హనుమకొండ: తనపై ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పేర్కొన్నారు. తాను వేరే పార్టీ నేతలతో పాల్గొన్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదన్నారు. తాను ఎవరితోనూ భేటీలో పాల్గొనలేదని నాయిని రాజేందర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు నాయిని.
‘సామాజిక మాధ్యమాల్లో ానాపై జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదు. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వంపై కుట్ర జరుగుతోంది. తనపై తప్పుడు ప్రచారాలు చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. వారిపై పరువు నష్టం దావా వేస్తా. ఈ కుట్రల వెనుక ఎవరు ఉన్నా వదిలే ప్రసక్తే లేదు. సోషల్ మీడియా కుట్రలు, యూట్యూబర్స్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోబోతున్నాను. సొంత పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కూర్చొని అభివృద్ధిపై చర్చిస్తే తప్పేముంది’ అని నాయిని రాజేందర్‌రెడ్డి ప్రశ్నించారు. ఈరోజు(ఆదివారం)సీఎం రేవంత్‌తో ానాయిని భేటీ కానున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment