nayani rajendar reddy
-
ఓరుగల్లు పశ్చిమంలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పొలిటికల్ హీట్..!
ఓరుగల్లు నగరం పశ్చిమంలో ఏం జరుగుతోంది? అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. వేసవి ఎండలతో పాటు పొలిటికల్ హీట్ కూడా తీవ్రంగా పెరుగుతోంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇంతకీ ఇక్కడ పోటీ పడుతున్నదెవరు? వారి పరిస్థితేంటి? వరంగల్ నగరం పశ్చిమ నియోజకవర్గంలో కారు, హస్తం పార్టీల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో పొలిటికల్ వార్ జరుగుతోంది. దాస్యం వినయ్‌భాస్కర్ అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా, ప్రభుత్వ చీఫ్ విప్‌గా కొనసాగుతున్నారు. ఇప్పటికే నాలుగుసార్లు విజయం సాధించిన వినయ్‌భాస్కర్ ఐదో సారి కూడా గులాబీ జెండా ఎగరేయడానికి రెడీ అవుతున్నారు. ఈసారి కూడా గెలిచేది నేనే అంటూ ధీమాగా ఉన్నారాయన. ఇక కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో దిగుతానంటున్న ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి ఎలాగైనా ఈసారి దాస్యంకు చెక్ పెట్టాలనే పట్టుదలతో ఉన్నారు. నాలుగుసార్లు గెలిచి నగరానికి ఏం చేశావని ఐదోసారి గెలిపించాలని ఎమ్మెల్యేను ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ జోడో యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళుతున్నారు నాయిని. తొలినుంచీ ఉత్తర దక్షిణ ధృవాలుగా కొనసాగుతున్న దాస్యం వినయ్‌భాస్కర్, నాయిని రాజేందర్‌రెడ్డి మధ్య కొంతకాలంగా విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. వీరిద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుండగా..వీరి అనుచరులు కూడా అదే రేంజ్లో ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. కరపత్రాలు, ప్లెక్సీ పోస్టర్లతో రాజకీయ విమర్శలు చేసుకుంటూనే..ఇరుపార్టీల నాయకులు పోటాపోటీగా పోలీసులకు ఫిర్యాదు చేసుకునే పరిస్థితికి వచ్చారు. దాస్యం వినయ్ భాస్కర్ పై చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్‌కు హనుమకొండ బిఆర్ఎస్ ముఖ్యనాయకులు ఫిర్యాదు చేశారు. ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. చదవండి: ఖమ్మంలో సై అంటే సై అంటున్న కారు, కాంగ్రెస్.. హస్తం పార్టీ ప్రతీకారం తీర్చుకుంటుందా? కాంగ్రెస్ నేత నాయిని రాజేందర్ రెడ్డితోపాటు ఆయన అనుచరులు సైతం వాగ్ధాటి పెంచారు. ప్రజల సమస్యలు పరిష్కరించి..అభివృద్ధి చేస్తాడని దాస్యంను గెలిపిస్తే ఎమ్మెల్యేగా చేసింది ఏంటని ప్రశ్నిస్తున్నారు. భూకబ్జాలు, ప్రతి పనిలో పర్సంటేజీలు తీసుకుంటూ అభివృద్దిని గాలికొదిలేసి వచ్చిన అభివృద్ధి నిధులను ఖర్చు చేయలేని నిస్సహాయ స్థితికి చేరారని ఆరోపిస్తున్నారు. ప్రతి సోమవారం పోలీస్ గ్రీవెన్స్ సెల్ కు వచ్చే ఫిర్యాదుల్లో 70శాతం బిఆర్ఎస్ నేతల భూ కబ్జాలపైనే ఉంటున్నాయని కాంగ్రెస్ నేతలు ఎదురు దాడి చేస్తున్నారు. ఈసారి కాంగ్రెస్ తరపున నాయిని రాజేందర్ రెడ్డి బరిలో నిలబడితే గులాబీ పార్టీ అభ్యర్థి వినయ్ భాస్కర్ ఓడిపోవడం ఖాయమంటూ ప్రచారం సాగిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీల తరుపున వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేసేది తామే అటు దాస్యం, ఇటు నాయిని చెప్పుకుంటున్నారు. ఎవరికి వారే ఎదుటి వారి లోపాల్ని ఎత్తి చూపుతూ..పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలతో దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దాదాపు సమానంగా వచ్చినట్లు సమాచారం. సర్వే తర్వాతే ఇరువురు నేతలు పోటీపడి విమర్శలు గుప్పించుకుంటూ..ప్రజాబలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారట. ప్రత్యర్థిని విమర్శించడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదలడంలేదని చెబుతున్నారు. చదవండి: గులాబీ బాస్‌నే ఢీకొడుతున్న పొంగులేటి.. బీఆర్ఎస్ కౌంటర్ ఎలా ఉండబోతుంది? -
వరంగల్ కాంగ్రెస్ నేతల్లో తీవ్ర అసంతృప్తి
-
కాంగ్రెస్ జాబితాపై ఆగ్రహం.. 17న రాష్ట్రబంద్
సాక్షి, హైదరాబాద్ : మహా కూటమిలో టికెట్ కేటాయింపులపై ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు తక్కువ స్థానాలు కేటాయించడంపై ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు మండిపడుతున్నారు. బీసీలకు అన్నింటా అన్యాయం జరుగుతోందని ఆగ్రహోదగ్రులవుతున్నారు. బీసీలకు టికెట్ల కేటాయింపులో అన్యాయం చేయడంపై నిరసనగా ఈ నెల 17న తెలంగాణ బంద్‌కు బీసీ నేత ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. బీసీలకు తగినమొత్తంలో సీట్లు కేటాయించి న్యాయం చేస్తామన్న కాంగ్రెస్ పార్టే అన్యాయం చేసిందని ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. కాంగ్రెస్‌లోనూ బీసీ సెగలు! 65మంది అభ్యర్థులతో తాజాగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన తొలి జాబితాలో కేవలం 13మంది బీసీ నేతలకు మాత్రమే టికెట్లు కేటాయించింది. దీంతో ఆ పార్టీలోని బీసీ నేతలు తీవ్ర అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సహా చాలామంది బీసీ నేతలకు పార్టీ మొండిచేయి చూపడంపై అసమ్మతి సెగలు ఎగిసిపడుతున్నాయి. తనకు టికెట్ దక్కకపోవడంతో పొన్నాల హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మహూకూటమి పొత్తుల్లో భాగంగా జనగాం సీటును టీజేఎస్‌కు ఇస్తారనే ప్రచారం నేపథ్యంలో ఆ స్థానాన్ని ప్రస్తుతం పెండింగ్‌లో ఉంచారు. ఎట్టి పరిస్థితుల్లో టికెట్ సాధించాలనే పట్టుదలతో పొన్నాల ఢిల్లీ వెళ్లారని ఆయన అనుచరులు చెప్తున్నారు. శేరిలింగంపల్లి టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. టిక్కెట్ రాకపోవడంతో భవిష్యత్ కార్యాచరణపై ఆయన తన అనుచరులతో భేటీ అయ్యారు. ఇండింపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని భిక్షపతి యాదవ్ భావిస్తున్నారు. -
నేడు కాంగ్రెస్ ధర్నా
వరంగల్: టీఆర్ఎస్ వంద రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, ఒక్క పథకం కూడా అమలుకు నోచుకోలేదని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను నిరసిస్తూ టీపీసీసీ పిలుపు మేరకు శుక్రవారం ఉదయం 10 గంటలకు హన్మకొండ ఏకశిలపార్కు వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. హన్మకొండలోని డీసీసీ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ పాలనలో రైతుల ఆక్రందనలు, ఆత్మహత్యలు పెరిగాయని, రోజుకో కొత్త పథకాలు ప్రకటించి నాలుగు రోజులు హడావుడి చేయడం తప్ప.. ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ప్రజలకేమైనా చేస్తారేమోనని వంద రోజులు వేచి చూశామని చెప్పారు. రుణమాఫీ, కరెంట్ సమస్యలను లేవనెత్తితే లాఠీచార్జి చేశారని విమర్శించారు. తెలంగాణ కోసం ఉద్యమించిన విద్యార్థులపై కేసులు ఎత్తివేసే తీరిక ఈ ప్రభుత్వానికి లేక పోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఐదు నిమిషాలకే ఉచిత విద్యుత్, పెన్షన్లు అమలు చేసిన ఘనత ఉందన్నారు. ప్రజా సమస్యలను పట్టించుకోని టీఆర్ఎస్ నాయకులు.. కాంగ్రెస్ నేతలను బ్లాక్మెయిల్ చేస్తూ, కేసులు నమోదు చేస్తామంటూ లొంగదీసుకుంటున్నారని మండిపడ్డారు. దళితుడిని సీఎం చేస్తానని, లేకుంటే తల నరుక్కుంటానని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు మాట మార్చారని విమర్శించారు. కేసీఆర్ ఇచ్చిన హామీని ఆయన సెల్పోన్లో వినిపించారు. ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారని, హిట్లర్‌లా వ్యవహరిస్తూ అహంకారంతో మాట్లాడుతున్నారని చెప్పారు. తొటి మంత్రులు హామీలిచ్చినా ఎద్దేవా చేస్తున్నారని అన్నారు. ప్రజా సమస్యలపై ఉద్యమించేందుకు వెనుకాడబోమని, కేసులకు భయపడేది లేదన్నారు. తాము చేపట్టే ధర్నాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్ మాట్లాడుతూ కేసీఆర్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదన్నారు. ప్రభుత్వ తీరుపై ప్రజలను చైతన్యం చేసేందుకు ఈ నిరసన చేపట్టినట్లు వివరించారు. ఈ విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు ఈవీ శ్రీనివాసరావు, నమిండ్ల శ్రీనివాస్, పులి సాంబరాజు, బిన్ని లక్ష్మణ్, వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అలిగితే.. పదవి!
కాంగ్రెస్‌లో బుజ్జగింపుల రాజకీయం సాక్షిప్రతినిధి, వరంగల్ : కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్లు దక్కక అసంతృప్తితో ఉన్న నాయకులకు ఆ పార్టీ నాయకత్వం పదవులు ఇచ్చి బుజ్జగిస్తోంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ టికెట్ ఆశించి భంగపడిన నాయిని రాజేందర్‌రెడ్డికి కాంగ్రెస్ జిల్లా ఇన్చార్జ అధ్యక్ష పదవి కట్టబెట్టింది. డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న దొంతి మాధవరెడ్డి రాజీనామా చేయడంతో ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఈ సామాజికవర్గం నుంచి ఇబ్బంది ఎదురవుతుందని పార్టీ భావించింది. జరగబోయే నష్టాన్ని తగ్గించేందుకు మాధవరెడ్డి సామాజిక వర్గానికే చెందిన నాయిని రాజేందర్‌రెడ్డికి డీసీసీ అధ్యక్ష పదవి అప్పగించింది. నాయినికి ఈ పదవి అప్పగించడం.. ఈ వర్గంలో అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నమేనని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. నాయిని రాజేందర్‌రెడ్డిని ఇన్చార్జ అధ్యక్షుడిగా నియమించడంపై పార్టీలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నాయినిపై నమ్మకం ఉంటే పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించేవారని... ఇది లేకపోవడంతో ఇన్చార్జ్జ అధ్యక్షుడిగా నియమించారని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. అరుుతే మాధవరెడ్డి సైతం ఇన్చార్జ అధ్యక్షుడిగానే ఉన్నారని నాయిని వర్గీయులు అంటున్నారు. నాయిని రాజేందర్‌రెడ్డి టికెట్ దక్కక అసంతృప్తితో ఉన్నప్పుడు కాంగ్రెస్ పెద్దల నుంచి పలకరింపు కూడా లేకపోవడంతో... నాయిని టీఆర్ఎస్లో చేరుతారని ప్రచారం జరిగింది. తర్వాత కాంగ్రెస్ పెద్దలు మాట్లాడడంతో తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని నాయిని స్పష్టం చేశారు. దొంతి మాధవరెడ్డి ప్రతిరోజూ పొన్నాలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. నర్సంపేట అసెంబ్లీ టికెట్‌ను కేటాయించి బీఫారం ఇవ్వకుండా... చివరి నిమిషంలో జేఏసీ నేత కత్తి వెంకటస్వామికి అభ్యర్థిత్వం కట్టబెట్టడంతో డీసీసీ అధ్యక్షుడు దొంతి మాధవరెడ్డి తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో దిగారు. ఆ తర్వాత ఆయన డీసీసీ అధ్యక్ష పదవికి, కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సొంత జిల్లాలో డీసీసీ అధ్యక్షుడు ఇలా తిరుగుబాటు అభ్యర్థిగా పోటీలో ఉండడం ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారింది. పొన్నాల లక్ష్మయ్య తనకు టిక్కెట్ రాకుండా కుట్ర చేశారని మాధవరెడ్డి విమర్శిస్తున్నారు. ఈ నష్టాన్ని ఎదుర్కొనేందుకు నాయినికి డీసీసీ పదవి అప్పగించినట్లు తెలుస్తోంది.