
పుట్టపర్తి: సత్యసాయి జయంతి వేడుకల్లో ప్రధాన ఘట్టమైన జోలోత్సవాన్ని గురువారం రాత్రి వైభవంగా నిర్వహించారు. సాయంత్రం సత్యసాయి చిత్రపటాన్ని బంగారు రథంపై అధిష్టింపజేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం యజుర్వేద మందిరం నుంచి ట్రస్ట్ సభ్యులు ఆర్‌జే రత్నాకర్, ప్రసాదరావు, చక్రవర్తి, నాగానంద, మోహన్, డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యనారాయణతో పాటు సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ సభ్యులు రథాన్ని లాగుతూ సాయికుల్వంత్ మందిరంలోకి తీసుకొచ్చారు.
అక్కడ ప్రత్యేక పూజల అనంతరం మహా సమాధి వద్ద వెండి ఊయలలో బాబా చిత్రపటాన్ని ఉంచి జోలోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తి గీతాలు ఆలపిస్తూ సత్యసాయిని స్తుతించారు. సంగీత విద్వాంసులు అభిషేక్, రఘురాముల సంగీత కచేరి ఆకట్టుకుంది. మహామంగళ హారతి అనంతరం భజనలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment