
సాక్షి, హన్మకొండ: బీసీ డిక్లరేషన్ హామీలు ఏమయ్యాయి?ఎటు పోయాయి? అంటూ కాంగ్రెస్ సర్కార్‌ను మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. ఆదివారం ఆయన హన్మకొండలో మాట్లాడుతూ.. ఏడాది కింద ఇదే రోజు కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. బీసీ డిక్లరేషన్ పేరిట చాలా వాగ్ధానాలు ఇచ్చారు. కొత్తవి అమలు చేయడం దేవుడెరుగు ఉన్న పథకాలు తీసేసింది.’’ అని మండిపడ్డారు.
‘‘కాంగ్రెస్ పార్టీ బీసీలకు వెన్నుపోటు పొడిచింది. బీసీ బంధుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పాతర వేసింది. కుల గణన కోసం ఇళ్లకు వెళ్తున్న అధికారులను ప్రజలు నిలదీస్తున్నారు. ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయని అడుగుతుంటే అధికారులు నీళ్లు నములుతున్నారు. అడ్డమైనా హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు పెట్టాలి’’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
‘‘కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేదలను ఇబ్బందులకు గురిచేస్తోంది. బీసీ ఓట్ల కోసం.. కులగణనతో కాంగ్రెస్ కొత్త నాటకానికి తెరతీసింది. ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా కాంగ్రెస్ నెరవేర్చలేదు. బీసీ డిక్లరేషన్‌తో కాంగ్రెస్ వెన్నుపోటు పొడుస్తుంది. మహారాష్ట్రలో సీఎం రేవంత్ తెలంగాణకు 500 బోనస్ ఇచ్చామంటూ బోగస్ మాటలు మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాడదాం’’ అని కేటీఆర్ చెప్పారు.

ఇదీ చదవండి: ఈ గందరగోళమేంటి ‘సర్వే’శా!
Comments
Please login to add a commentAdd a comment