జనగామ: ‘సీఎం కేసీఆర్.. మంత్రి కేటీఆర్ అడుగు జాడల్లో.. వారితో రెండున్నర దశాబ్దాలుగా ఉన్న అనుబంధంతో విలువలతో కూడిన రాజకీ యం చేస్తున్నా అని ఎమ్మెల్సీ, జనగామ బీఆర్‌ఎస్ టికెట్ ఆశిస్తున్న పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఆడియో ప్రసంగం బుధవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జనగామ నియోజకవర్గ టికెట్ విషయంలో కేసీఆర్ పెండింగ్ ఉంచిన సంగతి తెలిసిందే. ప్ర స్తుత ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వరెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ముగ్గురు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, ప్రజలకు పోచంపల్లి మెసేజ్ రూపంలో పంపించిన ఆడియో చర్చనీయాంశంగా మారింది.
‘2019లో కేసీఆర్ ఆశీస్సులతో ఎమ్మెల్సీగా మీ ముందుకు వచ్చినప్పుడు దేశంలోనే రికార్డు స్థాయిలో 96.6శాతం ఓట్లతో గెలిపించి దీవించారు. ఇప్పుడు చూస్తున్న రాజకీయ పరిస్థితులను చూసి బా ధేయడంతోనే ఇలా మీ ముందుకు రావడం జరి గింది. కొండా మురళి గెలిచిన తర్వా త కనిపించకుండా పోయింది నేను కాదు. కేసీఆర్, కేటీఆర్ చెప్పిన విధంగా ఎప్పుడూ ప్రజలు , ప్రజాప్రతిని ధులు, నమ్ముకున్న వారికి అందుబా టులో ఉండడమే నేర్చుకున్నా. అందరికీ రోల్‌మోడల్‌గా ఉండాలని, గతంలో ఎమ్మెల్సీ ఎ న్నికలు ముగిసిన వెంటనే ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నా .
ప్రస్తుత రాజకీయాలు పార్టీకి నష్టం కలిగించే వి ధంగా ఉన్నాయి. మీ అంతరాత్మ ఏది చెబితే అలా నడుచుకోండి... లేదంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్ని కల్లో ఇలాంటి రాజకీయాలు మీ ముందుకు కూడా రావచ్చు. ఒకరు రూపాయి ఇస్తే... నాలుగు రూపాయలు ఇచ్చే కెపాసిటీ నాకుంది.. విలువలతో కూడి న రాజకీయాలు చేయాలని కేసీఆర్, కేటీఆర్ చెప్పిన మాట ప్రకారం నడుచుకుంటున్నా.
ఆహ్లాద కరమైన రాజకీయాలు మనందరికీ మేలు చేస్తాయి. కేసీఆర్ ఎవరు నిర్ణయిస్తే, వారిని గెలిపించుకునే బాధ్యత మనందరిపై ఉంది. అంతరాత్మ నిర్ధేశించిన ప్రకా రం ఎవరికై నా సపోర్టు చేయవచ్చు... కానీ ప్రజలు మనకు కల్పించిన అధికారం, జరిగే అభివృద్ధి వారి కి ఎప్పుడూ కనిపించాలి. మనస్సాక్షి చెప్పినట్లు నడుచుకోవాలన్నదే నా ఉద్దే శం’ అని ఆడియోలో ప్రసంగం ముగించారు.
Comments
Please login to add a commentAdd a comment