హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా పుట్టపర్తి పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆదివారం పుట్టపర్తిలో జరిగే సత్యసాయి బాబా జన్మదిన వేడుకల్లో చంద్రబాబు పాల్గొనాల్సివుంది. అయితే చంద్రబాబు పర్యటన రద్దయ్యింది. ఏపీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సత్యసాయి జన్మదిన వేడుకల్లో పాల్గొననున్నారు.