సత్యసాయి సేవలు వెలకట్టలేనివి
స్పీకర్ మధుసూదనాచారి
పుట్టపర్తి టౌన్: సత్యసాయి బాబా మానవాళికి అందించిన సేవలు వెలకట్ట లేనివని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి కొనియాడారు. ఏపీలోని అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో జరుగుతున్న శివరాత్రి వేడుకల్లో పాల్గొనేందుకు శుక్రవారం ఆయన పుట్టపర్తి చేరుకున్నారు.
విలేకరులతో ఆయన మాట్లాడుతూ కరువు జిల్లాలో తాగునీటిని అందించిన మహాను భావుడు సత్యసాయి అని, తెలంగాణలో సైతం పలు జిల్లాల్లో ఆయన సేవలు కొనసాగుతున్నాయన్నారు. అనంతరం శివరాత్రి వేడుకల్లో భాగంగా ప్రశాంతి నిలయంలో జరుగుతున్న అఖండ భజన కార్యక్రమంలో పాల్గొని సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు.