Sathya Sai Baba
-
భారతీయ సంస్కృతిపై విదేశీయుల ఆసక్తి
సాక్షి, పుట్టపర్తి (శ్రీసత్యసాయి జిల్లా): దేశ, విదేశాల నుంచి వచ్చిన మహిళలు భారతీయ సంస్కృతిపై ఇష్టం పెంచుకున్నారు. చీర, పంచెకట్టులో దర్శనిమిచ్చారు. వివిధ దేశాల నుంచి వచ్చి అక్కడి విధానాలను పరిచయం చేయడమే కాకుండా.. స్థానిక అలవాట్లను వంటబట్టించుకున్నారు. సత్యసాయిబాబా నడయాడిన పుట్టపర్తికి పలు దేశాల నుంచి భక్తులు నిత్యం వస్తుంటారు. తెలుగోడి ఖ్యాతిని ప్రపంచ స్థాయికి సత్యసాయి తీసుకెళ్లారని చెబుతున్నారు. అంతేకాకుండా శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్టు సేవలు మరువలేనివని కొనియాడుతున్నారు. ఓసారి పుట్టపర్తికి వస్తే.. మళ్లీ మళ్లీ రావాలనిపిస్తోందని చెబుతున్నారు. ఎన్ని సమస్యలతో వచ్చినా.. మందిరంలో అడుగు పెట్టాక ప్రశాంతత వస్తుందని పేర్కొంటున్నారు. శనివారం శ్రీసత్యసాయి 99వ జయంతి సందర్భంగా విదేశీయులతో ‘సాక్షి’ మాటామంతీ.. ప్రశాంతతకు మారుపేరు పుట్టపర్తికి చాలా ఏళ్ల నుంచి వస్తున్నా. వచ్చిన ప్రతిసారీ నెల రోజులు ఉంటా. ఫుడ్ బాగా నచ్చింది. తెలుగు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నా. చీరకట్టు చాలా నచ్చింది. సత్యసాయి కోట్ల మంది గుండెల్లో కొలువై ఉన్నారు. – మెరియిల్లె, ఫ్రాన్స్మళ్లీ మళ్లీ రావాలనిపిస్తోంది పుట్టపర్తి గురించి చాలా ఏళ్లుగా వింటున్నా. తొలిసారి 15 రోజుల క్రితం వచ్చా. ఇక్కడే ఉండాలనిపిస్తోంది. ఒక వ్యక్తి ఇంతమందికి ఓ శక్తిలా మారి.. ఒక ఊరిని తయారు చేశారంటే మామూలు విషయం కాదు. – ఒట్టావి, ఫ్రాన్స్ సంప్రదాయాలు బాగున్నాయి తెలుగు సంప్రదాయం నచ్చిoది. చీరకట్టుకోవడం, తెలుగు వంటకాలు నేర్చుకున్నా. సెంట్రల్ ట్రస్టు సేవలు చాలా బాగున్నాయి. విద్య, వైద్యంపై భగవాన్ శ్రీసత్యసాయి సేవలను చరిత్ర మరువదు. – డానేలా, ఇటలీసాయిబాబా వ్యక్తి కాదు.. శక్తి 1980 నుంచి పుట్టపర్తికి వస్తున్నా. సాయిబాబా ఓ వ్యక్తి కాదు.. ఆయన ఓ శక్తి. ఇక్కడ చాలామంది పరిచయమయ్యారు. సొంత బంధువుల్లా ఆదరిస్తారు. తెలుగు కూడా మాట్లాడటం నేర్చుకున్నా. – లిండా, లండన్ సాయిబాబానే బతికించారు ఇక్కడకు చాలాసార్లు వచ్చాను. నేను మూడుసార్లు రోడ్డు ప్రమాదాలకు గురయ్యా. బాబానే బతికించాడని నమ్ముతున్నా. ఏటా బాబా జయంతి వేడుకలు మిస్ కాకుండా వస్తా. దోశ అంటే చాలా ఇష్టం. – ఫెర్నాండో, ఇటలీ అతిథులకు లోటు రానివ్వం భగవాన్ శ్రీసత్యసాయి బాబా భక్తులకు ఎలాంటి లోటు రానివ్వం. ఏ దేశం నుంచి అతిథులు వచ్చినా సాదరంగా స్వాగతిస్తాం. వారికి కావాల్సిన వసతి ఏర్పాటు చేస్తున్నాం. బాబా ఆశయాల సాధన మేరకు శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్టు సేవలు ఉన్నాయి. చిన్న గ్రామాన్ని ప్రపంచానికే పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి భగవాన్ శ్రీసత్యసాయిబాబా. – ఆర్జే రత్నాకర్రాజు, శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ -
Puttaparthi: ఆ ఏనుగంటే సత్యసాయికి ఎంతో ప్రేమ
పుట్టపర్తి అర్బన్(శ్రీసత్యసాయి జిల్లా): సత్యసాయి బాబాకు ఎంతో ఇష్టమైన ఓ ఏనుగు చనిపోవడంతో దానికి ఏకంగా ఆలయాన్నే నిర్మించారు. నిత్య పూజలు చేస్తున్నారు. ఈ ‘గజరాజు’ ఆలయం పుట్టపర్తిలో నక్షత్రశాల పక్కనే ఉంది. ఈ ఆలయ నేపథ్యాన్ని పరిశీలిస్తే సత్యసాయి బాబా సకల జీవుల పట్ల చూపిన అంతులేని ప్రేమ స్ఫురణకు వస్తుంది. సత్యసాయిబాబా 1962లో తమిళనాడులోని బండిపూర అడవి నుంచి ఓ గున్న ఏనుగును కొనుగోలు చేసి పుట్టపర్తికి తీసుకొచ్చారు. దానికి ‘సాయిగీత’ అని పేరు పెట్టి.. ప్రేమతో పెంచుకుంటుండేవారు. చదవండి: అరుదైన దేవాలయం... మద్యం మాన్పించే దేవుడు! ప్రశాంతినిలయంలో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ, పండుగల్లోనూ, ఊరేగింపుల్లోనూ బాబా ముందర సాయిగీత నడుస్తూ ఉండేది. దాని కోసం ప్రత్యేకంగా మావటీలను ఏర్పాటు చేసి, చిన్న షెడ్డులో ఉంచి సంరక్షించేవారు. ప్రతి రోజూ మావటీలు ఏనుగును వాకింగ్‌కు తీసుకెళ్లేవారు. వయసు మీద పడడంతో 2007 మే 23న ‘సాయిగీత’ చనిపోయింది. ఆత్మ బంధువుల అంత్యక్రియలకు సైతం వెళ్లని సత్యసాయి ఆరోజు సాయిగీత అంతిమయాత్రలో పాల్గొని కన్నీటి పర్యంతమయ్యారు. స్థానిక నక్షత్రశాల పక్కనే దాన్ని సమాధి చేశారు. 10వ రోజున వైకుంఠ సమారాధన సైతం ఘనంగా నిర్వహించారు. అక్కడే ఓ ఆలయాన్ని నిర్మించారు. అనంతరం మరో గున్న ఏనుగును అప్పటి టీటీడీ చైర్మన్ ఆదికేశవుల నాయుడు సత్యసాయికి బహూకరించారు. అది అనారోగ్యంతో 2013లో మృతి చెందింది. దాన్ని సైతం సాయిగీత పక్కనే ఖననం చేశారు. నిత్య పూజలు చేస్తున్న మావటి పెద్దిరెడ్డి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి సాయిగీతకు మావటిగా దాదాపు 23 ఏళ్లపాటు సేవలందించాడు. నిత్యం మేతగా చెరుకులు, నేపియర్ గడ్డి, రావి ఆకులు, మర్రి ఆకులు, అరటి గెలలు అందించేవాడు. ప్రతి రోజూ ఏనుగును సుమారు నాలుగు కిలోమీటర్లు వాకింగ్‌కు తీసుకెళుతుండేవాడు. ఏనుగు వచ్చినప్పుడు భక్తులంతా రోడ్డుకు ఇరువైపులా నిలబడి నమస్కరించేవారు. పెద్దిరెడ్డి ఇప్పటికీ పుట్టపర్తిలో ఉంటూ సాయిగీత ఆలయంలో నిత్య పూజలు చేస్తున్నారు. సాయిగీతకు మావటిగా పని చేయడం అదృష్టం సత్యసాయి బాబా ఎంతో ప్రేమగా చూసుకున్న సాయిగీతకు రెండు దశాబ్దాలకు పైగా సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నా. నేను చెప్పిన మాటను బాగా వినేది. చుట్టూ ఎంత మంది భక్తులు ఉన్నా బెదరకుండా నడిచేది. సాయిగీత లేకున్నా బాబా ఆశీస్సులతో ఆశ్రమంలోనే ఉంటున్నా. జీవితాంతం బాబా, సాయిగీత సేవలోనే ఉండిపోతా. – పెద్దిరెడ్డి -
సాయి సత్య బోధ
మనిషి జీవితంలో సైన్స్‌కి అందని విషయాలు చాలా ఉన్నాయి... రామాయణ.. మహా భారతాల్ని కల్పితాలు అని వాదించే నాస్తికులు, అబ్దుల్ కలాం లాంటి ప్రముఖ శాస్త్రవేత్తలు సైతం సత్యసాయి దర్శనం చేసుకుని ఆయన బోధలను ఆలకించినవారే! సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస అనే వాటిని ఆయుధాలుగా చేసుకుని.. లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని తన బోధనల ద్వారా ప్రజల్లో ప్రేమ తత్వాన్ని నింపారు సత్య సాయి. నేను మీ నుంచి ఆశించేది ఒక్కటే...అదే ప్రేమ... మీ ప్రేమ నాకు కావాలి.. అంటూ ఉండేవారు సత్యసాయి. భౌతికంగా ఆయన మనకు కనుమరుగై కొన్ని ఏళ్లు గడిచినా ఇప్పటికీ పుట్టపర్తిలోని ప్రశాంతినిలయంలో భగవాన్ జయంతి వేడుకలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన అందరూ ఇక్కడ 10 నుంచి 15 రోజులు సేవ చేస్తూ ఒకే కుటుంబంగా ఉంటూ వచ్చిన వాళ్ళకి సేవ చేస్తూ ఉంటారు. పదాహారేళ్ల పిల్లలు... ఎవరో తిని తాగిన ఎంగిలి విస్తళ్లు, కప్పులు మేము తియ్యడం ఏమిటా అనుకోకుండా ఒకరితో ఒకరు సేవలో పోటీ పడుతూ సంతోషంగా చేస్తున్నారు. కరోన కారణంగా సామాజిక దూరం పాటించడం కోసం మందిరంలో... ఇంకా చాలా చోట్ల వృత్తాలు గీసి ఉంచారు. బాబా తన బోధలలో ఎక్కువగా ఒక విషయం చెప్పేవారు... చావుకు భయపడద్దు... చెప్పుడు మాటలు నమ్మద్దు... భగవంతుడిని విడవద్దు... అని. బహుశ వీటిని దృష్టిలో పెట్టుకునే కాబోలు... ఎంతోమంది ఈ కరోన సమయంలో కూడా సేవకు వచ్చారు. సత్యసాయి బోధామృతం.. ►రోజును ప్రేమతో మొదలు పెట్టు... ఇతరుల కోసం ప్రేమతో సమయం వెచ్చించు. రోజంతా నీలో ప్రేమను నింపుకో. ప్రేమతోనే ఈ రోజు ముగించు. దేవుణ్ణి గుర్తించడానికి అదే సరైన దారి. ►కోరికలు ప్రయాణాలలో తీసుకు వెళ్లే వస్తువులలాంటివి. ఎక్కువయిన కొద్దీ జీవిత ప్రయాణం కష్టం అవుతుంది. ►దైవమే ప్రేమ. ప్రేమలో జీవించు. ►ప్రతి అనుభవం ఒక పాఠం ప్రతి వైఫల్యం ఒక లాభం ►ఎక్కడ దేవుని మీద విశ్వాసం ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది. ►ఎక్కడ ప్రేమ వుంటుందో అక్కడ శాంతి ఉంటుంది. ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. – ఇన్పుట్స్: పోరంకి లక్ష్మీప్రసన్న (నవంబర్ 23 సత్యసాయి జయంతి) -
బంగారు రథంపై సత్యసాయి
పుట్టపర్తి: సత్యసాయి జయంతి వేడుకల్లో ప్రధాన ఘట్టమైన జోలోత్సవాన్ని గురువారం రాత్రి వైభవంగా నిర్వహించారు. సాయంత్రం సత్యసాయి చిత్రపటాన్ని బంగారు రథంపై అధిష్టింపజేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం యజుర్వేద మందిరం నుంచి ట్రస్ట్ సభ్యులు ఆర్జే రత్నాకర్, ప్రసాదరావు, చక్రవర్తి, నాగానంద, మోహన్, డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యనారాయణతో పాటు సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ సభ్యులు రథాన్ని లాగుతూ సాయికుల్వంత్ మందిరంలోకి తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేక పూజల అనంతరం మహా సమాధి వద్ద వెండి ఊయలలో బాబా చిత్రపటాన్ని ఉంచి జోలోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తి గీతాలు ఆలపిస్తూ సత్యసాయిని స్తుతించారు. సంగీత విద్వాంసులు అభిషేక్, రఘురాముల సంగీత కచేరి ఆకట్టుకుంది. మహామంగళ హారతి అనంతరం భజనలు చేపట్టారు. -
సత్యమే సుందరం
ఆయన అమృతహస్తాలు ఆపన్నులను ఆదుకున్నాయి. కష్టాలలో ఉన్నవారిని సేదతీర్చాయి. ఆయన వితరణ దాహార్తితో పరితపిస్తున్న లక్షలాది ప్రజల దాహార్తి తీర్చింది. ఆయన చేసిన విద్యాదానం ఎంతోమంది విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను ఉచితంగా అందించింది. ప్రేమపూరితమైన ఆయన పలుకు, వెచ్చని ఆయన స్పర్శ వేలాదిమందికి ఉపశమనం కలిగించింది. ఆయన నీతిబోధ, సత్యవాక్పాలన, సేవానిరతి ప్రపంచదేశాలన్నింటికీ పాకి, కోటానుకోట్ల మందిని శిష్యులుగా చేసుకుంది. ప్రేమ, శాంతి, సహనం, సత్యం, సేవాతత్పరత వంటి అనేక ఉత్తమ గుణాలు కలగలసిన భగవాన్ శ్రీసత్యసాయిబాబా బోధామృతం నుంచి జాలువారిన కొన్ని బిందువులు... భారతదేశం అపూర్వ ఆధ్యాత్మిక సంపదకు పుట్టినిల్లని, మన పూర్వీకులు, ఋషులు చేసిన కృషి ఫలితమే మన సంస్కృతీ సంప్రదాయాలని, ఇటువంటి పవిత్ర భారతదేశంలో మనం పుట్టడం జన్మజన్మల అదృష్టమని బాబా ఎప్పుడూ చెప్పేవారు. నేను దేవుడనే– మీరూ దేవుడే నేనూ దేవుడినే, మీరూ దేవుడే, కాని, ఆ విషయం నాకు తెలుసు కాని మీకు తెలియదని పలుమార్లు చెప్పేవారు బాబా. మానవ నిజస్వరూపం, మన కంటికి కనిపించే స్వరూపం కాదని, ప్రేమ మన నిజమైన స్వరూపమని, దానిని మనమంతా పెంపొందించుకోవాలని చెబుతూ, అందుకు నిదర్శనంగా అందరినీ ‘ప్రేమస్వరూపులారా’ అనే పిలిచేవారు.భారతదేశంలో పుట్టిన ప్రతివారూ పేదయినా, ధనికుడైనా, ఈ ఆధ్యాత్మిక సంపదకు అందరూ వారసులేనని, దాని విలువ గుర్తించలేక మన సంఘం మనకు చూపించే ధన సంపద, ఆర్జన, సుఖాలు, వైజ్ఞానికత వంటి వాటితో కాలం గడుపుతూ మన జీవితాలను నిష్ప్రయోజనం కావించుకుంటామని అనేక ప్రసంగాలలో ఆవేదన వ్యక్తం చేసేవారు బాబా.మన చుట్టూ ఉన్న సంఘాన్ని చూసి, ధన సంపాదనే ధ్యేయంగా పెట్టుకుని, తాను చనిపోయినప్పుడు తనతో రాదని తెలిసినా, తనకు కావలసిన దానికన్నా అధిక సంపాదన కోసం, భగవంతుడు ఇచ్చిన అమూల్యమైన కాలాన్ని వ్యర్థం చేసుకుంటారని చెబుతారు. భగవంతుడు సృష్టించిన 84 లక్షల జీవరాశులలో, మానవ సృష్టి అత్యద్భుతమని, మానవ జాతికి అదనంగా ఇచ్చిన ‘విచక్షణ’ అనే జ్ఞానం ఒక పెద్ద వరమని, దాని ఉపయోగంలో అంటే ఏది చెడు, ఏది మంచి అని తెలుసుకొని, ఆదర్శంగా, ఆధ్యాత్మికంగా, సుఖమయ జీవితాన్ని అనుభవించవచ్చని బోధిస్తారు. ధనసంపాదనే ధ్యేయంగా ఉన్న ఈ సంఘంలో, మనకు తెలియకుండానే మనలో స్వార్థం పెరుగుతుందని, ఆ స్వార్థమే జాతి, దేశ సంస్కృతి వినాశాలకు దారి తీస్తుందని, ప్రపంచ చరిత్ర కూడా అదే నిజమని నిరూపించిందని చెబుతుంటారు. స్వార్థంతో... సర్వప్రాణులందరూ ప్రేమతత్వాన్ని పెంచుకోవడమే మనకు అంటుకున్న స్వార్థానికి విరుగుడు అని అంటారు. ఈ విషయంలో ‘నీ స్నేహితులెవరో చెబితే, నీవు ఎటువంటి వాడివో నేను చెబుతాను’ అని అంటారు. అంటే మన చుట్టూ ఉన్న సంఘం మనమీద ఎంత ప్రభావం చూపుతుందని చెప్పడం, చాలా సాధారణంగా ‘అందరినీ ప్రేమించు– అందరినీ సేవించు’ ‘అందరికీ సాయం చెయ్యి ఎవరినీ బాధపెట్టకు’ అనే విచక్షణతో, ప్రేమను పెంచుకోవచ్చని, ఎంతటి కరడుగట్టిన స్వార్థాన్ని కూడా కరిగించే అవకాశమని, జీవిత పరమార్థమని బోధిస్తాడు. శక్తి కొలది తనకు భగవంతుడు ఇచ్చిన దానిలో (సంపద కాని, విజ్ఞానం కాని, శక్తి కాని అధికారం కాని, ఏదైనా కాని తోటి అభాగ్యులకు సేవ చేయగలిగితే, ప్రేమతత్వాన్ని పెంపొందించుకోవచ్చని, తన జీవితమే దానికి నిదర్శనమని అంటారు. పదవుల కోసం, అధికారం కోసం, గుర్తింపు కోసం, ప్రచార నిమిత్తం చేసే సేవలు స్వార్థాన్ని పెంచుతాయేగాని, తగ్గించవంటారు. ప్రతి మానవుడు తన జీవితం కోసం బాధ్యతల కోసం, కావలసిన ధనాన్ని సంపాదించుకుంటూ, తోటి మానవునికి, జీవులకు తన శక్తి కొలది నిస్వార్థమైన సేవ చేస్తే, ప్రేమతత్వాన్ని పెంచుకుంటూ తన నిజస్వరూపాన్ని తెలుసుకుంటూ భగవంతుణ్ణి సులభంగా చేరుకోవచ్చని చెప్పేవారు. మన జీవన ప్రయాణం మానవత్వం నుంచి దైవత్వానికే మన జీవన ప్రయాణం అనేవారు... సర్వులందు ప్రేమయే వారు జగతికి ఇచ్చిన సందేశం. స్వామి జన్మదిన సందర్భంగా మనం వారు చెప్పిన విధానంలో మనలోని ప్రేమను పెంచుకుంటూ, తోటివారికి శక్తి కొలది సహాయ పడుతూ, ప్రేమతత్వాన్ని పెంపొందించుకుంటూ, సనాతన ధర్మాచరణతో ఈ మిగులు జీవితాన్ని సార్థకత చేసుకునే ప్రయత్నం చేద్దాం. – శంకర నారాయణ ప్లాంజెరి (హ్యూస్టన్, అమెరికా నుంచి) ►క్రమశిక్షణ ఉంటే ఇంకొకరి రక్షణ అవసరం లేదు. ►ఈ రోజును ప్రేమతో మొదలు పెట్టు ఇతరుల కోసం ప్రేమతో సమయం వెచ్చించు. ► రోజంతా నీలో ప్రేమను నింపుకో. ప్రేమతోనే ఈ రోజు ముగించు. దేవుణ్ణి గుర్తించడానికి అదే సరైన దారి. ►కోరికలు ప్రయాణాలలో తీసుకు వెళ్లే వస్తువులలాంటివి. ఎక్కువయిన కొద్దీ జీవిత ప్రయాణం కష్టం అవుతుంది. ► దైవమే ప్రేమ; ప్రేమలో జీవించు. ►ప్రతి అనుభవం ఒక పాఠం. ► ప్రతి వైఫల్యం ఒక లాభం. ►ఎక్కడ దేవుని మీద విశ్వాసం ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది. ►ఎక్కడ ప్రేమ వుంటుందో అక్కడ శాంతి ఉంటుంది. ►ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. ► ఎక్కడ దేవుడు ఉంటాడో అక్కడ ఆనందం ఉంటుంది. ►దేవుడు ఆకాశం నుంచి దిగి మరల పైకి ఆకాశానికి వెళ్లేవాడు కాదు. సర్వత్రా వ్యాపించి ఉంటాడు. ►అన్ని ప్రాణులను ప్రేమించు అది చాలు. ►నేటి విద్యార్థులే రేపటి గురువులు. ►ఇంటిలో ఆదర్శం ఉంటే, దేశంలో నిబద్ధత ఉంటుంది. ► సత్యానికి భయం లేదు. అసత్యం నీడను చూసి కూడా వణుకుతుంది. -
నువ్వులేక అనాథలం..
మా ఆర్తి చూస్తావని సాక్షాత్కరిస్తావని వేచాము క్షణం క్షణం సాయి శ్రీరాముడైనా, శ్రీకృష్ణుడైనా ఏ దైవమైన, ఏ ధర్మమైన నీలోనే చూశాము సాయి రావా బాబా.. రక్షా దక్షా నీవే కదా మా బాబా! ‘అందరినీ ప్రేమించు. ఎవరినీ ద్వేషించకు. తోటివారి బాధ నీదిగా భావించు. మానవ సేవే మాధవ సేవ’ అనే సత్యసాయి బోధన విశ్వ వ్యాప్తంగా సేవాకాంతులు ప్రజ్వలిస్తోంది. కులమతాలు.. ప్రాంతాలకు అతీతంగా ఆయన భక్తులు సేవా మార్గంలో పయనిస్తున్నారు. పేద విద్యార్థులకు ఉచిత విద్యా బోధన.. మెరుగైన వైద్యం.. ప్రకృతి వైపరీత్యాల్లో సేవా కార్యక్రమాలు.. ఉన్నత వ్యక్తిత్వం పెంపొందించేందుకు సత్య బోధన.. ఒక్క మాటలో చెప్పాలంటే ‘ప్రపంచ సంతోషమే.. తమ సంతోషం’ అని చాటుతున్నారు. ఇప్పటికీ.. ఎప్పటికీ.. బాబా సేవలు అజరామరం. ఇప్పటి వరకూ ‘సత్యసాయి సెంట్రల్ ట్రస్టు’ ఇండియాలో ఏం చేసిందనేది అందరికీ తెలుసు. అయితే ప్రపంచవ్యాప్తంగా ట్రస్టు ఏం చేస్తోంది? భారత్ మినహా ఆఫ్రికా దేశానికి మాత్రమే వెళ్లిన సత్యసాయి విశ్వమానవాళిని ఎలా ప్రభావితం చేశారు? ‘ప్రపంచాన్ని సేవా మార్గం వైపు నడిపిస్తున్న ‘సాయిలీల’ ఏమిటి? అనే అంశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సాక్షిప్రతినిధి, అనంతపురం: సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ప్రపంచ వ్యాప్తంగా చేస్తున్న సేవా కార్యక్రమాలపై బాబా ఉన్నన్నిరోజులు వీటి గురించి ఎక్కడా మీడియాలో కథనాలు రాలేదు. ఎందుకని ప్రశ్నిస్తే ‘నా ఇంట్లోకి పది మంది బంధువులు వచ్చి భోజనం చేసి వెళతారు. ఇది పత్రికకు వార్త కాదు కదా? అలాగే ప్రపంచమంతా నా కుటుంబం. మన ఇంట్లోవారికి చేసే సాయానికి ప్రచారమెందుకు?’ అని బాబా చెప్పిన మాటలను ట్రస్టు సభ్యులు గుర్తు చేశారు. భారత్ మినహా బాబా ఆఫ్రికాకు మాత్రమే ఒకసారి వెళ్లారు. అది మినహా మరేదేశానికీ వెళ్లలేదు. పుట్టపర్తికి వచ్చి బాబా బోధనలు విన్న విదేశీభక్తులు ‘స్ఫూర్తి’పొంది విదేశాల్లో సేవ చేయడం మొదలెట్టారు. దీన్ని అక్కడి వారు నిశితంగా గమనించారు. ‘ఉచితంగా రక్తం ఇస్తున్నారు. చికిత్స చేస్తున్నారు. భోజనం పెడుతున్నారు. చదువు చెబుతున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు.’ ఇంత మంచి కార్యక్రమాల్లో మనమూ భాగస్వాములు కావాలని భావించారు. ‘సాయిసేవ’లో సభ్యులయ్యారు. ఎంతలా అంటే అమెరికాలోని కొన్ని హెల్త్యూనివర్శిటీల డీన్లు కూడా సభ్యులుగా చేరి ‘సాయి మెడికల్ క్లినిక్’లలో సేవ చేస్తున్నారు. సత్యసాయిసేవలు విశ్వాన్ని ఎలా ప్రభావితం చేశాయో ఈ ఘటనలతో సుస్పష్టమవుతుంది. సత్యసాయి సెంట్రల్ ట్రస్టు స్వరూపం ప్రపంచవ్యాప్తంగా 195 దేశాలున్నాయి. ఇందులో 123 దేశాల్లో సత్యసాయి ట్రస్టు సేవలందిస్తోంది. ప్రశాంతి సొసైటీ, వరల్డ్ ఆర్గనైజింగ్ కమిటీ, యూత్వింగ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఈ మొత్తం దేశాలను తొమ్మిది జోన్లుగా విభజించారు. అందులో రీజియన్లు, వాటిలో దేశాలుగా విభజించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొత్తం రెండు వేల సెంటర్లుగా ఏర్పడిన ట్రస్టు... విద్య, వైద్యంతో పాటు పలు రకాల సేవలందిస్తోంది. ప్రశాంతి కౌన్సిల్ పేరుతో జరిగే ఈ కార్యక్రమాకు చైర్మన్‌గా లాస్ ఏంజెల్స్‌లోని ప్రముఖ వైద్యులు డాక్టర్ నరేంద్రనాథరెడ్డి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. వైద్య సేవ అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, సౌతాఫ్రికా, వెనుజులా, జర్మనితో పాటు చాలాదేశాల్లో ప్రపంచ ప్రసిద్ధులైన డాక్టర్లు కూడా సత్యసాయి భక్తులయ్యారు. వీరు తమ వత్తి చేసుకుంటూనే ఏడాదిలో రెండుసార్లు పుట్టపర్తికి వస్తారు. గురుపౌర్ణమి, సత్యసాయి జయంతికి ఇక్కడికి వచ్చి వారం రోజుల పాటు పేదరోగులకు ఉచితంగా వైద్యం, మందులు అందిస్తారు. దీంతోపాటు వారు నివసిస్తోన్న దేశాల్లో కూడా ‘ఫ్రీ మెడికల్ క్లినిక్’లు నిర్వహిస్తున్నారు. ‘మొబైల్ క్లినిక్’లకు కూడా శ్రీకారం చుట్టారు. ఇండోనేషియా, శ్రీలంక, నేపాల్‌తో పాటు చాలా దేశాల్లో మెబైల్ క్లినిక్‌లు ఏర్పాటు చేసి చికిత్స చేస్తున్నారు. యువ రక్తం...సేవా మార్గం సత్యసాయి యూత్వింగ్ ఆధ్వర్యంలోనూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. గతేడాది పుట్టపర్తిలో వరల్డ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో 36 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. యూత్వింగ్ ప్రపంచాన్ని 11 జోన్లుగా విభజించి, 11 యువజన సంఘాలు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరు ఎక్కువగా ప్రకతి వైపరీత్యాలు జరిగే ప్రాంతాలకు హాజరవుతుంటారు. వీటితో పాటు మెడికల్ క్యాంపు, బ్లడ్ క్యాంపు, అన్నదానాలు, విద్యాబోధన చేయడంతో పాటు తోటి మనిషిపై సాటి మనిషి ఎలా ప్రేమ చూపాలి అనే కోణంలో అక్కడి ప్రజలకు చైతన్యం కల్గిస్తుంటారు. విద్యాబోధనపై ప్రత్యేక శ్రద్ధ భారత్ కాకుండా ఇతర దేశాల్లో 41 సత్యసాయి స్కూళ్లు ఉన్నాయి. 39 సత్యసాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. వీటిలో నాణ్యమైన, ఉన్నత విలువలతో కూడిన విద్యతో పాటు ‘సేవా మార్గాన్ని’ బోధిస్తున్నారు. బాబా సూక్తులు, వచనాలు, మనిషి పట్ల, సమాజం పట్ల సాటి మనిషికి ఉండాల్సిన బాధ్యతలపై బోధిస్తారు. సత్యసాయి విద్యాసంస్థల్లో బోధన, క్రమశిక్షణ చూసి అక్కడి పాఠశాలల యాజమన్యాలు ఇలాంటి బోధన జరిగేలా తమ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని అడిగారు. ఆస్పత్రులలో కూడా సత్యసాయిభక్తులు రోగుల పట్ల వ్యవహరించే తీరు, చూపించే ప్రేమ తమ ఇన్స్టిట్యూట్లలో కూడా అందాలని అక్కడి ఆస్పత్రుల యాజమన్యాలు ట్రస్టులోని డాక్టర్లను తీసుకెళ్లి శిక్షణ ఇప్పిస్తోంది. గతేడాది ట్రస్టు చేసిన కొన్ని ముఖ్య కార్యక్రమాలు ♦ నైజీరియా, క్యూబాలో సాయి వాటర్ ప్రాజెక్టు నిర్మించి తాగునీరు అందించారు. ♦ కెన్యాలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి ప్రత్యేక చికిత్స చేశారు. ♦ చైనాలో మొక్కలునాటే కార్యక్రమం చేపట్టారు. ఇక్కడ రెగ్యులర్‌గా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ♦ దుబాయ్‌లో సత్యసాయి యువజన విభాగం ఆధ్వర్యంలో పేరెంట్స్ వర్క్‌షాపు నిర్వహించి, పిల్లలను ఎలాపెంచాలనే అంశంపై శిక్షణ ఇచ్చారు. స్వామి ప్రవచనాలను బోధించారు ♦ అబుదాబిలో అన్నదానం, రక్తదానం లాంటి సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ♦ బహ్రేయిన్లో స్కూలు పిల్లలతో మొక్కలు నాటించి పర్యావరణంపై వర్క్‌షాపు నిర్వహించారు. ♦ కాలిఫోర్నియాలో 400 మంది డాక్టర్లతో ఇంటర్నేషనల్ మెడికల్ క్యాంపు నిర్వహించారు. ♦ సౌదీలో రంజాన్ సందర్భంగా అన్నదానం చేశారు. ♦ ఒమెన్‌లో 45 వర్క్‌షాపులు నిర్వహించారు. వీటిని మెచ్చుకుని అక్కడి విద్యాశాఖమంత్రి ట్రస్టుకు ప్రశంసాపత్రం అందజేశారు. ♦ కువైట్‌లో స్పెషల్నీడ్ చిల్డ్రన్స్‌కు పలు సేవలు చేశారు. యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సమ్మర్‌క్యాంపు చేపట్టి సేవా కార్యక్రమాలపై శిక్షణ ఇచ్చారు. ♦ నేపాల్ భూకంపం సమయం నుంచి అక్కడి శరణార్థులకు సేవలందిస్తున్నారు. ఖాట్మండు,, పొకారా, భరత్‌పూర్‌లో పైపులైన్లు ఏర్పాటు చేసి మంచినీళ్లు అందించారు. ♦ వెస్టిండీస్, ఇటలీలో పక్కా ఇళ్లు నిర్మించారు. ♦ 25 దేశాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహిచారు. ఈ ఫొటోలో కన్పిస్తోన్న నర్సుపేరు కృష్ణలీల. ఆస్ట్రేలియా మహిళ. బాబా బోధనలకు ముగ్ధురాలై భక్తురాలైంది. కృష్ణలీల అని పేరు మార్చుకుంది. ఈమె బాబా జయంతి నవంబర్ 23 అంటే పది రోజులు ముందు వస్తుంది. మెడికల్ క్యాంపునకు కావల్సిన సౌకర్యాలను దగ్గరుండి చూస్తుంది. సొంత ఖర్చులతో మలేషియా నుంచి నర్సులను తీసుకొచ్చి ఇక్కడి సేవ చేయిస్తుంది. నెబులైజేషన్, బెడ్స్, మెడిసిన్స్ అన్నీ దగ్గరుండి చూస్తుంది. పేరు ఎందుకు మార్చుకున్నారని ప్రశ్నిస్తే ‘మతాలకు, కులాలకు అతీతమైంది మానవ సంబంధం. సాయిబోధనలో ఇది స్పష్టమైంది. ఈ విషయాలు పలు దేశాల్లో చెబితే మేమూ మీతో ఓ గంట సేవ చేస్తాం’ అని ముందుకొస్తున్నారు. పాత పేరు ఉంటే ఏంటని ప్రశ్నిస్తే...అది గతం. నాపేరు కృష్ణలీల. నేను పాటించేది ఇక్కడి సంస్కృతి అని అంటారు. తెలుగు రాష్ట్రాల్లో అన్నదానం సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర, తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రులలో రోగులకోసం వచ్చే బంధువులకు భోజనం లభించడం కష్టమవుతోంది. దీంతో శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ, ఏలూరు, భీమవరం, ఒంగోలు, నెల్లూరు, కడప, మెట్పల్లి, కరీంనగర్, నల్గొండ, జగిత్యాల, మంచిర్యాల, అదిలాబాద్ ఆస్పత్రులలో రోజూ 3,500 మందికి అన్నదానం నిర్వహిస్తున్నారు. 20న గవర్నర్ రాక అనంతపురం అర్బన్: రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ ఈ నెల 20న పుట్టపర్తికి విచ్చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు శాంతి భవన్ చేరుకుంటారు. అక్కడ అల్పాహారం తీసుకుని 8.35 గంటలకు సాయి కుల్వంత్ హాల్లో ఏర్పాటు చేసిన శ్రీ సత్యసాయి వేద కాన్ఫరెన్స్, మల్టీ ఫెయిత్ సింపోజిమ్ ఆన్ గ్లోబల్ పీస్ అండ్ హార్మోనీని ప్రారంభిస్తారు. ఉదయం 11 గంటలకు అక్కడి నుంచి బెంగుళూరుకు బయలుదేరి వెళతారు. ఏటా వస్తుంటా నా వయస్సు 74 ఏళ్లు. 1984 నుంచి సేవాదల్లో పనిచేస్తున్నా! సత్యసాయి ఇంటర్నేషనల్ మెడికల్ క్యాంపునకు హాజరవుతాంటా! పేదవారికి సేవ చేసినప్పుడు కలిగే తప్తి మళ్లీ పుట్టపర్తికి వచ్చే వరకూ ఉంటుంది. సత్యసాయి భోదనలు ఒంటపడితే అందరూ ప్రేమ, సేవకు బానిసలు కావల్సిందే! అదే సాయిలీల మహత్యం. – ఉడో ఫ్రెజల్, జర్మనీ సేవలతో ప్రభావితం ఏడాదికి రెండుసార్లు ఇక్కడ మెడికల్ క్యాంపు నిర్వహిస్తుంటాం. నా భార్యతో కలిసి కొద్దిరోజులు ముందుగానే వచ్చి ఏర్పాట్లు చూసుకుంటా. ఇక్కడ చికిత్స చేసే డాక్టర్ల పిల్లలతో పాటు సేవలందించే విదేశీ భక్తుల పిల్లలు మెడికల్ క్యాంపు చూసి, వారు కూడా డాక్టర్ కావాలని తల్లిదండ్రులతో చిన్నపుడే చెబుతున్నారు. పదేళ్ల వయసు నుంచే డాక్టర్ కావాలనే సంకల్పంతో చదివి డాక్టర్లు అయిన వారూ ఉన్నారు. విదేశీయుల్లో ఇది ఎక్కువగా కన్పిస్తోంది. దీన్నిబట్టే సత్యసాయి సేవలు ఎంత ప్రభావితం చేస్తున్నాయో తెలుస్తుంది. – డాక్టర్ బంగార్రాజు, జనరల్ మెడిసిన్, యూఎస్ఏ సత్యసాయి బోధనలే నడిపిస్తున్నాయి 123 దేశాల్లో సేవాకార్యక్రమాలు నిర్వహించడం చాలా గొప్ప విషయం. అమెరికాలో మెడికల్ క్యాంపులు నిర్వహించడం చాలా కష్టం. అక్కడ ఉచిత వైద్యం అంటే ప్రజలు నమ్మరు. పైగా ఇన్సూరెన్స్ కంపెనీలతో సమస్య. కానీ సత్యసాయి క్యాంపులకు అక్కడి ప్రభుత్వం, ఇన్సూరెన్స్ కంపెనీలు సహకరిస్తున్నాయి. కెన్యా, నైజీరియా, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాలోని రూరల్ ప్రాంతాలకు కూడా వెళ్లి సేవ చేస్తున్నాం. విద్య, వైద్యం చాలా గొప్పగా ఉంటోంది. ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు కూడా ఇలాంటి విద్య, వైద్యం కావాలని కోరుకుంటున్నాయి. ఏడాదికేడాదికీ సత్యసాయి సేవలను మరింత మెరుగ్గా చేస్తాం. 2019లో 95 దేశాలలోని 95 కమ్యూనిటీలతో సదస్సు నిర్వహించి వారిని దత్తత తీసుకుంటాం. తాగునీరు, ఇళ్లు, వైద్యం, విద్య అన్ని రకాలుగా సేవలందిస్తాం. వచ్చే ఏడాది జూలైలో గోగ్రీన్ కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నాం. – డాక్టర్ నరేంద్రనాథరెడ్డి, ప్రశాంతి కౌన్సిల్ చైర్మన్, యూఎస్ఏ బాబా బాటలో వెళుతున్నా మా తల్లి సైక్రియాట్రిస్టు. వాళ్లు బాబా భక్తులు. ఇక్కడికి సేవ చేసేందుకు వచ్చేవారు. వారి స్ఫూర్తితో నేను ఇక్కడికి వచ్చి సేవ చేస్తున్నా. హెపాటాలజీ ప్రొఫెసర్‌గా కూడా ఉన్నా. అమెరికాలో హెపటాలజీ విభాగపు డాక్టర్లకు శిక్షణ ఇస్తుంటా. ఎయిమ్స్‌లో కూడా సేవలందిస్తున్నా. ఉన్నత పదవుల్లో ఉన్నా అంకిత భావం, ప్రేమ ఉండాలని బాబా బోధించిన బాటలోనే వెళుతున్నా! –హరి కంజీవరం, గ్యాస్ట్రో ఎంటరాలజీ ప్రొఫెసర్, యూఎస్ఏ మానవతా విలువలు పెంపొందాలంటే సేవే మార్గం 48 ఏళ్లుగా సత్యసాయి సేవలో ఉన్నా. సత్యసాయి సెంట్రల్ ట్రస్టు సేవలు విశ్వవ్యాప్తమయ్యాయి. సాయి చూపిన సేవా మార్గంలో కోట్లాదిమంది భక్తులు నడుస్తున్నారు. ఆయన ప్రేమ–సేవ మార్గాన్ని ప్రపంచదేశాలు ఆచరిస్తున్నాయి. కులమతాలకు అతీతంగా దృక్పథంలో మార్చు వచ్చి అందరూ పుట్టపర్తికి వస్తున్నారు. మానవతా విలువలు ఇంకా పెంపొందాలి. దీనికి సేవే సరైన మార్గం. – హెచ్‌జే దొర, మాజీ డీజీపీ, సత్యసాయి వరల్డ్ ఫౌండేషన్ డైరెక్టర్, హైదరాబాద్. సాయి వాక్కుతో పీడియాట్రిక్ సర్జన్ అయ్యా.. మా తల్లిదండ్రులు యూఎస్‌లో స్థిరపడ్డారు. నేను నాసాలో ఎలక్ట్రిక్ ఇంజినీర్‌గా ఉండేవాన్ని. పుట్టపర్తిలో బాబా దర్శనానికి వెళితే ‘యూ ఆర్ మై ‘పీడియాట్రిక్ సర్జన్’ అన్నారు. మొదట అర్థం కాలేదు. తర్వాత మెడికల్ ఎంట్రెన్స్ రాసి ఈ రోజు పీడియాట్రిక్ న్యూరో సర్జన్‌గా ఉన్నా. అత్యాధునిక పద్ధతుల్లో రోబోటెక్ ఆపరేషన్లు ఉచితంగా చేస్తున్నా. వారం కిందట కేరళలో మెదడుకు సంబంధించి అరుదైన ఆపరేషన్ చేశా. పుట్టపర్తి, బెంగళూరులో ఆస్పత్రులు నిర్మించి డాక్టర్లు ఎలా ఉండలో, వైద్యం ఎలా సేవగా భావించాలో ప్రపంచానికి చెబుతాను. – డాక్టర్ వెంకట సదానంద్, పీడియాట్రిక్, న్యూరోసర్జన్ -
సత్యసాయి సేవలు వెలకట్టలేనివి
స్పీకర్ మధుసూదనాచారి పుట్టపర్తి టౌన్: సత్యసాయి బాబా మానవాళికి అందించిన సేవలు వెలకట్ట లేనివని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి కొనియాడారు. ఏపీలోని అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో జరుగుతున్న శివరాత్రి వేడుకల్లో పాల్గొనేందుకు శుక్రవారం ఆయన పుట్టపర్తి చేరుకున్నారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ కరువు జిల్లాలో తాగునీటిని అందించిన మహాను భావుడు సత్యసాయి అని, తెలంగాణలో సైతం పలు జిల్లాల్లో ఆయన సేవలు కొనసాగుతున్నాయన్నారు. అనంతరం శివరాత్రి వేడుకల్లో భాగంగా ప్రశాంతి నిలయంలో జరుగుతున్న అఖండ భజన కార్యక్రమంలో పాల్గొని సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. -
చిల్లుకుండలో... నీళ్ళు పోయకండి!
సత్యపథం ‘అందరినీ ప్రేమించు- అందరినీ సేవించు’ అన్న నినాదాన్ని ఒక మంత్రంగా, ఒక స్ఫూర్తిగా మలచినవారు శ్రీసత్యసాయిబాబా. బోధలతో కర్తవ్యాన్ని గుర్తు చేసేవారు కొందరైతే, బోధలతోపాటు ఆచరణ ద్వారా లోకానికి దారి చూపేవారు మరికొందరు. సత్యసాయి బోధలు, సేవలు పుట్టపర్తి దాటి ప్రపంచమంతా విస్తరించాయి. 1926 నవంబర్ 23న జన్మించిన సత్యసాయి చిన్నప్పటినుంచే తాత్వికంగా, వైరాగ్యంగా మాట్లాడేవారు. అయితే, మాటల కంటే చేతలే ముఖ్యమని నమ్మిన బాబా విద్య, వైద్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. దాహార్తితో నిండిన ఎన్నో గ్రామాలకు నీటి వసతి కల్పించారు. సత్యసాయి బోధలు దేవుడు ఒకటే. రెండు కాదు. సాధన చేస్తే నువ్వే దైవం కావచ్చు. ఇంద్రి యాలు కోరినవన్నీ ఇస్తూ, మనసు ఆడించినట్టల్లా ఆడుతూ పోతే - నువ్వెప్పటికీ దైవం కాలేవు, దైవాన్ని చేరుకోలేవు. నీ కుటుంబ సభ్యుల యోగక్షేమాలు చూసుకోవడం నీ బాధ్యత. నీ దైనందిన, వృత్తిపనులు వదిలి పెట్టాలని ఎవరూ కోరుకోరు. ఈ ప్రపంచంలో హాయిగా జీవించు. కానీ ఆధ్యాత్మిక స్రవంతికి ఎన్నడూ దూరం కావద్దు. నాలుక రుచులను కోరుతుంది. రుచులను అందిస్తూ పోతే శరీరానికే ప్రమాదం. నాలుక రుచికీ, మాటకూ ఆధారం. కాబట్టి రెండింతల జాగ్రత్త లేకపోతే, రెండింతల ప్రమాదం. ఇంద్రియ నిగ్రహం లేకపోతే, చిల్లుకుండలో నీరు పోసినట్లే. మాట అదుపు తప్పితే... మరీ ప్రమాదం. తక్కువ మాట్లాడాలి. ప్రియంగా మాట్లాడాలి. అవసరమైనంతే మాట్లాడాలి. మాటలో తీవ్రత పెరగకూడదు. అరుపులు, కేకలుగా మారకూడదు. కోపంలో, ఉత్సాహంలో కూడా మాట జారకూడదు. విద్య, వైద్య, ఆధ్యాత్మిక, సామాజిక సేవల్లో దారిదీపంగా నిలచిన బాబా 2011 ఏప్రిల్ 24న దేహాన్ని విడిచిపెట్టినా, ఆయన బోధలు, సత్యసాయి ట్రస్ట్ సేవలు స్ఫూర్తినిస్తున్నాయి. - పమిడికాల్వ మధుసూదన్ -
సత్యసాయి మెచ్చిన పకోడి...!
పకోడి... ఈ పేరు వింటే చాలు ఎంతో మంది నోళ్లూరిపోతుంటాయి. పకోడి అంటే ఇష్టంలేని వాళ్లు బహుశా ఉండరేమో. హాట్ ఐటమ్స్‌లో దీని ప్రత్యేకతే వేరు. ఇక పకోడీల్లో కల్లూరు పకోడి వేరయా అని చెప్పకతప్పదేమో. అంత ఫేమస్ కల్లూరు పకోడి. గార్లదిన్నె: అనంతపురం కల్లూరు రైల్వే స్టేషన్లో ఏదైనా ఒక రైలు ఆగిందంటే చాలు ప్రయాణికులంతా ఓ దగ్గర గుమిగూడుతుంటారు. మాకివ్వండి... మాకివ్వండి అంటూ హడావుడి చేస్తుంటారు. ఇదంతా దేనికంటే ఇకెందుకు ఇక్కడ లభించే పకోడి కోసమే అని వేరే చెప్పాలా. గార్లదిన్నె మండలం కల్లూరు రైల్వే క్యాంటీన్లో మాత్రమే ఈ స్పెషల్ పకోడి లభిస్తుంది. ఈ క్యాంటీన్ నిర్వాహకులు తండ్రీకొడుకులే. వారే కల్లూరు ఆర్ఎస్కు చెందిన వి.నరసింహ, వి. శశికాంత్‌లు. కర్నాటకలోని ఉడిపి జిల్లా కుందాపురం తాలుకాకు చెందిన వి. నరసింహారావు కుటుంబం 50 ఏళ్ల క్రితం కల్లూరు ఆర్ఎస్కు వచ్చారు. 1964లో వి. నరసింహ చిన్నాన్న శంకర్ కల్లూరు రైల్వే క్యాంటీన్ నిర్వహణను దక్కించుకున్నారు. దీంతో నరసింహారావు తన కుటుంబంతో ఇక్కడే స్థిరపడ్డారు. మొదట్లో 13 ఏళ్ల పాటు చిన్నాన్న శంకర్‌కు క్యాంటీన్ నిర్వహణలో నరసింహరావు తోడ్పాటునందించే వారు. ఆయన నిర్యాణంతో క్యాంటీన్ నిర్వహణ పూర్తి బాధ్యత తీసుకున్నాడు. కుమారుడు శశికాంత్‌తో కలిసి శుచి, రుచికరమైన పకోడీని తయారు చేయడలం ప్రారంభించాడు. అనతికాలంలోనే వారి పకోడీకి మంచి పేరు వచ్చింది. అంతేకాదు వీరి పకోడి అప్పట్లో పుట్టపర్తి సత్యసాయిబాబా ఎంతో ప్రీతిగా తినేవారంట. వీరు పకోడితో పాటు రుచికరమైన ఇడ్లీ, వడ, కాఫీ క్యాంటీన్లో విక్రయిస్తారు. ప్యాకింగ్ వెరీ వెరీ స్పెషల్ మామూలుగా బయట ఎక్కడ తీసుకున్న పకోడి అయినా ఏ పేపర్లోనో... కవర్లోనే ఇస్తుంటారు ఇది రొటీనే. అయితే కల్లూరు రైల్వే క్యాంటీన్లో మాత్రం ఎండిన ఇస్తరాకుల్లో ప్యాక్ చేసి ఇస్తారు. ధర కూడా బయటతో పోల్చి చీస్తే తక్కువే. ఒకప్పుడు రూ. 2 కే పకోడి పొట్లం దొరికేది. ఆతర్వాత రూ. 3 చివరికి ఇప్పుడు రూ.5కు దీన్ని విక్రయిస్తున్నారు. సామాన్యులకు కూడా అందుబాటులో ఉండటంతో కొనేవారు కూడా ఎక్కువే. రుచికరమైన పకోడీయే మా ప్రత్యేకత రుచికరమైన పకోడితోనే మా క్యాంటీన్‌కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. పకోడి తయారీలో నాణ్యతగల శనగపిండి, రీఫండ్ ఆయిల్, పూనా ఉల్లితో పాటు కొద్ది మోతాదులో ఉర్లగడ్డలను ఉపయోగిస్తాం. భద్రంగా ప్యాక్ కూడా చేస్తాం. ఈ పకోడిని 15 రోజుల తర్వాత తిన్నా దాని రుచిలో ఎటువంటి మార్పు ఉండదు. రోస్ట్ తగ్గదు. బూజు పట్టదు. అందుకే మా పకోడికి అంత గిరాకీ. - వి.నరసింహ, క్యాంటీన్ ఓనర్, కల్లూరు ఆర్ఎస్ తక్కువ ధరకే తినుబండారాలు తినుబండారాలను మా కుటుంబ సభ్యులమే తయారు చేస్తాం. అమ్మానాన్నతో పాటు నేనూ దాని తయారీకి సహాయం చేస్తుంటా. సొంత తయారీతో నాణ్యత లోపాన్ని అధిగమిస్తుండటంతో మా తినుబండారాలకు మంచిగిరాకీ. రైల్వే నిర్ణయించిన ధరల కంటే తక్కువకే విక్రయిస్తుండడంతో క్యాంటీన్‌కు గుర్తింపు లభించింది. - వీ. శశికాంత్ పకోడి తినందే వెళ్లరు క్యాంటిన్లో లభించే పకోడి చాలా రుచికరమైంది. 23 ఏళ్లుగా ఈ పకోడి రుచి చూస్తున్నా. స్టేషన్‌ను సందర్శించే రైల్వే ఉన్నతాధికారులు పకోడి రుచి చూడందే వెళ్లరు. సందర్శనకు ముందురోజే వారు పకోడి టాపిక్ తేవందే రారు. -
బాబా సేవలో 5 వసంతాలు
నేడు సత్యసాయిబాబా జయంతి తగరపువలస : ఇందుగలడు అందుగలడు ఎందెందు వెదికినా అందందేగలడంటూ భక్త ప్రహ్లాదుడు శ్రీహరిపై నమ్మకం ఉంచి భక్తిని చాటుకున్నాడు. అంతకాకపోయినా అలాంటి నమ్మకంతోనే తగరపువలసకు చెందిన వానపల్లి సన్యాసిరావు అనే 76 ఏళ్ల వృద్ధుడు బాబాపై నమ్మకంతో ఏభై వసంతాలుగా సేవ చేస్తూనే భక్తి మాధుర్యాన్ని చవిచూస్తున్నాడు. తగరపువలస ప్రధానరహదారిని ఆనుకుని ఉన్న సత్యనారాయణ కొండ దిగువ భాగంలో ఉన్న ఈ పురాతన మందిరాన్ని ఎందరు విడిచిపెట్టి పోయినా ఆయన మాత్రం ఎవ్వరొచ్చినా రాకున్నా భౌతికంగా బాబా లేకపోయినా మందిరంలో ఉదయం, సాయంకాల సేవలను త్యజించలేదు. బాబా జన్మనక్షత్రమైన ఆరుద్రను పురస్కరించుకుని శనివారం పురాతన మందిరంలో జయంతి వేడుకలు జరుపుతున్నారు. బాబాయే రప్పించుకున్నారు.. నెల్లిమర్ల జూట్‌మిల్లులో టెక్నీషియన్‌గా విధులు నిర్వర్తిస్తున్న సన్యాసిరావును 1965లో చిట్టివలస జూట్యాజమాన్యం ఇక్కడకు రప్పించుకుంది. అప్పటినుంచే ఆయనకు బాబా మందిరానికి వెళ్లే అలవాటయ్యింది. 1970లో బాబా రాజమండ్రి వచ్చినప్పుడు ఆయన ప్రసంగాన్ని రికార్డు చేయడానికి సన్యాసిరావు వెళ్తే స్వయంగా బాబాయే ఆయన వద్ద ఆగి ఆప్యాయంగా నిమిరారు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఆయన దరిదాపులకు ఎలాంటి బాధలూ చేరలేదని, పైగా తన కుటుంబానికి కూడా బాబా ఆశీస్సులు లభించాయని ఆయన చెబుతారు. 60 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పురాతన మందిరం బీటలువారడంతో ఇక్కడి సభ్యులంతా చిట్టివలసలో మందిరం కట్టుకుని వెళ్లిపోయినా సన్యాసిరావు మాత్రం బాబా కొలువైన ఈ పురాతన మందిరాన్ని విడిచిపెట్టి వచ్చేదిలేదని తెగేసి చెప్పారు. హుద్‌హుద్ తుపాను ధాటికి ఎన్నో నిర్మాణాలు దెబ్బతిన్నా ఈ మందిరంలోకి వర్షపుచుక్కలు కూడా రాలేకపోయాయి. బాబాపై నమ్మకమే నడిపిస్తుంది.. మందిరానికి నేను వచ్చే తొలిరోజుల్లో రంగూరి పెదరమణ, రమణమూర్తి పంతులు, గిడుగు సుబ్బారావు, జోగ అప్పలస్వామి వంటి వారు మందిరంలో వేకువజామున ఓంకారం, సుప్రభాతం, విష్ణుసహస్రనామాలు సాయంత్రం వేళల్లో ధ్యానం, భజనలు నిర్వహించేవారు. అలాంటి ఈ పవిత్రమందిరాన్ని విడిచిపెట్టడానికి మనసొప్పలేదు. ఇద్దరు, ముగ్గురు సాయంతో క్రమం తప్పకుండా ఈ క్రతువులు ఆచరిస్తూనే ఉన్నాను. బయట నుంచి ఎటువంటి చందాలు వసూలు చేయకుండానే నాకు వచ్చే పెన్షన్‌తోనే బాబాసేవతో పాటు నారాయణసేవ చేస్తున్నాను. కడ వరకు ఈ మందిరంలో బాబాసేవలోనే గడుపుతాను. రుద్రుడే సాయిరుద్రునిగా అవతరించి ఆరుద్ర నక్షత్రమున నరుని నారాయణుడిగా మార్చడానికి వచ్చినాడని నా నమ్మకం. - వానపల్లి సన్యాసిరావు, తగరపువలస -
అంతా సాయిమయం
-
చంద్రబాబు పుట్టపర్తి పర్యటన రద్దు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా పుట్టపర్తి పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆదివారం పుట్టపర్తిలో జరిగే సత్యసాయి బాబా జన్మదిన వేడుకల్లో చంద్రబాబు పాల్గొనాల్సివుంది. అయితే చంద్రబాబు పర్యటన రద్దయ్యింది. ఏపీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సత్యసాయి జన్మదిన వేడుకల్లో పాల్గొననున్నారు. -
తల్లివి నీవే.. జగన్మాతవూ నీవే
పుట్టపర్తి టౌన్ : సత్యసాయి బాబా 89వ జయంత్యుత్సవాల్లో భాగంగా బుధవారం ప్రశాంతి నిలయంలో 19వ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సత్యసాయి భక్తులైన మహిళలు దేశ విదేశాల నుంచి వేలాదిగా తరలివచ్చారు. బాబా మహాసమాధి చెంత నిర్వహించిన వేడుకల్లో పాలుపంచుకున్నారు. తల్లిగా, ఇల్లాలిగా, జగతినేలే మాతగా మహిళా ఔన్నత్యాన్ని కీర్తించారు. సత్యసాయి 70వ జన్మదిన వేడుకలలో భాగంగా తొలిసారిగా 1996 నవంబర్ 19న మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతియేటా కొనసాగిస్తూ వస్తున్నారు. మహిళా దినోత్సవాన్ని సత్యసాయి సేవా సంస్థలలోని మహిళా విభాగమే నిర్వహిస్తోంది. బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు సత్యసాయి మహాసమాధి చెంత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతపురం మహిళా క్యాంపస్‌కు చెందిన విద్యార్థినుల వేదమంత్రోచ్ఛారణతో వేడుకలు ప్రారంభమయ్యాయి. బ్రాస్‌బ్యాండ్ వాయిద్య బృందం సత్యసాయికి తమ హృదయ నివేదనను అర్పించింది. వేడుకలకు ముఖ్యఅతిథిగా ముంబాయి యూనివర్సిటీ విశ్రాంత వైస్ చాన్సలర్ డాక్టర్ స్నేహలత దేశ్‌ముఖ్ హాజరయ్యారు. మహిళా దినోత్సవ విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో ఈశ్వరాంబ ట్రస్ట్ ప్రతినిధి డాక్టర్ కేపీ సాయిలీల, ట్రస్ట్ సభ్యురాలు మాధురీ నాగానంద్, అనంతపురం మహిళా క్యాంపస్ డెరైక్టర్ ప్రొఫెసర్ మధు కపాణి తదితరులు పాల్గొన్నారు. -
సత్యసాయి 88వ జయంతి వేడుకలు
సత్యసాయి బాబా 88వ జయంతి సందర్భంగా శనివారం అశేష భక్త జనుల సాయి నామస్మరణతో ప్రశాంతి నిలయం మార్మోగింది. ఉదయం 8.30 గంటలకు సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత విద్యార్థుల వేదపఠనంతో జయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. కేరళ సంప్రదాయరీతిలో మంగళ వాద్యాలతో సత్యసాయిని కీర్తిస్తూ విద్యార్థులు ఆత్మ స్వరూపుడైన సత్యసాయికి ఆత్మ నివేదనను అర్పించారు.ఆదర్శనీయుడు సత్యసాయిజ్యోతి ప్రజ్వలనతో సత్యసాయిబాబా 88వ జయంతి వేడుకలను ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి కిల్లి కృపారాణిహాజరైన మంత్రులు, అధికారులు, ప్రజా ప్రతినిధులుబాబా సమాధి వద్ద పుష్పగుచ్ఛాలను ఉంచి నివాళులర్పిస్తున్న విద్యార్థులుసత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు నాగానందవార్షిక నివేదిక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు రఘువీరారెడ్డి, గీతారెడ్డి, కేంద్ర మంత్రి కిల్లికృపారాణిబ్యాండ్ వాయిస్తున్న సత్యసాయి విద్యాసంస్థల విద్యార్థినులువిలేకరులతో మాట్లాడుతున్న కోడి రామకృష్ణసత్యసాయి విద్యాసంస్థల విద్యార్థినులువేడుకలకు హాజరైన మంత్రి గీతారెడ్డి సాయి కుల్వంత్ హాలు వద్ద సత్యసాయికి ఆత్మ నివేదన అర్పిస్తున్న విద్యార్థులు -
ఘనంగా సత్యసాయి జయంతి
పుట్టపర్తి టౌన్, న్యూస్‌లైన్ : సత్యసాయి బాబా 88వ జయంతి సందర్భంగా శనివారం అశేష భక్త జనుల సాయి నామస్మరణతో ప్రశాంతి నిలయం మార్మోగింది. ఉదయం 8.30 గంటలకు సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత విద్యార్థుల వేదపఠనంతో జయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. కేరళ సంప్రదాయరీతిలో మంగళ వాద్యాలతో సత్యసాయిని కీర్తిస్తూ విద్యార్థులు ఆత్మ స్వరూపుడైన సత్యసాయికి ఆత్మ నివేదనను అర్పించారు. సత్యసాయి ప్రేమతత్వాన్ని వివరిస్తూ సత్యసాయి భోదనల ఆంగ్లఅనువాదకుడు ప్రోఫెసర్ అనిల్ కుమార్ ప్రసంగించారు. సత్యసాయి మానవాళికందించిన వెలకట్టలేని సేవలకు చిహ్నంగా భారత ప్రభుత్వం తరుఫున కేంద్ర సమాచార ప్రసార సాధనాల శాఖ మంత్రి కిల్లి కృపారాణి సత్యాసాయి స్మారక స్టాంపును విడుదల చేశారు. ప్రథమ స్టాంపును సత్యసాయి ట్రస్ట్ సభ్యుడు జస్టిస్ ఏపీ మిశ్రాకు అందజేశారు. అనంతరం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ 2012-13 సంవత్సర వార్షిక నివేదికను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు టీకేకే భగవత్‌తో కలసి మంత్రి కిల్లి కృపారాణి విడుదల చేశారు. వాటి ప్రతులను రాష్ట్ర రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి, భారీ పరిశ్రమల శాఖ మంత్రి గీతారెడ్డికి అందజేశారు. ట్రస్ట్ సభ్యుడు నాగానంద సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ వార్షిక నివేదిక ఆధారంగా సత్యసాయి ట్రస్ట్ సేవలు, చేపట్టబోవు పథకాలను వివరించారు. అనంతరం సత్యసాయి స్మారకార్థం పోస్టల్ కవర్‌ను విడుదల చేసి మంత్రి కిల్లి కృపారాణి, సత్యసాయి ట్రస్ట్ సభ్యుడు మద్రాస్ శ్రీనివాస్‌కు అందజేశారు. సాయి సేవలు వెలకట్టలేనివి : కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి వేడుకలకు ముఖ్య అథితిగా హాజరైన కిల్లి కృపారాణి ప్రసంగింస్తూ పేదలకు సత్యసాయి అందజేసిన సేవలు వెలకట్టలేనివన్నారు. నేటి ప్రపంచానికి ఆయన ఆదర్శమన్నారు. సత్యసాయి ఆశయ సాధనకు ప్రతి సాయి భక్తుడు పాటుపడాలన్నారు. దేశవిదేశాల భక్తలకు ప్రశాంతత నందించిన ప్రశాంతి నిలయం పేరుమీద త్వరలోనే మైస్టాంప్ పేరుతో మరో స్టాంపును విడుదల చేస్తామని ప్రకటించారు. అనంతరం విద్యార్థులు బ్రాస్ బ్యాండ్ వాయిద్యంతో సత్యసాయికి శుభాకాంక్షలు తెలుపుతూ స్వరాలొలికించారు. సత్యసాయి విద్యార్థులు, వివిద దేశాలకు చెందిన భక్తులు ప్రత్యేకంగా తయారు చేసిన 88 కేజీల సత్యసాయి జయంతి కేక్‌ను మంత్రి కిల్లికృపారాణి క్యాండిల్స్ వెలిగించి కట్ చేశారు. వేడుకల్లో సత్యసాయి ట్రస్ట్ సభ్యులు, దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు,సత్యసాయి భక్తులు పాల్గొన్నారు. సత్యసాయి జయంతి వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి, కలెక్టర్ లోకేష్‌కుమార్, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, కదిరి ఆర్డీఓ రాజశేఖర్, పోస్టల్ పీఎంజీలు సుధాకర్, సంధ్యారాణి, పోస్టల్ డెరైక్టర్ డీఎస్‌వీఆర్ మూర్తి, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు ఆర్జే రత్నాకర్రాజు, మద్రాస్ శ్రీనివాస్, చక్రవర్తి, సత్యసాయి యూనివర్సిటీ చాన్సలర్, సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ వెంకటాచలయ్య, వైస్‌చాన్సలర్ శశిధర్‌ప్రసాద్, రిజిస్ట్రార్ నరేన్ రాంజి, సిమ్స్ డెరైక్టర్ డాక్టర్ ఓలేటి చౌదరి, సత్యసాయి సేవా సంస్థల జాతీయ అధ్యక్షుడు నరేంద్రరెడ్డి, అంతర్జాతీయ అధ్యక్షుడు గ్యారీబెల్, మాజీ అధ్యక్షుడు గోల్డ్ స్టెయిన్, పారిశ్రామిక వేత్త టీవీఎస్ శ్రీనివాసన్, రిటైర్డ్ డీజీపీ హెచ్‌జె దొర, అప్పారావు తదితరులు హాజరయ్యారు. -
చెరగని తీపిగుర్తు ‘తెలుగు గంగ’
తిరువళ్లూరు, న్యూస్‌లైన్: సత్యసాయిబాబాను తిరువళ్లూరు ప్రజలు తమ అరాద్యదైవంగా స్మరించుకుంటారు. తెలుగుగంగ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆయన చేసిన సేవలు ప్రశంసనీయం. శనివారం ఆయన జయంతి సందర్భంగా ఈ స్పెషల్ స్టోరీ.. తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత ఇరు రాష్ట్రాల మధ్య 1977లో జల ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ప్రతి ఏటా 15 టీఎంసీల నీటిని ఆంధ్రా ప్రభుత్వం విడుదల చేయాలి. ఈ మేరకు ప్రతి ఏటా ఆంధ్రా నుంచి కృష్ణా జలాలను అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే తిరువళ్లూరు జిల్లా పూండి రిజర్వాయర్‌ను 35 అడుగుల నీటి సామర్థ్యం నిల్వ ఉండేలా నిర్మించారు. కృష్ణా జలాలను పూండికి తరలించడానికి కండలేరు-తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన ఊత్తుకోట జీరో పాయింట్ వరకు 160 కిలోమీటర్ దూరంలోనూ, జీరోపాయింట్ నుంచి పూండి వరకు 25 కిలోమీటర్ వరకు కాలువలను నిర్మించారు. తర్వాత 1996లో కండలేరు నుంచి నీటిని విడుదల చేశారు. కొంత కాలం పాటు నీరు పూండికి చేరిన తర్వాత కాలువ పూర్తిగా కుంగిపోయింది. దాని మరమ్మతుల కోసం అప్పటి ముఖ్యమంత్రి కరుణానిది సత్యసాయి ట్రస్టును ఆశ్రయిం చారు. కాలువ మరమ్మతుల కోసం సాయం అందించాలని సాయి బాబాను అభ్యర్థించారు. స్పందించిన బాబా రూ.150 కోట్లు కేటాయించారు. ఆ నిధులతో పూండి కాలువను పూర్తిగా మరమ్మతు చేశారు. ఆయన కృషిని చెన్నై ప్రజలు నెటికీ స్మరించుకుంటున్నారు. ఆయన జయంతిని ఘనంగా జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. -
బాబా ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయి...