
గిట్టుబాటు ధర చెల్లించేది కేంద్రమే..
రఘునాథపల్లి: రైతులు పండించిన పంటలకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధరలు చెల్లించేది ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వమేనని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పెరుమాండ్ల వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని కోమళ్లలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పార్టీ నాయకులతో కలిసి ఆదివారం సందర్శించారు. కొనుగోలు కేంద్రంలో సమస్యలు ఉన్నాయా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పిస్తున్నది కూడా కేంద్ర ప్రభుత్వమేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి మంద వెంకటేష్‌యాదవ్, బూత్ అధ్యక్షుడు వల్లాల శ్రీను, బాల్నె వెంకటయ్య, మంకెన అన్నపురెడ్డి, మంద రాములు, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు వెంకటేశ్వర్లు