Jangaon District Latest News
-
చట్టాలపై అవగాహన అవసరం
జనగామ రూరల్: చట్టాలపై ప్రతిఒక్కరికీ అవగాహ న అవసరమని సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్ అన్నారు. సోమవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యాన కోమటిరెడ్డి సుశీలమ్మ రుద్రమదేవి ఓల్డేజ్ హోంను సందర్శించిన ఆయన సీనియ ర్ సిటిజన్లకు చట్టాలపై అవగాహన కల్పించారు. వారి మంచి చెడులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏమైనా న్యాయపరమైన సమస్యలు ఉంటే కాగితంపై రాసి జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు అందజేస్తే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం వయోవృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వృద్ధాశ్రమ ప్రెసిడెంట్ లక్ష్మణ్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ రవీంద్ర, పారా లీగల్ వలంటీ ర్లు శేఖర్, భీమయ్య తదితరులు పాల్గొన్నారు. సీనియర్ సివిల్ జడ్జి విక్రమ్ -
గ్రామసభలు పకడ్బందీగా నిర్వహించాలి
జనగామ రూరల్ : సంక్షేమ పథకాల అమలుకు గ్రామ, వార్డు సభలను పకడ్బందీగా నిర్వహించాల ని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి అదనపు కలెక్ట ర్లు పింకేష్‌కుమార్, రోహిత్‌సింగ్, డీసీపీ రాజమహేంద్రనాయక్‌తో కలిసి గ్రామ, వార్డు సభల నిర్వహణపై నిర్వహించిన జూమ్ మీట్లో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త ఆహార భద్రత కార్డులు(రేషన్ కార్డులు), ఇందిరమ్మ ఇళ్ల పథకాలను ఈనెల 26 నుంచి అమలు చేయనున్న నేపథ్యంలో 21 నుంచి 24వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించాలన్నారు. హాజరయ్యే ప్రజల కోసం అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని చెప్పారు. సభ ప్రారంభానికి ముందు ప్రభుత్వం జారీ చేసిన సందేశాన్ని తప్పనిసరి చదివి వినిపించాలన్నారు. హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసి కొత్త దరఖాస్తులు, సర్వే పరిశీలన అభ్యంతరాలను స్వీకరించాలని తెలిపారు. పథకా లకు సంబంధించిన జాబితాలు ప్రదర్శించాలని సూచించారు. లబ్ధిదారుల ఎంపిక నిరంతరం కొనసాగుతుందని వివరించారు. సమావేశంలో జెడ్పీ సీఈ ఓ మాధురీషా, ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమాన్ నాయక్, డిప్యూటీ సీఈఓ సరిత, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, డీఆర్డీఓ వసంత, డీపీఓ స్వరూప, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు జనగామ: అర్హులకు సంక్షేమ పథకాలను అందించడమే ప్రభుత్వ ధ్యేయమని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. అర్హుల గుర్తింపు కోసం చేపట్టిన సర్వే చివరి రోజు సోమవారం పట్టణంలోని 19వ వార్డులో రేషన్ కార్డుల ప్రక్రియను ఆయన పరిశీలించారు. కలెక్టర్ వెంట స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, మునిసిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఆయా శాఖల అధికారులు ఉన్నారు. హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసి కొత్త దరఖాస్తులు స్వీకరించాలి కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ముగిసిన ఇంటింటి సర్వే.. జనగామ: రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమలులో భాగంగా ఈనెల 16 నుంచి ప్రారంభమైన ఇంటింటి సర్వే సోమవారం ముగిసింది. పంటల సాగుకు పనికిరాని 6,395 సబ్ డివిజన్ల(సర్వే నంబర్లు బైతో సహా) పరిధిలో 5,696 ఎకరాల భూమిని గుర్తించారు. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు 9,986 దరఖాస్తులను పరిశీలించారు. కార్డులో కుటుంబ సభ్యులను చేర్చేందుకు 10,877(16,660 మంది సభ్యులు) వచ్చిన దరఖాస్తుల వెరిఫికేషన్ వందశాతం పూర్తి చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం రూరల్ పరిధిలో 1,33,345, అర్బన్‌లో 9,824 మొత్తం 1,43,187 అప్లికేషన్లకు సంబంధించి అర్హత వివరాలు సేకరించారు. అలాగే ఇందిర మ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి అర్హుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. నేటి(మంగళవారం) నుంచి 24 వరకు అర్హుల జాబితా ఎంపి క కోసం పట్టణ, గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. -
ప్రజలు మోసపోయి గోసపడుతున్నరు
జనగామ: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు మోసపోయి గోసపడుతున్నరని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం యశ్వంతాపూర్‌లోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బచ్చన్నపేట, జనగామ మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయ న మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ సర్కారు ద్వంద్వ విధానాలను ఎండగట్టాలన్నారు. రాష్ట్రంలో మళ్లీ పాత రోజులు వచ్చాయని, పేద కుటుంబాలు వలసపోయే పరిస్థితి నెలకొందన్నారు. రేషన్ కార్డుల పేరుతో పాలకులు ప్రజలను ఆగం చేస్తున్నారని, ప్రజాపాలనలో 80 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే పది శాతం పేర్లు సర్వేలో కనిపించడం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రశ్నించడం వల్లే రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరంగా కొనసాగిస్తామని ప్రకటించినట్లు పేర్కొన్నారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వని పక్షంలో గ్రామసభల్లోనే నిలదీస్తామని హెచ్చరించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ పి.జమునలింగయ్య, ఫ్లోర్‌లీడర్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, మాజీ ఎంపీపీ మేకల కలింగరాజు, రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, గంగం సతీష్‌రెడ్డి, బావడ్ల కృష్ణంరాజు, మద్దికుంట రాధ, రావెల రవి, పేర్ని స్వరూప, బాల్దె కమలమ్మ, పాక రమ, వాంకుడోతు అనిత, ప్రవీణ్, నర్సింగ్, రాజు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి -
ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనలు పాటించాలి
జనగామ: ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ మల్లికార్జున్‌రావు అన్నారు. సోమవారం పట్టణంలోని చందన పిల్లల ఆస్పత్రిని ఆకస్మికంగా సందర్శించిన ఆయన వైద్యారోగ్య శాఖ నిబంధనలు, రోగులకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. ఆస్పత్రుల్లో బయోమెడికల్ మేనేజ్మెంట్ ఒప్పందంతోపాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అగ్నిమాపక శాఖ అనుమతలు అప్పనిసరి అని పేర్కొన్నా రు. ఆస్పత్రి అనుమతి పత్రాన్ని అందరికీ కనిపించేలా ప్రదర్శించాలని, అలాగే పనిచేస్తున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పేర్ల డిస్‌ప్లేతోపాటు ప్రతి చోట హెల్ప్‌డెస్క్ ఉండాలని స్పష్టం చేశారు. విధుల్లో ఉన్న వైద్య సిబ్బంది యూనిఫాం కోడ్ పాటించాలని తెలిపారు. రోగులకు మర్యాదతో కూడిన వైద్యసేవలు అందించాలని, నిబంధనల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు కఠినంగా ఉంటాయన్నారు. అక్కడి నుంచి బస్తీ దవాఖానకు చేరుకుని వైద్యులు, సిబ్బందికి సూచనలు ఇచ్చారు. డీఎంహెచ్ఓ మల్లికార్జునరావు -
యక్షగాన కళాకారులకు పూర్వవైభవం
దేవరుప్పుల : యక్షగాన కళాకారులకు పూర్వవైభ వం తెస్తాం.. కళలకు జీవం పోసేలా ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి చిన్నమడూరులో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నిర్వహించిన గడ్డం సోమరాజు కళాక్షేత్రం రెండో వార్షికోత్సవ సభలో ఆమె మాట్లాడారు. నియోజకవర్గంలో నిలువనీడ లేని చింధు యక్షగాన కళాకారు ల కుటుంబాలకు తొలి ప్రాధాన్యతగా ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూల నుంచి వచ్చిన చిందు యక్షాన, ఒగ్గు, కోలాటం, డప్పు తదితర కళాకారుల ప్రదర్శనలు తిలకించి అభినందించారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత గడ్డం సమ్మ య్య, ఉద్యమ కళాకారుడు గజవెల్లి ప్రతాప్, కళాక్షేత్రం వ్యవస్థాపకుడు గడ్డం సోమరాజు, కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు ఉప్పల సురేష్‌బా బు, వీరారెడ్డి సోమశేఖర్‌రెడ్డి, వంగ కళమ్మ, దశర థ, నరేష్, రామచంద్రునాయక్, మాలతి, గడ్డం శేషాద్రి, శ్రీపతి, చంద్రమోహన్ పాల్గొన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి -
మంగళవారం శ్రీ 21 శ్రీ జనవరి శ్రీ 2025
– 8లోuన్యూస్రీల్సమస్యల‘పాలిక’జనగామ పురపాలిక పరిధిలో సమస్యలు ప్రజలను పట్టిపీడిస్తున్నాయి. గుంతలమయమైన రోడ్లు.. రహదారుల పక్కనే ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు.. వీటికితోడు మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. కోతులు, కుక్కలు, దోమల బెడద అధికమైంది. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని జనం మండిపడుతున్నారు. – జనగామ -
ఎల్లమ్మకు వెండి కిరీటం
చిల్పూరు: చిన్నపెండ్యాల సమీప శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయానికి గ్రామానికి చెందిన దాతలు రూ.1.70 లక్షల విలువైన వెండి కిరీటాన్ని సోమవారం బహూకరించారు. ఈ మేరకు తాళ్లపల్లి చిన్నరామస్వామి–సౌందర్య దంపతుల కూతరు–అల్లుడు గుండెబోయిన రమేష్–మమత ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం వెండి కిరీటాన్ని అర్చకులు కర్ణాకర్శర్మకు అందజేశారు. స్లాట్ బుక్ చేసుకోండి జనగామ రూరల్: జిల్లాలోని దివ్యాంగులు సదరం క్యాంపులో పాల్గొనేందుకు మీసేవా ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని జిల్లా గ్రామీ ణాభివృద్ధి అధికారి ఎన్.వసంత ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త వారికి నిరంతరం, రెన్యూవల్ చేసుకునే వారు ఈనెల 21న ఉదయం 11.30 గంటలకు స్లాట్ బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నా రు. 24న రెన్యువల్స్ క్యాంపులో దృష్టి లోపం, వినికిడి లోపం, 28, 30 తేదీల్లో ఆర్థో పెడిక్, 29న మానసిక దివ్యాంగులకు అవకాశం ఉందన్నారు. కొత్తగా స్లాట్ బుక్ చేసుకుని వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న వారిలో అర్హుల ఫోన్ నంబర్‌కు మెసేజ్ వస్తుందనీ.. ఆయా తేదీల్లో మీసేవా రశీదు, డాక్టర్ రిపోర్ట్లు, ఆధార్కార్లు, ఫొటోలు, ఎక్స్‌రేతో జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి లోని సదరం క్యాంపునకు హాజరుకావాలన్నా రు. సదరంలో ఒకసారి తిరస్కారానికి గురైన వారి వివరాలు ఐ.డి. సాఫ్ట్‌వేర్‌లో తొలగిస్తారని, ప్రస్తుతం వాస్తవ దివ్యాంగులు అపిలేట్ మేరకు జిల్లా ఆస్పత్రిలోని మెడికల్ బోర్డ్‌కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 80082 02287, 98664 60830 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ధర్మాచరణతో మోక్షం జనగామ: మానవ జన్మలో ధర్మాచరనతో మోక్షం ప్రాప్తిస్తుందని బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ పేర్కొన్నారు. స్థానిక హెడ్ పోస్టాఫీసు ఏరియా శ్రీ సంతోషిమాత ఆలయంలో సోమవారం అష్టాదశ పురాణాల్లో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసశర్మ ఆధ్వర్యాన శ్రీ స్కాంద మహా పురాణ ప్రవచనం నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతికి ఇష్టమైన చతుర్థి తిథి రోజు న పాటించాల్సిన, దేవాలయంలో ఆచరించే సూక్ష్మ నియమాలతో పొందే ఫలితాలు, తదితర విషయాలను మహేశ్వర శర్మ భక్తులకు వివరించారు. ఈనెల 26వ తేదీ వరకు జరిగే ప్రవచన కార్యక్రమానికి భక్తులు తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో భక్తులు రంగ నర్సింగారావు, కొమురయ్య తదితరులు ఉన్నారు. హౌసింగ్ బోర్డు కాలనీకి మురుగు నీరు సరఫరా జనగామ: పట్టణ పరిధి హౌసింగ్ బోర్డు కాలనీకి కొంత కాలంగా మురుగు నీరు సరఫరా అవుతోంది. ఈ విషయమై అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీరు సరఫరా చేసే పైపులైన్లు లీకేజీ అవుతూ.. డ్రెయినేజీ వాటర్ అందులో కలుస్తోందని మున్సిపల్ అధికారులు స్పందించి పైపులైన్లకు మరమ్మత్తు చేపట్టిన శుద్ధి చేసిన వాటర్ సరఫరా చేయాలని కోరారు. రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలి జనగామ రూరల్: రాజ్యాంగ ఫలాలు ప్రతీ ఒక్కరికి అందాలి.. రాష్ట్ర ప్రభుత్వం పథకాల అమలులో పేద ప్రజలకు మొండి చేయి చూపిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం ‘సంవిదా న్ గౌరవ్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి ఆధ్వర్యాన ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక మార్లు రాజ్యాంగాన్ని మార్చుతూ పేదలకు రాజ్యాంగ ఫలాలు అందకుండా చేసిందని విమర్శించిన ఆయన.. మోదీ సర్కారు రాజ్యాంగాన్ని గౌరవిస్తుందని, ఇందు కు రాష్ట్రపతి పదవి దళితులకు ఇచ్చి గౌరవించ మే నిదర్శనమన్నారు. ఈనెల 22, 23 తేదీల్లో ఎస్సీ, ఎస్టీ బస్తీలలో సమావేశాలు ఏర్పాటు చేసి కేంద్ర పథకాల అమలుపై విస్తృత ప్రచారం చేయాలని కోరారు. రాష్ట్ర నాయకులు ఉడుగుల రమేష్, సౌడ రమేష్, పట్టణ అధ్యక్షుడు అనిల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
జీఐఎస్ మాస్టర్ ప్లాన్
అమృత్ 2.0 స్కీంలో పైలెట్ ప్రాజెక్టు కింద జనగామ ● పట్టణ విస్తీర్ణం 19.31 స్క్వేర్ కిలోమీటర్లు ● సర్వేను ప్రారంభించిన కలెక్టర్ రిజ్వాన్ బాషా ● 1990 మాస్టర్ ప్లాన్.. 2019 రివైజ్డ్ వివరాలతో సర్వే ఆఫ్ ఇండియా బేస్ మ్యాప్జనగామ: రాష్ట్రాలు, నగరాలను మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేయడానికి కేంద్రం అమృత్ 2.0 పథకానికి శ్రీకారం చుట్టింది. జీఐఎస్(జియోగ్రా ఫికల్ ఇన్ఫర్మెషన్ సిస్టం–రివైజ్డ్/కొత్త) ఆధారంగా మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు దేశ వ్యాప్తంగా 20 మున్సిపాలిటీలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయగా.. అందులో జనగామ మున్సిపాలిటీ ఉంది. సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యాన 1990 సంవత్సరం చేపట్టిన మాస్టర్ ప్లాన్‌తో పాటు 2019లో రివైజ్డ్ చేసిన సమాచారం ఆధారంగా ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకుని సర్వే మొదలు పెట్టారు. జిల్లా కేంద్రం ధర్మకంచ మినీ స్టేడియంలో కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా జీఐఎస్ సర్వేను ప్రారంభించారు. 19.31 స్క్వేర్ కిలోమీటర్లు యశ్వంతాపూర్, చీటకోడూరు, శామీర్‌పేట ప్రాంతాల శివారు సర్వే నంబర్లు విలీనం చేయగా జిల్లా కేంద్రం 19.31 స్క్వేర్ కిలోమీటర్ల పరిధికి విస్తరించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ జనాభా 57వేలు ఉండగా ప్రస్తుతం 85వేలకు చేరింది. జనగామ మున్సిపాలిటీకి 1990లో మాస్టర్ ప్లాన్ తయారు చేయగా.. 2010లో రివైజ్ చేయాల్సి ఉంది. అయితే 2019లో (2041 వరకు) పట్టణ అభివృద్ధి, కనీస మౌలిక వసతి సౌకర్యాలు, ఇండస్ట్రియల్, రహదారుల విస్తరణ, రింగురోడ్ల నిర్మాణం తదితర అంశాలకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ సర్వేను పట్టాలెక్కించారు. కరోనా ఎఫెక్ట్‌తో ఆ ప్రక్రియకు బ్రేక్ పడగా.. ప్రస్తుతం మోక్షం లభించింది. అమృత్ 2.0 స్కీంలో పైలెట్ ప్రాజెక్టు కింద జనగా మ మున్సిపాలిటీ ఎంపిక కాగా.. సర్వే ఆఫ్ ఇండి యా సర్వేయర్ బి.గోపాల్‌రావు నేతృత్వాన జీఐఎస్ ఆధారిత మాస్టర్ ప్లాన్ తయారీకి డిజిటల్ సర్వే చేపట్టారు. పూర్తి స్థాయి మాస్టర్ ప్లాన్‌కు డిజిటల్ ద్వారా చేపట్టిన బేస్ మ్యాప్ ఉపయోగపడుతుంది. సర్వే ప్రక్రియ ఇలా..జనగామ పట్టణానికి సంబంధించిన రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపాలిటీ, వ్యవసాయ తదితర విభాగాల సమాచారాన్ని సర్వే ఆఫ్ ఇండియా తీసుకుంది. జీఐఎస్ సర్వే కోసం 30 వార్డుల పరిధిలో 30 నుంచి 40 పాయింట్లు(గ్రౌండ్ చెకింగ్ పాయింట్లు) గుర్తించారు. ముందస్తుగా గుర్తించిన గ్రౌండ్ చెకింగ్ పాయింట్ నుంచి డ్రోన్‌ను పంపిస్తారు. డ్రోన్ ఒక్కసారి ఎగిరితే సుమారు 45 నుంచి 59 నిమిషాల పాటు త్రీడీ సిస్టంలో ముందుగా గుర్తించిన ప్రదేశంలో 1.8 సెకన్లకు ఒక ఫొటో చొప్పున 600 ఎకరాల భూమికి సంబంధించిన 3,200 ఫొటోలను క్యాప్చరింగ్ చేస్తుంది. డ్రోన్ 120 మీటర్ల ఫ్రీక్వెన్సీ ఎత్తులో మాత్రమే ప్రయాణం చేస్తుంది. వాతావరణ మార్పులు, ఈదురు గాలులు సంభవించిన సమయంలో గ్రౌండ్ చెక్ పాయింట్ వద్ద ఉన్న కంట్రోల్ రూంకు సంకేతాలు అందించిన వెంట నే.. దానిని వెనక్కి రప్పిస్తారు. పది రోజుల పాటు జీఐఎస్ సర్వే పూర్తి చేసి.. రెండు నెలల్లో హైదరాబాద్ సర్వే ఆఫ్ ఇండియాకు నివేదిక పంపిస్తారు. శాటిలైట్ ద్వారా అక్యురేట్గా తీసిన ఫొటోలు, తదితర వివరాలతో కూడిన హార్డు కాపీలు, మాస్టర్ ప్లాన్ కాపీలను జనగామ మున్సిపల్‌కు పంపిస్తారు. 2019 నాటి రివైజ్డ్ మాస్టర్ ప్లాన్ ఆధారంగా ప్రస్తుత జీఐఎస్ సర్వేను జోడించి పురపాలిక భవిష్యత్‌కు పునాది వేయనున్నారు. జనగామ మాస్టర్ ప్లాన్ పట్టణ అభివృద్ధికి మరింత దోహదపడనుంది. డ్రోన్ సర్వే నేపథ్యంలో సీఐ దామోదర్‌రెడ్డి, పోలీసులు బందోబస్తు చేపట్టారు. -
ఏఐసీఎస్ టోర్నమెంట్‌కు ఉద్యోగులకు ఆహ్వానం
జనగామ: భారత ప్రభుత్వం 2024–25 సంవత్సరానికి గాను నిర్వహించ తలపెట్టిన ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్(ఏఐసీఎస్) టోర్నమెంట్లో పాల్గొనేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు ఆహ్వానం పలుకుందని జిల్లా యువజన, క్రీడల అధికారి వెంకట్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రస్థాయి సివిల్ సర్వీస్ సెలక్షన్ ట్రయల్స్‌లో భాగంగా వివిధ క్రీడాపోటీలకు సంబంధించి ఈ నెల 23, 24వ తేదీలలో హైదరాబాద్‌లోని పలు క్రీడా మైదానాల్లో పోటీలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అథ్లెటిక్స్, క్రికెట్, చెస్, క్యారమ్, హాకీ, పవర్ లిఫ్టింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్ (మహిళలు, పురుషులు)లో అవకాశం కల్పించనున్నట్లు వివరించారు. అలాగే కుస్తీ–గ్రీకో రోమన్, ఉత్తమ శరీర ధృఢత్వం, ఖోఖో, యోగా అంశాలలో సైతం పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ శాఖల్లో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ఇందులో పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న ఉద్యోగులు సర్వీస్ సర్టిఫికెట్, ఇటీవల తీసుకున్న గుర్తింపు కార్డుతో ఈ నెల 21వ తేదీన కలెక్టరేట్లోని రెండో అంతస్తు ఎస్–15లోని జిల్లా యువజన, క్రీడల కార్యాలయంలో సాయంత్రం 4గంటల వరకు వచ్చి పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. జిల్లా స్థాయిలో పేర్లు నమోదు చేసుకున్న ఉద్యోగులను మా త్రమే పోటీలకు పంపించనున్నట్లు తెలిపారు. -
‘గీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి’
జఫర్‌గఢ్: కల్లుగీత కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కుర్ర ఉప్పలయ్య, సంఘం ప్రధాన కార్యదర్శి బాల్నే వెంకటమల్లయ్య డిమాండ్ చేశారు. మండల పరిధిలోని ఉప్పుగల్లులో శ్రీరేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద కల్లుగీత కార్మికులతో ఆదివారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి సంఘం అధ్యక్షులు కొరుకోప్పుల రాజు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా వారు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కల్లుగీత వృత్తిపై ఆధారపడి 5లక్షల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయన్నారు. వీరిని ఆదుకునే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని తెలిపారు. 2024 అక్టోబర్ 18న నిర్వహించిన రాష్ట్రస్థాయి సదస్సులో 22 డిమాండ్లు రూపొందించి ప్రభుత్వానికి అందజేసినా ఇప్పటి వరకు ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. కేవలం అరకొరగా సేఫ్టీ కిట్టును ప్రభుత్వం అందిస్తున్నదే తప్పా మిగితా హామీల అమలు విషయంలో ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు ఈ నెల 20న కలెక్టరేట్ ఎదుట చేపట్టనున్న ధర్నాలో కల్లుగీత కార్మికులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు నాయిని యాదగిరి, సంఘం మండల అధ్యక్షులు గడ్డం రాజు, సంఘం ఉపాధ్యక్షుడు పులి ధనుంజయ, మూల సారయ్య, బొల్లపల్లి రాజు, వడ్లకొండ మధుకర్, పూజారి యాకయ్య, గడ్డం రమేష్, బైరు రాజు, దొరి నవీన్‌కుమార్‌తో పాటు గీత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ
జనగామ: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వచ్చిన జనం ఆదివారం తిరుగు ప్రయాణం కావడంతో జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ఈ నెల 17వ తేదీ వరకు విద్యా సంస్థలకు సెలవులు ఉండగా మధ్యలో ఆదివారం రావడంతో మెజార్టీ కుటుంబాలు సొంతూళ్లలోనే ఉండి పోయారు. నేటి(సోమవారం) నుంచి పిల్లలు, యువత విద్యాసంస్థల బాటపట్టనున్న నేపథ్యంలో తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ నేపథ్యంలో జనగామ బస్టాండ్‌తో పాటు జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లోని బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. బస్సుల్లో నిలబడే పరిస్థితి లేకపోవడంతో ఇబ్బందులు పడుతూనే ప్రయాణం చేశారు. -
నిరుపేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
దేవరుప్పుల: నిరుపేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. మండల కేంద్రానికి చెందిన ఎ.అనూషకు అత్యవసర ఆపరేషన్ కోసం ముందస్తుగా రూ.5 లక్షల ఎల్ఓసీ మంజూరు ఇప్పించి ఆమె భర్త మధుకు ఆదివారం అందజేశారు. గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో ప్రత్యేక ఆపరేషన్లకు ఎల్ఓసీలు, సీఎం సహాయ నిధి సాయం అందిస్తూ బాసటగా నిలుస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగ పురోగతికి సత్వర చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ, మండల అధ్యక్షులు రాజేష్ నాయక్, పులిగిళ్ల వెంకన్న, మాసంపెల్లి సాత్విక్, మధు, లొడంగి అశోక్ తదితరులు పాల్గొన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి -
సిటీ ఆర్ముడ్ రిజర్వ్ విభాగం
ఓవరాల్ చాంపియన్ వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి పోలీసులకు మూడు రోజులుగా నిర్వహిస్తున్న పోలీస్ క్రీడలు ఆదివారం ముగిశాయి. వార్షిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2025లో సిటీ ఆర్ముడ్ రిజర్వ్ విభాగం 125 పతకాలు గెలుచుకుని ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించింది. ఈస్ట్‌జోన్ 51, సెంట్రల్ జోన్ 50, వెస్ట్‌జోన్ 19, ఇతర విభాగాల జట్లు 21 పతకాలను గెలుచుకున్నారు. ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ జట్టు, డీసీపీ అధికారుల జట్లకు టగ్ ఆఫ్ వార్ పోటీ నిర్వహించగా సీపీ జట్టు గెలుపొందింది. అనంతరం విజేతలకు సీపీ అంబర్ కిశోర్ఝూ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ నిరంతరం విధినిర్వహణలో ఉండే పోలీసులకు ఈ క్రీడలు ఉల్లాసాన్ని కలిగించాయన్నారు. క్రీడలతో దేహదారుఢ్యంతోపాటు, ఆనారోగ్య సమస్యలు దరిచేరవని చెప్పారు. కమిషనరేట్ పోలీస్ క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమములో డీసీపీలు షేక్ సలీమా, రాజమహేంద్రనాయక్, రవీందర్, అదనపు డీసీపీలు రవి, సురేష్ కుమార్, ఏఎస్పీ చేతన్‌తో పాటు ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ముగిసిన పోలీస్ క్రీడలు -
వెంకన్నకు స్వర్ణకంకణ పురస్కారం
చిల్పూరు: మండల పరిధిలోని చిన్నపెండ్యాల గ్రామానికి చెందిన చిందుయక్షగాన కళాకారుడు గజవెళ్లి వెంకన్న స్వర్ణకంకణ పురస్కారం అందుకున్నాడు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం ఆర్యాణి సకల కళావేదిక డాక్టర్ దూడపాక శ్రీధర్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి సంక్రాంతి కళా పురస్కారాలను ప్రకటించారు. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన వెంకన్న 40 ఏళ్లుగా చిందు యక్షగాన వృత్తిలో రాణిస్తూ వేలాది ప్రదర్శనలు ఇచ్చినందుకుగాను ఆయన ప్రతిభను గుర్తించి జాతీయస్థాయి అవార్డును అందజేశారు. కబడ్డీ పోటీలకు రేపు జిల్లా జట్టు ఎంపిక రఘునాథపల్లి: రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా తరఫున సీనియర్ పురుషుల కబడ్డీ జట్టును జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రేపు పాలకుర్తి మండలం చెన్నూరు ఉన్నత పాఠశాలలో ఎంపిక చేయనున్నట్లు కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎర్రోళ్ల కుమార్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి తోటకూరి గట్టయ్య, కోశాధికారి ఎదునూరి ఉప్పలయ్యలు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న జట్టు ఫిబ్రవరి 1నుంచి 4వ తేదీ వరకు అదిలాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన 71వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటుందని పేర్కొన్నారు. పాల్గొనే క్రీడాకారులు వయస్సుతో సంబంధం లేకుండా 85 కేజీల లోపు బరువు ఉండాలని, క్రీడాకారులు మ్యాట్ షూస్ తప్పనిసరి వెంట తెచ్చుకోవాలని సూచించారు. వివరాలకు 9849363396, 9440412915, 7661095550 నంబర్లలో సంప్రదించాలని కోరారు. నిట్‌లో సైన్స్ కమ్యూనికేషన్ వర్క్షాప్కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లోని విశ్వేశ్వరయ్య స్కిల్ డెవలప్మెంట్ భవనంలో ఆదివారం తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్స్, జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీ ఆధ్వార్యాన స్కూల్ టీచర్స్‌కు ఒక్క రోజు సైన్స్ వర్క్‌షాప్ నిర్వహించారు. ‘గో గ్రీన్, బ్రీత్ క్లీన్, ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ లైఫ్’ అనే అంశంపై నిట్ ప్రొఫెసర్ రామరాజు ఉపాధ్యాయులతో మాట్లాడారు. కార్యక్రమంలో నిట్ ప్రొఫెసర్ ఆంజనేయులు, రాములు, జేవీవీ కమిటీ సభ్యులు కేబీ.ధర్మప్రకాష్,కాజీపేట పురుషోత్తం, రామంచ బిక్షపతి, పరికిపండ్ల వేణు, సుమలత పాల్గొన్నారు. పురాణం మహేశ్వరశర్మకు ఘనస్వాగతం జనగామ: పట్టణంలోని హెడ్‌పోస్టాఫీసు ఏరియా శ్రీ సంతోషిమాత ఆలయంలో నేటి (సోమవారం) నుంచి ప్రారంభం కానున్న శ్రీ వేదవ్యాస విరచిత శ్రీ స్కాంద మహాపురాణ ప్రవచనం వినిపించేందుకు బ్రహ్మశ్రీ, ఆయుత చండీయాగకర్త పురాణం మహేశ్వరశర్మ ఆదివారం జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస శర్మ నేతృత్వంలో భక్తబృందం ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్ వద్ద పురాణం మహేశ్వర శర్మకు ఘనంగా స్వాగతం పలికారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుర్రం రథంపై స్వామిజీని శోభాయాత్రగా ఆర్టీసీ చౌరస్తా వరకు వెళ్లారు. రైల్వేస్టేషన్ మీదుగా నెహ్రూపార్కు, గాంధీ బొమ్మ నుంచి ఆర్టీసీ చౌరస్తా వరకు భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ శోభాయాత్ర నిర్వహించారు. నేటి ఉదయం గణపతి పూజ, స్వస్తివాచనము, కంకణ ధారణ, కలశ స్థాపన, వ్యాస, గ్రంథ పూజ తర్వాత ప్రవచనము ప్రారంభించనున్నట్లు శ్రీనివాసశర్మ తెలిపారు. జేఎన్ శర్మకు రోటరీ ఎక్స్‌లెన్స్ అవార్డుహన్మకొండ కల్చరల్: వరంగల్‌కు చెందిన సీనియర్ రంగస్థల నటులు, పోతన విజ్ఞాన పీఠం మేనేజర్ జేఎన్ శర్మ ‘రోటరీ ఎక్స్‌లెన్స్’ అవార్డు అందుకున్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ ఆధ్వర్యంలో ఆదివారం క్లబ్లో నిర్వహించిన కార్యక్రమంలో క్లబ్ పూర్వ అధ్యక్షులు రమేశ్, మోహన్‌రావు నుంచి ఆయన అవార్డు అందుకున్నారు. కళారంగంలో ఉత్తమ సేవలు అందించినందుకుగాను అవార్డు లభించింది. -
రేషన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియ
జనగామ రూరల్/బచ్చన్నపేట/నర్మెట: రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా తెలిపారు. జిల్లాలోని క్యాంపు కార్యాలయం నుంచి అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, రోహిత్ సింగ్‌లతో కలిసి కలెక్టర్ ఆదివారం ఆర్డీఓలు, ఎస్డీసీలు, జిల్లా, మండల స్థాయి ప్రత్యేక అధికారులు ఎంపీడీఓలు, ఎంపీఓలు, తహసీల్దార్లతో నాలుగు పథకాల అమలుపై ఆ టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి సంబంధిత అధికారులకు సూచనలు చేసి వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ నెల 26న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు వంటి కీలకమైన నాలుగు సంక్షేమ పథకాలను అమలు చేయడానికి క్షేత్రస్థాయి సర్వే పరిశీలనలో అలసత్వం వహించకుండా రేపటి లోగా పూర్తిచేయాలని ఆదేశించారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి రేషన్ కార్డులు జారీ చేయడం జరుగుతుందన్నారు. రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్లు నిరంతర ప్రక్రియ అన్నారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదనే విషయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ నెల 21నుంచి 24 వరకు నిర్వహించే గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తులను స్వీకరించడంతో పాటు ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకొని పరిశీలించనున్నట్లు వివరించారు. గ్రామ, వార్డు సభల నిర్వహణకు బ్యానర్లను ఏర్పాటు చేయాలన్నారు. లబ్ధిదారుల ముసాయిదా జాబితాను పారదర్శకంగా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో జనగామ ఆర్డీఓలు గోపీరామ్, వెంకన్న, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమాన్ నాయక్, డీఆర్డీఓ వసంత, డీపీఓ స్వరూప, డీసీఎస్ఓ సరస్వతి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, డీఏఓ రామారావు నాయక్, హౌసింగ్ ఈఈ మత్రు నాయక్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మండలంలోని శామీర్‌పేట, పసరమడ్ల గ్రామ పంచాయతీల్లో, మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో గల ఇందిరమ్మ కాలనీలో అధికారులను నిర్వహిస్తున్న సర్వే ప్రక్రియను పరిశీలించారు. బచ్చన్నపేట మండల పరిధిలోని గోపాల్‌నగర్‌లో సర్వే ప్రక్రియను పరిశీలించారు. అలాగే నర్మెట మండల పరిధిలోని బొమ్మకూర్‌లో సర్వే ప్రక్రియను పరిశీలించి పలు సూచనలు చేశారు. పలుచోట్ల ఇంటింటికీ వెళ్లి ఆయా కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సమస్యలపై ఆరా తీసి సందేహాలను నివృత్తి చేయాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. గ్రామసభల్లో దరఖాస్తుల స్వీకరణ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా -
రిజర్వేషన్లపై ఉత్కంఠ..!
● కేడర్‌తో పాటు అధిష్టానం ఆశీస్సుల కోసం ప్రయత్నాలు ● పల్లెల్లో మొదలైన సందడి ● జిల్లాలో 7.61లక్షల మంది ఓటర్లుజనగామ: జిల్లాలో సర్పంచ్ ఎన్నికల్లో పోటీచేసే ఆశావహులు ప్రభుత్వం ప్రకటించే రిజర్వేషన్ల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. పలు పంచాయతీల్లో సర్పంచ్ పదవికి పోటీచేసే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. వచ్చే నెల రెండోవారంలో స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందనే ప్రచారం నేపథ్యంలో పోటీలో నిలబడనున్న నాయకులు కేడర్‌తో పాటు అధిష్టానం ఆశీస్సుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అన్నీ కలిసొచ్చినా.. రిజర్వేషన్లు ఎలా ఉండబోతున్నాయనే టెన్షన్ పట్టుకుంది. అధిష్టానం గ్రీన్ సిగ్నల్‌తో పాటు రిజర్వేషన్లు సైతం కలిసి రావాలని కోరుకుంటున్నారు. జిల్లాకు చేరుకున్న ఎన్నికల సామగ్రి గత ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన సర్పంచ్, జూలై 4న ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి స్పెషలాఫీసర్ల పాలన కొనసాగుతోంది. ఇప్పటికే జిల్లాకు ఎన్నికల సామగ్రి చేరుకుంది. ప్రిసైడింగ్, రిటర్నింగ్ అధికారులకు సంబంధించిన ప్రింటింగ్ పేపర్లు సిద్ధం చేశారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రతీ విభాగానికి ఒక జిల్లా స్థాయి అధికారితో పాటు ప్రత్యేక అధికారిగా కలెక్టర్ నియమించారు. మూడు పంచాయతీల్లో ఎన్నికలు లేనట్టే? స్టేషన్‌ఘన్‌పూర్(శివునిపల్లి, ఛాగల్)ను మున్సిపాలిటీగా ప్రకటిస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో స్థానిక పోరులో ఈ మూడు జీపీల పరిధిలో సర్పంచ్ ఎన్నికలు ఉండే పరిస్థితి కనిపించడం లేదు. ఈ విషయంపై అధికారుల నుంచి పూర్తిస్థాయి క్లారిటీ రావాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న వారికి నిరాశే మిగిలినా.. కౌన్సిలర్‌గా పోటీ చేసే అవకాశం ఉంటుంది. అదృష్టం కలిసొచ్చి రిజర్వేషన్లు అనుకూలిస్తే చైర్మన్, వైస్ చైర్మన్ అయ్యే అవకాశం లేకపోలేదు. మూడు నియోజకవర్గాలు జిల్లాలో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటి పరిధిలో కొత్తగా 7,500మంది ఓటర్లు ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. దీంతో జిల్లాలో మొత్తంగా 7,61,642మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఎన్ఆర్ఐ ఓటర్లు 23మంది ఉండగా సర్వీసు ఓటర్లు 464మంది ఉన్నారు. నిర్ణయ యాప్‌లో ఓటరు జాబితా.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయ అనే యాప్‌ను రూపొం దించింది. ఈ యాప్‌లో టీ పోల్ పోర్టర్లో ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలు వివరాలను అందుబా టులో ఉంచారు. ఎలక్షన్ పకడ్బందీగా నిర్వహించేందుకు 12 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. గతంలో 14మంది సర్పంచ్‌లు మృతి చెందగా, నలుగురు వివిధ కారణాల చేత పదవి నుంచి తొలగింపబడ్డారు. అదే విధంగా ఓ ఉప సర్పంచ్‌ను రిమూవ్ చేశారు. కేడర్‌కు విందులు.. అధికారులు ఎలక్షన్ నిర్వహణకు బిజీలో ఉండగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎంల నుంచి పోటీకి సై అంటున్న ఆశావహులు నోటిఫికేషన్, రిజర్వేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డు మెంబర్లుగా పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్న అభ్యర్థులు కేడర్‌కు విందులు ఇస్తూ మచ్చిక చేసుకుంటున్నారు. పలు గ్రామాల్లో మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తున్నారు. యువతకు ఆట వస్తువులు ఇవ్వడంతో పాటు నిరుపేద కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలుస్తూ మార్కులు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలో ఎక్కడ చూసినా సర్పంచ్ ఎన్నికల గురించే మాట్లాడుకుంటున్నారు. కులాల వారీగా ఓట్ల లెక్క వేస్తూ.. పోటీకి సిద్థఽమైన సమయంలో ఎలా ముందుకు వెళ్లాలనే ముందస్తు ప్లాన్ చేసుకుంటున్నారు. తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తులతో రహస్య మంతనాలు సాగిస్తూ ఊళ్లలో తమ పరపతి ఎలా ఉందో ఒకటికి, రెండు పర్యాయాలు చెక్ చేసుకుంటున్నారు. వ్యతిరేకత ఉన్న చోట అనుకూలంగా మలుచుకునేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ఈ సారి ఎన్నికల బరిలో నిలబడే ఆశావహులకు రిజర్వేషన్లు కలిసివస్తాయో లేదో కొద్ది రోజుల్లో తేలిపోనుంది. రిజర్వేషన్ల మార్పుతోనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించబోతున్నామని ఇటీవల ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయాలి
ఎంజీఎం: రాష్ట్రవ్యాప్తంగా పేరుకుపోయిన ఆరోగ్యశ్రీ బకాయిలు వెంటనే చెల్లించాలని తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్(టీఎన్హెచ్ఏ) రాష్ట్ర ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ ఐఎంఏ హల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి క్లెయిమ్స్ రానందున అన్ని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు ఈనెల 10 నుంచి ఆరోగ్యశ్రీ రోగులకు చికిత్సను నిలిపేసినట్లు తెలిపారు. సేవల్ని నిలిపేయడానికి కారణాలు తెలుపుతూ.. ఆస్పత్రులు వారి కన్సల్టేషన్ మొత్తాలను, జీతాలను చెల్లించలేనందున కన్సల్టెంట్లు పని చేయడానికి ఇష్టపడరని, ఆర్నెళ్లుగా ఆస్పత్రులు తమ మొత్తాన్ని చెల్లించలేకపోయినందున సరఫరాదారులు తమ సరఫరాలను నిలిపివేశారని, ఈప్రాతినిథ్యంలో తమ ప్రతిపాదనలను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రికి, ఆరోగ్యశ్రీ సీఈఓ దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు కూడా అందించామని తెలిపారు. ప్రధానంగా నాలుగు డిమాండ్లను వారి ముందుంచినట్లు తెలిపారు. టీఎన్హెచ్ఏ రాష్ట్ర ప్రతినిధులు -
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలుకు కుట్ర
రఘునాథపల్లి: పిడికెడు మంది లేకున్నా రాజ్యమేలుతున్న అగ్రవర్ణాలు.. వెనుకబడిన తరగతుల బిడ్డల నోటికాడి ముద్ద, పల్లెంలో బుక్క ఎత్తుకుపోయేందుకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేసే కుట్ర పన్నుతున్నారు.. దీనిని ఐక్యంగా తిప్పి కొట్టాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపు నిచ్చారు. కామారెడ్డి డిక్లరేషన్ మేరకు పంచాయతీ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌తో మండల పరిధిలోని ఖిలాషాపూర్‌లో బీసీల ఆధ్వర్యాన ఆదివారం ‘బీసీ అజాదీ’ సైకిల్ యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా సర్వాయి పాపన్న కోట వద్ద బీసీ అజాది సిద్ధాంతకర్త బత్తుల సిద్ధేశ్వర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి తీన్మార్ మల్లన్న హాజరై మాట్లాడారు. జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు 20శాతం ఇచ్చి, ఏడు శాతం కూడా లేని రెడ్డి, వెలమ, కమ్మ వర్గాలు 70 శాతం దోచుకుంటున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలుంటే ఆ మూడు వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు 60 మంది ఉన్నారని పేర్కొన్నారు. ఓట్లు కొని రాజ్యాధికారంలో ఉంటున్న అగ్రవర్ణాలు బీసీలకు అన్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. మన బిడ్డలకు 70 మార్కులు వచ్చినా ఉద్యోగం రాదు.. వా ళ్లకు 50 మార్కులు వచ్చినా కొలువు దక్కేలా రిజర్వేషన్లు అమలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలు ఏవైనా.. మనోడికి మనం ఓటు వేసుకోవాలని ఆయన సూచించారు. తొలిరోజు చేపట్టిన ఈ సైకిల్‌యాత్ర జనగామకు చేరింది. ఈ సైకిల్ యాత్రలో రాష్ట్ర హిందూ బీసీ మహాసభ ప్రధాన కార్యదర్శి పర్వత సతీష్‌కుమార్, ప్రచార కార్యదర్శి పంతుల మల్లయ్య, కార్యనిర్వహక అధ్యక్షుడు కొంగర నరహరి, కుంటి విజయ్‌కుమార్, రామనర్సయ్య, వెంకటస్వామి, మల్లయ్య, కుమార్, వెంకటేశ్వర్లు, అర్జున్, కనకరాజు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న -
ఘన్పూర్ మున్సిపాలిటీకి గెజిట్
స్టేషన్‌ఘన్‌పూర్: ఘన్పూర్ ప్రజల మున్సిపాలిటీ కల ఎట్టకేలకు నెరవేరుతోంది. దాదాపు రెండు దశాబ్దాలుగా ఘన్పూర్ పట్టణ ప్రజలు ఎదురు చూస్తు న్న మున్సిపాలిటీపై గత నెల 20న అసెంబ్లీలో మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే.. స్టేషన్‌ఘన్‌పూర్, శివునిపల్లి, ఛాగల్లు గ్రా మాలను కలుపుతూ తెలంగాణ ప్రభుత్వం రెండు రోజుల క్రితం గెజిట్ విడుదల చేసింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రం తర్వాత పెద్ద సెంటర్‌గా ఉన్న స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ కావడానికి నిబంధనల మేరకు అన్ని అర్హతలున్నా గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా అవకాశం దక్కలేదు. ఇదిగో, అదిగో అంటూ కాలం గడిపారు. మున్సిపాలిటీ విషయంలో మొదటి నుంచి పాలకులు, ప్రజాప్రతినిధులు ఘన్‌పూర్‌పై శీతకన్ను వేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మేజర్ గ్రామ పంచాయతీ అయిన స్టేషన్‌ఘన్‌పూర్ జనాభా 12వేల పైచిలుకు ఉంది. ఘన్‌పూర్‌కు జంటపట్టణమైన శివునిపల్లి జనాభా ఆరు వేలకు పైగా ఉంది. మున్సిపాలిటీ కావాలంటే నిబంధనల మేరకు 15వేల జనాభా ఉండాలి. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఘన్పూర్ జనాభా దాదాపు 16వేలకు పైగా ఉంది. మున్సిపాలిటీ అవుతుందని విస్తృత ప్రచారం జరిగింది. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సైతం తప్పనిసరి గా మున్సిపాలిటీ అవుతుందనీ.. స్టేషన్‌ఘన్‌పూర్, శివునిపల్లి గ్రామ పంచాయతీలను కలిపి చేస్తారని చెప్పినా.. ఆచరణలోకి రాలేదు. కాగా ప్రస్తుత ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక చొరవతో మున్సి పాలిటీ ప్రకటన, గెజిట్ రావడంతో మూడు గ్రామా ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే కడియం కృషితో ప్రజల కల సాకారం -
షూటింగ్ హాట్‌స్పాట్ ఖిలా వరంగల్
చారిత్రకమే కాదు.. అందమైన బహు సుందరనగరం ఓరుగల్లు. ఈప్రాంతంలో తీసిన ఎన్నో సినిమాలు బంపర్‌హిట్ కొట్టాయి. కొంత మంది దర్శకులైతే వరంగల్‌కు సంబంధించి తమ సినిమాలో ఒక్కసీన్ అయినా ఉండాలని కోరుకుంటారు. లెక్కలేనన్ని సినిమాలు ఈ ప్రాంతం నేపథ్యంలో వచ్చాయి. టాలీవుడ్లో హైదరాబాద్ తర్వాత అంతటి స్కోప్ ఉన్న సిటీ వరంగల్. ఇక్కడి అందాల్ని కళ్లకు కట్టినట్లుగా దర్శకులు తెరకెక్కిస్తున్నారు. ఈనేపథ్యంలో ఇక్కడి షూటింగ్ హాట్‌స్పాట్ అయిన ఖిలా వరంగల్‌పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.– ఖిలా వరంగల్20 ఏళ్ల.. ‘వర్షం’ఇరవై ఏళ్ల క్రితం వరంగల్ ప్రాంతంలో చిత్రీకరించిన వర్షం సినిమా రెండు రాష్ట్రాల్లో 200 రోజులు ఆడి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఇందులో హీరో ప్రభాస్, హీరోయిన్ త్రిషపై పలు సన్నివేశాలు కోటలో చిత్రీకరించారు. ఆతర్వాత వందలాది తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, సీరియల్స్‌ను ఖిలావరంగల్ ప్రాంతంలో చిత్రీకరించారు. రాణిరుద్రమాదేవి సినిమాను సైతం కొంత భాగం ఇక్కడే తెరకెక్కించారు. వరంగల్ గడ్డపై పుట్టిన దర్శకులు, నటులు జైనీ ప్రభాకర్, కరాటే ప్రభాకర్, సంగ కుమార్, గడ్డం సుధాకర్, గణేశ్ ఈ ప్రాంత వైభవాన్ని చాటుతూ.. అనేక చిత్రాలు నిర్మించారు. ‘నేనే సరోజన’ సినిమాను పాకల శారద, సదానందం రచయిత, నిర్మాతగా ఈపరిసరాల్లో షూట్ చేశారు. గతేడాది డిసెంబర్లో ‘ఓ రామా, అయ్యోరామ’ సినిమా షూటింగ్.. జరిపారు. సుహాస్, మాళవిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి పలు సన్నివేశాలు కోటలో చిత్రీకరించారు.వేలాది మందికి ఉపాధిఓరుగల్లు నగరం కళలకు పుట్టినిల్లే కాదు.. వివిధ భాషల్లో రూపుదిద్దుకున్న ఎన్నో సినిమా విజయాల్లోనూ కీలక పాత్ర పోషించింది. ఇక్కడ ఒక్క సన్నివేశమైనా చిత్రీకరిస్తే చాలు.. సినిమా హిట్ అవుతుందని నమ్మే కథానాయకులు, నిర్మాతలు, దర్శకులు చిత్ర పరిశ్రమలో ఎందరో ఉన్నారు. చారిత్రక రాతి, మట్టికోట కట్టడాలు, రాతికోట చుట్టూ జలాశయం వంటి సుందర ప్రదేశాలు. మరెన్నో అందాలకు నెలవైనది ఈకళారాజ్యం. నల్లరాతిలో చెక్కిన అద్భుత కళా ఖండాలు కనువిందు చేస్తున్నాయి.ఇక్కడేముందంటే..ఉమ్మడి జిల్లాలో సినీ చిత్రీకరణకు ఎన్నో అనువైన ప్రదేశాలున్నప్పటికీ ఖిలావరంగల్ కోటను ప్రథమంగా చెప్పుకోవాలి. ఇక్కడి ప్రకృతి అందాలు ఎవరినైనా ఇట్టే కట్టిపడేస్తాయి. రాతి శిల్పాలైతే చూపు తిప్పనివ్వవు. పురాతన కట్టడాలు, రాజ ప్రాకారాలు, కోటలు, రాజులు వినియోగించిన ఖుష్ మహల్, ఏకశిల కొండ ఇవన్నీ మైమరిచిపోయేలా చేస్తాయి. కనువిందు చేసే ఏకశిల కొండ, విశాలమైన జలాశయం, బోటు షికారు, చుట్టూ పచ్చని సిరుల పంటలు. పల్లెటూరి వాతావరణం.. వెరసి ప్రకృతి రమణీయతకు ఇక్కడి ప్రాంతం పెట్టింది పేరుగా చెప్పవచ్చు. టూరిజం స్పాట్‌గా వెలుగొందుతున్న ఈప్రాంతంపై పాలకులు దృష్టి సారిస్తే టాలీవుడ్లో హైదరాబాద్ తర్వాత ఇక్కడే ఎక్కువ షూటింగ్‌లు జరిగే అవకాశం ఉంది. వైభవానికి పెట్టింది పేరు.. కాకతీయుల రాజధాని చుట్టూ 7 కిలోమీటర్లు మట్టి కోట, 4.5 కిలోమీటర్ల పరిధిలో రాతికోట విస్తరించి ఉంటుంది. రాతికోట చుట్టూ ఉన్న నాలుగు దర్వాజలను (1 బండి దర్వాజ, 2, మచ్లీ, 3వ సీనా, 4వ హైదర్) పేర్లతో పిలుస్తారు. 75 బురుజులతో, నల్లరాతితో నిర్మించిన ఈకోట వైభవానికి పెట్టింది పేరుగా చెప్పవచ్చు. ఈ ద్వారాల వద్ద అనేక సినిమాలను చిత్రీకరించారు. లఘు చిత్రాల షూటింగ్‌లైతే లెక్కేలేదు.షూటింగ్‌కు అనువైన స్థలంత్రికోటలో కంటికి కనిపించని సుందరమైన ప్రదేశాల ఎన్నో దాగి ఉన్నాయి. అపూర్వమైన నిర్మాణాలు, ప్రాచీన కట్టడాలను, రాతికోట అందాలను కాకతీయుల వైభవాన్ని నా సినిమాల్లో చూపించాను. ప్రజల ఆదరణ తో సినిమా హిట్ అయ్యింది. ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చింది.– కరాటే ప్రభాకర్, ప్రేమిస్తే ప్రాణమిస్తా హీరో, చిత్ర నిర్మాతఇక్కడే చిత్రీకరించాలన్నది నా సెంటిమెంట్ఖిలా వరంగల్‌లో సినిమా తీస్తే హిట్ అవుతుందన్నది నా సెంటిమెంట్. అందుకే నా ప్రతీ సినిమాలో ఒక్క సీన్ అయినా ఈ ప్రాంతంలోనిది ఉంటుంది. 2014లో హిట్ కొట్టిన ‘ఆట మొదలైంది’ సినిమా కొంత వరకు ఇక్కడే షూటింగ్ పూర్తి చేసుకుంది. 15 చిత్రాల్లో హీరోగా.. మరో పది చిత్రాల్లో సెకెండ్ హీరో పాత్ర పోషించా. నేను తీసిన సినిమాలకు దర్శక నిర్మాతగా నేనే వ్యవహరించా. బాక్స్, నర్సింహా ఐపీఎస్, పౌరుశం, నైస్ గాయ్, తదితర 15 చిత్రాలు కోటలోనే తీసి ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్నా.– సంగ కుమార్, సినీనటుడు, తూర్పు కోట వరంగల్ -
శాంతిభద్రతలను పరిరక్షించాలి
బచ్చన్నపేట : ప్రతి ఒక్కరూ శాంతి భద్రతలను పరిరక్షించాలి.. విఘాతం కలిగిస్తే నేరస్తులవుతారని జనగామ ఏసీపీ నితిన్ చేతన్ అన్నారు. శనివారం ఆయన.. పోచన్నపేటలో నూతనంగా నిర్మించనున్న పెట్రోల్ పంపు స్థలాన్ని పరిశీలించాక పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ నేటి యువత చేస్తున్న పనులను వారి తల్లిదండ్రులు తప్పనిసరిగా గమనిస్తూ ఉండాలని, చెడు వ్యసనా లకు అలవాటు పడకుండా చూడాలని చెప్పా రు. మద్యం సేవించి వాహనాలు నడుపొద్దని, హెల్మెట్ తప్పకుండా ధరించాలని అన్నారు. స్టేషన్‌కు వచ్చే వారి సమస్యలను పోలీసులు తెలుసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సై ఎస్కే.అబ్దుల్ హమీద్, కానిస్ట్టేబుళ్లు పాల్గొన్నారు. హుండీ ఆదాయంరూ.41,44,248 పాలకుర్తి టౌన్: శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.41,44,248 వచ్చినట్లు ఈఓ మోహన్‌బాబు తెలిపారు. 2024 మార్చి 27 నుంచి 2025 జనవరి 17 వరకు భక్తులు సమర్పించిన కానుకలను శనివారం ఆలయ కల్యాణ మండపంలో దేవాదాయ ధర్మదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఎన్.సంతోష్‌రెడ్డి పర్యవేక్షణలో లెక్కించారు. అమెరికా, ఇంగ్లండ్, యూరప్, సింగపూర్, ఆస్టేలియా కరెన్సీ వచ్చినట్లు ఈఓ పేర్కొన్నా రు. లెక్కింపులో అర్చకులు, సిబ్బందితోపాటు కేజీవీబీ సిబ్బంది, మహబూబాబాద్‌కు చెందిన శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ సభ్యులు, పోలీసులు పాల్గొన్నారు. బీసీలకు కార్పొరేషన్ సబ్సిడీ రుణాలు ఇవ్వాలిస్టేషన్ఘన్పూర్: నిరుద్యోగ బీసీ యువతకు కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు ఇవ్వాలని తెలంగాణ బీసీ బహుజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రతాపగిరి విజయకుమార్ డిమాండ్ చేశారు. శనివారం నియోజకవర్గ ఇన్చార్జ్ కొయ్యడ రమేశ్ అధ్యక్షతన స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్య, ఉద్యోగం, ఉపాధి, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉన్న బీసీ, ఎంబీసీ, సంచార జాతుల్లోని కులాలను గత పాలకులు పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో ఎంతో మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు రాక ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గత ప్రభుత్వంలో యువకులకు వ్యక్తిగత సబ్సిడీ రుణం రూ.లక్ష ఇచ్చి చేతులు దులుపుకున్నారని, అర్హులందరికీ వ్యక్తిగత రుణాలు ఇవ్వాల ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కొయ్యడ వెంకటయ్య, దామెర రాజారామ్, దామెర రాజు తదితరులు పాల్గొన్నారు.అండర్‌పాస్ ఏర్పాటు చేయాలి జనగామ రూరల్: పట్టణ పరిధి బాణాపురంలో అండర్‌పాస్ ఏర్పాటు చేయాలని సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యాన శనివారం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితోపాటు ఇరిగేషన్ ఏఈ స్వప్నకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కనకారెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే చొరవ తీసుకొని 15 గ్రామాలకు ఉపయోగపడేలా అండర్ పాస్ ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. స్పందించిన ‘పల్లా’ ఎన్‌హెచ్ అధికారులు, ఆర్అండ్బీ శాఖ మంత్రి, భువనగిరి ఎంపీ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నాయకులు బొట్ల శేఖర్, బూడిద గోపి, జోగు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
‘కాల్వపల్లి’ కన్నీరు
● ముగిసిన దామోదర్ ఉద్యమ ప్రస్థానం ● ఎన్కౌంటర్లో కన్నుమూసిన మావోయిస్టు అగ్రనేత.. ● రెండు రాష్ట్రాల్లో ఆయనపై రూ.50 లక్షల రివార్డు ● ఇటీవల దామోదర్ తల్లిని కలిసిన ములుగు ఎస్పీ ● లొంగిపోవాలని కొడుకును వేడుకున్న మాతృమూర్తి ● ఇంతలోనే మృతి చెందినట్లు మావోల ప్రకటన తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని పూజారి కాంకేర్ నక్సల్స్ క్యాంపుపై భద్రతా దళాలు జరిపిన మెరుపు దాడిలో ములుగు జిల్లా ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలం కాల్వపల్లికి చెందిన మావోయిస్టు కీలకనేత, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు మృతి చెందాడు. ఆయన మరణవార్తతో స్వగ్రామం కాల్వపల్లి ఉలిక్కిపడింది. గ్రామంలో చివరి ఉద్యమ కెరటంగా ఉన్న దామోద ర్ అసువులు బాయడంతో కాల్వపల్లి మావోయిస్టుల ప్రస్థానం ముగిసినట్టయింది.దామోదర్ (ఫైల్)– ములుగు/ఎస్‌ఎస్‌తాడ్వాయి -
రేపటి ప్రజావాణి రద్దు
జనగామ రూరల్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 26న అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాలకు సంబంధించి(రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త ఆహార భద్రత కార్డులు,ఇందిరమ్మ ఇళ్లు) సర్వే కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లాలోని అధికారులందతా క్షేత్రస్థాయి పరిశీలనలో నిమగ్నమై ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్న ట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి ఈనెల 20వ తేదీన వినతులు ఇవ్వడానికి కలెక్టరేట్‌కు రావొద్దని విజ్ఞప్తి చేశారు. -
ఆశ చూపి.. కొల్లగొట్టి
జనగామ: ‘పెట్టుబడికి రెండు రెట్ల ఆదాయం.. కార్లు, బైక్‌లు వస్తాయి.. ఒక్క యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీ భవిష్యత్ బంగారుమయం’ అంటూ ‘కోస్టా’ యాప్ పేరిట నిర్వాహకులు అమాయకుల నెత్తిన కుచ్చుటోపీ పెట్టారు. విస్తృతంగా ప్రచారం చేపట్టి.. కార్పొరేట్ కంపెనీని తలదన్నే రీతిలో ఫంక్ష న్ నిర్వహించగా.. అత్యాశతో వేలాది మంది యాప్ లో పెట్టుబడులు పెట్టారు. తీరా నిర్వాహకులు బిచానా ఎత్తివేయడంతో మోసపోయినట్లు తెలుసుకుని బాధితులు లబోదిబోమంటున్నారు. యాప్‌ను పరిచయం చేసిన ఏజెంట్లను నిలదీయగా వారు ఎదురు తిరగడంతో శనివారం పోలీసులను ఆశ్రయించారు. బాధితులు కె.రాజు, ఇ.జగీదీష్, ఎస్.ప్రశాంత్, జి.భాస్కర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. 2వేల మంది.. రూ.15కోట్లు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. 2వేల మంది.. రూ.15కోట్లు నష్టపోయినట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా దేశం మెల్బోర్న్కు చెందిన కోస్టా యాప్‌ను జిల్లాకు నాలుగు నెలల క్రితం పరిచయం చేశారు. పట్టణానికి చెందిన శ్రీధర్ యాదవ్, ఇక్రమొద్దీన్ కంపెనీ ఏజెంట్లుగా యాప్ గురించి ప్రచా రం చేశారు. గత ఏడాది డిసెంబర్ చివరి ఆదివారం యశ్వంతాపూర్ శ్రీ సత్యసాయి కన్వెన్షన్‌లో వేడుకలు నిర్వహించగా.. జిల్లా నలుమూలల నుంచి 600 మందికిపైగా హాజరయ్యారు. కోస్టా యాప్‌ను ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని పెట్టుబడులు పెడితే ఒకటికి రెండు రెట్ల ఆదాయం వస్తుందని నమ్మించారు. ఫ్రూట్స్ పేరిట కేటగిరీలను విభజించి రోజువారీ లాభాలు వస్తాయని వివరించారు. రూ.19వేల పెట్టుబడి పెట్టిన వారికి 52 రోజుల పాటు రోజుకు రూ.893 చొప్పున రూ.46,636 వస్తాయని లెక్కలు వేసి చూపించారు. ఇలా రూ.67వేలు, రూ.39వేలు, రూ.97వేలుగా విభజించి కోస్టా యాప్ ద్వారా కలెక్షన్ చేశారు. కొంతమంది ఖాతాల్లో మూడు, నాలు గు రోజుల పాటు డబ్బులు వేయగా.. చాలా మంది ఆకర్షితులయ్యారు. ఆ తర్వాత ఖాతాల్లో డబ్బు జమకాకపోవడంతో బాధితులు ఏజెంట్లను సంప్రదించగా కేంద్రం నిబంధనల మేరకు ట్యాక్స్ సమస్య వస్తుందని చెబుతూ వచ్చారు. ఈ సమస్య కు పరిష్కారంగా రూ.3వేలు, రూ.9వేలు, రూ.15వేలు, రూ.25వేల ట్యాక్స్ కార్డు తీసుకుంటే మొదట పెట్టుబడి పెట్టిన డబ్బులకు రెట్టింపు వస్తాయని నమ్మించారు. దీంతో చాలా మంది వడ్డీలకు తీసుకొచ్చి చెల్లించారు. బాధితుల్లో కొందరు సమస్యను పోలీస్‌స్టేషన్ వరకు తీసుకెళ్లగా.. మెజారీ బాధితులు పరువు పోతుందనే భయంతో మిన్నకుండి పో యారు. జిల్లాలో సుమారు 2వేల మంది రూ.4వేల నుంచి రూ.7లక్షల వరకు మొత్తం రూ.15కోట్ల మేర పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. కార్లు, బైకులు వచ్చాయని.. కోస్టా యాప్ పరుగులు పెడుతోందని ఫంక్షన్లు, ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేస్తూ ఏజెంట్లు ప్రచారాన్ని క్షేత్ర స్థాయికి తీసుకెళ్లారు. శ్రీ సత్యసాయి కన్వెన్షన్‌లో జరిగిన వేడుకల్లో పలువురికి నజరానాగా కార్లు, బైక్‌లు వచ్చాయని నమ్మించా రు. కంపెనీ ప్రతినిధుల చేతుల మీదుగా తీసుకున్న ట్టు నటించి మోసం చేశారని బాధితులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. రోగులకు పండ్లు పంపిణీ చేసిన చంపక్‌హిల్స్ మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం ప్రధాన గేటు వద్ద కోస్టా యాప్ గురించి ఫ్లెక్సీతో ప్రచారం చేయడం గమనార్హం.‘కోస్టా’ యాప్ పేరిట మోసం పెట్టుబడికి రెండురెట్లు వస్తాయని బురిడీ కార్లు, బైకులు వస్తున్నాయని నమ్మించిన ఇద్దరు ఏజెంట్లు 2వేల మంది నుంచి రూ.15కోట్ల వసూలు పోలీసులను ఆశ్రయించిన బాధితులు ఆన్లైన్ మోసాలకు దూరంగా ఉండాలి : ఏఎస్పీ ఆన్లైన్ యాప్‌ల పేరిట అనధికారిక వ్యక్తులు చెప్పిన మాటలు విని మోసపోవద్దని ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్ అన్నారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సీఐ దామోదర్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. జనగామకు చెందిన శ్రీదర్ యాదవ్, ఇక్రమొద్దీన్ కోస్టా యాప్‌కు ఏజెంట్లుగా వ్యవహరించి మోసం చేశారని బాధితులు కె.రాజు, ఇ.జగదీష్, ఎస్.ప్రశాంత్, జి.భాస్కర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. యాప్ నిర్వహణపై సమగ్ర విచారణ చేపట్టి బాధితుల సంఖ్య, ఎంత డబ్బు నష్టపోయారనే విషయం తెలుసుకుంటామని చెప్పారు. స్మార్టు ఫోన్లలో వచ్చే లింకులు, అనధికార యాప్‌ల ద్వారా పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. రూ.1.20లక్షలు పెట్టుబడి పెట్టా.. గత ఏడాది డిసెంబర్ చివరి ఆదివారం యశ్వంతాపూర్ శ్రీ సత్యసాయి కన్వెన్షన్‌లో కోస్టా యాప్ ప్రమోట్ ఫంక్షన్ నిర్వహించారు. మమ్మల్ని కూడా ఆహ్వానించారు. సుమారు 600 మంది వరకు వచ్చారు. రెట్టింపు డబ్బులు వస్తాయని జనగామకు చెందిన ఏజెంట్లు శ్రీధర్‌యాదవ్, ఇక్రమొద్దీన్ నమ్మించి నాతో రూ.1.20లక్షలు పెట్టుబడి పెట్టించారు. మూడు రోజుల పాటు రూ.30వేల వరకు ఖాతాలో జమయ్యాయి. ఆ తర్వాత రాకపోవడంతో ఏజంట్లను అడిగితే సంక్రాంతి తర్వాత అన్నారు. అప్పుడు కూడా విత్ డ్రా ఆప్షన్ కనిపించక పోవడంతో అడగ్గా దాడి చేసేందుకు వచ్చారా అంటూ బెదిరించడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. – కె.నాగరాజు టైల్స్ షాప్ యజమాని, జనగామ -
టెన్త్‌లో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యం
● ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా కాజీపేట అర్బన్: పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని ఐటీడీఏ ఏటూరునాగారం ప్రాజెక్ట్ అధికారి చిత్రామిశ్రా అన్నారు. హనుమకొండ జిల్లాలోని గిరిజన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం హాస్టల్ వెల్ఫేర్ ఆఫీస ర్లు, హెడ్మాస్టర్లు, ప్రిన్సిపాళ్లతో సమీక్ష నిర్వహించారు. పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయడానికి సూచనలిచ్చారు. అనంతరం హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల గిరిజనుల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యల పరిష్కారా నికి కృషి చేస్తామని ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అధికారి చిత్రామిశ్రా చెప్పారు. కార్యక్రమంలో ఆయా జిల్లాల ఆర్సీఓలు, ఏసీఎంలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.