Jangaon District News
-
వివాహ నమోదు తప్పనిసరి చేయాలి
జనన, మరణ తేదీల నమోదు మాదిరిగానే వధూవరుల వయ సు, పాఠశాల, ఆస్పత్రి రికార్డులను పరిశీలించి మేజరైతేనే ముహూర్తం పెట్టేలా బ్రాహ్మణులు చర్యలు తీసుకోవాలి. పెళ్లి నమోదు రికార్డులను సంబంధిత అధికారులకు అప్పగించేలా చూస్తే చాలావరకు బాల్యవివాహాలను కట్టడి చేయవచ్చు. గ్రామాల్లో ఆశకార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు ప్ర తిఒక్కరూ వీటిని నిరోధించేందుకు కృషి చేయాలి. బాల్యవివాహం జరిపితే రెండేళ్ల జైలు శిక్ష లేదా లక్ష రూపాయల వరకు జరిమానా లేదంటే రెండూ ఒకేసారి విధించే వీలుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల్లో మార్పుతోనే ఈ వివాహలు ఆగే అవకాశం ఉంది. – మండల పరశురాం, సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్, ఉమ్మడి వరంగల్ -
ఆరోగ్యపరంగా చాలా నష్టం..
పెళ్లి వయస్సు రాకుండా వివాహం చేయడం వల్ల అమ్మాయిలైనా, అబ్బాయిలైనా చాలా కష్టనష్టాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. మానసిక, శారీరక పరిపక్వత లేకపోవడం మూలంగా అనేక సమస్యలు తలెత్తుతాయి. స్వతహాగా ఎదుర్కోలేక మానసికంగా కుంగిపోతారు. చిన్న వయస్సులో బాలికలకు గర్భ సంచి ఎదగదు. ఇలాంటి పరిస్థితుల్లో గర్భం దాలిస్తే గర్భస్రావం జరిగే అవకాశం ఉంటుంది. రక్తహీనతతో సమస్యలు ఎదురవుతాయి. పుట్టిన పిల్లలు కూడా బరువు తక్కువగా ఉంటారు. తరచూ అనారోగ్యం బారిన పడతారు. బాల్యవివాహాలు చేయడం మంచిది కాదు. తల్లిదండ్రులు ఈ విషయంలో పొరపాటు చేయవద్దు. –డాక్టర్ నరేశ్ కుమార్, రాష్ట్ర వైద్యమండలి సభ్యుడు● -
విద్యాశాఖలో విలీనం చేయాలి
జనగామ రూరల్: సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి వారి డిమాండ్లు తక్షణమే అమలు చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ ఏలే చంద్రమోహన్ అన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరవధిక దీక్షలు శుక్రవారం 11వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మద్దతు తెలిపారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు అర్థనగ్న ప్రదర్శన చేపట్టారు. మహిళా ఉద్యోగులు బతుకమ్మ ఆడుతూ నిరసన వ్యక్తం చేశారు. రిటైర్డ్ ప్రొఫెసర్, రాష్ట్ర బీసీ ఉద్యోగుల పెన్షనర్ల ప్రెసిడెంట్, డాక్టర్ చందా మల్లయ్య సంఘీభావం ప్రకటించారు. రాజకీయాలకు అతీతంగా సమగ్ర శిక్ష ఉద్యోగులకు ప్రతీఒక్కరు మద్దతు ఇ వ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు తాడూరు రమేష్, సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ చంద్రమోహన్ -
బాల్యానికి ‘బంధం’
● ఈనెల 14న ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఓ 16 ఏళ్ల బాలికకు 27 ఏళ్ల యువకుడితో వివాహం చేస్తున్నారని 1098 నంబర్‌కు రెండురోజుల ముందే సమాచారం వచ్చింది. జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారులు వెళ్లి అమ్మాయి కుటుంబసభ్యులతో మాట్లాడారు. అనంతరం సీడబ్ల్యూసీ ఎదుట హాజరుపరిచి అమ్మాయి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. 18 ఏళ్లు నిండే వరకు పెళ్లి చేయమని లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో బాలికను వారితో పంపించారు. ● నవంబర్ 19న వరంగల్ జిల్లా దుగ్గొండి మండల పరిధిలోని ఓ గ్రామంలో 16 ఏళ్ల అమ్మాయి, 25 ఏళ్ల అబ్బాయికి వివాహం అవుతున్నట్లు ఫోన్ రావడంతో జిల్లా బాలల సంరక్షణ అధికారులు వెళ్లి పెళ్లి ఆపారు. తర్వాత అమ్మాయిని సీడబ్ల్యూసీ ఎదుట హాజరుపరిచి నర్సంపేటలోని ఆశ్రమ పాఠశాలకు తరలించారు. అక్కడ రెండు రోజులున్న తర్వాత అమ్మాయిని తల్లిదండ్రులు తీసుకెళ్లారు.● ఈనెల 5న వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని ఓ గ్రామంలో 16 ఏళ్ల బాలికకు వరుసకు మేనబావ అయిన 28 ఏళ్ల యువకుడితో వివాహం చేస్తున్నట్లు చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు సమాచారం వచ్చింది. జిల్లా బాలల సంరక్షణ విభాగాధికారులు బాలికను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరుపరిచారు. తర్వాత ఆమె తల్లిదండ్రులకు బాల్యవివాహంతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. 18 ఏళ్లు నిండే వరకు పెళ్లి చేయమని లిఖితపూర్వకంగా హామీ తీసుకుని బాలికను అప్పగించారు. -
ఎట్టకేలకు..
స్టేషన్‌ఘన్‌పూర్: ఏళ్ల తరబడి నియోజకవర్గ కేంద్రమైన స్టేషన్‌ఘన్‌పూర్ ప్రజలు ఎదురుచూస్తున్న ఘన్పూర్ మున్సిపాలిటీ కల ఎట్టకేలకు నెరవేరింది. రెండు దశాబ్ధాలుగా ఘన్పూర్ పట్టణ ప్రజలను అందని ద్రాక్షలా ఊరిస్తున్న ఘన్పూర్ మున్సిపాలిటీకి మోక్షం లభించింది. అసెంబ్లీలో మంత్రి శ్రీధర్‌బాబు ఘన్పూర్ మున్సిపాలిటీపై శుక్రవారం ప్రకటించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా కేంద్రం తర్వాత పెద్ద సెంటర్‌గా ఉన్న స్టేషన్‌ఘన్‌పూర్‌కు ఏళ్ల తరబడి మున్సిపాలిటీ అయ్యే మోక్షం లభించడం లేదు. గత పాలకుల నిర్లక్ష్యంతో అన్ని అర్హతలున్నా.. మున్సిపాలిటీ అయ్యే భాగ్యం లభించలేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం మేజర్ గ్రామ పంచాయతీ అయిన స్టేషన్‌ఘన్‌పూర్ జనాభా 12 వేల పైచిలుకు ఉంది. ఘన్‌పూర్‌కు జంటపట్టణమైన శివునిపల్లి జనాభా ఆరు వేలకు పైగా ఉంది. మున్సిపాలిటీ కావాలంటే నిబంధనల మేరకు 15 వేల జనాభా ఉండాలి. ఈ రెండింటినీ కలుపుకుని మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నా.. పట్టించుకోలేదు. ఘన్పూర్ కన్నా తక్కువ జనాభా ఉన్న పలు సెంటర్లను మున్సిపాలిటీగా చేశారని, ఘన్‌పూర్‌ను ఎందుకు మున్సిపాలిటీగా ప్రకటించరని వాపోయారు. అసెంబ్లీలో ప్రకటన.. ప్రస్తుతం స్టేషన్‌ఘన్‌పూర్ జనాభా దాదాపు 16 వేలకు పైగా ఉన్నప్పటికీ స్టేషన్‌ఘన్‌పూర్, శివునిపల్లి, ఛాగల్లు గ్రామ పంచాయతీలను కలిపి మున్సిపాలిటీ అవుతుందని విస్తృత ప్రచారం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మున్సిపాలిటీ అవుతుందని ప్రచారం జరిగినా నెరవేరలేదు. ప్రస్తుత ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక చొరవతో మున్సిపాలిటీగా ప్రకటించారు. ఘన్పూర్ మున్సిపాలిటీ కావడంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీగా స్టేషన్‌ఘన్‌పూర్ ఫలించిన ఎమ్మెల్యే కడియం కృషి స్టేషన్‌ఘన్‌పూర్, శివునిపల్లి, ఛాగల్లు కలిపి పురపాలికగా ఏర్పాటు అసెంబ్లీలో ప్రకటించిన మంత్రి శ్రీధర్‌బాబు -
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకోం
చిల్పూరు: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించొద్దని సీపీ అంబర్‌కిషోర్‌ఝా అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. పీఎస్‌లోని రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. సిబ్బంది పనితీరు గురించి ఒక్కొక్కరిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బ్యాంకులు, ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నేరాల నియంత్రణలో పోలీసులు బాధ్యతగా పనిచేయాలన్నారు. ఎక్కడైన నేరం జరిగిన వెంటనే స్పందించాలని, చట్టాలను అతిక్రమించే వారిని ఉపేంక్షించొద్దని అన్నారు. అంతకుముందు సీపీకి ఏసీపీ భీంశర్మ, రఘునాథపల్లి సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై సిరిపురం నవీన్‌కుమార్‌లు మర్యాదపూర్వకంగా మొక్కను అందజేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ, ట్రైనీ ఐపీఎస్ మన్న్భట్, సిబ్బంది పాల్గొన్నారు. సీపీ అంబర్‌కిషోర్‌ఝా -
సర్వే వేగవంతం చేయాలి
రఘునాథపల్లి: ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియ వేగవంతం చేయాలని, దరఖాస్తుదారుల వివరాలు సమగ్రంగా యాప్‌లో నమోదు చేయాలని కలెక్టర్ రిజ్వాన్‌బాషా సూచించారు. శుక్రవారం మండలంలోని రఘునాథపల్లి, ఖిలాషాపూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల సర్వే తీరును పరిశీలించారు. ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరి అనుసరించాలని, సర్వే పూర్తయ్యాక ప్రతీ ఇంటి నంబర్లను నమోదు చేసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ మోహ్సిన్ముజ్తాబ, ఎంపీడీఓ గార్లపాటి శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. తప్పిదాలకు తావివ్వొద్దు కలెక్టర్ రిజ్వాన్ బాషా -
1098 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వండి..
వివాహ వయసు అమ్మాయిలకు 18, అబ్బాయిలకు 21 సంవత్సరాలుగా ప్రభుత్వం నిర్దేశించింది. చాలావరకు బాల్య వివాహాలు గ్రామీణ ప్రాంతాల్లోనే జరుగుతున్నాయి. వీటిని నిరోధించడానికి 1098 టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంది. అధికారులు ఆపిన బాల్యవివాహాల్లో ఎక్కువగా ఈ నంబర్‌కు అందిన ఫిర్యాదుల వల్లే. ఫోన్ చేసిన వారి పేరు, నంబర్ వెల్లడించే అవకాశం లేకపోవడంతో ఎవరైనా నిర్భయంగా సమాచారం అందించవచ్చు. అన్ని విభాగాల సమన్వయంతో బాల్య వివాహాలు ఆపుతున్నారు. –బి.రాజమణి, వరంగల్ జిల్లా సంక్షేమ అధికారి -
‘భూ భారతి’ తో రైతులకు మేలు
జనగామ: ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించిన భూమి హక్కుల రికార్డు కొత్త ఆర్ఓఆర్ చట్టం(భూ భారతి) రైతులకు మేలు చేకూరే విధంగా ఉంటుందని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ నాన్ గెజిటెడ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మట్టపల్లి వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ కొత్త ఆర్ఓఆర్ చట్టం గ్రామ స్థాయిలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తుందన్నారు. సాదా బైనామాల క్రమబద్ధీకరణ, మ్యటేషన్ భూ రికా ర్డుల సవరణ, భూ హక్కుల కల్పన ద్వారా రైతుల కు మేలు జరుగుతుందన్నారు. విద్యార్థులకు కుల, నివాసం, ఆదాయం ధ్రువీకరణ పత్రాలు జారీలో మరింత వేగం పెరగనుందన్నారు. -
ముమ్మరం
శనివారం శ్రీ 21 శ్రీ డిసెంబర్ శ్రీ 202 యాసంగి – 8లోuవేరుశనగ 1,011నువ్వులు 114పొగాకు 8001.93 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం ● ఇప్పటికే 5వేల ఎకరాల్లో వరినాట్లు పూర్తి ● జనవరి కల్లా వందశాతం పూర్తి ● 45,214 క్వింటాళ్ల వరి విత్తనాలు.. ● 37వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరంకంది 70మొక్కజొన్న 10,700 జనగామ: జిల్లాలో యాసంగి సీజన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఖరీఫ్ సీజన్లో అతివృష్టి, అనావృష్టితో వరి, పత్తి దిగుబడులు కోల్పోయిన రైతులు.. ఆ లోటును పూడ్చుకునేందుకు ఈ సీజన్‌నే నమ్ముకున్నారు. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో దుక్కులు పూర్తి చేసుకుని, నారు పోసిన అన్నదాతలు.. నాట్లు సైతం ముమ్మరంగా వేస్తున్నారు. భూగర్భ జలాలు తగ్గినా... గోదావరి జలాలను నమ్ముకుని ముందుకు వెళుతున్నారు. జిల్లాలో వరి, మొక్కజొన్న, వేరుశనగ, పొగాకు తదితర ఆరుతడి పంటలు 1.93 లక్షల ఎకరాల్లో సాగు చేసే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేయగా.... ప్రస్తుతం 12వేల ఎకరాల్లో సాగు పూర్తయింది. గోదావరి జలాలతో ఒక్కో చెరువు నిండుతున్న వేళ... భూగర్భ జలాలు కొంతమేర పెరిగే అవకాశం ఉంది. సన్‌ఫ్లవర్ 60శనగ 32మినుములు 55ఆరుతడి పంటలు 36యూరియా16,277 యాసంగి సీజన్లో సాగు పనులు జోరుగా సాగుతున్నాయి. నారు మడులు చివరి దశకు చేరుకోగా, అనేక చోట్ల నాట్లు వేసే పనిలో రైతు కుటుంబాలు శ్రమిస్తున్నారు. జిల్లాలో 3.60 లక్షల ఎకరాల వరకు సాగు విస్తీర్ణం ఉంది. యాసంగిలో ఏటా 2 లక్షల ఎకరాల వరకు సాగు చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుత సీజన్లో వరి 1.80 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 10,700, బొబ్బెర్లు 85, వేరుశనగ 1,011, పొగాకు 800, జొన్న 574, నువ్వులు 114, పెసర 86, కంది 70, ఉలువలు 63, సన్‌ఫ్లవర్ 60, మినుములు 55, శనగ 32, ఇతర ఆరుతడి పంటలు 36 ఎకరాల్లో సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ ముందస్తు అంచనాలో పేర్కొంది. 37 వేల మెట్రిక్ టన్నుల యూరియా, పొటాష్, సింగిల్ సూపర్ పాస్పేట్, నైట్రోజన్ పాస్పరస్ పొటా షియం ఎరువులు అందుబాటులో ఉన్నాయి. 45, 214 మెట్రిక్ టన్నుల వరివిత్తనాలు, 133 మెట్రిక్ టన్నుల వేరుశనగ ఇతర పంటలకు సంబంధించిన విత్తనాలు ఆయా ఎరువుల దుకాణంలో స్టాక్ ఉన్నట్లు వ్యవసాయ శాఖ తయారు చేసిన నివేదికలో పేర్కొన్నారు. వలస కూలీలు.. యాసంగి సీజన్ సాగు వచ్చే ఏడాది జనవరి చివరి కల్లా ముగియనుంది. ఇప్పటి వరకు 5వేల ఎకరాలకు పైగా వరి నాట్లు పడగా, 5,600 ఎకరాల్లో మొక్కజొన్న సాగు పూర్తయింది. వేరుశనగ 800, పొగాకు 500, జొన్న, పెసర్లు, మినుములు తదితర పంటలను సాగుచేస్తున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో వరి యంత్రాలతో నాట్లు వేయిస్తున్నారు. మరికొన్ని చోట్ల బీహార్, ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు నాట్లు వేసే పనిలో బిజీబిజీగా ఉన్నారు. జోరుగా సాగు పనులు పొటాష్ 5,549 సింగిల్ సూపర్ పాస్పేట్ 1,49.1 నైట్రోజన్ పాస్పేట్ పొటాషియం 5,876.3 రైతులకు అందుబాటులో వ్యవసాయ శాఖ యాసంగి సీజన్లో రైతులు ఆయా పంటలు సాగు చేసే సమయంలో ఏఓ, ఏఈఓలు అందుబాటులో ఉంటూ సూచనలు, సలహాలు అందిస్తున్నారు. ఈసారి 1.93లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేసే అవకాశం ఉన్నట్లు అంచనా వేయగా, ఇప్పటి వరకు 12 వేల ఎకరాల సాగు పూర్తి చేశారు. – రామారావు నాయక్, జిల్లా వ్యవసాయాధికారి ●న్యూస్రీల్ఎరువుల వివరాలు (మెట్రిక్ టన్నుల్లో) -
విద్యుత్ సమస్యలు పరిష్కరించాం
స్టేషన్‌ఘన్‌పూర్/పాలకుర్తి టౌన్: విద్యుత్ శాఖ ఘన్పూర్ డివిజన్ పరిధిలో వ్యవసాయ రంగానికి సంబంధించిన విద్యుత్ సమస్యలు పరిష్కరించామని ఎన్పీడీసీఎల్ డీఈ రాంబాబు తెలిపారు. ఆయన గురువారం స్థానిక కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. నెల రోజుల్లోనే డివిజన్ పరిధిలో 280 వ్యవసాయ సర్వీసులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. అందులో ఘన్పూర్ 36, రాజవరం 64, జఫర్‌గఢ్ 54, శివునిపల్లి 18, పాలకుర్తి టౌన్ 58, పాలకుర్తి రూరల్ 29, కొడకండ్ల 21 ఉన్నాయని చెప్పారు. ఇందులో విద్యుత్ అధికారులు, సిబ్బంది కృషితో పాటు వినియోగదారుల సహకా రం ఉందన్నారు. డివిజన్లో రూ.18 కోట్లు విద్యుత్ బకాయిలు ఉన్నాయని, అవగాహన కల్పిస్తూ వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు. ఎన్పీడీసీఎల్ డీఈ రాంబాబు -
‘తోడు’ వీడి.. నింగికేగి
సాక్షి, వరంగల్/దుగ్గొండి: సంచార జాతినుంచి యక్షగానంతో సినీ తెరకు పరిచయమైన బలగం మొగిలయ్య ఇక లేరు.. ఆయన తంబూర మూగబోయింది.. కిడ్నీలు ఫెయిలై, గుండె సమస్య రావ డం, కంటి చూపు కోల్పోయి తీవ్ర అనారోగ్య సమస్యలతో మూడేళ్లుగా బాధపడుతున్న పస్తం మొగిలి అలియాస్ బలగం మొగిలయ్య(67) వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా గురువారం ఆరోగ్యం విషమించింది. ఎంజీఎం ఆస్పత్రికి తరలించేలోపు తుదిశ్వాస విడిచారు. దిల్ రాజు బ్యానర్‌పై దర్శకుడు యెల్డండి వేణు నిర్మించి న బలగం సినిమా చివరి ఘట్టంలో ‘తోడుగా మాతోడుండి.. నీడగా మాతో నిలిచి’ అనే పాట పా డి కోట్లాది మంది ప్రజల హృదయాలకు దగ్గరైన మొగిలయ్య ఓరుగల్లుకే బలగమయ్యారు. కళాకారులు, గ్రామస్తులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఓరుగల్లుకే పేరు తెచ్చారు... దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన పస్తం మొగిలి (67), కొమురమ్మ దంపతులు బేడ బుడిగ జంగా లు. శార్థకథ కథలు చెబుతూ జీవనం సాగిస్తున్నా రు. వీరి పూర్వీకులది కమలాపూర్ మండలం అంబాల కేశవాపురం. మొగిలి తల్లిదండ్రులు పస్తం పెంటయ్య, ముత్తమ్మ ఉపాధి నిమ్తిం మల్లారెడ్డిపల్లి, సిద్ధాపురం గ్రామాల్లో కొన్నాళ్లు ఉండి 30 ఏళ్ల క్రితం దుగ్గొండికి వచ్చి స్థిరపడ్డారు. మొగిలి భార్యతో కలిసి సుదీర్ఘ కాలం వేలాది కథలు చెప్పి గుర్తింపు పొందారు. ఈ క్రమంలో బలగం సినిమా డైరెక్టర్ యెల్దండి వేణుకు పస్తం మొగిలిని ఒగ్గుకథ కళాకా రుడు కాయేతి బాలు పరిచయం చేశారు. అలా బలగం సినిమాలో మొగిలయ్యతో పాడించిన ‘తోడుగా మాతో ఉండి... నీడగా మాతో నడిచి’ అనే పాట ప్రజల గుండెలను హత్తుకుని కంటతడి పెట్టించింది. ఈ పాటతో మొగిలి, కొమురమ్మ దంపతులకు పేరు ప్రఖ్యాతలు రావడంతోపాటు వరంగల్ జిల్లా పేరు మార్మోగింది. ఇటీవల పొన్నం సత్తయ్య ఫౌండేషన్ అవార్డు ను మంత్రి పొన్నం ప్రభాకర్ అందించారు. ఇంటి స్థలంతోపాటు ఇల్లు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చా రు. ఈ మేరకు ఉనికిచర్లలో ఇంటిస్థలాన్ని కేటా యించారు. పట్టా కాగితాలు అందుకునే తరుణంలోనే మొగిలయ్య కన్నుమూశారు. దహన సంస్కారాలకు ఆర్థిక సాయం.. మొగిలయ్య మృతి వార్త తెలుసుకున్న నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రూ.50వేలు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రూ.50వేలు ఆర్థికసాయం పంపించారు. వారి ప్రతినిధులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాసరెడ్డి, ఎల్కతుర్తి మండల నాయకుడు బొమ్మెనపల్లి అశోక్‌రెడ్డి.. మొగిలయ్య భార్య కొమురమ్మకు అందించారు. మొగిలయ్య మృతదేహాన్ని నర్సంపేట మాజీ ఎమ్మె ల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సందర్శించి నివాళులర్పించా రు. ఆయన మృతి జానపద కళకు తీరని లోటన్నా రు. ప్రభుత్వం మొగిలయ్య కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. వరంగల్ పశ్చిమ, నర్సంపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, దొంతి మాధవరెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, బలగం సినిమా నటుడు రచ్చ రవి, కళాకారులు సంతాపం ప్రకటించారు. సాయంత్రం పలువురు కవులు, కళాకారులు పాట లతో మొగిలయ్యకు నివాళులర్పించారు. అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. ‘బలగం’ మొగిలయ్య ఇక లేరు ‘తోడుగా మాతో ఉండి’ పాటతో పేరు ప్రఖ్యాతలు కొన్నేళ్లుగా తీవ్ర అనారోగ్యం.. దుగ్గొండిలో అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు పాటలతో నివాళులర్పించిన కళాకారులు -
సంక్రాంతిలోపు మున్సిపాలిటీ
స్టేషన్‌ఘన్‌పూర్: సంక్రాంతి లోపు ఘన్పూర్ మున్సి పాలిటీ అవుతుంది.. సీఎంతో మాట్లాడి అభివృద్ధికి రూ.25కోట్లు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్థానిక సీఎన్ఆర్ గార్డెన్స్‌లో గురువారం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఘన్పూర్ గ్రామ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. 500 మంది కూర్చునేలా మున్సిపాలిటీ టౌన్‌హాల్ నిర్మాణం, అలాగే గ్రామానికి మొదటి విడతలో 250 ఇందిరమ్మ ఇళ్లు, అత్యాధునికంగా లైబ్రరీ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ఇందిరతో విభేదాలు లేవు ‘సింగపురం ఇందిరతో నాకు ఎలాంటి రాజకీయ విభేదాలు లేవు.. సృష్టించి పనిచేయాల్సిన అవసరమూ లేదు.. కడియం శ్రీహరితో ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.. ప్రజలకు పనిచేయడమే తన లక్ష్యం’ అని కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఇకపై పార్టీలో పాత, కొత్త అనే తేడాలు ఉండవద్దని, అందరూ కుటుంబసభ్యుల మాదిరిగా నియోజకవర్గ అభివృద్ధికి పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్‌రెడ్డి, నాయకులు సీహెచ్.నరేందర్‌రెడ్డి, బెలిదె వెంకన్న, నీల గట్టయ్య, ఘన్పూర్ పట్టణ అధ్యక్షుడు నీల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
ప్రాక్టికల్స్‌కు నిధులు విడుదల
జనగామ రూరల్: గతేడాది చిల్పూర్, దేవరుప్పుల కేజీబీవీల్లో నూతనంగా ఇంటర్మీడియట్ విద్య ప్రా రంభించారు. ఎంపీసీ, బైపీసీ ల్యాబ్ ఏర్పాటు, సైన్స్ ప్రాక్టికల్స్ కోసం సమగ్ర శిక్ష, తెలంగాణ ప్రభుత్వం రూ.50 వేల చొప్పున నిధులు మంజూ రు చేసినట్లు డీఈఓ రమేశ్ ఒక ప్రకటనలో తెలిపా రు. అలాగే జిల్లాలోని ఏడు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు కెమి క ల్స్, ఇతర సామగ్రి కొనుగోలుకు రూ.25వేల చొప్పున మంజూరయ్యాయన్నారు. అంతేకాకుండా సీసీ కెమరాలకు రూ.6వేలు అందజేస్తున్నట్లు ఇంట ర్ విద్యాధికారి జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు. -
దేవాదులకు రూ.178కోట్లు కేటాయించాలి
జనగామ: దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసి జనగామ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు రూ.178 కోట్లు కేటాయించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ జనగామతో పాటు యాదాద్రిలోని ఆలేరుకు సాగునీరు అందించాలంటే మరో 499 ఎకరాల భూసేకరణ జరగాల్సి ఉందన్నారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధి ఏడు నియోజకవర్గాలకు సంబంధించి భూసేకరణ తదితర విషయాలపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడగ్గా.. లిఖిత పూర్వకంగా అందజేసిన ట్లు పేర్కొన్నారు. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్కువ భాగం జనగామలోనే ఉండడంతో మిగిలి పోయిన ప్యాకేజీ–8, 7, 2లో 3,400 ఎకరాలకు గాను 2,972 ఎకరాలు గతంలోనే ప్రభుత్వం సేకరించిందని, మిగతా భూసేకరణకు రూ.178కోట్లు అవసరమన్నారు. జనగామ నియోజకవర్గ పరిధిలోని 484 చెరువులను పూర్తిగా నింపాలంటే భూసేకరణ తప్పనిసరి అన్నారు. ధర్మసాగర్ నుంచి గండిరామారం మీదుగా తపాస్‌పల్లి రిజర్వాయర్లను నింపుకుంటే ప్రస్తుత యాసంగి సీజన్‌కు సరిపడా సాగునీరు అందించవచ్చని చెప్పారు. సాగునీటి తరలింపునకు సిస్టం సిద్ధంగా ఉన్నా.. అధికారులు చర్యలు తీసుకో వడం లేదని పేర్కొన్నారు. తపాస్‌పల్లి రిజర్వాయర్ పరిధిలో 4 మోటార్లను వెంటనే ఆన్‌చేసి చెరువుల ను నింపాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి -
అమిత్ షా వ్యాఖ్యలపై నిరసన
జనగామ : అంబేడ్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చెంచారపు బుచ్చి రెడ్డి ఆధ్వర్యాన గురువారం ఆర్టీసీ చౌరస్తాలో ఆయ న దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి, నాయకులు మాట్లాడుతూ.. మతత్వ బీజేపీ నాయకులు అంబేడ్కర్‌ను అవమానిస్తే దేశ ప్రజలు ఊరుకోరని, అహంకారంతో విర్రవీగితే కర్రుకాల్చి వాత పెడతారని అన్నారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు చెంచారపు శ్రీనివాసరెడ్డి, ప్రముఖ డాక్టర్ రాజమౌళి, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి మిద్దెపాక సిద్ధులు, మేడ శ్రీనివాస్, సేవాదళ్ రాష్ట్ర నాయకులు సుంకరి శ్రీనివాస్‌రెడ్డి గనిపాక మహేందర్, గంగం నరసింహారెడ్డి, లింగా ల నర్సిరెడ్డి, లక్ష్మీనారాయణ, కృష్ణస్వామి, మల్లారెడ్డి, గాదెపాక రామచందర్ పాల్గొన్నారు. బీఎస్పీ ఆధ్వర్యాన.. జనగామ రూరల్: అంబేడ్కర్‌పై కేంద్ర మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చేప్పాలని బీఎస్సీ జిల్లా అధ్యక్షుడు మడిపడిగ చంద్రశేఖర్, రాష్ట్ర ఈసీ సభ్యుడు నీర్మాల రత్నం డిమాండ్ చేశారు. ఈ మేరకు అంబేడ్కర్ చౌరస్తాలో జిల్లా కమిటీ ఆధ్వర్యాన చేపట్టిన కార్యక్ర మంలో శ్రీశైలం, మల్లయ్య, అర్జున్, ప్రవీణ్, సిద్దులు, దండు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఇళ్ల సర్వే పారదర్శకంగా చేపట్టాలి
జనగామ రూరల్: ఇందిరమ్మ ఇళ్ల సర్వే నిర్దేశిత సమయంలో పారదర్శకంగా చేపట్టాలని అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్ అన్నారు. గురువారం జనగా మ మండలం శామీర్‌పేటలో కొనసాగుతున్న ఇంది రమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియను ఆయన పరిశీలించారు. దరఖాస్తుదారుల ఇళ్లను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులను గుర్తించి ఇందిరమ్మ పథకం ద్వారా సొంతింటి కలను నిజం చేసేందుకు ఈ సర్వే చేపట్టిందని చెప్పారు. ఎంపీడీఓ సంపత్‌కుమార్, అధికారులు ఉన్నారు. జఫర్‌గఢ్‌లో ఆర్డీఓ.. జఫర్‌గఢ్: మండల పరిధి షాపల్లి గ్రామంలో ఇంది రమ్మ ఇళ్ల సర్వేను ఘన్పూర్ ఆర్డీఓ వెంకన్న గురువా రం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వం సూచించిన విధంగా సర్వే చేపట్టాలన్నారు. గ్రామానికి చెందిన శివరాత్రి వెంకటేష్ ఇంటి స్థలం విషయంలో ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంబంధిత అధికారులతో కలసి ఆయన విచారణ చేపట్టారు. తహసీల్దార్ శంకరయ్య, ఎంపీడీఓ సుమన్, ఎస్సై రామ్‌చరణ్, అర్ఐ అనిల్‌బాబు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్ -
పత్తి రైతుల అరిగోస
జనగామ: తెల్లబంగారం పండించిన రైతులు పంట ను అమ్ముకోవడానికి అరిగోస పడుతున్నారు. ప్రైవే ట్ వ్యాపారుల చేతిలో దగా పడకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీపీఐ సెంటర్లను ఏర్పాటు చేశాయి. పింజ 8 నుంచి 12 శాతం క్వాలిటీతో ఉన్న పత్తిని క్వింటాకు రూ.7,521 ప్రారంభ ధరతో కొనుగోలు చేస్తున్న సీసీఐ.. అంతకు మించితే తీసుకోవడం లేదు. దీంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించి తీవ్రంగా నష్టపోతున్నారు. అక్టోబర్ 18న జిల్లాలో సీసీఐ సెంటర్లను ప్రారంభించగా.. రోజు వారీగా పత్తి కొనుగోలు చేస్తున్నారు. 30, 29ఎంఎం(పొడవు గింజ) రకానికి చెందిన పత్తి కొనుగోళ్లు పూర్తి కాగా.. ప్రస్తుతం 28 ఎంఎం రకానికి చెందిన పత్తి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో 26, 26.5ఎంఎం రకానికి చెందిన పత్తి వస్తుండడంతో కొనుగోలు చేయడం లేదు. నిబంధనల మేరకు పత్తి లేకపోవడంతో తిరస్కరిస్తున్నారు. జిల్లాలో 15 కాటన్ మిల్లుల పరిధిలో సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. ఇప్పటి వరకు 22,833 మంది రైతుల నుంచి 6,05,176 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేశారు. ప్రైవేట్‌లో అడ్డగోలు దోపిడీ సీసీఐ తిరస్కరించిన పత్తిని రైతులు ప్రైవేట్ మార్కెట్‌కు తీసుకువెళ్తే అడ్డగోలుగా ధర తగ్గిస్తున్నారు. 26, 26.5ఎంఎం రకం పత్తి క్వింటాకు రూ.6వేల నుంచి రూ.6,200 మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో రైతులు క్వింటాకు రూ.1000 నుంచి రూ.1,200 నష్టపోవాల్సి వస్తున్నది. జిల్లాలో పత్తి దిగుబడి వచ్చే సమయంలో 20 రోజుల పాటు వాతావరణం చల్లబడి, నిరంతర ముసురు, జోరు వానలు కురిశాయి. దీంతో పత్తి నలుపు రంగుకు మారడంతోపాటు ఎకరాకు రెండు నుంచి మూడు క్వింటాళ్ల దిగుబడి తగ్గింది. ఈ సమస్య ఎక్కువగా లింగాలఘణపురం, పాలకుర్తి, రఘునాథపల్లి, జఫర్‌గఢ్, నర్మెట, కొడకండ్ల తదితన ప్రాంతాల్లో ఉంది. నాణ్యత తక్కువగా ఉన్న పత్తిని సీసీఐ తిరస్కరించడంతో రైతులు అధికారులను నిలదీస్తున్నారు. నిబంధనలు పాటించడం తప్ప తాము ఏమీ చేయలేమని చెప్పి పంపిస్తున్నారు. దీంతో రైతులు ప్రైవే ట్ వ్యాపారులను ఆశ్రయిస్తుండడంతో ఇదే అదనుగా అడ్డగోలుగా ధర తగ్గిస్తున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి క్వాలిటీ పత్తి కొనుగోలు చేసేందుకు కేంద్రం అనుమతివ్వగా.. ఇక్కడ కూడా అమలు చేయాలని ఇటీవలే భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి సంబంధిత కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకుని తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 26.5 ఎంఎం రకం పత్తి కొనుగోలు చేయని సీసీఐ వరుస వర్షాలు, వాతావరణ మార్పులతో తగ్గిన నాణ్యత ప్రైవేట్‌లో అడ్డగోలుగా ధర తగ్గిస్తున్న వ్యాపారులు క్వింటాకు రూ.వెయ్యి నుంచి రూ.1,200 నష్టపోతున్న రైతన్నలుప్రైవేట్లో రూ.6వేలు అంటున్నరు ఏడు ఎకరాల్లో పత్తి సాగు చేసి న. పెట్టుబడుల కోసం రూ.4లక్షల వరకు ఖర్చు అయింది. వాతావరణ మార్పులు, వరుస వర్షాల కారణంగా 80 క్వింటా ళ్లకు పైగా రావాల్సిన దిగుబడి 60 క్వింటాళ్లకు పడిపోయింది. సీసీఐ సెంటర్లో మద్దతు ధరకు అమ్ముకుదామని వెళ్తే క్వాలిటీ లేదని తిరిగి పంపించారు. బతిమిలాడినా వినిపించుకోలేదు. ప్రైవేట్‌కు వెళ్తే రూ.6వేలకు రూపాయి ఎక్కువ ఇవ్వమంటున్నా రు. దీంతో ట్రాక్టర్ అద్దె రూ.5వేల వరకు వృథా అయినా.. పత్తిని ఇంటికి తీసుకువచ్చా. ప్రభుత్వం స్పందించి సీసీఐలో మద్దతు ధరకు కొనుగోలు చేసేలా చూడాలి. – కొంగరి పరశురాములు, పత్తి రైతు, కుందారం (లింగాలఘణపురం)కేంద్రం అనుమతి ఇవ్వాలి..సీసీఐ సెంటర్లో 26, 26.5 ఎంఎం రకానికి చెందిన పత్తి కొనుగోలు చేసేలా కేంద్రం ఆదేశించి రైతులను ఆదుకోవాలి. లేని పక్షంలో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. రైతుల కష్టాన్ని చూసి సానుకూల దృక్పథంతో స్పందించాలి. – రామ్మోహన్, కాటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడునిబంధనల మేరకే.. సీసీఐ నిబంధనల మేరకే పత్తి కొనుగోలు చేస్తున్నాం. 28 ఎంఎం కంటే తక్కువ ఉన్న పత్తి కొనుగోలు చేయడం లేదు. సీసీఐ సెంటర్‌కు రైతులు తెచ్చే పత్తి క్వాలిటీని అన్ని రకాలుగా పరిశీలించి 8 నుంచి 12 శాతం వరకు ఉన్నదానికే నామ్స్ మేరకు ధర చెల్లిస్తున్నాం. – నర్సిరెడ్డి, సీసీఐ ఇన్చార్జ్ -
ఐక్యతతో సమస్యలు పరిష్కరించుకోవాలి
జనగామ రూరల్: ఐక్యతతో సమస్యలు పరిష్కరించుకోవాలని ఆల్ పెన్ష్నర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకుర్తి కృష్ణమూర్తి అన్నారు. పెన్షనర్స్ డే సందర్భంగా గురువారం పట్టణంలోని సంఘం కార్యాలయంలో అసోసియేషన్ ఆధ్వర్యాన ఎర్రోజు రామస్వామి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఒకరికొకరు సహకరించుకుని వాటిని అధిగమించాలని పేర్కొన్నారు. అనంతరం జిల్లాలోని 26 మంది పెన్షనర్లను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అంబటి రాజయ్య, డిప్యూటీ జనరల్ సెక్రటరీ తొల్పునూరి రామచంద్రం, జిల్లా కోశాధికారి కొత్తూరి సంపత్ కుమార్, ఉపాధ్యక్షులు గాదె కాథరిన్, జనార్ధన్ రెడ్డి, సరాబ్ వీరన్న తదితరులు పాల్గొన్నారు. -
సమతుల్య ఆహారం తప్పనిసరి
‘భద్రకాళి’ అంచున ఆదిమానవులు? వరంగల్‌లోని భద్రకాళి చెరువు చుట్టూ ఆదిమానవులు జీవనం సాగించినట్లు ఆధారాలు లభ్యమయ్యాయని డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్‌రెడ్డి తెలిపారు.వాతావరణం ఉదయం చల్లని వాతావరణం ఉంటుంది. ఆకాశం మేఘావృతమై మధ్యాహ్నం సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. రాత్రి సమయంలో చలి తీవ్రత అధికంగా ఉంటుంది.– 8లోuఎంజీఎం : చలికాలంలో వేడివేడి పదార్థాలతో పాటు రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఆలుగడ్డ, బీట్రూట్, క్యారెట్, మష్రూమ్స్ వంటి దుంప కూరలు శరీరంలో వేడిని పుట్టిస్తాయి. వీటిలో ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉండడంతో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. º వేరుశనగ, బాదం, జీడి పప్పు, పిస్తా, కర్జూర వంటి తృణ ధాన్యాలు తీసుకో వాలి. ఇవి బలవర్థ్ధకమైన ఆహారంతో పాటు శరీరంలో వేడిని పుట్టిస్తాయి. º చలి కాలంలో యాపిల్, అరటిపండ్లు, బొప్పాయి, పైనాపిల్ వంటివి తీసుకో వాలి. వీటిలో ఫైబర్ ఉంటుంది. వేడిని ఉత్పత్తి చేస్తాయి. º వంట గదిలోని ఆవాలు, ఎండు మిర్చి, మెంతులు, అల్లం, లవంగాలు, దాల్చి న చెక్క, పసుపు, జీరా వంటి సుగంధ ద్రవ్యాలు శరీరంలో వేడిని ఉత్పత్తి చేయడానికి సహకరిస్తాయి. జలుబు, దగ్గు, వంటి వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి ఉపశమనం పొందేందుకు ఉపయోగపడుతాయి. º శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్స్, చక్కెర పదార్థాలు, స్వీట్లు, కేకులు, ఫ్రైడ్ రైస్, ఆల్కహాల్, బేకరీ పదార్థాలకు దూరంగా ఉండాలి. º చలిగాలి వెళ్లకుండా తల, చెవుల భాగాలు మఫ్లర్‌తో కప్పి ఉంచాలి. స్వెటర్లు వేసుకోవాలి. ముఖ్యంగా బయటికి వెళ్లేవారు మఫ్లర్ లేదా మంకీక్యాప్ ధరించాలి. వేడివేడి పదార్థాలు తీసుకోవాలిరవీందర్రెడ్డి, డైటీషియన్, ఎంజీఎం -
జీవశాస్త్రం ఎంతో కీలకమైనది
● జిల్లా సైన్స్ అధికారి ఉపేందర్ జనగామ రూరల్: జీవశాస్త్రం ఎంతో కీలకమైనదని, శాసీ్త్రయ వైఖరిని పెంపొందిస్తుందని జిల్లా సైన్స్ అధికారి సీహెచ్.ఉపేందర్ అన్నారు. తెలంగాణ జీవశాస్త్ర జిల్లా ఫోరం ఆధ్వర్యాన బుధవారం పట్టణంలో విద్యార్థులకు జీవశాస్త్రంలో జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవశాస్త్రం అనేది నిత్యజీవితంలో అనేక అవసరాలను తీరుస్తుందని, దీని ద్వారా అన్ని రకాల జీవరాశుల శరీర నిర్మాణాలు, వాటి విధులను తెలుసుకోవచ్చన్నారు. పెరుగుతు న్న జనాభాకు అనుగుణంగా ఉత్పత్తులు పెంచి ఆహార ధాన్యాల కొరతను తీర్చవచ్చని చెప్పారు. ఫోరం జిల్లా అధ్యక్షుడు తాటికొండ పంచాక్షరి మాట్లాడుతూ జీవశాస్త్రం సహాయంతో హరిత విప్లవం, శ్వేత విప్లవం వంటి ఉత్పత్తులు పెంచడం, జీవ వైవిధ్యం, జీవావరణ పరిరక్షణ తదితరాల గురించి తెలుసుకోవచ్చని చెప్పారు. పిల్లలు ఇష్టంతో చదవాలని సూచించారు. ఈ టాలెంట్ టెస్ట్‌లో ప్రతిభ కనబర్చిన వారు ఈనెల 28న రాష్ట్ర స్థాయి టెస్ట్‌లో పాల్గొంటారని తెలిపారు. అనంతరం పోటీ పరీక్షల్లో పాల్గొన్న వారికి బహుమతులు, మెమొంటోలు, ప్రశంస పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సత్తయ్య, రాష్ట్ర బాధ్యులు ఎర్రోజు శ్రీనివాస్, శివప్రసాద్, ఆంజనేయులు, శ్రీనివాస్, కరుణ, స్పందన, నాగరాణి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపిక.. దేవరుప్పుల/కొడకండ్ల : దేవరుప్పుల మండలం మాధాపురం హైస్కూల్‌కు చెందిన విద్యార్థిని గుర్రం దీక్షిత జిల్లా స్థాయి జీవశాస్త్ర ప్రతిభా పాఠవ పోటీల్లో ప్రథమ స్థానం సంపాందించి త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్టు హైస్కూల్ హెచ్ఎం వీరగోని రమేష్ తెలిపారు. అలాగే కొడకండ్ల మండలకేంద్రంలోని టీజీఆర్ఎస్ గురుకుల విద్యార్థినులు బి.నాగవైష్ణవి ప్రథమ స్థానంలో, పి.మోక్షజ ద్వితీయ స్థానంలో నిలిచారు. -
పోలీసులు అంకితభావంతో పనిచేయాలి
స్టేషన్‌ఘన్‌పూర్: పోలీసులు విధి నిర్వహణలో అంకితభావంతో నిజాయితీగా పనిచేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్‌కిషోర్‌ఝూ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా స్టేషన్‌ఘన్‌పూర్ ఏసీపీ కార్యాలయాన్ని ఆయన బుధవారం సందర్శించా రు. ఆయనకు మొక్క అందజేసి స్వాగతం పలికా రు. అనంతరం సీపీ రిజిష్టర్లు, ఎస్సీ, ఎస్టీ, ఇతర కేసుల రికార్డులను పరిశీలించి కేసుల ప్రస్తుత స్థితిగతులపై ఆరా తీశారు. నిందితుల అరెస్టు, దర్యాప్తు తీరును ఏసీపీని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. శాంతిభద్రతల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, పోలీస్‌స్టేషన్‌తో పాటు బ్యాంకులు, ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరా లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. నేరాల నియంత్రణకు పోలీసు అధికారులు మరింత బాధ్యతగా పనిచేయాలని, నేరం జరిగిన వెంటనే వేగంగా స్పందించాలని చెప్పారు. చట్టాలను అతిక్రమించే చర్యలకు పాల్పడేవారిని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించవద్దని సూచించారు. ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ వారు ఇచ్చే ఫిర్యాదులను పరిశీలించాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో డీసీసీ రాజమహేంద్రనాయక్, ఏఎస్పీ, ట్రెయినీ ఐపీఎస్ మన్నన్భట్, ఏసీపీ భీమ్‌శర్మ, సీఐలు జి.వేణు, శ్రీనివాస్‌రెడ్డి, ఎస్ఐలు వినయ్‌కుమార్, రమేష్, నవీన్‌కుమార్, నరేష్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ సీపీ అంబర్‌కిషోర్‌ఝూ -
హాకర్స్ జోన్ ఏర్పాటు చేయాలి
జనగామ రూరల్: పట్టణ కేంద్రంలో తోపుడు బండ్లు, చిరు వ్యాపారులతో వెండింగ్ కమిటీ వేసి హాకర్స్ జోన్ ఏర్పాటు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు విజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం యూనియన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి పేరుతో మున్సిపల్, ట్రాఫిక్ పేరుతో పోలీసులు రోడ్లపై చిరు వ్యాపాలు చేసుకోకుండా నిరోధించడం సరికాదన్నారు. ప్రత్యామ్నాయం చూపించకుండా తోపుడు బండ్లను తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. సుప్రీం, హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం మున్సిపల్ అధికారులు చిరు వ్యాపారం చేసే వారిని గుర్తించి పభుత్వం గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని, కలెక్టర్ పర్యవేక్షణలో వెండర్స్ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్ ఏఓ మన్సూర్‌కు వినతిపత్రం అందజేశారు. తోపుడుబండ్ల చిరు వ్యాపారుల సంక్షేమ సంఘం కన్వీనర్ మెండే రమేశ్, కోకన్వీనర్ మధు, సునీత, పద్మ, దానమ్మ షరీఫుద్దీన్, చిన్ని, పద్మ తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా -
పిల్లలు, పెద్దలు జాగ్రత్త..
గురువారం శ్రీ 19 శ్రీ డిసెంబర్ శ్రీ 2024ఎంజీఎం : చలి తీవ్రత ఎక్కువైనందున పిల్ల లు, పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ చలితో చర్మం, ఊపిరితిత్తుల సమస్యలతో పాటు గుండె సంబంధ వ్యాధుల వారికి డిప్రెషన్ పెరిగే అవకాశం ఉంటుంది. ● చర్మం పొడిబారకుండా మాశ్చరైజర్ రాసుకోవాలి. న్యూమోనియా, బ్రాంకై టీస్, అస్తమా వంటి ఊపిరితిత్తుల ఇబ్బంది తలెత్తకుండా చల్లగాలిలో తిరగడం, దుమ్ము ధూళి ఉండే పరిసరా ల కు, రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలి. చర్మ సంరక్షణకు రోజూ 6 నుంచి 8 గ్లాసుల నీరు తాగాలి. ● పొడి దగ్గు, పిల్లి కూతలు, ఛాతిలో బరువు ముఖ్యంగా రాత్రివేళలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్తమాగా భావించాలి. ● పెద్దల్లో దగ్గు మాత్రమే ఉంటే అస్తమా కాదు. రాత్రి, ఉదయం వేళలో అధికమవుతుంది. అధిక వ్యాయామం, అలెర్జీ లు, చల్లటి గాలి ద్వారా తీవ్రమయ్యే అవకాశం ఉంది. అస్తమా మందులు వాడేవారు ఇన్హేలర్లు క్రమం తప్పకుండా వినియోగించాలి. ● శీతాకాలంలో ఊపిరితిత్తుల సమస్యలు వస్తే న్యూమోనియా, ఇన్ప్లూంజాగా పరిగణిస్తారు. వ్యాక్సినేషన్ వల్ల ఇన్ఫెక్షన్ తీవ్రత తగ్గే అవకాశం ఉంది. ● గుండె వ్యాధులు ఉన్నవారు మందులు రెగ్యులర్‌గా వాడాలి. కొందరిలో గుండె వేగం తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. వైద్యులను సంప్రదించాలి.జిల్లాలో చలితీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. సాయంత్రం 6 గంటలు అయ్యిందంటే చాలు జనం బయటికి వెళ్లేందుకు జంకుతున్నారు. పొగమంచు కురవడంతోపాటు చల్లటి గాలులు వీస్తున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. నగరంలో వివిధ పనులు చేసుకునే వారు, గ్రామాల్లో చీకటి పడగానే చలిమంటలు వేసుకుంటున్నారు. ఉదయం 10 గంటల వరకు కూడా మంచు వీడడం లేదు. జిల్లాలో ఎనిమిది రోజులుగా నమోదైన ఉష్ణోగ్రతలు (డిగ్రీల సెల్సియస్‌లలో)గరిష్టం కనిష్టం11 12 13 14 15 16 17 18ఊపిరితిత్తులు, గుండె సంబంధ వ్యాధిగ్రస్తులకు ఇబ్బందిడాక్టర్ ఎం.పవన్‌కుమార్ జనరల్ మెడిసిన్ ఎండీ.ప్రొఫెసర్ భూపాలపల్లి -
శబరిమల యాత్ర బస్సు ప్రారంభం
జనగామ: దేవరుప్పుల నుంచి శబరిమల యాత్రకు వెళ్లే ఆర్టీసీ జనగామ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్‌ను బుధవారం మేనేజర్ ఎస్.స్వాతి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 36 మంది అయ్యప్ప స్వాములతో బయలుదేరిన బస్సు.. శ్రీశైలం, మహానంది, కాణిపాకం, భావాని, గురువా యర్ మీదుగా పంబ–శబరిమల పుణ్యక్షేత్రానికి చేరుకుంటుందన్నారు. అయ్యప్ప స్వామి దర్శనం ముగిసిన తర్వాత శ్రీరంగం, అరుణాచలం, కంచి, తిరుత్తని, శ్రీకాళహస్తి, తిరుపతి, విజయవాడ మీదుగా దేరుప్పులకు చేరుకుంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ అసిస్టెంట్ మేనేజర్ డి.హుస్సేన్, జి.రాఘవేందర్, మెకానికల్ విభాగం అసిస్టెంట్ ఇంజినీర్ వై.యాదమణిరావు, ఆఫీస్ సూపరింటెండెంట్ వి.ప్రభాకర్, సెక్యూరిటీ హెడ్ కానిస్టేబుల్ కె.సురేందర్‌గౌడ్, సేఫ్టీ వార్డెన్ పాల్గొన్నారు.