రథ మండపానికి తరలించారు. సుమారు గంట సమయం పట్టింది. కాగా స్వర్ణ రథం ఎత్తు 32 అడుగులు. బరువు 28 టన్నులు. ఇటువంటి స్వర్ణరథం దేశంలో మరెక్కడా లేదు. ఎస్వీ మ్యూజియం నుంచి మాడవీధుల్లో రథ మండపానికి తరలిస్తున్న టీటీడీ అధికారులు రథం తయారీలో 74 కిలోల బంగారం, 2,900 కిలోల రాగి, 25 టన్నుల దారుచెక్క, ఇనుము వినియోగించారు. 18 అడుగుల గేజ్ కలిగిన రాగిపై 9సార్లు బంగారుపూత పూశారు. ఇందుకోసం రూ.24.34 కోట్లు వ్యయం అయ్యింది. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు 18 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వెంకన్న సర్వ దర్శనానికి పది గంటల సమయం పడుతోంది. -
సిద్ధమైన స్వర్ణరథం.. నేడు ప్రయోగాత్మక పరిశీలన
సాక్షి, తిరుమల: తిరుమలేశుని కైంకర్యసేవకు కొత్త స్వర్ణరథం సిద్ధమైంది. సోమవారం ఉదయం 9.05 గంటలకు దాన్ని ఆలయ వీధుల్లో ప్రయోగాత్మకంగా ఊరేగించనున్నారు. దీనిఎత్తు 32 అడుగులు. బరువు 28 టన్నులు. ఇలాంటి స్వర్ణరథం దేశంలో మరెక్కడా లేదు. రథం తయారీలో 74 కిలోల బంగారం, 2,900 కిలోల రాగి, 25 టన్నుల దారుచెక్క, ఇనుము వినియోగించారు. 18 అంగుళాల గేజ్ కలిగిన రాగిపై 9 సార్లు బంగారుపూత పూశారు. ఇందుకోసం రూ.24.34 కోట్లు వ్యయం చేశారు. -
స్వర్ణరథం బంగారు తాపడం పనులు ప్రారంభం
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి స్వర్ణరథానికి బంగారు తాపడం పనులు సోమవారం ప్రారంభం అయ్యాయి. తిరుపతి టీటీడీ పరిపాలన విభాగంలోని జ్యూయలరీ విభాగం ఆధ్వర్యంలో బంగారు తాపడం పనులు చేస్తున్నట్లు టీటీడీ ఈవో గోపాల్ తెలిపారు. సెప్టెంబర్ 25లోగా పనులు పూర్తవుతాయని, స్వర్ణరథం ఎత్తు 30 అడుగులుగా పేర్కొన్నారు. ఈ తాపడానికి 73 కిలోల బంగారం, మూడు టన్నుల రాగి ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. బంగారు తాపడానికి రూ.35 కోట్లు ఖర్చు అవుతుందని ఈవో వెల్లడించారు.