
హనుమకొండ జిల్లా: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకత వస్తుందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనచారి. ఎన్నికల ముందు అధికారం కోసం 420 హామీలు ఇచ్చి, ఇప్పటివరకూ ఏ ఒక్క హానమీ నెరవేర్చలేనది మధుసూదనచారి ఆరోపించారు. హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ ఏడాది పాలనా వైఫల్యం పేరుతో బీఆర్ఎస్ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ క్యాలెండర్, డైరీని ఎమ్మెల్సీ మధుసూదనచారి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మధుసూదనచారి మాట్లాడుతూ.. ‘కడియం శ్రీహరి తన స్వార్థ రాజకీయాల కోసం పార్టీ మారాడు. పార్టీ మారిన ఎమ్మెల్యే లతో రాజీనామా చేయించి పోటీలో నిలబెట్టు. బీఆర్ఎస్ కార్యకర్తల ఉద్యమంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చాం. పూర్తి స్థాయిలో కులగణ చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలి. BRSసాధించిన తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన మహనీయుడు కేసీఆర్. నూటికి నూరు శాతం బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటాం. ఎక్కడికి వెళ్తే రేవంత్రెడ్డి పబ్బం గడుస్తదో అక్కడికి వెళతాడు’ అని విమర్శించారు మధుసూదనచారి.
Comments
Please login to add a commentAdd a comment